శామ్యూల్‌గా మారిన సిద్దరామయ్య! | Miscreants add 'Samuel' to Siddaramaiah's name on Wikipedia page | Sakshi
Sakshi News home page

శామ్యూల్‌గా మారిన సిద్దరామయ్య!

Published Thu, Nov 5 2015 4:31 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

శామ్యూల్‌గా మారిన సిద్దరామయ్య!

శామ్యూల్‌గా మారిన సిద్దరామయ్య!

బెంగళూరు: గోమాంసం తినడాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ముఖ్యమంతి సిద్దరామయ్య లక్ష్యంగా ఆన్‌లైన్‌లోనూ దాడి జరుగుతున్నది. ఓ దుండగుడు వికీపీడియా వెబ్‌సైట్‌లోని ఆయన పేజీ పేరును మార్చివేశాడు. సిద్దరామయ్య పేరును కాస్తా శామ్యూల్‌గా మార్చాడు. గోమాంసం తినడానికి తాను సిద్ధమని సిద్దరామయ్య ప్రకటించిన కొంతసేపటికే ఇది జరిగింది.  గోమాంసం తింటే ఆయన తల నరికేస్తామని ఇప్పటికే బీజేపీ స్థానిక నాయకుడు ఒకరు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే వికీపీడియాలో ఆయన పేరు మారిన విషయాన్ని గుర్తించిన అధికారులు ఈ అంశాన్ని అడ్మినిస్ట్రేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు వెంటనే శామ్యూల్ పేరును తొలగించి.. ఆయన పేరును పునరుద్ధరించారు. వికీపీడియా వెబ్‌సైట్‌లో వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా పొందపరిచే వీలుండటంతో దుండగుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. బీఫ్ వివాదం నేపథ్యంలో సిద్దరామయ్యకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో విద్వేషపూరితమైన వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయని, అందులో భాగమే ఈ చర్య అని కర్ణాటక సీఎం మీడియా కోఆర్డినేటర్ కేవీ ప్రభాకర్ తెలిపారు.

కర్ణాటకలో గోమాంసంపై నిషేధం విధించాలన్న బీజేపీ డిమాండ్‌పై స్సందిస్తూ.. తాను ఇప్పటివరకు గోమాంసం తినలేదని, అయితే ఇప్పుడు తినాలని అనిపిస్తున్నదని, నన్ను అడిగేందుకు వారు ఎవరు అని సిద్దరామయ్య ప్రశ్నించిన సంగతి తెలిసిందే.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement