FIDE chess tourney
-
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
2024–25 ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో పాల్గొనే 14 మంది గ్రాండ్మాస్టర్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తమిళనాడు క్రీడాకారిణి ఆర్.వైశాలి భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో మొత్తం 20 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.‘ఫిడే’ నిర్దేశించిన అర్హత (ర్యాంకింగ్) ప్రకారం 14 మందికి నేరుగా చోటు దక్కగా... మిగతా ఆరుగురిని నిర్వాహకులు నామినేట్ చేస్తారు. ముగ్గురు మాజీ ప్రపంచ చాంపియన్లు (క్లాసికల్) టాన్ జోంగ్యి, అలెగ్జాండ్రా కోస్టెనిక్, మారియా ముజీచుక్ కూడా టోర్నీ బరిలో నిలిచారు. ప్రస్తుత చాంపియన్ జు వెన్జున్ ఈ ఈవెంట్‌నుంచి తప్పుకుంది. మహిళల చెస్‌ను మరింత ఆదరణ పెంచే క్రమంలో పలు మార్పులతో గ్రాండ్‌ప్రి సిరీస్‌ను ఈ సారి కొత్తగా నిర్వహించనున్నట్లు ‘ఫిడే’ సీఈఓ ఎమిల్ సుటోవ్స్కీ వెల్లడించారు. ఇటీవల జరిగిన క్యాండిడేట్స్ టోర్నీలో హంపి రెండో స్థానంలో నిలిచింది. -
భారత చెస్ చరిత్రలో గొప్ప క్షణాలు.. ఒకేసారి రెండు అద్భుత విజయాలు
Isle of Man- Vidit Gujrathi, Vaishali R claim titles: ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ ఈవెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్లు ఆర్. వైశాలి, విదిత్ గుజరాతి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో విదిత్ గుజరాతి ఓపెన్ చాంపియన్‌గా అవతరించగా.. ఆర్.వైశాలి మహిళా విభాగంలో టైటిల్ విజేతగా నిలిచింది. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా టీమిండియా సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన వేళ చెస్ టోర్నీలో వీరిద్దరు డబుల్ ధమాకా అందించారు. అదే విధంగా ఈ విజయంతో క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించారు వైశాలి, విదిత్. అక్కడా సత్తా చాటి వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌నకు క్వాలిఫై కావాలనే పట్టుదలతో ఉన్నారు. కాగా స్విస్ టోర్నీలో ర్యాంకింగ్స్‌లో తమకంటే ఎంతో మెరుగ్గా ఉన్న ప్లేయర్లను ఓడించి మరీ వైశాలి, విదిత్ ఈ మేరకు విజయం అందుకోవడం విశేషం. ఓపెన్ టోర్నీలో 15వ సీడ్‌గా బరిలోకి దిగిన విదిత్.. ఫిబియానో కరువానా, హికరు నకమురా, అలీరెజా ఫిరౌజాలతో పాటు భారత గ్రాండ్‌మాస్టర్లు డి. గుకేశ్, ఆర్, ప్రజ్ఞానందలతో పోటీపడి విజేతగా నిలిచాడు. మరోవైపు.. మహిళల విభాగంలో 12వ సీడ్‌గా పోటీకి దిగిన వైశాలి.. ఫైనల్ రౌండ్లో పెద్దగా పోరాడాల్సిన పనిలేకుండానే బత్కుయాగ్ మోంగోటుల్పై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. కాగా చెన్నైకి చెందిన రమేశ్‌బాబు వైశాలి.. ప్రఖ్యాత చెస్ ప్లేయర్, సంచలన విజయాలకు కేరాఫ్ అయిన ఆర్. ప్రజ్ఞానంద అక్క అన్న విషయం తెలిసిందే. ఇక ఫిడే వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద ఇప్పటికే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాడు. తాజాగా వైశాలి సైతం క్వాలిఫై అయింది. ఈ నేపథ్యంలో ప్రజ్ఞానంద హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: Virat Kohli: అవును.. కోహ్లి స్వార్థపరుడే! ముమ్మాటికీ స్వార్థపరుడే..!! -
FIDE Grand Swiss: అర్జున్‌కు మూడో గెలుపు
గ్రాండ్ స్విస్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో విజయం నమోదు చేశాడు. యూకేలోని ఐల్ ఆఫ్ మ్యాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 68 ఎత్తుల్లో రినాత్ జుమాబయేవ్ (కజకిస్తాన్)పై గెలుపొందాడు. ఐదో రౌండ్ తర్వాత అర్జున్ నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. -
ప్రపంచకప్‌లో అదుర్స్.. ఇదో చారిత్రక ఘట్టం: భారత చెస్ దిగ్గజం
బకూ (అజర్బైజాన్): ప్రపంచ కప్ చెస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి కీలక విజయాన్ని అందుకున్నాడు. మంగళవారం జరిగిన తొలి గేమ్‌లో అర్జున్ 53 ఎత్తుల్లో భారత్‌కే చెందిన ఆర్. ప్రజ్ఞానందను ఓడించాడు. నల్లపావులతో ఆడిన అర్జున్‌కు ఈ విజయంతో ఆధిక్యం దక్కింది. బుధవారం తెల్ల పావులతో ఆడి రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకు న్నా అతను సెమీస్ చేరతాడు. తొలి గేమ్‌లు డ్రా మరో క్వార్టర్స్ పోరులో వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) జోరు ముందు భారత ఆటగాడు డి.గుకేశ్ నిలవలేకపోయాడు. నల్ల పావులతో ఆడిన కార్ల్సన్ 48 ఎత్తులో గుకేశ్ ఆటకట్టించాడు. మరో రెండు క్వార్టర్ ఫైనల్ సమరాల తొలి గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. విదిత్ గుజరాతీ (భారత్), నిజాత్ అబసోవ్ (అజర్ బైజాన్) మధ్య గేమ్ 109 ఎత్తుల్లో... ఫాబియోనో కరువానా (అమెరికా), లీనియర్ డొమినెగ్వెజ్ పెరెజ్ (అమెరికా) మధ్య గేమ్ 71 ఎత్తుల్లో ‘డ్రా‘ అయ్యాయి. ఇదో చారిత్రక ఘట్టం మరోవైపు నలుగురు భారత ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరడం పెద్ద విశేషమని దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. ‘భారత చదరంగంలో ఇదో చారిత్రక ఘట్టం’ అని ఆనంద్ విశ్లేషించాడు. ‘ఒకరు కానీ ఇద్దరు కానీ క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలరని నేను అంచనా వేశాను. కానీ నలుగురు ముందంజ వేయగలిగారు. వారి ఆట చూస్తే ఇంకా ముందుకు వెళ్లగల సామర్థ్యం ఉందని నమ్ముతున్నా’ అని ఆనంద్ అభిప్రాయ పడ్డాడు. చదవండి: టీమిండియాతో సిరీస్ నాటికి వచ్చేస్తా.. వరల్డ్‌కప్ తర్వాత కెప్టెన్ అతడే! -
హంపికి ఆరో స్థానం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆరో స్థానంతో ముగించింది. గొర్యాక్చినా (రష్యా)తో బుధవారం జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఓవరాల్‌గా హంపి 4.5 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 3.5 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచింది. షువలోవా (రష్యా)తో జరిగిన చివరి గేమ్‌లో హారిక 66 ఎత్తుల్లో ఓటమి చవిచూసింది. భారత్‌కే చెందిన వైశాలి రెండు పాయింట్లతో పదో ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. -
FIDE Chess Tournament: విజేత సామ్యూల్ స్టీఫెన్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఓపెన్ ‘ఫిడే’ రేటెడ్ బిలో–1600 చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 ఏళ్ల కుర్రాడు సామ్యూల్ స్టీఫెన్ నోబెల్ విజేతగా నిలిచాడు. వీ4 చెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో సామ్యూల్ స్టీఫెన్ తొమ్మిది రౌండ్లకుగాను 8.5 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సామ్యూల్ ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. విజేతగా నిలిచిన సామ్యూల్‌కు భారీ ట్రోఫీతోపాటు రూ. 1 లక్ష ప్రైజ్‌మనీగా లభించింది. హర్షల్ పాటిల్ (మహారాష్ట్ర; 8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రూ. 60 వేలు... కె.సమర్‌తేజ (తెలంగాణ; 8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి రూ. 40 వేలు ప్రైజ్‌మనీ గెల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. -
తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ జైత్రయాత్ర
అల్మాటీ (కజకిస్తాన్): తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్ ‘ఫిడే’ ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో వరుస విజయాలతో సత్తా చాటుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో అతను ప్రపంచ నంబర్‌వన్, చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో కలిసి ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. వీళ్లిద్దరు మొదటి నాలుగు గేముల్లో వారి ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఐదో గేమ్‌లో కార్ల్సన్తో తలపడిన అర్జున్ 44 ఎత్తుల్లో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. 38వ సీడ్‌గా బరిలోకి దిగిన అర్జున్, టాప్‌సీడ్ కార్ల్సన్ 4.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి ఉమ్మడిగా ఆధిక్యంలో ఉన్నారు. మొదటి నాలుగు గేముల్లో అర్జున్... సరాసి డెరిమ్ (కొసొవో), రౌనక్ (భారత్), వహప్ సనల్ (టర్కీ), రిచర్డ్ రపొర్ట్ (రొమేనియా)పై గెలుపొందాడు. సీనియర్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ (2.5) రెండో రౌండ్లో ఫ్రెడెరిక్ (జర్మనీ)పై గెలిచి, మిగతా మూడు రౌండ్లలోనూ డ్రాలతోనే సరిపెట్టుకున్నాడు. మహిళల ఈవెంట్లో సీనియర్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి (3.5) నాలుగు రౌండ్లలో మూడు విజయాలు సాధించింది. ఏడో సీడ్ హంపి ఎన్క్తూల్ అల్తాన్ (మంగోలియా), మరియమ్ (ఆర్మేనియా), గోంగ్ క్విన్యున్ (సింగపూర్)పై గెలుపొందింది. మరో నలుగురితో కలిసి ఆమె సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఆరోసీడ్ ద్రోణవల్లి హారిక (2.5)తొలి గేమ్‌లో గెలిచి తర్వాతి మూడు గేముల్లోనూ డ్రా చేసుకుంది. -
చెస్ బోర్డు మాదిరి బ్రిడ్జ్... ఎక్కడుందో తెలుసా!: వీడియో వైరల్
చెన్నై: 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ జూలై 28న చెన్నైలోని మహాబలిపురంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చెన్నై నగరంలోని నేపియర్ బ్రిడ్జ్‌కి చెస్ బోర్డులా పేయింట్ వేశారు. ఈ బ్రిడ్జ్ ప్రయాణికులను అత్యద్భుతంగా ఆకట్టుకుంటోంది. వందేళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది ఈ ఒలింపియాడ్ ఈవెంట్‌కి సుమారు 2 వేల మంది దాక క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ బ్రిడ్జ్ తాలుకా వీడియోని పోస్ట్ చేస్తూ...భారతదేశానికి చెందిన చెస్ రాజధాని చెన్నై గగ్రాండ్ చెస్ ఒలింపియాడ్ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, ఐకానిక్ నేపియర్ బ్రిడ్జ్‌గా చెస్ బోర్డులా అలంకరిచండబడిందని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు వావ్ వాటే స్పీరిట్ నమ్మా చెన్నై అంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Chennai the Chess Capital of India is all set to host the grand, Chess Olympiad 2022.The iconic Napier Bridge is decked up like a Chess Board.Check it out 😊 #ChessOlympiad2022 #ChessOlympiad #Chennai pic.twitter.com/wEsUfGHMlU — Supriya Sahu IAS (@supriyasahuias) July 16, 2022 (చదవండి: కరోనాతో ఆస్పత్రిలో చేరిన పన్నీర్‌సెల్వం) -
చెస్‌కు చెక్!
మాస్కో: కరోనా విలయతాండవంలోనూ దానికి సంబంధం లేనట్లుగా జరుగుతున్న ఒకే ఒక్క పెద్ద క్రీడా ఈవెంట్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీ. ఇందులో విజేతగా నిలిచిన ఆటగాడు ప్రపంచ చెస్ టోర్నమెంట్లో నార్వే సూపర్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్తో తలపడతాడు. అయితే ఇప్పుడు ఇది కూడా ఆగిపోయింది. రష్యాలో అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేయడంతో ఉన్నపళంగా టోర్నీని నిలిపివేయక తప్పలేదు. శుక్రవారం (ఈ నెల 27) నుంచి విమాన రాకపోకల్ని నిరవధికంగా రద్దు చేస్తున్నట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో టోర్నీని కొనసాగిస్తే... ఈవెంట్ ముగిశాక వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు స్వదేశం చేరే అవకాశాలు మూసుకుపోతాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఈవెంట్‌ను నిలిపివేసింది. ‘ఫిడే ఈ టోర్నమెంట్‌ను ఇలాగే కొనసాగిస్తే ఆటగాళ్లు, అధికారులు, ఇతరత్ర సిబ్బందిని నిర్ణీత గడువులోగా వారి స్వదేశాలకు పంపలేదు. ఈ నేపథ్యంలో ‘ఫిడే’ నిబంధనల మేరకు ఈవెంట్‌ను నిలిపివేయాలని నిర్ణయించాం’ అని ఫిడే అధ్యక్షుడు అర్కడి వొర్కవిచ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 7 రౌండ్లు జరిగాయి. మాక్సిమ్ వాచియెల్ (ఫ్రాన్స్), ఇయాన్ నెపొమ్నియాచి (రష్యా) 4.5 పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నారు. తిరిగి మొదలైతే 8వ రౌండ్ నుంచి కొనసాగిస్తారు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ‘కోవిడ్–19’ వల్లే జర్మనీలో ఇరుక్కుపోయాడు. విదేశీ ప్రయాణ ఆంక్షలతో అక్కడే ఆగిపోయాడు. దీంతో అతను క్యాండిడేట్స్ చెస్‌కు ఆన్లైన్లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. -
ఉమ్మడిగా అగ్రస్థానంలో మిశ్రా
సాక్షి, హైదరాబాద్: టెట్రాసాఫ్ట్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో స్వయమ్ష్ మిశ్రా (ఎయిరిండియా) ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాడు. సికింద్రాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో జరుగుతోన్న ఈ టోర్నీలో నాలుగు రౌండ్లు ముగిసేసరికి 4 పాయింట్లతో మరో నలుగురితో కలసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. మిశ్రాతో పాటు ఆర్. అశ్వథ్, ముత్తయ్య, వినోద్‌కుమార్, ఎ.బాలకిషన్ తొలిస్థానంలో కొనసాగుతున్నారు. సోమవారం జరిగిన నాలుగోరౌండ్ గేమ్‌లో ముత్తయ్య (4, తమిళనాడు) జె. రామకృష్ణ (3, ఆంధ్రాబ్యాంక్)పై, స్వయమ్ష్ మిశ్రా (4) ఎన్. లోకేశ్ (3)పై, ఆర్. అశ్వథ్ (4) భరత్ కుమార్ రెడ్డి (3)పై, వినోద్ కుమార్ (4) ఎస్. విక్రమ్‌జీత్ సింగ్ (3)పై, ఎ. బాలకిషన్ (4) సోహన్ (3)పై గెలుపొందారు. శ్రీశ్వాన్ (3.5)తో జరిగే గేమ్‌ను కుషాగ్రమోహన్ (3.5 తెలంగాణ) డ్రా చేసుకున్నాడు. -
చాంపియన్ రామకృష్ణ
ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో జె. రామకృష్ణ (ఆంధ్రాబ్యాంక్) సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. నిర్ణీత 10 రౌండ్లలో 9.5 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చివరిదైన పదో గేమ్‌లో రామకృష్ణ, అజయ్ (ఏపీ)పై విజయం సాధించాడు. ఈ టోర్నీలో 8 పాయింట్లతో తరుణ్, జె. మల్లేశ్వర రావు (ఏపీ), కేఎన్ గోపాల్ (ఆంధ్రాబ్యాంక్) సంయుక్తంగా రెండో స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా తరుణ్, మల్లేశ్వర రావు వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు.