dronavalli Harika
-
చెస్ ఒలింపియాడ్–2024.. చెస్ ‘క్వీన్స్’
‘చెస్ అనేది ఆర్ట్. ఆట, సైన్స్‌ల సమాహారం’ అంటారు. ఆ విషయం ఎలా ఉన్నా... చెస్ అనేది ఆత్మవిశ్వాస సంకేతం. ఆ ఆత్మవిశ్వాస శక్తితోనే చెస్ ఒలింపియాడ్–2024(బుడాపెస్ట్, హంగెరి)లో మన మహిళా మణులు సత్తా చాటారు. చెస్ ఒలింపియాడ్ మహిళల విభాగంలో తొలి స్వర్ణం సాధించారు. మన ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి రమేష్‌బాబు, వంతిక ఆగర్వాల్, తానియా సచ్దేవ్లు సత్తా చాటారు. స్వర్ణకాంతులతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు..ఆమె విజయ రహస్యంమహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో పుట్టింది దివ్యా దేశ్‌ముఖ్. తల్లిదండ్రులిద్దరూ వైద్యులు. తండ్రి తరచు చెస్‌బోర్డ్ ముందు కూర్చొని కనిపించేవాడు. ఆ దృశ్యాలను పదే పదే చూసిన దివ్యకు చెస్‌పై ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తి కాస్తా నైపుణ్యంగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్, ‘వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్’ టైటిల్ గెలుచుకుంది.తన ఆట తీరుతో ఎన్నోసార్లు ‘అమేజింగ్ పర్ఫార్మెన్స్’ అనిపించుకున్న దివ్యా దేశ్‌ముఖ్ ‘గంటల కొద్దీ ్రపాక్టీస్, తల్లిదండ్రుల నిరంతర ్రపోత్సాహమే నా విజయ రహస్యం’ అంటోంది.ఆ క్షణం నుంచి...ఏడున్నర సంవత్సరాల వయసులో తొలిసారిగా చెస్ బోర్డ్‌ను టచ్ చేసింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వంతిక అగర్వాల్. ఆ టచ్ చేసిన ముహూర్తం ఎలాంటిదోగాని ఆ క్షణం నుంచే చెస్ ఆటే తన రూట్ అయింది. స్కూల్లో ఫ్రెండ్స్‌తో, ఇంట్లో సోదరుడు విశేష్‌తో చెస్ ఆడేది. చెస్ కెరీర్ ్రపారంభంలోనే ఎన్నో ట్రోఫీలు గెలుచుకొని ‘ఔరా’ అనిపించింది. రోజుకు ఎనిమిది గంటలు చెస్ ్రపాక్టీస్ చేస్తుంది. పోద్దున యోగా చేయడం, సాయంత్రం బ్యాడ్మింటన్ ఆడడం తప్పనిసరి. మొదట్లో గేమ్‌లో ఓటమిని తట్టుకోలేకపోయేది. ఏడ్చేది కూడా. ఏడుస్తూ నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తనలో గెలుపు, ఓటములను సమంగా చూసే పరిణతి వచ్చింది. ‘నేను ఏమాత్రం నిరాశగా కనిపించినా అమ్మ నాలో ధైర్యం నింపుతుంది. యస్...నువ్వు సాధించగలవు అంటుంది. ఆమె నాకు కొండంత అండ’ అంటుంది వంతిక అగర్వాల్.హార్డ్ వర్క్ ఈజ్ ది బిగ్గెస్ట్ టాలెంట్2005లో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సాధించిన తానియా సచ్దేవ్ దిల్లీలో పుట్టి పెరిగింది. తానియా సచ్‌దేవ్‌కు ఆరేళ్ల వయసులో తల్లి అంజు ద్వారా చెస్ పరిచయం అయింది. తానియా తల్లి బ్యాడ్మింటన్, తండ్రి ఫుట్‌బాల్ ఆడేవారు. ఈ రెండు ఆటలు కాకుండా తానియాకు చెస్ పరిచయం చేయడం యాదృచ్ఛికమే అయినా ఆ చెస్ తనని ఎక్కడికో తీసుకెళ్లింది. 2007లో మహిళల ఆసియా చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది తానియ.‘చెస్‌లో స్టార్‌గా రాణించడం ఏ ఒక్కరికో పరిమితమైన ప్రతిభ కాదు. కష్టపడితే అందరికి సాధ్యమే’ అంటున్న తానియా సచ్దేవ్ గ్యారీ కాస్పరోవ్ మాట ‘హార్డ్ వర్క్ ఈజ్ ది బిగ్గెస్ట్ టాలెంట్’ను పదే పదే గుర్తు తెస్తుంటుంది.ఆరోజు నుంచి వైశాలి జీవితమే మారిపోయింది!చెన్నైలో పుట్టింది వైశాలి రమేష్‌బాబు. తల్లి గృహిణి. తండ్రి టీఎన్ఎస్సీ బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్. ఆమె సోదరుడు ఆర్. ప్రజ్ఞానంద గ్రాండ్ మాస్టర్. చిన్నప్పుడు వైశాలి టీవీకి అతుక్కుపోయేది. చివరికి అదొక వ్యసనంగా మారింది. ఇది గమనించిన తల్లిదండ్రులు వైశాలిని చెస్ క్లాసులకు పంపించారు.‘నేను వెళ్లను’ అని వైశాలి మారాం చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదుగానీ ‘అలాగే’ అంటూ వెళ్లడం ఆమె జీవితాన్నే మార్చేసింది. 2012లో గర్ల్స్ వరల్డ్ యూత్ చెస్ చాంపియన్‌షిప్ (అండర్–12), 2016లో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (డబ్ల్యూఐయం) టైటిల్ గెలుచుకుంది. చెస్‌లో తొలి పాఠం నుంచి ‘గ్రాండ్ మాస్టర్’ టైటిల్ సొంతం చేసుకోవడం వరకు ఎన్నో విషయాలను నేర్చుకుంది. ఆటకు సంబంధించిన ఇన్‌స్పిరేషన్‌ను ది గ్రేట్ విశ్వనాథన్ ఆనంద్ నుంచి మాత్రమే కాదు తన సోదరుడు ప్రజ్ఞానంద నుంచి కూడా తీసుకుంటుంది. ‘అతడికి ఓపిక ఎక్కువ. గెలుపు, ఓటములను ఒకేరకంగా తీసుకుంటాడు. ఓర్పు నుంచి స్థితప్రజ్ఞత వరకు ప్రజ్ఞ నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి’ అంటుంది వైశాలి.కుటుంబ బలం పరిచయం అక్కర్లేని పేరు హారిక ద్రోణవల్లి. ఎంతోమంది ఔత్సాహికులకు ఈ గ్రాండ్ మాస్టర్ స్ఫూర్తిగా మారింది. చెన్నైలో ‘చెస్ ఒలింపియాడ్’ జరుగుతున్న టైమ్‌లో హారిక తొమ్మిది నెలల గర్భిణి. అయినప్పటికీ పోటీలో పాల్గొని జట్టుకు కాంస్యం దక్కడంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోని టఫెస్ట్ టీమ్‌లు ఏమిటో, ఇండియా టీమ్‌లోని స్ట్రాంగ్ పాయింట్స్ ఏమిటో హారికకు బాగా తెలుసు. బలాబలాలు బేరీజు వేసుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలో తెలుసు.‘మనం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నంత కాలం చెస్‌ను కొనసాగించవచ్చు. వయసు ముఖ్యం కాదు. నేను బాగా ఆడగలుగుతున్నాను అనిపించినంత కాలం ఆడతాను. కుటుంబ బలం నా అదృష్టం’ అంటోంది హారిక. -
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
2024–25 ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో పాల్గొనే 14 మంది గ్రాండ్మాస్టర్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తమిళనాడు క్రీడాకారిణి ఆర్.వైశాలి భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో మొత్తం 20 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.‘ఫిడే’ నిర్దేశించిన అర్హత (ర్యాంకింగ్) ప్రకారం 14 మందికి నేరుగా చోటు దక్కగా... మిగతా ఆరుగురిని నిర్వాహకులు నామినేట్ చేస్తారు. ముగ్గురు మాజీ ప్రపంచ చాంపియన్లు (క్లాసికల్) టాన్ జోంగ్యి, అలెగ్జాండ్రా కోస్టెనిక్, మారియా ముజీచుక్ కూడా టోర్నీ బరిలో నిలిచారు. ప్రస్తుత చాంపియన్ జు వెన్జున్ ఈ ఈవెంట్‌నుంచి తప్పుకుంది. మహిళల చెస్‌ను మరింత ఆదరణ పెంచే క్రమంలో పలు మార్పులతో గ్రాండ్‌ప్రి సిరీస్‌ను ఈ సారి కొత్తగా నిర్వహించనున్నట్లు ‘ఫిడే’ సీఈఓ ఎమిల్ సుటోవ్స్కీ వెల్లడించారు. ఇటీవల జరిగిన క్యాండిడేట్స్ టోర్నీలో హంపి రెండో స్థానంలో నిలిచింది. -
చెస్‌లో త్రుటిలో చేజారిన పతకం
ఆసియా క్రీడల చెస్ ఈవెంట్ వ్యక్తిగత విభాగాల్లో భారత్ ఒక్క పతకం కూడా గెలవలేకపోయింది. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో, కోనేరు హంపి 5.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. ఎనిమిదో రౌండ్లో హంపితో జరిగిన గేమ్‌ను హారిక 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో హారిక 30 ఎత్తుల్లో జినెర్ జు (చైనా)పై గెలిచింది. ని ర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత జినెర్ జు ఏడు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఉమిదా ఒమనోవా (ఉజ్బెకిస్తాన్), హు ఇఫాన్ (చైనా) 6.5 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు విదిత్ సంతోష్ గుజరాతి, ఇరిగేశి అర్జున్ 5.5 పాయింట్లతో వరుసగా ఐదు, ఆరు స్థానాలతో సరిపెట్టుకున్నారు. వె యి (చైనా; 7.5 పాయింట్లు) స్వర్ణం, నొదిర్బెక్ (ఉజ్బెకిస్తాన్; 7 పాయింట్లు) రజతం, సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్; 7 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. -
రెండు గేముల్లో ఓడిన హంపి
కోల్‌కతాలో జరుగుతున్న టాటా స్టీల్ ఇండియా ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి రెండు గేముల్లో ఓడిపోయి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. అర పాయింట్‌తో చివరిదైన పదో ర్యాంక్‌లో ఉంది. జు వెన్జున్ (చైనా)తో జరిగిన తొలి గేమ్‌ను 67 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... ఇరీనా క్రుష్ (అమెరికా)తో జరిగిన రెండో గేమ్‌లో 48 ఎత్తుల్లో... వంతిక (భారత్)తో జరిగిన మూడో గేమ్‌లో 24 ఎత్తుల్లో ఓటమి పాలైంది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఒక పాయింట్‌తో 8వ ర్యాంక్‌లో ఉంది. తొలి రౌండ్ లో దివ్య (భారత్) చేతిలో 57 ఎత్తుల్లో ఓడిన హారిక... నినో బత్సియాష్విలి (జార్జియా)తో 26 ఎత్తుల్లో, సవితాశ్రీ (భారత్)తో 56 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో మూడు రౌండ్ల తర్వాత దివ్యæ, వంతిక 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
క్వార్టర్ ఫైనల్లో హారిక
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్ చేరుకోగా... కోనేరు హంపి ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఎలైన్ రోబర్స్తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హారిక 2.5–1.5తో గెలిచింది. నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో శుక్రవారం ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్‌ను నిర్వహించారు. తొలి గేమ్‌ను హారిక 61 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... రెండో గేమ్‌లో హారిక 73 ఎత్తుల్లో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. బెలా ఖొటెనాష్ లి (జార్జియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హంపి 1–3తో ఓడిపోయింది. ర్యాపిడ్ ఫార్మాట్ టైబ్రేక్ తొలి గేమ్‌లో హంపి 54 ఎత్తుల్లో... రెండో గేమ్‌లో 43 ఎత్తుల్లో పరాజయం పాలైంది. గుకేశ్ ముందంజ... ఓపెన్ విభాగంలో 18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద పెను సంచలనం సృష్టించాడు. టైటిల్ ఫేవరెట్, ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకముర (అమెరికా)పై ప్రజ్ఞానంద గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. ర్యాపిడ్ ఫార్మాట్లోని రెండు గేముల్లో 2787 ఎలో రేటింగ్ ఉన్న నకమురను 2690 రేటింగ్ కలిగిన ప్రజ్ఞానంద ఓడించడం విశేషం. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద తొలి గేమ్‌లో 33 ఎత్తుల్లో, రెండో గేమ్‌లో 41 ఎత్తుల్లో విజయం సాధించాడు. తమిళనాడుకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 2.5–1.5తో ఆండ్రీ ఎసిపెంకో (రష్యా)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... నిహాల్ సరీన్ 1–3తో నెపోమ్నిశి (రష్యా) చేతిలో ఓడిపోయాడు. -
‘సడన్‌డెత్’లో హారిక విజయం
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... ఓపెన్ విభాగంలో నిహాల్ సరీన్, విదిత్ సంతోష్ గుజరాతి నాలుగో రౌండ్లోకి ప్రవేశించారు. సోమవారం జరిగిన మూడో రౌండ్ టైబ్రేక్ పోటీల్లో హారిక 5.5–4.5తో లెలా జవఖి‹Ùవిలి (జార్జియా)పై... నిహాల్ 2.5–1.5తో డేనియల్ బొగ్డాన్ (రొమేనియా)పై... విదిత్ 5–4తో మథియాస్ బ్లూ»ౌమ్ (జర్మనీ)పై విజయం సాధించారు. ఆదివారం రెండు క్లాసికల్ గేమ్‌లు ‘డ్రా’ కావడంతో హారిక–లెలా మధ్య విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. వీరిద్దరు ముందుగా 25 నిమిషాల నిడివి గల రెండు ర్యాపిడ్ గేమ్‌లు ఆడారు. రెండూ ‘డ్రా’గా ముగియడంతో 2–2తో సమంగా నిలిచారు. దాంతో 10 నిమిషాలు నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లు నిర్వహించారు. ఇందులో చెరో గేమ్‌లో గెలవడంతో స్కోరు 3–3తో సమమైంది. అనంతరం 5 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లు ఆడించగా...రెండూ ‘డ్రా’ కావడంతో స్కోరు 4–4తో నిలిచింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ఆఖరుగా 3 నిమిషాల నిడివిగల ‘సడన్‌డెత్’ గేమ్‌లు మొదలయ్యాయి. ‘సడన్‌డెత్’లో ‘డ్రా’ అయితే విజేత తేలేవరకు గేమ్‌లు నిర్వహిస్తారు, గెలిస్తే మాత్రం వెంటనే ముగిస్తారు. ఇందులో హారిక, లెలా తొలి గేమ్ ‘డ్రా’కాగా... రెండో గేమ్‌లో హారిక 59 ఎత్తుల్లో నెగ్గి నాలుగో రౌండ్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. -
అర్జున్ శుభారంభం; హారిక గేమ్ ‘డ్రా’
షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ శుభారంభం చేశాడు. బుధవారం మొదలైన ఈ టోర్నీలో పోలాండ్ గ్రాండ్‌మాస్టర్ కాస్పెర్ పియోరన్తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన అర్జున్ 32 ఎత్తుల్లో గెలుపొందాడు. భారత్‌కే చెందిన మరో యువ గ్రాండ్‌మాస్టర్, తమిళనాడుకు చెందిన దొమ్మరాజు గుకేశ్ కూడా తొలి రౌండ్లో గెలిచాడు. వెస్కోవి (బ్రెజిల్)తో జరిగిన గేమ్‌లో గుకేశ్ 33 ఎత్తుల్లో విజయం సాధించాడు. హారిక గేమ్ ‘డ్రా’ నికోసియా (సైప్రస్): మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి ‘డ్రా’ నమోదు చేసింది. జర్మనీ ప్లేయర్ దినారా వాగ్నర్‌తో బుధవారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను తెల్ల పావులతో ఆడిన హారిక 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
హంపికి ఆరో స్థానం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆరో స్థానంతో ముగించింది. గొర్యాక్చినా (రష్యా)తో బుధవారం జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఓవరాల్‌గా హంపి 4.5 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 3.5 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచింది. షువలోవా (రష్యా)తో జరిగిన చివరి గేమ్‌లో హారిక 66 ఎత్తుల్లో ఓటమి చవిచూసింది. భారత్‌కే చెందిన వైశాలి రెండు పాయింట్లతో పదో ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. -
ఆశల పల్లకిలో...
