Nobel Literature Prize
-
FIDE Chess Tournament: విజేత సామ్యూల్ స్టీఫెన్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఓపెన్ ‘ఫిడే’ రేటెడ్ బిలో–1600 చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 ఏళ్ల కుర్రాడు సామ్యూల్ స్టీఫెన్ నోబెల్ విజేతగా నిలిచాడు. వీ4 చెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో సామ్యూల్ స్టీఫెన్ తొమ్మిది రౌండ్లకుగాను 8.5 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సామ్యూల్ ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. విజేతగా నిలిచిన సామ్యూల్‌కు భారీ ట్రోఫీతోపాటు రూ. 1 లక్ష ప్రైజ్‌మనీగా లభించింది. హర్షల్ పాటిల్ (మహారాష్ట్ర; 8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రూ. 60 వేలు... కె.సమర్‌తేజ (తెలంగాణ; 8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి రూ. 40 వేలు ప్రైజ్‌మనీ గెల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. -
సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న అబ్దుల్ రజాక్ గుర్నా
స్టాక్‌హోమ్: సాహిత్యంలో ఈ ఏడాదికి గాను టాంజేనియా నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాను నోబెల్ బహుమతి వరించింది. వలసవాదంపై ఆయన రాజీలేని పోరాటంతో పాటు, శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకుగానూ రజాక్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. (చదవండి: 2021 నోబెల్ బహుమతి: వైద్యరంగంలో ఇద్దరికి పురస్కారం) BREAKING NEWS: The 2021 #NobelPrize in Literature is awarded to the novelist Abdulrazak Gurnah “for his uncompromising and compassionate penetration of the effects of colonialism and the fate of the refugee in the gulf between cultures and continents.” pic.twitter.com/zw2LBQSJ4j — The Nobel Prize (@NobelPrize) October 7, 2021 అబ్దుల్ రజాక్ గుర్నా.. 1948లో హిందూ మహాసముద్రంలోని జాంజిబర్ ద్వీపంలో జన్మించారు. కానీ 1960 చివర్లో శరణార్థిగా ఇంగ్లాండ్ వలసవెళ్లారు. ప్రస్తుతం ఆయన కేంట్రబెరీలోని కెంట్ యూనివర్శిటీలో సాహిత్య ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇక 21వ ఏట నుంచే రచనలు ప్రారంభించారు రజాక్. ఇప్పటివరకు 10 నవలలు, ఎన్నో చిన్న కథలు రచించారు. 2005లో రజాక్ రాసిన ‘డిసర్షన్’ నవల అప్పట్లో సంచలనం సృష్టించింది. చదవండి: వాతావరణంపై పరిశోధనలకు పట్టం -
సాహిత్య నోబెల్ ప్రతిష్టకు మచ్చ
కొపెన్‌హెగన్: ప్రఖ్యాత నోబెల్ సాహిత్య బహుమతిని అందించే స్వీడిష్ అకాడమీ ఖ్యాతి మసకబారింది. అకాడమీలో మాజీ సభ్యురాలి భర్తపై వచ్చిన అత్యాచార ఆరోపణలు రుజువు కావడంతో స్వీడన్ కోర్టు సోమవారం అతణ్ని దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఫ్రెంచ్ పౌరుడు, స్వీడన్లో ప్రముఖ కళాకారుడిగా గుర్తింపు ఉన్న జీన్ క్లాడ్ ఆర్నాల్ట్.. కవయిత్రి, స్వీడిష్ అకాడమీ మాజీ సభ్యురాలైన కేథరీనా ఫ్రోస్టెన్సన్ను పెళ్లాడాడు. ఆర్నాల్ట్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అకాడమీ కార్యాలయంలో పనిచేసే 18 మంది యువతులు గతంలో ఓ వార్తా పత్రికకు వెల్లడించి సంచలనం సృష్టిం చారు. నోబెల్ విజేతల పేర్లను అనేకసార్లు ముందుగానే వెల్లడించేందుకు ఆర్నాల్ట్ లంచం తీసుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నప్పటికీ వాటిపై విచారణ జరుగుతుందో లేదో కూడా సమాచారం తెలియరాలేదు. ఆర్నాల్ట్‌పై లైంగిక వేధింపులు, ఆర్థిక కుంభకోణాల ఆరోపణలు రావడంతో అకాడమీ శాశ్వత సభ్యుల్లో చీలిక ఏర్పడి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్నాల్ట్ భార్య సహా ఏడుగురు సభ్యులు అకాడమీ నుంచి వైదొలగడం తెలిసిందే. ఈ ఏడాది నోబెల్ సాహిత్య బహుమతి ఉండబోదని మే నెలలోనే అకాడమీ ప్రకటించింది. -
నోబెల్ పురష్కార గ్రహీత వీఎస్ నైపాల్ మృతి
-
నోబెల్ సాహిత్య పురష్కార గ్రహీత మృతి
లండన్ : నోబెల్ సాహిత్య పురష్కార గ్రహీత వీఎస్ నైపాల్ (84) మృతి చెందారు. లండన్‌లోని తన నివాసంలో శనివారం రాత్రి కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. భారత సంతతికి చెందిన నైపాల్ పూర్తి పేరు విధ్యాధర సూరజ్ ప్రసాద్ నైపాల్. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆంగ్లసాహిత్యాన్ని అభ్యసించారు. ఆయనకు 2001లో నోబెల్ సాహిత్య పురష్కారం లభించింది. 1932లో వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో ఆయన జన్మించారు. -
ఫ్రెంచ్ నవలా రచయితకు సాహిత్య నోబెల్
స్టాక్‌హోం(స్వీడన్): ఫ్రెంచ్ నవలా రచయిత ప్యాట్రిక్ మొడియానోకు సాహిత్యంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. రెండో ప్రపంచ యుద్ధం, 1940 నాటి పరిస్థితులాధారంగా ఆయన రచనలు సాగాయి. మానవ జీవితంలో ఎవరూ స్పృశించని కోణాలను ప్యాట్రిక్ మొడియానో తన రచనల్లో పొందుపరిచారని అవార్డు కమిటీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి రాని విభిన్న రకాల జీవన విధానాలను ఆయన స్పృశించారని నోబెల్ కమిటీ కొనియాడింది.