Beef ban
-
అక్కడ బీఫ్ తిని.. ఇండియాకు రండి: కేంద్ర మంత్రి
సాక్షి, భువనేశ్వర్: ఓవైపు గోమాంస నిషేధంపై వివిధ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా టూరిజం శాఖ(సహాయ) బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేజే ఆల్ఫోన్స్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఫ్ తిన్నాకే ఇండియాకు రావాలంటూ విదేశీ టూరిస్ట్‌లకు ఆయన సూచించారు. భువనేశ్వర్‌లో నిర్వహిస్తున్న 33వ ఇండియన్ టూరిస్ట్ అసోషియేషన్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మీడియా ఆయనను పలకరించగా, బీఫ్ బ్యాన్పై ఆయన స్పందించారు. ‘వాళ్లు(విదేశీ టూరిస్ట్‌లు) వాళ్ల సొంత దేశాల్లో బీఫ్ తిన్న తర్వాతే .. ఇండియాకు రావాల్సి ఉంటుంది’ అంటూ నవ్వుతూ ఓ ప్రకటన ఇచ్చారు. మోదీ సర్కారు అన్ని వర్గాలను కలుపుకొని పోతుందని, కేరళ, గోవాలో బీఫ్‌ను తినడంపై తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం, సమస్య లేవని ఇంతకు ముందు ఈయనే వ్యాఖ్యానించారు. అయితే గోమాంస నిషేధం చాలా సున్నితమైన అంశమని, స్పందించేందుకు తానేం ఆహార శాఖ మంత్రిని కాదని తర్వాత ఆల్ఫోన్స్ వివరణ ఇచ్చుకున్నారు. గోమాంస నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రాల్లో మంత్రి ఆల్ఫోన్స్ సొంత రాష్ట్రం కేరళ కూడా ఉంది. జంతువుల అమ్మకం అనేది మాంసం కోసం కాదంటూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించిన విషయం తెలిసిందే. -
మానవ రక్తంతో తడుస్తున్న ‘గోమాంసం’
న్యూఢిల్లీ: గోమాంసాన్ని తరలిస్తున్నారనే ఆరోపణలపై అమాయకులను కొట్టి చంపుతున్న గోరక్షకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించినా దాడులు ఆగడం లేదు. నకిలీ గోరక్షకులు, మీట్ మాఫియా దాడులకు అమాయకులైన ముస్లింలు, దళితులే కాకుండా భారత జంతు సంక్షేమ బోర్డు అధికారులు, పర్యాటకులు, జంతు ప్రేమికులు, నిజమైన గోరక్షకులు బలవుతున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా బయటకు రావడం లేదు. బాధితులు మరణించిన సందర్భాలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. గుర్తుతెలియని దుండగుల పేరిట కేసులు నమోదవుతున్నాయి. తదుపరి చర్యలు కనిపించడం లేదు. గోమాంసం నిషేధం అమల్లో ఉన్న గుజరాత్ నుంచి మహారాష్ట్రకు గోమాంసం, పశువులు పెద్ద ఎత్తున అక్రమ రవాణా కొన్నేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ‘మీట్ మాఫియా’ దీనిలో కీలక పాత్ర వహిస్తోంది. ఈ మాఫియాను ఛేదించేందుకు ‘ఇండియా టుడే’ ఇటీవల నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. గోమాంసం రవాణాను అడ్డుకుంటామన్న నెపంతో రోడ్డుపక్కన వెలసిన శివసేన, భజరంగ్ దళ్ కేంద్రాలకు చెందిన కార్యకర్తలే మీట్ మాఫియాకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటున్నారు. గోమాంసం లేదా పశువులను తరలించే ఒక్కో వాహనానికి కనీసంగా వారు 20వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. డబ్బులిస్తే తాము వాహనం వెంట వస్తామని, ఏ పోలీసు అధికారి కూడా తమను చూస్తే వాహనాన్ని ఆపరని భరోసా ఇస్తున్నారు. డబ్బులివ్వకపోతే రాళ్లతోకొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఒక్క గోవులేకాదు, ఎద్దులు, బర్రెలు వేటిని తరలించినా డబ్బులు ముట్టజెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచి అహ్మదాబాద్, పుణె జాతీయ రహదారిలో ఈ దందా కొనసాగుతున్నప్పటికీ పశువుల విక్రయంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన నాటి నుంచి ఎక్కువైందని పశువుల ఎగుమతిదారులు చెబుతున్నారు. కేంద్రం ఆంక్షలపై కోర్టులు స్టే ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం గోమాంస నిషేధం అమల్లో ఉన్న ప్రతి రాష్ట్రంలో గోరక్షకుల పేరిట దాడులు చేస్తున్నారు. పశువులను తరలించే వాహనాల నుంచి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే గోమాంసం కలిగి ఉన్నారనో, కబేళాలకు గోవులను తరలిస్తున్నారనే ఆరోపణలపై కొడుతున్నారు. ఇలా దెబ్బలుతిన్న అమాయకులు ఎందరో ఉన్నారు. వారు ఫిర్యాదులు చేసినా కొంత మంది నాయకుల ఒత్తిళ్లకు లొంగి పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు. జూలై 14వ తేదీన సాఫ్ట్వేర్ ఇంజనీరు అజయ్ (ఆయన విజ్ఞప్తిపై పేరు మారింది) తన భార్యా, మిత్రులతో కలసి పర్యాటక ప్రాంతానికి వెళ్లగా వారిపై మీట్ మాఫియా దాడి చేసింది. అజయ్ చెప్పిన వివరాల ప్రకారం వారు ఒడిశాలోని రాయగఢ జిల్లా, ఛాందిలీ ప్రాంతం పర్యటనకు వెళ్లారు. అక్కడ బహిరంగ ప్రదేశంలో బలమైన కర్రలు, గొడ్డళ్లతో పశువులను బాదుతూ ఎక్కడికో తీసుకెళుతున్నారు. నోరులేని జీవులను ఎందుకయ్యా ! అలా హింసిస్తున్నారని అజయ్ బృందం ప్రశ్నించగా, అవే కర్రలు, గొడ్డళ్లతో వారిని చితకబాదారు. అజయ్ భార్యను లైంగికంగా వేధించారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు ధ్రువీకరణ పత్రాలు కూడా ఉన్నాయి. పోలీసులు కేసును నమోదు చేయడానికి తొలుత నిరాకరించారు. సంఘటనకు సంబంధించి రికార్డు చేసిన కొన్ని మొబైల్ వీడియో దశ్యాలను సాక్ష్యంగా చూపడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఇంతవరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో జూన్ నెలలో భారత జంతు సంక్షేమ బోర్డు అధికారి తిమ్మరాజుపై పోలీసుల సమక్షంలోనే మీట్ మాఫియా దాడి చేయడంతో తలకు బలమైన గాయం అయింది. ఇతర రాష్ట్రాల్లో భారత జంతు సంక్షేమ బోర్డుకు చెందిన అధికారులు కవితా జైన్, జోషిన్ ఆంటోనిలకు కూడా దాడుల్లో తలలపై తీవ్ర గాయాలయ్యాయి. హర్యానాలోని రేవరి జిల్లా, ఖోల్లో జూలై పదవ తేదీన పశువులను అక్రమంగా తరలిస్తున్న మీట్ మాఫియా పోలీసులపైకే కాల్పులు జరిపింది. పలు రాష్ట్రాల్లో గోమాంసం నిషేధం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మీట్ మాఫియా ఆగడాలు మితిమీరిపోయాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. గోమాంసానికి డిమాండ్ పెరగడంతో మీట్ మాఫియా ఎంతకైనా తెగిస్తోందని వారన్నారు. మరోవైపు డబ్బుల కోసం మీట్ మాఫియాకు సహకరిస్తున్న గోరక్షకుల దాడులు కూడా పెరిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. -
గోవధ నిషేధ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి: సురవరం
సాక్షి, హైదరాబాద్: గొడ్డు మాంసంపై నిషేధంలేదని, గోవు లను వధశాలలకు తరలించడాన్నే నిషేధించినట్లు పదే పదే అబద్ధాలను ప్రచారం చేస్తున్నా రని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం గోవధ నిషేధ చట్టాన్ని వెంటనే ఉపసంహరిం చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అశాస్త్రీయమైన అవగాహనతో సంఘ్‌పరివార్ అనారోగ్యకరమైన వాతావర ణాన్ని సృష్టిస్తోందన్నారు. గోవధ నిషేధచ ట్టంపై మంగళవా రం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయనపై విధంగా స్పం దించారు. మాంసా హారుల్లో 60 నుంచి 70 శాతం మంది గొడ్డుమాంసం తినేవారు న్నారని, ఇందులో ఎక్కువగా ప్రోటీన్లు ఉన్నందున అధికంగా భుజిస్తు న్నారని చెప్పా రు. భిన్నమైన పద్ధతుల్లో మాంసాహారాన్ని నిరుత్సాహ పరిచేందుకు, శాకా హారాన్ని పెంచేందుకు సంఘ్‌పరి వార్ ప్రయత్నిస్తోందన్నారు. శ్వాస పీల్చే సమయంలో సూక్ష్మక్రిములు శరీరం లోకి వెళ్లాక మరణించ కుండా ఉండేందుకు జైనమతస్థు లు ముక్కుకు, నోటికి గుడ్డను అడ్డుపెట్టుకుం టారన్నారు. ఈ విధంగా ప్రతీది జంతు హింస అంటే అందరూ జైనులుగా మారాల్సిందేనని అన్నారు. రైతుల మృతిపై న్యాయ విచారణ మధ్యప్రదేశ్‌లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో అయిదుగురు రైతులు మరణించడం పట్ల సీపీఐ జాతీయ సెక్రటేరియట్ పక్షాన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీనికి కారకులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
గోమాంస నిషేధంపై గందరగోళం
-
గోమాంస నిషేధంపై గందరగోళం
పశువులను కబేళాలకు తరలించకుండా నిరోధించేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆంక్షలపై కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని మంటకలుపుతోందని మండిపడుతున్నాయి. దీనికి కేంద్ర పర్యావరణ శాఖ వివరణ ఇస్తూ ఆహారం కోసం జంతువులను హతమార్చడాన్ని నిషేధించలేదని, జంతువులను హింస నుంచి రక్షించే చట్టం కిందనే ఆంక్షలు తీసుకొచ్చామని, అందుకని సమైక్య స్ఫూర్తిని దెబ్బతీయలేదని స్పష్టం చేశారు. పశుమాంసం క్రయ, విక్రయాలపై, కబేళాలకు పశువుల అమ్మకాలపై నిషేధం విధిస్తూ చట్టాలు తెచ్చే హక్కు రాష్ట్రాలకు మాత్రమే ఉంది. అందుకే బీజేపీ తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గోమాంస నిషేధ చట్టాలను తెచ్చింది. దేశవ్యాప్తంగా ఈ గోమాంస విక్రయాలను నిరోధించేందుకు కేంద్రం జంతువులను క్రూరత్వం నుంచి రక్షించే (ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్స్ యాక్ట్) చట్టాన్ని ఆశ్రయించింది. ఆ చట్టంలో 22వ నిబంధన కింద పశువుల సంతలో పశువులను వ్యవసాయ అవసరాల కోసమే తీసుకుంటున్నట్లు కొనుగోలు, విక్రయదారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటూ ఆంక్షలు తీసుకొచ్చారు. అదే చట్టంలోని 11వ సెక్షన్ (ఈ) నిబంధన ప్రకారం అనవసరంగా హింసించనంత కాలం ఆహారం కోసం జంతువులను చంపడం తప్పు కాదని కూడా ఉంది. చట్టం ఇంత స్పష్టంగా జంతువులను ఆహారం కోసం చంపవచ్చని చెబుతుండగా, కబేళాలకు తరలించరాదనే నిబంధన ఎలా చెల్లుతుంది? చట్టం పశుపక్ష్యాదులన్నింటినీ కలిపి జంతువులుగా పరిగణిస్తే, కొత్తగా విధించిన ఆంక్షల్లో పశువులను మాత్రమే పేర్కొన్నారు. ఇదీ ఎంతవరకు సబబు? దేశవ్యాప్తంగా గోమాంసం నిషేధించాలనే ఆరెస్సెస్ డిమాండ్‌ను అమలు చేయడానికి కేంద్రం అతి తెలివిగా వ్యవహరించడమే ఈ గందరోగోళానికి కారణం. గోమాంసం నిషేధం, కబేళాల నిషేధం రాష్ట్రాల పరిధిలోని అంశం కావంతో కేంద్రం జంతువులను క్రూరత్వం నుంచి రక్షించే చట్టం నిబంధనలను ఆశ్రయించింది. ఆ చట్టం కింద పశుమాంసం క్రయవిక్రయాలను గానీ, కబేళాలను గానీ నిషేధించే హక్కు లేకపోవడం వల్ల కేంద్రం మధ్యేమార్గాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్రమే గోమాంసాన్ని నిషేధించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. నిషేధం వల్ల వచ్చే పర్యవసనాలను కూడా పరిశీలించాలి. దేశంలో గోమాంసం, దాని సంబంధిత పరిశ్రమలపై ఆధారపడి బతుకుతున్న నాలుగైదు కోట్ల మంది రోడ్డున పడతారని ప్రాథమిక అంచనాలు తెలియజేస్తున్నాయి. యూపీలో మాంసం పరిశ్రమ స్తంభించిపోవడం వల్ల ఏడాదికి 56 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతుందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. -
నేనొస్తే స్వచ్ఛమైన బీఫ్ అందిస్తా: బీజేపీ నేత
న్యూఢిల్లీ: బీఫ్ మాంసం నిషేధించాలా వద్ద అనేది తర్వాత తేలుస్తామని, ముందైతే తనను ఎన్నికల్లో గెలిపించాలని కేరళకు చెందిన బీజేపీ నేత ఎన్ శ్రీప్రకాశ్ కొంత వివాదాన్ని మూటగట్టుకునేలా మాట్లాడారు. వ్యక్తిగతంగా తాను కూడా బీఫ్‌కు వ్యతిరేకం అని, గోవధను ఒప్పుకోనని చెబుతూనే మాంసం విషయంలో ప్రజల ఇష్టం అని అన్నారు. వారు ఎలాంటి మాంసం అయినా తినవచ్చని చెప్పారు. ఏప్రిల్ 12న జరగనున్న మలప్పురం లోక్‌సభ స్థానంలో ఆయన బీజేపీ తరుపున ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ఓ టీవీ చానెల్ మాట్లాడుతూ బీఫ్ నిషేధానికి మద్దతిస్తారా అని ప్రశ్నించగా ఈ విధంగా సమాధానం చెప్పారు. ‘నేను వ్యక్తిగతంగా గోవధకు అంగీకరించను. కానీ, కేరళ చట్టాలు బీఫ్ తినేందుకు అనుమతిస్తాయి. ప్రజలు ఎలాంటి మాంసం అయినా తినగలరు. నేను మలప్పురం ప్రజలకు ఒక హామీ ఇస్తున్నాను. మీకు క్వాలిటీ బీఫ్ అందిస్తాను. కబేళాలను ఎలాంటి సమస్యలు లేకుండా నడిపిస్తాను’ అని చెప్పారు. మలప్పురం నియోజకవర్గం ఎంపీ గత ఫిబ్రవరి 1న చనిపోయిన కారణంగా ఇప్పటి ఉప ఎన్నిక అనివార్యమైంది. -
కబేళాలపై కోరడా ఝుళిపించిన 4 రాష్ట్రాలు
-
అక్కడ పెద్దకూరపై నో నిషేధం: బీజేపీ
ఉత్తరప్రదేశ్‌లో నూతన బీజేపీ ప్రభుత్వం అక్రమ గోవధశాలలపై ఉక్కుపాదం మోపుతోంది. గోడ్డుమాంసం కబేళాలు, అక్రమ మాంసం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నది. దీంతో ఈ ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపైనా ప్రతిబింబిస్తున్నది. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, మిజోరం, నాగాల్యాండ్‌లలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. క్రైస్తవ మెజారిటీ ప్రజలున్న ఈ రాష్ట్రాల్లో పశుమాంసాన్ని అధికంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తే బీఫ్‌పై నిషేధం తప్పదంటూ పెద్ద ఎత్తున వదంతులు చేలరేగుతున్నాయి. దీంతో ఈశాన్య రాష్ట్రాలలో తాము అధికారంలోకి వస్తే బీఫ్ నిషేధాన్ని అమలుచేసే ప్రసక్తే లేదని బీజేపీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్‌పై నిషేధం విధిస్తారన్న ప్రచారం వట్టిదేనని, స్వార్థరాజకీయ ప్రయోజనాలతోనే కొన్ని గ్రూపులు ఈ వదంతులను ప్రచారం చేస్తున్నాయని మేఘాలయా బీజేపీ చీఫ్ డేవిడ్ ఖర్సాటి స్పష్టం చేశారు. యూపీలో బీఫ్ నిషేధ ప్రభావం తమ రాష్ట్రాలపై ఉండబోదని, ఇక్కడ పశుమాంసంపై ఎలాంటి ఆంక్షలు ఉండవని నాగాలాండ్ బీజేపీ చీఫ్ విససోలీ లౌంగు మీడియాకు తెలిపారు. మేఘాలయా, మిజోరంలలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, నాగాలాండ్‌లో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్‌లో బీజేపీ మిత్రపక్షంగా ఉంది. -
బీఫ్ నిషేధం కొనసాగుతుంది: హైకోర్టు
ముంబై : మహారాష్ట్రలో గోవధ నిషేధం కొనసాగుతుందని బాంబే హైకోర్టు శుక్రవారం తెలిపింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చిన ఆవు మాంసాన్ని తినటంలో తప్పులేదని కోర్టు వినూత్నంగా తీర్పునిచ్చింది. అభయ్ ఓకా, సురేష్ గుప్ లతో కూడిన డివిజనల్ బెంచ్ ఈ మేరకు తీర్పునిచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది బీఫ్ వినియోగంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. చట్టానికి విరుద్ధంగా జంతుబలికి పాల్పడే వారికి ఐదేళ్లు జైలుతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బీఫ్ బ్యాన్పై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, మరోవైపు బయట నుంచి తెచ్చుకున్న గోమాంసం తినటంలో తప్పులేదని తెలిపింది. -
బీఫ్ బ్యాన్ కోసం ఎనిమిదిమంది ఆత్మహత్యాయత్నం
అహ్మదాబాద్ః గోమాంసాన్ని నిషేధించాలంటూ గుజరాత్ లో మళ్ళీ ఆందోళన మొదలైంది. రాజ్ కోట్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎనిమిదిమంది యువకులు ఢిల్లీలో జరుగుతున్న బీఫ్ బ్యాన్ డిమాండ్ దీక్షకు మద్దతుగా పత్తి పొలాలకు వేసే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. దీంతో ఆప్రమత్తమైన స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గుజరాత్ లోని గోరక్ష ఏక్తా సమితికి చెందిన సుమారు 50 మంది కార్యకర్తలు మధ్యాహ్నం 12.15 నిమిషాల ప్రాంతంలో కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వారి డిమాండ్ కు మద్దతుగా నినాదాలు ప్రారంభించారు. దీంతో ఆందోళనకారులను అడ్డుకునేందుకు ఘటనాస్థలంలో పోలీసులు మొహరించారు. దీంతో ప్రదర్శనకు రాజ్ కోట్ వచ్చిన నిరసనకారుల్లోని సౌరాష్ట్ర గూచీ, గోండాల్, థంగాధ్, జామ్‌నగర్, లింబ్డి ప్రాంతాల్లోని ఎనిమిదిమంది యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రదర్శనకు వచ్చిన యువత ఆస్పత్రిపాలయ్యారన్నవార్తతో గో రక్షణ ప్రచార మద్దతుదారులు సౌరాష్ట్ర ప్రాంతంలో నిరసనలకు దిగారు. పలు ప్రాంతాల్లోని రహదారులపై ట్రాఫిక్ స్తంభింపజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రాజ్ కోట్ గ్రీన్ ల్యాండ్ క్రాసింగ్ సమీపంలో ట్రాఫిక్ అడ్డుకునేందుకు ప్రయత్నించిన 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ ఢిల్లీలో కొనసాగుతున్న నిరాహార దీక్షకు మద్దతుగా రాజ్ కోట్ లో ప్రదర్శన నిర్వహించారు. -
'అలాంటి వాళ్లు మా రాష్ట్రానికి రావొద్దు'
చండీగఢ్: హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీఫ్ తినేవారు తమ రాష్ట్రానికి రావొద్దని హుకుం జారీ చేశారు. తమ రాష్ట్రంలో గోపరిరక్షణ చట్టం కట్టుదిట్టంగా అమలవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. 'ఆహారం, పానీయపు అలవాట్లు సరిపడవని కొన్ని దేశాలకు మనం వెళ్లం. అలాగే బీఫ్ తినకుండా ఉండలేమని భావించేవారు హర్యానాకు రాకుండా ఉంటే మంచిద'ని అనిల్ విజ్ అన్నారు. బీఫ్ తినే విదేశీయులకు ప్రత్యేక అనుమతి ఇస్తారా అని విలేకరులు ప్రశ్నకు ఆయనీవిధంగా స్పందించారు. అయితే బీఫ్ తినే విదేశీయులకు మినహాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అంతకుముందు ప్రకటించారు. వివాదస్పద ప్రకటనలు చేయడం అనిల్ విజ్ కు కొత్తకాదు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దీనిపై ఆన్ లైన్ పోల్ నిర్వహించాలని గతేడాది ఆయన డిమాండ్ చేశారు. గోసంరక్షణ, గోవధ నిషేధం బిల్లును గతేడాది మార్చిలో గోవా అసెంబ్లీ ఆమోదించింది. గత నవంబర్ నుంచి ఈ బిల్లు అమల్లోకి రావడంతో ఆవుల అక్రమ రవాణా, గోవధ, బీఫ్ తినడంపై నిషేధం కొనసాగుతోంది. గోవధకు పాల్పడిన వారికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని ఈ బిల్లులో ఉంది. -
గోవులను వధించకుండా కొత్త చట్టం
నార్నల్(హర్యానా): త్వరలో గోవు సంరక్షణ చట్టం రాబోతుందని, అది వచ్చిన తర్వాత ఎవరైనా గోవధకు పాల్పడినా, వాటిని అమ్మినా, తిన్నట్లు తెలిసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ అన్నారు. గో సంరక్షణ చట్టం చేసేందుకు బిల్లును రూపొందించామని, దానికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ కూడా ఇచ్చామని రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత దానిని ప్రవేశపెడతామని చెప్పారు. ఈ చట్టం అమలుచేసిన తర్వాత ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే బిల్లు 90 మందిచే అసెంబ్లీలో ఆమోదం పొందిందని, ఆ బిల్లును ఆమోదించినవారిలో ముస్లింలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ బిల్లు తీసుకురావడంలో ముస్లింలు కూడా ఎంతో సహకరించారని, బిల్లు రూపొందించే దశ నుంచి చట్ట సభలోకి తీసుకెళ్లే వరకు ఏ రకమైన సహాయమైనా తాము అందించేందుకు సిద్ధమని వారు చెప్పారని వివరించారు. ఇక నుంచి హర్యానాలో గోవధ మాత్ర ఉండదని చెప్పారు. -
'మటన్' మంట
ముంబై : రాష్ట్రంలో బీఫ్ నిషేధంతో మటన్ ధర అమాంతం పెరిగిపోయింది. గత రెండు నెలల్లో రీటైల్ మార్కెట్లో 35 నుంచి 40 శాతం ధరలు పెరిగాయి. డిమాండు పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో మటన్ ధర రూ. 500 పలుకుతోంది. ఏప్రిల్ నెలలో బీఫ్ నిషేధంపై స్టే విధించడానికి బాంబే హైకోర్టు నిరాకరించడంతో రాష్ట్రంలో బీఫ్ భద్రపరచడం, ఎగుమతి, దిగుమతిపై నిషేధం విధించారు. అయితే మూడు నెలల వరకు బీఫ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోకూడదని అధికారులకు కోర్టు ఆదేశాలిచ్చింది. మూడు నెలల సమయం తర్వాత మటన్ ధర పెరగడం మొదలైంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 350-రూ.360 కి మటన్ లభించేది. తర్వాత నవీముంబై, ఇతర ప్రదేశాల్లో రీటైల్ మార్కెట్లో ధర రూ. 450కి చేరుకుంది. ప్రస్తుతం రూ. 500 కు దొరుకుతోంది. బీఫ్ నుంచి మటన్‌కు గత రెండు నెలలుగా కస్టమర్ల సంఖ్య పెరుగతోందని, గతంతో బీఫ్ తినేవారు ఇప్పుడు మటన్ తింటున్నారని నెరూల్‌లోని ఓ వ్యాపారి రఫీక్ ఖురేషి చెప్పారు. డిమాండ్ పెరిగినప్పటికీ అవసరమైన మటన్ అందుబాటులో లేదని మరో వ్యాపారి పేర్కొన్నారు. మేకలు, గొర్ల ధర 10 నుంచి 20 శాతం పెరిగిందని ఆయన అన్నారు. అందుకే ధర పెంచాల్సి వచ్చిందన్నారు. మరో వ్యాపారి మాట్లాడుతూ.. ధరలు మూడు రెట్లు పెరిగినప్పటికీ వినియోగదారులు మాత్రం పెరిగారని చెప్పారు. దేవనార్ వధశాల నుంచి ప్రతిరోజు 3,700 మేకలు, గొర్ల మాంసం వస్తున్నప్పటికీ నవీముంబైలో ఎక్కువ మంది వ్యాపారులు షాపుల్లోనే మేకలు, గొర్లను వధిస్తున్నారు. మరోవైపు ధరలు పెరగడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ‘గతంలో వారాంతంలో మటన్ తినేవాడిని. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. బీఫ్ నిషేధం తర్వాత మటన్ ధర అమాంతం పెరిగిపోయింది’ అని నెరూల్ వాసి శివరామ్ పేర్కొన్నారు. కాగా, హోళీ పండుగనాటికి ధర రూ. 600 తాకుతోందని వ్యాపారులు చెబుతున్నారు. -
శామ్యూల్‌గా మారిన సిద్దరామయ్య!
బెంగళూరు: గోమాంసం తినడాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ముఖ్యమంతి సిద్దరామయ్య లక్ష్యంగా ఆన్‌లైన్‌లోనూ దాడి జరుగుతున్నది. ఓ దుండగుడు వికీపీడియా వెబ్‌సైట్‌లోని ఆయన పేజీ పేరును మార్చివేశాడు. సిద్దరామయ్య పేరును కాస్తా శామ్యూల్‌గా మార్చాడు. గోమాంసం తినడానికి తాను సిద్ధమని సిద్దరామయ్య ప్రకటించిన కొంతసేపటికే ఇది జరిగింది. గోమాంసం తింటే ఆయన తల నరికేస్తామని ఇప్పటికే బీజేపీ స్థానిక నాయకుడు ఒకరు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వికీపీడియాలో ఆయన పేరు మారిన విషయాన్ని గుర్తించిన అధికారులు ఈ అంశాన్ని అడ్మినిస్ట్రేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు వెంటనే శామ్యూల్ పేరును తొలగించి.. ఆయన పేరును పునరుద్ధరించారు. వికీపీడియా వెబ్సైట్లో వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా పొందపరిచే వీలుండటంతో దుండగుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. బీఫ్ వివాదం నేపథ్యంలో సిద్దరామయ్యకు వ్యతిరేకంగా ఆన్లైన్లో విద్వేషపూరితమైన వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయని, అందులో భాగమే ఈ చర్య అని కర్ణాటక సీఎం మీడియా కోఆర్డినేటర్ కేవీ ప్రభాకర్ తెలిపారు. కర్ణాటకలో గోమాంసంపై నిషేధం విధించాలన్న బీజేపీ డిమాండ్‌పై స్సందిస్తూ.. తాను ఇప్పటివరకు గోమాంసం తినలేదని, అయితే ఇప్పుడు తినాలని అనిపిస్తున్నదని, నన్ను అడిగేందుకు వారు ఎవరు అని సిద్దరామయ్య ప్రశ్నించిన సంగతి తెలిసిందే. -
బీఫ్ నిషేధంపై బీఎంసీ వెనక్కి
ముంబై: పవిత్ర పర్యుషాన్ వారంలో రెండు రోజులపాటు బీఫ్ నిషేధం, దియోనార్ జంతువధ శాలను మూసేయడాన్ని బీఎంసీ విరమించుకుంది. శుక్రవారం జరిగిన బీఎంసీ సర్వసభ్య సమావేశంలో ఈ విషయమై జరిగిన ఓటింగ్‌లో ఎక్కువ మంది కార్పొరేటర్లు బీఫ్ నిషేధం ఎత్తివేయలాని ఓటేశారు. ఓటింగ్‌లో శివసేన, బీజేపీలు ప్రతిపక్షం వైపు నిలిచాయి. 1964, 1994లోని పౌర చట్టాలను తిరిగి అమలులోకి తీసుకురావాలని, జైనుల పండుగ పర్యుషాన్ వారంలో రెండురోజులపాటు దియోనార్ జంతువధ శాలను తెరిచే ఉంచాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై ఓటింగ్ నిర్వహించాలని బీజేపీ కోరింది. బీఫ్ నిషేధాన్ని ఎత్తివేయాలని 111 మంది ఓటు వేయగా, ఇందుకు వ్యతిరేకంగా 24 మంది ఓట్లు వేశారు. మొదట ఒక్కరోజే.. మొదట జంతువధ శాల ఒక్కరోజు మాత్రమే మూసి ఉండేదని ఎస్పీ నేత రైస్ షైక్ అన్నారు. 1994 లో దాన్ని రెండు రోజులకు పెంచారన్నారు. అయితే అయినప్పటికీ బీజేపీ సంతృప్తి చెందలేదని, బీఫ్‌ను కూడా నిషేధించాలనుకుందని అందుకే వారం రోజులపాటు నిషేధం విధించారని పేర్కొన్నారు. తర్వాత దాన్ని 4 రోజులకు తగ్గించారని, అయితే దీన్ని ప్రజలు సహించలేకపోయారని అన్నారు. తర్వాత పోలింగ్ ద్వారా నిర్ణయించారని చెప్పారు. ఎనిమిది రోజులు విధించండి: బీజేపీ వివాదం కోర్టులో ఉండగా ఏవిధంగా ఓటింగ్ నిర్వహిస్తారని, నిర్ణయం ఎలా తీసుకుంటారని బీఎంసీ న్యాయవిభాగానికి సోలిసిక్ లెక్స్ న్యాయవాద సంస్థ లేఖ రాసింది. వివాదం కోర్టులో ఉన్నప్పుడు మళ్లీ తెరపైకి తీసుకువచ్చి చర్చించడం ఎంత వరకు సమంజసమని లేఖలో ప్రశ్నించింది. బీఫ్ నిషేధంపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ముంబైలోని మటన్ డీలర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
టీవీ విశ్లేషకుడిపై దాడి
తిరువనంతపురం: గోమాంసం నిషేధం సెగలు దేశంలో ఏదో ఒక మూల రగులుతూనే ఉన్నాయి. కేరళ విద్యాసంస్థల్లో వివాదం ముదురుతోంది. బీఫ్ బ్యాన్‌ను సమర్ధించిన ఓ టీవీ విశ్లేషకుడిపై దాడిచేసి కొట్టిన వైనం కేరళలో చోటుచేసుకుంది. అలెప్పూ సమీపంలోని ఒక కాలేజీ ఫంక్షన్‌కు వెళ్లి వస్తున్న రాహుల్ ఈశ్వర్ పై కొంతమంది విద్యార్థులు చేయి చేసుకున్నారు. కాయంకులం ఎంఎస్ఎం కాలేజీ ఆవరణలో రాహుల్‌పై దాడిచేసిన విద్యార్థులు అతని కారును ధ్వంసం చేశారు. శబరిమలై మతగురువు మనవడైన రాహుల్ పలు టీవీ చానళ్లలో విమర్శకుడిగా తన వాదనలు వినిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద అంశం బీఫ్ బ్యాన్ ను సమర్ధిస్తూ జాతీయ మీడియా చర్చలో వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు కాగా రెండు రోజులు ఇదే అంశంపై రాష్ట్రంలోని మరో కాలేజీలో కూడా వివాదం చెలరేగింది. క్యాంపస్‌లో గోమాంసంతో విందు చేసుకున్న విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. యాజమాన్యం చర్యను ఖండించిన దీపా నిశాంత్ అనే మహిళా టీచర్‌పైనా చర్యలు తీసుకుంది. దీనిని కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ ఖండించారు. అలాగే కొట్టాయంలోని మరో కాలేజీలో దాద్రి ఘటనకు నిరసనగా బీఫ్ ఫెస్ట్ నిర్వహించిన వామపక్ష విద్యార్థులు కొందరిపై సస్పెన్షన్ వేటు పడింది. -
'ఏం తినాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు'
ముంబయి: బృహణ్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)లో బీజేపీకి ఆరెస్సెస్‌కు మధ్య మాంసం పంచాయితీ మొదలైంది. జైనులు పవిత్రంగా ఉండే ఎనిమిది రోజులపాటు బీఎంసీలో ఎవరూ మాంసం అమ్మకాలు జరపొద్దని, ఎవరూ తినొద్దన్న ప్రకటనకు బీజేపీ మద్దతు ప్రకటించగా ఆరెస్సెస్ మాత్రం పూర్తిగా వ్యతిరేకించింది. 'ఎవరూ ఏం తినాలో చెప్పే హక్కు ఏ ఒక్కరికీ లేదు' అని ఆరెస్సెస్ నేత సంజయ్ రావత్ అన్నారు. దేశంలో 85శాతం మంది మాంసాహారులేనని ఆయన చెప్పారు. అయినా, ఈ నిర్ణయంపై తీర్మానం ప్రవేశపెట్టినా దానికి మద్దతుగా కేవలం 29ఓట్లు మాత్రమే లభించాయని చెప్పారు. జైనులు పవిత్రంగా ఉండే పర్యుషాన్(అహింసతో కూడిన దీక్ష) సందర్భంగా ఈ నెల 10, 13, 17, 18 తేదీల్లో పూర్తిగా మాంసాన్ని నిషేధించాలని బీజేపీ నేత దినేశ్ జైన్ మిరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్ణయం తీసుకున్నారు. -
'మెజారిటీ ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాలి'
న్యూఢిల్లీ: రెండు బీజేపీ పాలిత రాష్ట్రాలు గొడ్డుమాంసం వినియోగంపై నిషేధం విధించడాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా సమర్ధించారు. ఆవులపై ప్రత్యేక పూజ్యభావం కలిగిన మెజారిటీ ప్రజల భావోద్వేగాలను గౌరవించాల్సిందేనన్నారు. ‘ఎవరి సెంటిమెంట్లనూ గాయపర్చకూడదన్నది నా విధానం. మైనారిటీల సెంటిమెంట్ల గురించి మాట్లాడే మీరు.. మెజారిటీ ప్రజల భావోద్వేగాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు?’ అంటూ కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. దేశ రాజధానిలో సోమవారం వక్ఫ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆమె పై వ్యాఖ్యలు చేశారు. ఒక ఆహార పదార్ధం తినడం ఇతరుల భావోద్వేగాలను గాయపరుస్తుందనుకున్నప్పుడు.. దాన్ని తినకపోవడమే మంచిదన్నారు. ‘మన పొరుగింటివారి సెంటిమెంట్ల గురించి కూడా ఆలోచించాలి’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత హర్యానా, మహారాష్ట్రలు ఇటీవల గోవధను, గొడ్డు మాంసం వినియోగాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. -
గోవధను నిషేధించాలని డిమాండ్
లక్నో: దేశవ్యాప్తంగా గోవధను నిషేధించి ఆవులను రక్షించాలని శంకరాచార్య స్వరూపానంద సరస్వతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. హిందూ మతానికి చెందిన ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. ఇదే గోవులను రక్షించడానికి సరైన సమయం అని శంకరాచార్యులు అన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర, హర్యానాల్లో గోవధ నిషేధాన్ని విమర్శించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ నివేదికను కూడా ఆయన తోసి పుచ్చారు. భారతీయ జనతా పార్టీ, ఇతర హిందూ ఆర్గనైజేషన్లు 'ఘర్ వాపసి' కార్యక్రమానలు నిర్వహిస్తున్నాయి. వాటితో పాటు గోవధ నిషేధాన్ని కూడా ప్రారంభిస్తే బాగుంటుందని శంకరాచార్యులు పేర్కొన్నారు.