మహాకూటమికే కుర్చీ
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి అధికారం దక్కడం ఖాయమని ఒక మరాఠీ చానెల్ సర్వే ప్రకటించింది.బీజేపికి 103, శివసేనకు 64 స్థానాలు వరకు వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. కాంగ్రెస్, ఎన్సీపీకి 65 సీట్ల వరకు రావొచ్చని లెక్కగట్టింది.
సాక్షి, ముంబై: వచ్చే నెలలో నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి శివసేన, బీజేపీల మహాకూటమి అధికస్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఒక మీడియా సంస్థ సర్వేలో వెల్లడయింది.బీజేపీ అత్యధికంగా అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంటుందని పేర్కొం ది. ఏబీపీ మాజా చానెల్, నీల్సన్ సంస్థ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించాయి. ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే ఈ అధ్యయనం నిర్వహించాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఒంట రిగా బరిలోకి దిగితే బీజేపికి 103, శివసేనకు 64 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయని సర్వేలో తేలిం ది. మరోవైపు కాంగ్రెస్‌కు 49, ఎన్సీపీకి 40 స్థానాలు వచ్చేఅవకాశాలుండగా, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)కు 11 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని ఇది అంచనా వేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్నట్టుగానే ప్రజాసామ్య కూట మి, మహాకూటమిగా పొత్తులతో పోటీ చేసినట్టయితే మహాకూటమికి (బీజేపీకి 107, శివసేన 86, ఆర్పీఐ 5, స్వాభిమాని శేత్కారికి రెండు) 200 సీట్లు వచ్చేఅవకాశాలున్నాయని సర్వేలో తేలింది.
మరోవైపు ప్రజాసామ్య కూటమిలో కాంగ్రెస్‌కు 40, ఎన్సీ పీ 25కి సీట్లు వస్తాయని ఈ చానెల్ లెక్కిగట్టింది. అంటే ప్రజాస్వామ్య కూటమికి మొత్తం 65 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ఎమ్మెన్నెస్‌కు 10 స్థానాలు వచ్చే సూచనలు ఉన్నాయని పేర్కొం ది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ మీడియా సంస్థలు సర్వేలు నిర్వహించాయి. అన్ని సర్వేలూ స్వల్పతేడాతో నిజమయ్యాయి. దీంతో ఈ సర్వే కూడా నిజరూపం దాల్చుతుందన్న నమ్మకం మహా కూటమిలో కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని, మహాకూటమి అధికారంలో వస్తుందని మహాకూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.