ముంబై : మహారాష్ట్రలో గోవధ నిషేధం కొనసాగుతుందని బాంబే హైకోర్టు శుక్రవారం తెలిపింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చిన ఆవు మాంసాన్ని తినటంలో తప్పులేదని కోర్టు వినూత్నంగా తీర్పునిచ్చింది. అభయ్ ఓకా, సురేష్ గుప్ లతో కూడిన డివిజనల్ బెంచ్ ఈ మేరకు తీర్పునిచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది బీఫ్ వినియోగంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
చట్టానికి విరుద్ధంగా జంతుబలికి పాల్పడే వారికి ఐదేళ్లు జైలుతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బీఫ్ బ్యాన్పై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, మరోవైపు బయట నుంచి తెచ్చుకున్న గోమాంసం తినటంలో తప్పులేదని తెలిపింది.