'ఏం తినాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు' | Nobody has the right to decide who will eat what, says Shiv Sena's Raut on meat ban | Sakshi
Sakshi News home page

'ఏం తినాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు'

Published Tue, Sep 8 2015 12:26 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'ఏం తినాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు' - Sakshi

'ఏం తినాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు'

ముంబయి: బృహణ్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)లో బీజేపీకి ఆరెస్సెస్కు మధ్య మాంసం పంచాయితీ మొదలైంది. జైనులు పవిత్రంగా ఉండే ఎనిమిది రోజులపాటు బీఎంసీలో ఎవరూ మాంసం అమ్మకాలు జరపొద్దని, ఎవరూ తినొద్దన్న ప్రకటనకు బీజేపీ మద్దతు ప్రకటించగా ఆరెస్సెస్ మాత్రం పూర్తిగా వ్యతిరేకించింది. 'ఎవరూ ఏం తినాలో చెప్పే హక్కు ఏ ఒక్కరికీ లేదు' అని ఆరెస్సెస్ నేత సంజయ్ రావత్ అన్నారు.

దేశంలో 85శాతం మంది మాంసాహారులేనని ఆయన చెప్పారు. అయినా, ఈ నిర్ణయంపై తీర్మానం ప్రవేశపెట్టినా దానికి మద్దతుగా కేవలం 29ఓట్లు మాత్రమే లభించాయని చెప్పారు. జైనులు పవిత్రంగా ఉండే పర్యుషాన్(అహింసతో కూడిన దీక్ష) సందర్భంగా ఈ నెల 10, 13, 17, 18 తేదీల్లో పూర్తిగా మాంసాన్ని నిషేధించాలని బీజేపీ నేత దినేశ్ జైన్ మిరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement