2024–25 ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో పాల్గొనే 14 మంది గ్రాండ్‌మాస్టర్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తమిళనాడు క్రీడాకారిణి ఆర్.వైశాలి భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో మొత్తం 20 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
‘ఫిడే’ నిర్దేశించిన అర్హత (ర్యాంకింగ్) ప్రకారం 14 మందికి నేరుగా చోటు దక్కగా... మిగతా ఆరుగురిని నిర్వాహకులు నామినేట్ చేస్తారు. ముగ్గురు మాజీ ప్రపంచ చాంపియన్లు (క్లాసికల్) టాన్ జోంగ్యి, అలెగ్జాండ్రా కోస్టెనిక్, మారియా ముజీచుక్ కూడా టోర్నీ బరిలో నిలిచారు. ప్రస్తుత చాంపియన్ జు వెన్‌జున్ ఈ ఈవెంట్‌నుంచి తప్పుకుంది.
మహిళల చెస్‌ను మరింత ఆదరణ పెంచే క్రమంలో పలు మార్పులతో గ్రాండ్‌ప్రి సిరీస్‌ను ఈ సారి కొత్తగా నిర్వహించనున్నట్లు ‘ఫిడే’ సీఈఓ ఎమిల్ సుటోవ్‌స్కీ వెల్లడించారు. ఇటీవల జరిగిన క్యాండిడేట్స్ టోర్నీలో హంపి రెండో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment