ముంబై: పవిత్ర పర్యుషాన్ వారంలో రెండు రోజులపాటు బీఫ్ నిషేధం, దియోనార్ జంతువధ శాలను మూసేయడాన్ని బీఎంసీ విరమించుకుంది. శుక్రవారం జరిగిన బీఎంసీ సర్వసభ్య సమావేశంలో ఈ విషయమై జరిగిన ఓటింగ్‌లో ఎక్కువ మంది కార్పొరేటర్లు బీఫ్ నిషేధం ఎత్తివేయలాని ఓటేశారు. ఓటింగ్‌లో శివసేన, బీజేపీలు ప్రతిపక్షం వైపు నిలిచాయి. 1964, 1994లోని పౌర చట్టాలను తిరిగి అమలులోకి తీసుకురావాలని, జైనుల పండుగ పర్యుషాన్ వారంలో రెండురోజులపాటు దియోనార్ జంతువధ శాలను తెరిచే ఉంచాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేసింది.
దీనిపై ఓటింగ్ నిర్వహించాలని బీజేపీ కోరింది. బీఫ్ నిషేధాన్ని ఎత్తివేయాలని 111 మంది ఓటు వేయగా, ఇందుకు వ్యతిరేకంగా 24 మంది ఓట్లు వేశారు.
మొదట ఒక్కరోజే..
మొదట జంతువధ శాల ఒక్కరోజు మాత్రమే మూసి ఉండేదని ఎస్పీ నేత రైస్ షైక్ అన్నారు. 1994 లో దాన్ని రెండు రోజులకు పెంచారన్నారు. అయితే అయినప్పటికీ బీజేపీ సంతృప్తి చెందలేదని, బీఫ్‌ను కూడా నిషేధించాలనుకుందని అందుకే వారం రోజులపాటు నిషేధం విధించారని పేర్కొన్నారు. తర్వాత దాన్ని 4 రోజులకు తగ్గించారని, అయితే దీన్ని ప్రజలు సహించలేకపోయారని అన్నారు. తర్వాత పోలింగ్ ద్వారా నిర్ణయించారని చెప్పారు.
ఎనిమిది రోజులు విధించండి: బీజేపీ
వివాదం కోర్టులో ఉండగా ఏవిధంగా ఓటింగ్ నిర్వహిస్తారని, నిర్ణయం ఎలా తీసుకుంటారని బీఎంసీ న్యాయవిభాగానికి సోలిసిక్ లెక్స్ న్యాయవాద సంస్థ లేఖ రాసింది. వివాదం కోర్టులో ఉన్నప్పుడు మళ్లీ తెరపైకి తీసుకువచ్చి చర్చించడం ఎంత వరకు సమంజసమని లేఖలో ప్రశ్నించింది. బీఫ్ నిషేధంపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ముంబైలోని మటన్ డీలర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బీఫ్ నిషేధంపై బీఎంసీ వెనక్కి
Published Tue, Oct 13 2015 2:00 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement