శివసేనకు కాంగ్రెస్ దూరం.. మరెలా?
శివసేనకు కాంగ్రెస్ దూరం.. మరెలా?
Published Sat, Feb 25 2017 8:08 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
ప్రతిష్ఠాత్మకమైన ముంబై మేయర్ పదవి దక్కించుకోవాలంటే కనీసం 114 మంది కార్పొరేటర్లు అవసరం. కానీ శివసేన గెలుచుకున్నది 84 మాత్రమే. ఎలాగోలా నలుగురు స్వతంత్ర సభ్యులు మద్దతు తెలపడమో, పార్టీలో చేరిపోవడమో అయ్యి.. ఆ బలం 88కి చేరింది. మరోవైపు మతతత్వ పార్టీలకు తాము మద్దతిచ్చేది లేదని, ఇప్పటికే శివసేన నుంచి కొంతమంది తమను సంప్రదించారు గానీ తాము మాత్రం వాళ్లకు అండగా నిలబడబోమని కాంగ్రెస్ పార్టీకి చెందిన సంజయ్ నిరుపమ్ చెప్పారు. తమవాళ్లెవరూ కాంగ్రెస్ వాళ్ల వద్దకు వెళ్లలేదని, మేయర్ మాత్రం తమవాడే అవుతాడని.. ఎలా అవుతాడో తెలుసుకోవాలంటే మార్చి 9వ తేదీ వరకు ఆగాలని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
మరి ఇటు కాంగ్రెస్ మద్దతివ్వకుండా.. అటు బీజేపీ వైపు మొగ్గకుండా అధికారాన్ని శివసేన ఎలా చేపడుతుందన్నది అనుమానంగానే కనపడుతోంది. మొత్తం 227 మంది కార్పొరేటర్లున్న ముంబై కార్పొరేషన్‌లో అధికారం చేపట్టాలంటే శివసేనకు ఇంకా 26 మంది మద్దతు అవసరం. ఇది ఎక్కడినుంచి వస్తుందన్నది అనుమానంగానే కనిపిస్తోంది. మరి శివసైనికులు ఏం చేస్తారో.. మేయర్ పదవిని ఎలా చేపడతారో చూడాల్సి ఉంది.
Advertisement
Advertisement