samuel
-
రిటైర్ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ఇంట్లో చోరీ కేసులో కొత్తకోణం
-
IRS అధికారి ఇంట చోరీ కేసులో కొత్త కోణం.. ఎస్ఐ కృష్ణ స్కెచే ఇది..
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ దొంగతం కేసులో ఎస్ఐ కృష్ణనే సూత్రదారిగా పోలీసు అధికారులు గుర్తించారు. సురేందర్ అనే వ్యక్తితో కలిసి రూ.100 కోట్ల ఆస్తి కొట్టేసేందుకు కృష్ణ స్కెచ్ వేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఎస్సై కృష్ణను అదపులోకి తీసుకుని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇక, ఈ కేసులో సురేందర్‌ను విచారించడంతో వెలుగులోకి ఎస్ఐ కృష్ణ వ్యవహారం బయటకు వచ్చింది. సురేందర్ అనే వ్యక్తితో కలిసి 100 కోట్ల ఆస్థి కొట్టేసేందుకు కృష్ణ స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. మే 30న శామ్యూల్‌కు సురేందర్ మత్తు మందు ఇచ్చాడు.. శామ్యూల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లను సురేందర్ చోరీ చేశాడు. 40 ల్యాండ్ డాక్యుమెంట్లు, 5 లక్షల నగదుతో పాటు 30 తులాలు బంగారాన్ని సురేందర్ దోపిడీ చేశాడు. ఇక, ఈ డాక్యుమెంట్లను కృష్ణకు అందించాడు సురేందర్. కాగా, సీసీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా సైంటిఫిక్ ఎవిడెన్స్‌ను పోలీసులు సేకరించారు. మరోవైపు.. సురేందర్ చోరీ చేసన సొమ్ముతో గోవా వెళ్లి క్యాసినో ఆడినట్టు తెలిపాడు. గతంలో సైతం క్యాసినోకు బానిసై సురేందర్ అప్పుల పాలైనట్లు చెప్పాడు. ఈ కేసు విచారణ సందర్భంగా ఎస్ఐ కృష్ణను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశాడు. ఎస్ఐ కృష్ణా, సురేందర్‌ల అక్రమ దందాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్, బీజేపీకి షాక్!.. పొంగులేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
FIDE Chess Tournament: విజేత సామ్యూల్ స్టీఫెన్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఓపెన్ ‘ఫిడే’ రేటెడ్ బిలో–1600 చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 ఏళ్ల కుర్రాడు సామ్యూల్ స్టీఫెన్ నోబెల్ విజేతగా నిలిచాడు. వీ4 చెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో సామ్యూల్ స్టీఫెన్ తొమ్మిది రౌండ్లకుగాను 8.5 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సామ్యూల్ ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. విజేతగా నిలిచిన సామ్యూల్‌కు భారీ ట్రోఫీతోపాటు రూ. 1 లక్ష ప్రైజ్‌మనీగా లభించింది. హర్షల్ పాటిల్ (మహారాష్ట్ర; 8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రూ. 60 వేలు... కె.సమర్‌తేజ (తెలంగాణ; 8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి రూ. 40 వేలు ప్రైజ్‌మనీ గెల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. -
భారత్, అమెరికా భాగస్వామ్యం ఉజ్వలం
సాక్షి, విశాఖపట్నం: నెట్వర్క్, సాంకేతిక భాగస్వామ్యం బలోపేతం అవుతుండటంతో భారత్, అమెరికా దేశాల మధ్య రక్షణ సంబంధాలు భవిష్యత్‌లో మరింత ఉజ్వలంగా మారతాయని యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ జె పపారో వ్యాఖ్యానించారు. మిలాన్–2022 విన్యాసాల్లో భాగంగా విశాఖలో నిర్వహించిన మారిటైమ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భారత్, అమెరికా దళాలు నెట్వర్క్, సాంకేతికతలను ఇచ్చిపుచ్చుకోవడంలో పరస్పర సహకారాలు మెరుగు పర్చుకుంటున్నాయన్నారు. ఎంహెచ్–60 రోమియో చాపర్స్ వంటి అత్యాధునిక రక్షణ సాంకేతిక హెలికాప్టర్ల విషయంలోనూ బంధం బలోపేతమైందని తెలిపారు. మిలాన్‌లో పాల్గొనడం వల్ల అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ మొదలైన క్వాడ్ దేశాల మధ్య మారిటైమ్ సహకారం మరింత దృఢంగా మారనుందన్నారు. ఈ కూటమిలో పొత్తులు ఒకదానికొకటి బాధ్యతలను కలిగి ఉంటాయనీ, క్వాడ్ దేశాలు పరస్పరం సహాయం చేసుకునేందుకు దేశాల భాగస్వామ్య విలువలు, కట్టుబాట్లను గమనిస్తున్నట్లు తెలిపారు. మిలాన్‌లో వియత్నాం పాల్గొనడం స్ఫూర్తిదాయకమన్నారు. సముద్ర జలాల విషయంలో వియత్నాం తరచూ దురాక్రమణలకు గురవుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మిలన్లో పాల్గొనడం ద్వారా ఒక కూటమిని ఏర్పరుచుకోవడంతో పాటు కొన్ని పెద్ద దేశాల నుంచి ఎదుర్కొంటున్న బెదిరింపులను చిన్న దేశాలు సమర్థంగా తిప్పికొట్టేందుకు సహకారాలు పొందుతాయన్నారు. -
జిల్లా విద్యాశాఖ అధికారిగా శామ్యూల్
సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్: చిత్తూరు జిల్లా మదనపల్లి డెప్యూటీ డీఈఓగా పని చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి (ఎఫ్ఏసీ)గా రెండుసార్లు పని చేసిన శామ్యూల్‌ను ప్రస్తుతం అనంతపురం జిల్లా రెగ్యులర్ డీఈఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ డీఈఓగా పని చేస్తున్న జనార్దనాచార్యులును సరెండర్ చేసిన సంగతి తెలిసిందే. తాజా బదిలీల్లో జనార్దనాచార్యులును నెల్లూరుకు బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న శామ్యూల్‌ను ఇక్కడికి నియమించారు. కాగా శామ్యూల్ గతంలో ఇక్కడ పని చేసిన సమయంలో జిల్లాపై తనదైన ముద్ర వేసుకున్నారు. తొలిసారి 2012 ఆగస్టు 2 నుంచి 2013 ఏప్రిల్ 25 వరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా పని చేశారు. అలాగే రెండోమారు 2016 నవంబరు 2 నుంచి 2017 జనవరి 24 వరకు పని చేశారు. ఆయన పని చేసినంతకాలమూ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా బడికి వెళ్లకుండా ఎగనామం పెట్టే టీచర్ల భరతం పట్టారు. సాధారణ ఉపాధ్యాయులే కాదు బడులు ఎగ్గొట్టి పైరవీలు చేసే కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సైతం వణుకు పుట్టించారు. ప్రతి టీచరూ బడివేళల్లో బడిలోనే ఉండాలనే సిద్ధాంతం అమలుకు గట్టి చర్యలు తీసుకున్నారు. అంతకుముందు వేళాపాళా లేకుండా టీచర్లు, సంఘాల నాయకలు డీఈఓ కార్యాలయం చుట్టూ తిరిగేవారు. శామ్యూల్ వచ్చిన తర్వాత వారి తీరు మారింది. బడివేళల్లో ఒక్కరంటే ఒక్క టీచరు కూడా ఈ దరిదాపుల్లో కనిపించలేదంటే ఆయన ఎంత కఠినంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. సొంత వ్యాపారాలపైనే మక్కువ కొందరు టీచర్లు బడికి డుమ్మా కొడుతూ చీటీలు, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాగే ఎస్జీటీల అక్రమాలకు కొందరు ఎంఈఓలు అండగా నిలుస్తున్నారు. వారానికి, పదిరోజులకోసారి బడికి వెళ్లి సంతకాలు చేస్తున్నారు. నెలనాడు జీతం రాగానే ఎంఈఓలకు వాటా ఇస్తుండటంతో చూసీచూడనట్లు వెళ్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మరికొన్ని పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు వంతులు వేసుకుని మరీ బడులకు వెళ్తున్నారని చెబుతున్నారు. కొందరు టీచర్లు వారంలో తొలి మూడు రోజులు వెళ్తే తర్వాత మూడు రోజులు తక్కిన టీచర్లు వెళ్తున్నారు. ఉదయం బడికి గంట ఆలస్యంగా, సాయంత్రం ఇంటికి గంట ముందు వెళ్లే టీచర్లూ చాలాచోట్ల ఉన్నారు. ఇలాంటి వారిపై కొత్త డీఈఓ దృష్టి సారించి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
‘తుంగతుర్తి టికెట్‌పై పునరాలోచించాలి’
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘2001 నుంచి ఇప్పటి వరకు తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ నాయకుడిగా తెలంగాణ కోసం ఉద్యమించా.. పార్టీని నియోజకవర్గంలో నేనే బలోపేతం చేశా.. తుంగతుర్తి నియోజకవర్గ టికెట్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచించాలి. నాకు టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీ తో గెలుస్తా’అని టీఆర్ఎస్ నేత, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వరకు తన అనుచరులతో కలసి కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల టీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. 2014లో ఓయూ నేతకు టికెట్ ఇస్తే కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ అభ్యర్థి విజయం కోసం కృషి చేశానన్నారు. తాను ఎప్పటికీ కేసీఆర్ వెంటే ఉంటానని, టికెట్ విషయంలో పునరాలోచించాలని అన్నారు. ర్యాలీలో నియోజకవర్గ ముఖ్య నేతలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
‘పది’ ఉత్తీర్ణతపై దృష్టి సారించాలి
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంపుపై ›ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈఓ శామ్యూల్ అన్నారు. హెచ్ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2017 క్యాలెండర్‌ను బుధవారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశులు, జయరామిరెడ్డి, గౌరవాధ్యక్షుడు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శామ్యూల్‌గా మారిన సిద్దరామయ్య!
బెంగళూరు: గోమాంసం తినడాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ముఖ్యమంతి సిద్దరామయ్య లక్ష్యంగా ఆన్‌లైన్‌లోనూ దాడి జరుగుతున్నది. ఓ దుండగుడు వికీపీడియా వెబ్‌సైట్‌లోని ఆయన పేజీ పేరును మార్చివేశాడు. సిద్దరామయ్య పేరును కాస్తా శామ్యూల్‌గా మార్చాడు. గోమాంసం తినడానికి తాను సిద్ధమని సిద్దరామయ్య ప్రకటించిన కొంతసేపటికే ఇది జరిగింది. గోమాంసం తింటే ఆయన తల నరికేస్తామని ఇప్పటికే బీజేపీ స్థానిక నాయకుడు ఒకరు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వికీపీడియాలో ఆయన పేరు మారిన విషయాన్ని గుర్తించిన అధికారులు ఈ అంశాన్ని అడ్మినిస్ట్రేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు వెంటనే శామ్యూల్ పేరును తొలగించి.. ఆయన పేరును పునరుద్ధరించారు. వికీపీడియా వెబ్సైట్లో వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా పొందపరిచే వీలుండటంతో దుండగుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. బీఫ్ వివాదం నేపథ్యంలో సిద్దరామయ్యకు వ్యతిరేకంగా ఆన్లైన్లో విద్వేషపూరితమైన వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయని, అందులో భాగమే ఈ చర్య అని కర్ణాటక సీఎం మీడియా కోఆర్డినేటర్ కేవీ ప్రభాకర్ తెలిపారు. కర్ణాటకలో గోమాంసంపై నిషేధం విధించాలన్న బీజేపీ డిమాండ్‌పై స్సందిస్తూ.. తాను ఇప్పటివరకు గోమాంసం తినలేదని, అయితే ఇప్పుడు తినాలని అనిపిస్తున్నదని, నన్ను అడిగేందుకు వారు ఎవరు అని సిద్దరామయ్య ప్రశ్నించిన సంగతి తెలిసిందే. -
చిత్తూరు డీఈవోగా సుబ్బారెడ్డి?
పోటీలో రవీంద్రనాథరెడ్డి శామ్యూల్‌పై వేటు టెన్త్ ఫలితాలను సీరియస్‌గా తీసుకున్న సీఎం సొంత జిల్లా చివరి స్థానం రావడంపై ఆగ్రహం సమర్థుడైన అధికారిని పంపాలంటూ విద్యాశాఖకు హుకుం నేడో, రేపో వెలువడనున్న ఉత్తర్వులు చిత్తూరు: జిల్లా విద్యాశాఖాధికారిగా సుబ్బారెడ్డిని నియమించనున్నట్లు సమాచారం. ఈ మేరకు నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. సుబ్బారెడ్డి గతంలో హైదరాబాద్ డీఈవోగా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనరేట్‌లో డెప్యూటీ డెరైక్టర్‌గా విధులు నిర్వహించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సుబ్బారెడ్డిని తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయన రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ కార్యదర్శి సిసోడియాకు రిపోర్టు చేసుకున్నారు. మరోవైపు ఖమ్మం డీఈవోగా పనిచేసి రిలీవైన రవీంద్రనాథ్‌రెడ్డి సైతం చిత్తూరు డీఈవోగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చిత్తూరు డీఈవోగా ఎవరు వస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చిత్తూరు సహా మొత్తం నాలుగు డీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖలో బదిలీల కసరత్తు ఊపందుకున్న నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు డీఈవో పోస్టు భర్తీ కానుంది. డీఈవోగా సుబ్బారెడ్డిని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. విద్యాశాఖపై సీఎం సీరియస్ చిత్తూరుకు సమర్థుడైన విద్యాశాఖాధికారిని నియమించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర విద్యాశాఖకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. పదో తరగతి ఫలితాల్లో సొంత జిల్లాకు చివరి స్థానం దక్కడంపై ఇప్పటికే సీఎం ఆగ్రహంతో ఉన్నారు. వెంటనే ఇన్‌చార్జ్‌ల పాలనకు స్వస్తి పలికి రెగ్యులర్ డీఈవోను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపింది. దీంతో కొత్త డీఈవో నియామకంపై రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సుబ్బారెడ్డి, రవీంద్రనాథ్రెడ్డిలో ఒకరిని చిత్తూరు డీఈవోగా నియమించనున్నట్లు సమాచారం. శామ్యూల్‌పై వేటు ఇన్నాళ్లూ పచ్చచొక్కా నేతల మద్దతుతో రెండు డెప్యూటీ డీఈవో పదవులతో పాటు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖాధికారిగా కొనసాగిన శామ్యూల్‌పై వేటుకు రంగం సిద్ధమైంది. దేశం కార్యకర్తల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప శామ్యూల్ విద్యాశాఖను గాలికి వదిలేశారన్న విమర్శలు ఉన్నారు. శామ్యూల్ నిర్వాహకంతో గత ఏడాది జిల్లా పదిలో చివరి స్థానంలో నిలిచింది. ఇప్పటికీ ఇన్చార్జ్ డీఈవోగా కొనసాగేందుకు శామ్యూల్ తనవంతు ప్రయత్నాలుసాగిస్తున్నట్లు సమాచారం. -
డీఈవో పోస్టుకు ఫైటింగ్ !
- బరిలో మువ్వా, దేవానందరెడ్డి, శామ్యూల్ - తననే కొనసాగించాలంటూ ఇన్చార్జ్ డీఈవో పైరవీలు - మంత్రులకూ సవాలుగా మారిన వ్యవహారం సాక్షి, చిత్తూరు: జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు కోసం నలుగురు ఢీ అంటే ఢీ అంటున్నారు! ఎవరి పరిధిలో వారు ప్రయత్నాలు సాగి స్తున్నారు. గతంలో నెల్లూరు డీఈవోగా పనిచేసిన మువ్వా రామలిం గం, పాడేరు ఐటీడీఏ అధికారి దే వానందరెడ్డి, మదనపల్లె డెప్యూటీ డీఈవో, ప్రస్తుత ఇన్చార్జ్ డీఈవో శామ్యూల్, ఓ మహిళా అధికారి తీవ్రంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. వారిలో ఒకరికిజిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ మద్దతు పలుకుతున్నట్లు ప్రచారంలో ఉంది. జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వర్గాలుగా విడిపోయి డీఈవో పోస్టు కోసం పైరవీలు నెరుపుతున్నట్లు తెలిసింది. దీంతో డీఈవో పోస్టు బేరం భారీగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో నెల్లూరు డీఈవోగా పనిచేసిన మువ్వా రామలింగం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వక పోవడంతో ఖాళీగా ఉన్నారు. చిత్తూరు డీఈవోగా రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఆయనకు రాష్ర్ట మంత్రి నారాయణ హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి నారాయణకు అత్యంత సన్నిహితుడు కావడంతో రామలింగం భరోసాతో ఉన్నారని సమాచారం. రామలింగం గతంలో కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పనిచేసిన సమయంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. నెల్లూరులో పనిచేస్తుండగా ఆయనను కలెక్టర్ సస్పెండ్ చేయడంతో పోస్టింగ్ లేక ఖాళీగా ఉన్నారు. ఇదిలావుండగా పాడేరులో ఐటీడీఏలో పనిచేస్తున్న దేవానందరెడ్డి డీఈవోగా రావడానికి అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆశీస్సులు కోరినట్లు సమాచారం. శ్యామ్యూల్ ముమ్మర యత్నం ! ప్రస్తుతం ఇన్చార్జ్ డీఈవోగా ఉన్న శామ్యూల్ రెగ్యులర్ పోస్టులోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డీఈవో ప్రతాప్‌రెడ్డి కడపకు బదిలీ కావడంతో మదనపల్లి డెప్యూటీ డీఈవోగా ఉన్న శ్యామ్యూల్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆయన మంత్రి బొజ్జలతో పాటు, జెడ్పీ చైర్పర్సన్, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, పలువురు టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకొంటున్నట్లు తెలుస్తోంది. ఓ మహిళా ప్రిన్సిపాల్ కూడా... డీఈవో పోస్టు కోసం ఓ మహిళా ప్రిన్సిపాల్ కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన కొందరు అధికారపార్టీ నేతలు ఆమెకు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో డీఈవో పోస్టు ఖరీదుగా మారినట్లు సమాచారం. -
కారుపై కోపం..!
వద్దన్నా వదిలేసి వెళ్లిపోయాడనో... ఫ్లాష్‌బ్యాక్‌లో మరేదన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చిందో... మొత్తానికి బాయ్‌ఫ్రెండ్ శామ్యూల్‌పై కోపంతో అతని మెర్సిడెజ్ కారును తుక్కు చేసింది స్టార్ ర్యాపర్ నికీ మినాజ్. తన జతగాడితో అప్పటివరకూ తీవ్రంగా కొట్లాడి, విడిపోయిన ఈ అనకొండ సింగర్.. అదే టెంపోను కంటిన్యూ చేసింది. పక్కనే ఉన్న బేస్‌బాల్ బ్యాట్‌ను పట్టుకుని... ముద్దుగా ఉన్న కారును చెత్తగా మార్చేసింది. కసి తీరలేదేమో.. అతగాడి డ్రెస్స్టూ తీసుకెళ్లి గార్బేజీలో పడేసింది! -
‘ఉద్యానం’.. బహు లాభదాయకం
నిజామాబాద్ వ్యవసాయం : పండ్ల తోటల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన శాఖ జాయింట్ డెరైక్టర్ శామ్యూల్ సూచించారు. పండ్ల తోటల పెంపకంతో అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. మామిడి, అరటి, బొప్పాయి వంటి తోటల పెంపకానికి ఉద్యాన శాఖ ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. వీటిని ఉపయోగించుకొని లబ్ధిపొందాలని సూచించారు. ఉద్యాన పంటల అభివృద్ధి పథకాల గురించి ఆయన వివరిం చారు. తోటల పెంపకంపై ఆసక్తిగల రైతులు ఉద్యాన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మామిడి మొక్కలు, జీవ, రసాయన ఎరువులు, పురుగు మందుల ఖర్చులో 40 శాతం రాయితీ ఇస్తోంది. మూడేళ్లలో అయ్యే ఖర్చులో 40 శాతం రాయితీ రూ. 6,560కి(ఎకరానికి) మించకుండా లభిస్తుంది. ఒక రైతు పది ఎకరాల వరకు రాయితీకి అర్హుడు. రైతులు తోటకు ఉపయోగించిన మందులు తదితర వివరాలతో ఉద్యాన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే రాయితీ మొత్తాన్ని ఆ రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అరటి అరటి సాగుకు సైతం 40 శాతం రాయితీ లభిస్తుంది. ఎకరం విస్తీర్ణంలో మొక్కలు, జీవ, రసాయన ఎరువులు, పురుగు మందులకు రెండేళ్లలో అయ్యే ఖర్చులో 40 శాతం(రూ. 16,394 మించకుండా) రాయితీ మొత్తాన్ని సదరు రైతు ఖాతాలో జమ చేస్తారు. బొప్పాయి బొప్పాయికి 40 శాతం (గరిష్టంగా రూ. 9,865) రాయితీ లభిస్తుంది. ఒక రైతు పది ఎకరాల వరకు రాయితీ పొందడానికి అర్హుడు. మామిడి తోటల పునరుద్ధరణ రోగాల బారిన పడిన లేదా కాతకాయనటువంటి పాత మామిడి తోటలను పునరుద్ధరించడానికి సైతం ఉద్యాన శాఖ ప్రోత్సాహకాలు అందిస్తోంది. మొక్కలు, ఎరువులు, పురుగు మందులు, పరికరాల కొనుగోలుకు అయ్యే ఖర్చు లో 50 శాతం (ఎకరానికి రూ. 6 వేలు) రాయితీ ఇస్తారు. బంతిపూలు సాగుకు అయ్యే ఖర్చులో 40 శాతం రాయితీ (గరిష్టంగా ఎకరానికి రూ.4 వేలు) ఇస్తారు. -
మరో ముగ్గురు ‘ఎర్ర’ దొంగల అరెస్టు
చిత్తూరు (అర్బన్) : చిత్తూరులో ‘ఎర్ర’దొంగలను పోలీసులు వరసపెట్టి అరెస్టు చేస్తున్నారు. అరెస్టుల జాబితాలో సోమవారం మరో ముగ్గురు చేరారు. వీరి నుంచి ఫార్చునర్, ఐషర్ కార్లతో పాటు 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, ఓఎస్డీ రత్న నిందితులను అరెస్టు చూపించి వారి నేర చరిత్రను విలేకరుల సమావేశంలో వివరించారు... శామ్యూలు ... ఆయిల్ వ్యాపారం నుంచి... మిజోరం రాష్ట్రానికి చెందిన శామ్యూల్ (40) విద్యావంతుడు. ఎంఏ ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడు. ఐజ్వాల్ సమీపంలోని బాంగ్వా ఇతని స్వస్థలం. 2002వరకు కేకే ఏజెన్సీ ద్వారా ప్రభుత్వ అనుమతితో ఇడిబుల్ ఆయిల్, ఎలక్ట్రికల్ గూడ్స్, కంప్యూటర్ పరికరాల వ్యాపారం, 2011 నుంచి కేకే పేరిట పాల డెయిరీ ప్రారంభించి పాలు, నెయ్యి పాకెట్లను దుకాణాలకు సరఫరా చేసేవాడు. అదే ఏడాది ఐజ్వాల్‌లో ఎర్రచందనం వ్యాపారం చేసే ఎల్ఫియాతో పరిచయం పెంచుకున్నాడు. అతని ద్వారా చెన్నైకు చెందిన నాగరాజు, వేలు, సెంథిల్ కుమార్, జాఫర్, అయ్యప్పన్ ద్వారా ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాడు. ఎర్ర చందనం దుంగలను దుబాయ్, సింగపూర్, హాంకాంగ్, చైనా, బర్మాలకు అమ్మేవాడు. ఇలా ఇప్పటి వరకు 50 టన్నుల ఎర్ర దుంగలను విక్రయించాడు. ఇతని నెలసరి సంపాదన రూ.20 లక్షలు. సింగారవేలు ... గోనెసంచుల అమ్మకం నుంచి... చెన్నైకు చెందిన సింగారవేలు అలియాస్ మారియప్పన్ గురుస్వామి (59) పుట్టింది బర్మాలో. అక్కడే ఆరో తరగతి వరకు చదివాడు. గోనెసంచుల వ్యాపారం చేసేవాడు. 40 ఏళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి చెన్నైకు వచ్చి స్థిరపడ్డాడు. 1987లో చెన్నైలోని ఓ టెక్స్టైల్స్ దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేసేవాడు. చెన్నైకు చెందిన షణ్ముగం, సుగంధి టాల్క్ సంస్థ భాగస్వాములు ధర్మరాజు, డేవిడ్‌తో కలిసి శ్రీగంధం వ్యాపారం చేశాడు. 2002లో వైఎస్సార్ జిల్లాకు చెందిన అలంకార్తో కలిసి 50 టన్నుల ఎర్రచందనం దుంగలను 5 లారీల్లో ముంబైకు చెందిన జైన్‌కు విక్రయించాడు. చిత్తూరు నగరానికి చెందిన అన్సర్బాయ్ ద్వారా ఆరు టన్నులను జైన్‌కు అమ్మాడు. 2012లో కోల్‌కత్తాకు చెందిన లక్ష్మణ్ ద్వారా 30 టన్నుల ఎర్రచందనాన్ని ఢిల్లీలోని స్మగ్లర్లకు అమ్మాడు. చిత్తూరుకు చెందిన కిషోర్, గోపి, డాబా శీనుతో కలిసి 100 టన్నుల ఎర్రదుంగల్ని ఢిల్లీకి చెందిన విక్రమ్‌కు విక్రయించాడు. నాగరాజు ... చీపుర్ల అమ్మకం నుంచి... మణిపూర్ రాష్ట్రంలోని మోరెకు చెందిన నాగరాజు(38) చీపురు కట్టల వ్యాపారిగా వ్యాపారం ప్రారంభించాడు. తల్లిదండ్రులతో కలిసి చెన్నైలో స్థిరపడ్డాడు. డిగ్రీ పూర్తిచేసి తొలుత ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2009లో బర్మా, చైనా దేశాల నుంచి చీపుర్లు, క్లీనింగ్ మెటీరియల్స్ చెన్నైకు దిగుమతి చేసుకుని దుకాణాలకు అమ్మేవాడు. 2011లో మిజోరంలో ఉన్న ఎల్ఫీయాతో పరిచయం ఏర్పడింది. చెన్నైకు చెందిన సెంథిల్, వేలు, అయ్యప్పన్, జాఫర్‌తో కలిసి చైనా, సింగపూర్, హాంకాంగ్, బర్మా, దుబాయ్‌కు ఎర్రచందనం విక్రయించడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు సుమారు 100 టన్నుల ఎర్రచందనం విదేశాలకు ఎగుమతి చేశాడు. నెలకు రూ.15 లక్షల వరకు సంపాదించేవాడు.