అల్మాటీ (కజకిస్తాన్): ఈ ఏడాదిని చిరస్మరణీయంగా ముగించాలనే లక్ష్యంతో నేటి నుంచి ఐదు రోజులపాటు జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో 2019 ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్, 2012 కాంస్య పతక విజేత, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపితోపాటు ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, సవితా శ్రీ, పద్మిని రౌత్, దివ్యా దేశ్‌ముఖ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొదటి మూడు రోజులు ర్యాపిడ్ విభాగంలో, ఆ తర్వాత రెండు రోజులు బ్లిట్జ్ విభాగంలో పోటీలు జరుగుతాయి. ర్యాపిడ్ టోర్నీని 11 రౌండ్లపాటు, బ్లిట్జ్ టోర్నీని 17 రౌండ్లపాటు నిర్వహిస్తారు. ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, హర్ష భరతకోటిలతోపాటు విదిత్ సంతోష్ గుజరాతి, సూర్యశేఖర గంగూలీ, నిహాల్ సరీన్, ఎస్ఎల్ నారాయణన్, అరవింద్ చిదంబరం, అభిమన్యు పురాణిక్, ఆధిబన్, రౌనక్ సాధ్వాని, శ్రీనాథ్ నారాయణన్, వి.ప్రణవ్, అర్జున్ కల్యాణ్, సంకల్ప్ గుప్తా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓపెన్ ర్యాపిడ్ టోర్నీని 13 రౌండ్లు, బ్లిట్జ్ టోర్నీని 21 రౌండ్లు నిర్వహిస్తారు. మహిళల ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలలో టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు), 30 వేల డాలర్లు (రూ. 28 లక్షల 83 వేలు), 20 వేల డాలర్లు (రూ. 16 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా ఇస్తారు. ఓపెన్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలలో టాప్–3లో నిలిచిన వారికి వరుసగా 60 వేల డాలర్లు (రూ. 49 లక్షల 67 వేలు), 50 వేల డాలర్లు (రూ. 41 లక్షల 39 వేలు), 40 వేల డాలర్లు (రూ. 33 లక్షల 11 వేలు) ప్రైజ్‌మనీగా అందజేస్తారు. -
Dronavalli Harika: ‘గ్రాండ్ స్విస్’లో హారికకు ఐదో స్థానం
Dronavalli Harika Draws 8 Games: లాత్వియాలో ఆదివారం ముగిసిన గ్రాండ్ స్విస్ మహిళల చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది. 11 రౌండ్ల ఈ టోర్నీలో హారిక మొత్తం ఏడు పాయింట్లు సాధించింది. ఈ టోర్నీలో హారిక మూడు గేముల్లో గెలిచి, ఎనిమిది గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. చైనా ప్లేయర్ లీ తింగ్జీ (9 పాయింట్లు) టైటిల్ సాధించింది. చదవండి: T20 World Cup 2021: కివీస్ సెమీస్‌కు.. ప్రాక్టీసు రద్దు చేసుకుని హోటల్లోనే ఉండిపోయిన భారత ఆటగాళ్లు! -
Dronavalli Harika: కల నెరవేరింది.. నా భర్త అన్ని విధాలా అండగా నిలిచారు
భారత చెస్ స్టార్ ద్రోణవల్లి హారిక ఖాతాలో ఇప్పటి వరకు మూడు వరల్డ్ చాంపియన్ షిప్ వ్యక్తిగత కాంస్యాలు ఉన్నాయి. అయితే 2004నుంచి జట్టు సభ్యురాలిగా ఉన్నా టీమ్ ఈవెంట్లో ఒక్కసారి కూడా పతకం అందుకునేందుకు పోడియం ఎక్కలేదనే నిరాశ ఆమెను వెంటాడింది. ఇప్పుడు హారికకు ఆ లోటు తీరిపోయింది. స్పెయిన్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్‌తో రజతం ఆమె ఖాతాలో చేరింది. పైగా వ్యక్తిగత ప్రదర్శనకుగాను మరో వెండి పతకం కూడా హారిక చెంత చేరడంతో ఆనందం రెట్టింపైంది. ఇదే ఉత్సాహంతో మున్ముందు మరిన్ని ఘనతలు సాధించేందుకు ఆమె సిద్ధమవుతోంది. సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత పతకంకంటే తన దృష్టిలో సమష్టి విజయంతో దక్కే టీమ్ మెడల్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక అభిప్రాయ పడింది. చెస్లోనూ ఒలింపియాడ్ ఉన్నా... వరల్డ్ చాంపియప్లో సాధించిన పతకం తన దృష్టిలో ఒలింపిక్ క్రీడల్లో విజయంలాంటిదేనని ఆమె పేర్కొంది. స్పెయిన్‌నుంచి తిరిగొచ్చాక ‘సాక్షి’తో ముచ్చటించిన హారిక చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... చాంపియన్‌షిప్‌కు ముందు అంచనాలు... పెద్దగా ఆశలతో మేం టోర్నీకి వెళ్లలేదు. పైగా కోనేరు హంపి కూడా దూరం కావడంతో టీమ్ కాస్త బలహీనంగానే మారింది. అయితే మా శాయశక్తులా ప్రయత్నించాలని, చివరి వరకు పట్టుదలగా పోరాడాలని మాత్రం అనుకున్నాం. నేను ఈ టోర్నీ కోసం సుమారు నెలన్నర పాటు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాను. స్విస్ సిస్టంతో పోలిస్తే ఈ సారి ఫార్మాట్ నాకౌట్‌కు మారడం మాకు కొంత సానుకూలంగా పని చేసిందని భావిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి గేమ్‌లలో పెద్ద జట్లు, అగ్రశ్రేణి ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి ఉంటుంది. మేం స్వేచ్ఛగా ఆడేందుకు అది మేలు చేసింది. క్వార్టర్ ఫైనల్లో కజకిస్తాన్‌పై గెలవడం అన్నింటికంటే కీలకంగా నేను భావిస్తున్నాను. టీమ్ ఈవెంట్ పతకానికి ఉన్న ప్రత్యేకత... నా 13 ఏళ్ల వయసులో తొలిసారి భారత జట్టులో భాగమయ్యాను. 17 ఏళ్లలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వేర్వేరు వరల్డ్ చాంపియన్షిప్లే కాకుండా చెస్కే ప్రత్యేకమైన ఒలింపియాడ్‌లలోనూ పాల్గొన్నాను. కానీ ఒక్కసారి కూడా పతకం లభించలేదు. వ్యక్తిగత విజయాలు ఎన్ని సాధించినా భారత జట్టుతో కలిసి వేదికపై నిలబడాలని ఎన్నో సార్లు కోరుకున్నాను. ఇప్పుడు నా కల తీరింది. ఒలింపిక్స్‌లో చెస్ క్రీడాంశం లేదు కానీ ఇప్పుడు జట్టుగా కలిగిన ఆనందం అక్కడ దక్కే పతకంకంటే తక్కువేమీ కాదు. గతంలో టీమ్ ఈవెంట్లలో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన నాలుగో స్థానం మాత్రమే. ఇప్పుడు మేం దానిని మార్చాం. దీనిని అధిగమించాలంటూ ముందు తరాల కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించాం. టోర్నీ ‘టేబుల్ 1’లలో నా ఆటకు మరో రజతం కూడా దక్కడం సంతోషం. ఏడాదిగా ఆన్లైన్ టోర్నీలు ఆడటంపై... బయటినుంచి చూస్తే చెస్‌లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ తేడా ఏముుంటుంది అనిపిస్తుంది. కానీ ఆన్లైన్లో తలపడటం ఏమాత్రం ఆసక్తి కలిగించదు. చెస్ ఆట మాత్రమే కాదు...మైండ్ గేమ్స్ కూడా చాలా ఉంటాయి. దగ్గరినుంచి ప్రత్యర్థి కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తూ స్పందనను బట్టి సైకలాజికల్‌గా వేసే ఎత్తులు కూడా ఎంతో ముఖ్యం. అది ఆన్లైన్లో సాధ్యపడదు. కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆడటం ఒక కొత్త అవకాశాన్ని సృష్టించినా...అసలు ఆటతో దానికి పోలిక లేదు. కోవిడ్ తర్వాత సోచిలో ఆఫ్‌లైన్‌లో ఆడిన నాకు ఇది రెండో టోర్నీ. అయితే ర్యాపిడ్, బ్లిట్జ్ తరహాలో ఇకపై ఆన్లైన్ కూడా ఒక ఫార్మాట్‌గా మారుతుందేమో! ఇప్పటికీ భారత మహిళల చెస్నుంచి ఇద్దరే గ్రాండ్‌మాస్టర్లు ఉండటంపై... చాలా దురదృష్టకరం. నిజాయితీగా చెప్పాలంటే కారణం ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. 70 మంది గ్రాండ్మాస్టర్లలో ఇన్నేళ్ల తర్వాత కూడా నేను, హంపి మాత్రమే మహిళలం. మనతో పోలిస్తే ఇతర దేశాల్లో మహిళల చెస్‌కు ఎంతో ప్రాధాన్యత లభిస్తుంది. అయితే ఓవరాల్‌గా చూస్తే మన చెస్‌లో మంచి పురోగతి కనిపిస్తుండటం శుభ పరిణామం. 2022 ఆసియా క్రీడల్లో మళ్లీ చెస్ రానుండటం సంతోషించాల్సిన విషయం. చెస్ ఖరీదైన క్రీడగా మారిపోవడంపై... ఇప్పుడే కాదు. చాలా కాలంగా చెస్‌లో ఒక స్థాయికి చేరాలంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందనేది వాస్తవం. ఇందులో సింహ భాగం కోచింగ్‌కే వెళుతుంది. పెద్ద స్థాయికి చేరే కొద్దీ మంచి శిక్షణ అవసరం అయితే దాని కోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సిందే. ఈ ఇబ్బందులతో చాలా మంది ఆటగాళ్లు ఇంటర్నెట్, పుస్తకాలపై ఆధారపడి కూడా తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడం కూడా నేను చూస్తున్నాను. వ్యక్తిగత జీవితంపై... మూడేళ్లుగా నా భర్త కార్తీక్ నాకు అన్ని విధాలా అండగా నిలిచారు. 2019 చివరి వరకు కూడా ఇద్దరం కలిసే ప్రయాణాలు చేశాం. దాదాపు అన్ని టోర్నీలకు కలిసి వెళ్లడంతో నా ఆట ఏమిటో, ఇతర సమస్యలేమిటో ఆయనకూ తెలిశాయి. చదవండి: వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన కామెంట్స్ -
నా కెరీర్లో ఇది గొప్ప ఫలితం: ద్రోణవల్లి హారిక
-
World Women Chess Championship: క్వార్టర్ ఫైనల్లో భారత్
సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఫ్రాన్స్ జట్టుతో బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–1తో గెలిచి ఏడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మేరీ సెబాగ్‌తో జరిగిన గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 45 ఎత్తుల్లో... నవ్రోతెసు్కతో జరిగిన గేమ్‌ను తానియా సచ్దేవ్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. భక్తి కులకర్ణి 51 ఎత్తుల్లో నటాషాపై, మేరీఆన్ గోమ్స్ 51 ఎత్తుల్లో సిలి్వయాపై నెగ్గడంతో భారత విజయం ఖాయమైంది. భారత్‌తోపాటు గ్రూప్ ‘ఎ’ నుంచి రష్యా, అర్మేనియా, అజర్బైజాన్ కూడా క్వార్టర్ ఫైనల్ చేరాయి. గ్రూప్ ‘బి’ నుంచి ఉక్రెయిన్, జార్జియా, కజకిస్తాన్, అమెరికా క్వార్టర్ ఫైనల్ చేరాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో కజకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. చదవండి: కోనేరు హంపికి కోవాగ్జిన్ ఆంక్షలు -
Women World Chess Championship: భారత్‌కు మిశ్రమ ఫలితాలు
సిట్‌గెస్ (స్పెయిన్): ప్రపంచ మహిళల టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అర్మేనియాతో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో 2.5–1.5తో గెలిచిన భారత జట్టు... రష్యాతో జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 1–3తో పరాజయం పాలైంది. అర్మేనియాతో మ్యాచ్‌లో హారిక తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకోగా... వైశాలి ఓడిపోయింది. తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి తమ ప్రత్యర్థులపై నెగ్గి భారత్‌కు విజయాన్ని అందించారు. రష్యాతో మ్యాచ్‌లో హారిక, మేరీఆన్ గోమ్స్ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... తానియా, వైశాలి ఓడిపోయారు. నేడు ఐదో రౌండ్లో ఫ్రాన్స్‌తో భారత్ ఆడుతుంది. కాగా అజర్‌బైజాన్‌తో జరిగిన పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకున్న భారత్... రెండో లీగ్ మ్యాచ్‌లో 2.5–1.5తో స్పెయిన్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: Ashwin Vs Morgan: అందుకే ఆ గొడవ జరిగింది: దినేశ్ కార్తిక్ The battles of the FIDE Women's World Team Championship are finished for today. Results of Round 4 of the group stage: Pool A Spain ½:3½ Armenia CFR Team 3:1 India France 3½:½ Azerbaijan Pool B Poland 2:2 Georgia FIDE Americas 2:2 Germany Ukraine 2½:1½ Kazakhstan pic.twitter.com/pdcmsOr5mP — International Chess Federation (@FIDE_chess) September 28, 2021 -
మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నీకి కోనేరు హంపి, హారిక అర్హత
చెన్నై: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరగనున్న మహిళల ప్రపంచకప్ టోర్నమెంట్‌కు భారత స్టార్ క్రీడాకారిణులు, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక అర్హత సాధించారు. ఈ ఇద్దరితోపాటు పద్మిని రౌత్, భక్తి కులకర్ణి భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. ప్రపంచ ర్యాంకింగ్, రేటింగ్ ప్రకారం హంపి, హారిక బెర్త్‌లు దక్కించుకోగా... ఆసియా జోనల్ కోటా ద్వారా పద్మిని, భక్తి అర్హత పొందారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం హంపి మూడో ర్యాంక్‌లో, హారిక తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ జూలై 10 నుంచి ఆగస్టు 3 వరకు రష్యాలోని సోచి నగరంలో జరగనుంది. ఈ టోర్నీకి అర్హత సాధించిన క్రీడాకారిణుల జాబితాను ‘ఫిడే’ విడుదల చేసింది. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో మొత్తం ఏడు రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్లో రెండు గేమ్‌ల చొప్పున జరుగుతాయి. ఒకవేళ ఇద్దరి మధ్య స్కోర్లు సమం గా నిలిస్తే టైబ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. -
Covid-19: చెస్ స్టార్స్ విరాళం రూ. 37 లక్షలు
చెన్నై: కరోనాతో పోరాడుతున్న వారికి తమ వంతు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చిన భారత చెస్ స్టార్ క్రీడాకారులు 50 వేల డాలర్లను (దాదాపు రూ. 37 లక్షలు) సేకరించారు. అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఏర్పాటు చేసిన ‘చెక్‌మేట్ కోవిడ్’ కార్యక్రమంలో భాగమైన విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, రమేశ్ బాబు ఇతర చెస్ ప్లేయర్లతో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించారు. ఇక దీనిని రెడ్ క్రాస్ ఇండియాకు అందజేస్తామని ఏఐసీఎఫ్ తెలిపింది. రెండు వేలలోపు ఫిడే రేటింగ్స్ ఉన్న చెస్ ప్లేయర్లు ఆనంద్‌తో సహా మిగిలిన నలుగురు క్రీడాకారులతో మ్యాచ్‌లు ఆడేందుకు ఏఐసీఎఫ్ అవకాశ మిచ్చింది. ఆనంద్‌తో ఆడాలంటే 150 డాలర్ల (రూ. 11 వేలు)ను... మిగిలిన నలుగురితో ఆడాలనుకుంటే 25 డాలర్ల (రూ.1,835)ను రిజిస్ట్రేషన్ రుసుముగా పెట్టింది. ఇందులో 105 మంది చెస్ ప్లేయర్లు పాల్గొన్నారు. చదవండి: Tokyo Olympics: ‘రాజకీయాలతో చంపేస్తారా’ -
