FIDE Chess Tournament: విజేత సామ్యూల్‌ స్టీఫెన్‌ | FIDE Chess Tournament: Telangana Samuel emerges champion at V4 Chess Tournament | Sakshi
Sakshi News home page

FIDE Chess Tournament: విజేత సామ్యూల్‌ స్టీఫెన్‌

Published Tue, Feb 7 2023 4:56 AM | Last Updated on Tue, Feb 7 2023 4:56 AM

FIDE Chess Tournament: Telangana Samuel emerges champion at V4 Chess Tournament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ ఓపెన్‌ ‘ఫిడే’ రేటెడ్‌ బిలో–1600 చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 ఏళ్ల కుర్రాడు సామ్యూల్‌ స్టీఫెన్‌ నోబెల్‌ విజేతగా నిలిచాడు. వీ4 చెస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో సామ్యూల్‌ స్టీఫెన్‌ తొమ్మిది రౌండ్లకుగాను 8.5 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

సామ్యూల్‌ ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. విజేతగా నిలిచిన సామ్యూల్‌కు భారీ ట్రోఫీతోపాటు రూ. 1 లక్ష ప్రైజ్‌మనీగా లభించింది. హర్షల్‌ పాటిల్‌ (మహారాష్ట్ర; 8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రూ. 60 వేలు... కె.సమర్‌తేజ (తెలంగాణ; 8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి రూ. 40 వేలు ప్రైజ్‌మనీ గెల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం  అధ్యక్షుడు కేఎస్‌ ప్రసాద్‌ విజేతలకు ట్రోఫీలు అందజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement