paryushan
-
'ఏం తినాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు'
ముంబయి: బృహణ్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)లో బీజేపీకి ఆరెస్సెస్‌కు మధ్య మాంసం పంచాయితీ మొదలైంది. జైనులు పవిత్రంగా ఉండే ఎనిమిది రోజులపాటు బీఎంసీలో ఎవరూ మాంసం అమ్మకాలు జరపొద్దని, ఎవరూ తినొద్దన్న ప్రకటనకు బీజేపీ మద్దతు ప్రకటించగా ఆరెస్సెస్ మాత్రం పూర్తిగా వ్యతిరేకించింది. 'ఎవరూ ఏం తినాలో చెప్పే హక్కు ఏ ఒక్కరికీ లేదు' అని ఆరెస్సెస్ నేత సంజయ్ రావత్ అన్నారు. దేశంలో 85శాతం మంది మాంసాహారులేనని ఆయన చెప్పారు. అయినా, ఈ నిర్ణయంపై తీర్మానం ప్రవేశపెట్టినా దానికి మద్దతుగా కేవలం 29ఓట్లు మాత్రమే లభించాయని చెప్పారు. జైనులు పవిత్రంగా ఉండే పర్యుషాన్(అహింసతో కూడిన దీక్ష) సందర్భంగా ఈ నెల 10, 13, 17, 18 తేదీల్లో పూర్తిగా మాంసాన్ని నిషేధించాలని బీజేపీ నేత దినేశ్ జైన్ మిరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్ణయం తీసుకున్నారు. -
ఆ ఎనిమిది రోజులు మాంసం అమ్మకం బంద్
థానే: మాంసం అమ్మకాలను మహారాష్ట్రలోని మిరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ) ఓ ఎనిమిది రోజులపాటు నిషేధించనుంది. ఈ నెలలో జైనులు పవిత్రంగా భావించే ఆ ఎనిమిది రోజులు ఎవరూ మాంసం విక్రయించడానికి వీల్లేదంటూ నిషేధాజ్ఞలు జారీ చేయనుంది. జైనులు పవిత్రంగా ఉండే ఈ ఎనిమిది రోజుల కార్యక్రమాన్ని 'పర్యుషాన్' అని అంటారు. దీనిని ఈ నెల 11 నుంచి 18వరకు పాటించనున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక భేటీ నిర్వహించిన ఎంబీఎంసీ పాలక మండలి ఈ ఎనిమది రోజులు పూర్తయ్యేవరకు ఎవరూ తమ కార్పొరేషన్లో మాంసం విక్రయించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలని నిర్ణయించారు. దీనిపై సోమవారం అధికారికంగా నిర్ణయం తీసుకునేందుకు మరో సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి పోలీసులు కూడా హాజరుకానున్నారు.