హంపి, హారిక ఓటమి
చెన్నై: ‘ఫిడే’ మహిళల స్పీడ్ చెస్ చాంపియన్‌షిప్ గ్రాండ్‌ప్రి మూడో అంచె పోటీల్లో భారత పోరాటం ముగిసింది. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలయ్యారు. వరల్డ్ నంబర్ 2 హంపి 2–9తో అలెగ్జాండ్రా కోస్టెనిక్ (రష్యా) చేతిలో చిత్తు కాగా, వరల్డ్ నంబర్‌వన్ హూ యిఫాన్ (చైనా) 7–3తో హారికపై విజయం సాధించింది. ఈ టోర్నీలో చివరిదైన నాలుగో అంచె పోటీలు బుధవారంనుంచి జరుగుతాయి. ఇందు లో హంపి, హారిక పాల్గొంటారు. -
చెస్ స్టార్స్ విరాళం రూ. 4 లక్షల 50 వేలు
చెన్నై: కరోనాపై పోరాటానికి మద్దతుగా భారత అగ్రశ్రేణి చెస్ క్రీడాకారులు తమవంతుగా చేయూతనిచ్చారు. ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తోపాటు గ్రాండ్‌మాస్టర్లు విదిత్ సంతోష్ గుజరాతి, ఆదిబన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక అభిమానులతో ఆన్లైన్లో 20 బోర్డులపై చెస్ గేమ్‌లు ఆడారు. చెస్.కామ్–ఇండియా వెబ్సైట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత చెస్ స్టార్స్‌తో ఆడిన వారు స్వచ్ఛందంగా కొంత మొత్తం విరాళంగా ఇచ్చారు. ఓవరాల్‌గా ఈ టోర్నీ ద్వారా చెస్ స్టార్స్ మొత్తం ఆరు వేల డాలర్లు (రూ. 4 లక్షల 50 వేలు) సమకూర్చారు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేశారు. -
ఈ విరామం ఊహించలేదు
సాక్షి, హైదరాబాద్: కరోనాతో ప్రస్తుతం ఏర్పడిన కల్లోల వాతావరణం త్వరలోనే తగ్గుముఖం పడుతుందని... పరిస్థితులు చక్కబడతాయని ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ద్రోణవల్లి హారిక అభిప్రాయపడింది. క్రీడాకారుల కెరీర్లో ఖాళీ సమయం చాలా తక్కువ సందర్భాల్లో దొరుకుతుందని... ఊహించని విధంగా లభించిన విరామ సమయాన్ని ప్రణాళికతో సద్వినియోగం చేసుకుంటున్నానని ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో మూడుసార్లు కాంస్య పతకాలు నెగ్గిన హారిక తెలిపింది. స్విట్జర్లాండ్‌లో జరిగిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీలో పాల్గొని తిరిగొచ్చిన హారిక హోం క్వారంటైన్లోకి వెళ్లింది. ఆదివారంతో స్వీయ నిర్బంధం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... స్విట్జర్లాండ్‌లోని లుసానేలో మార్చి 1 నుంచి 13 వరకు జరిగిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో పాల్గొన్నాను. 14వ తేదీన స్విట్జర్లాండ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాను. కరోనా కట్టడికి ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం నేను విదేశం నుంచి రావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాను. ఆదివారంతో అధికారికంగా నా సెల్ఫ్ క్వారంటైన్ గడువు పూర్తయింది. అంతా సవ్యంగా ఉందని జీహెచ్ఎంసీ అధికారులు స్వయంగా వచ్చి ధ్రువీకరించారు. స్వీయ నిర్బంధం ముగిసినా నేను ఇంట్లోనే ఉంటున్నాను. లాక్‌డౌన్‌ను పాటిస్తు న్నాను. కొంతకాలం నుంచి విరామం లేకుండా టోర్నమెంట్లు ఆడుతున్నాను. స్విట్జర్లాండ్ నుం చి వచ్చాక నాలుగైదు రోజులపాటు ఒకే గదికి పరిమితమయ్యాను. ఆటకు వారం రోజులపాటు బ్రేక్ ఇచ్చాను. క్వారంటైన్ పూర్తవ్వడంతో మళ్లీ చెస్‌పై దృష్టి పెట్టాను. అయితే అంత సీరియస్‌గా ప్రాక్టీస్ చేయడంలేదు. శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండటం కోసం వ్యాయామం, యోగా చేస్తున్నాను. ఆగస్టులో మాస్కోలో జరగాల్సిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కారణంగా దాదాపు అన్ని క్రీడాంశాల్లో టోర్నీలు రద్దు కావడం లేదంటే వాయిదా పడటం జరిగింది. ఈ ఏడాది నా తదుపరి టోర్నీ ఏంటనే విషయం ప్రస్తుతం నాకే తెలియదు. ఒక్కసారిగా ఊహించని విధంగా ఇంత సమయం విరామం లభిస్తుందని ఊహించలేదు. పెళ్లయ్యాక నేను తొలిసారి నాలుగైదు నెలలు ఇంటివద్దే ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతర్జాతీయస్థాయిలో కొన్నాళ్లపాటు చాలా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కరోనా కట్టడి అయ్యాక అంతా సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత అంతా సాఫీగా సాగిపోతుందని ఆశాభావంతో ఉన్నాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనమందరం మంచే జరుగుతుందనే ఆశావహ దృక్పథంతో ఉండాలి. అయితే కరోనా సృష్టించిన భయం కారణంగా కొన్నాళ్లపాటు విదేశీ ప్రయాణాలు చేయడానికి అందరూ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. నేను స్విట్జర్లాండ్ వెళ్లినపుడు అక్కడ కరోనా సీరియస్‌గా లేదు. తిరిగి వచ్చాక పరిస్థితి తీవ్రరూపం దాల్చిం ది. టోర్నీ జరుగుతున్న సమయంలో కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని సూచించారు. టోర్నీ జరుగుతున్న సమయంలో నేను కూడా వేదిక వద్దకు వెళ్లడం, గేమ్ పూర్తికాగానే వెంటనే హోటల్ గదికి చేరుకోవడం చేశాను. ప్రపంచ వ్యాప్తంగా క్రీడా పోటీలు నిలిచిపోయిన దశలో మాస్కోలో క్యాండిడేట్స్ చెస్ టోర్నీని నిర్వహించడం వివాదాస్పదమైంది. అయితే రష్యాలో కరోనా మరీ తీవ్రంగా లేకపోవడంతో అప్పటి పరిస్థితులనుబట్టి ‘ఫిడే’ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నాను. అయితే ఏడు రౌండ్లు ముగిశాక రష్యా ప్రభు త్వం అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించడంతో టోర్నీని మధ్యలో నిలిపేశారు. కరోనా విలయతాండవం చేస్తున్న చైనా, ఇటలీ దేశాలకు సంబంధించి నాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. చైనాలోనే నేను గ్రాండ్‌మాస్టర్ హోదా సంపాదించాను. ఐదేళ్ల క్రితం రోమ్‌లో వరల్డ్ బ్లిట్జ్ ఆన్లైన్ చాంపియన్ షిప్ టైటిల్ గెల్చుకున్నాను. అయితే ఇటలీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కలచి వేస్తున్నాయి. అన్ని చోట్లా అందరూ కరోనా నుంచి తొందరగానే కోలుకోవాలని, అంతటా సాధారణ పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్‌లో భర్త కార్తీక్ చంద్రతో హారిక -
‘ఫిడే’ గ్రాండ్‌ప్రి టోర్నీ: హారికకు ఏడో స్థానం
లుసానే: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 5.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌ను హారిక 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఏడు పాయింట్లతో నానా జాగ్‌నిద్జే (జార్జియా), గోర్యాచికినా (రష్యా) సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. -
ప్రౌడ్ ఆఫ్ యూ బావ : హారిక
దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించిన ‘వెంకీ మామ’ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్, నాగచైనత్య హీరోలుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం 2019 డిసెంబర్లో విడుదలైన తెలుగు సినిమాలన్నింటిల్లో కెల్లా అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక.. సో ప్రౌడ్ ఆఫ్ యూ బావ అని బాబీకి ట్వీట్ చేశారు. హారిక ట్వీట్‌కు బాబీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, హారిక సోదరిని బాబీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి ఓ పాప కూడా ఉంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న హారిక.. గతేడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. Thank you @HarikaDronavali 😊 https://t.co/WWycESE1S0 — Bobby (@dirbobby) January 3, 2020 -
దూసుకెళుతోన్న హంపి, హారిక
మాస్కో: ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. టోర్నీలో ఎనిమిది రౌండ్ల అనంతరం వీరిద్దరూ 6 పాయింట్లతో సమంగా నిలిచినప్పటికీ... ర్యాంకుల్ని వర్గీకరించగా హంపి ఐదో స్థానంలో, హారిక ఎనిమిదో స్థానంలో ఉన్నారు. 6.5 పాయింట్లతో రొమేనియా ప్లేయర్ బల్మగ ఇరినా అగ్రస్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం మొత్తం నాలుగు రౌండ్లు జరుగగా హంపి ఐదో గేమ్‌లో గిర్యా ఓల్గాపై గెలుపొంది, ఆరో గేమ్‌లో బల్మగ ఇరినా చేతిలో ఓడిపోయింది. ముజిచుక్ అనాతో ఏడో గేమ్‌ను డ్రా చేసుకున్న ఆమె.. ఎనిమిదో గేమ్‌లో జనిజె ననాపై గెలుపొందింది. మరోవైపు హారిక మూడు గేమ్‌ల్ని డ్రా చేసుకొని ఒక గేమ్‌లో గెలుపొందింది. గలియామోవా అలీసా (ఆరో గేమ్)పై గెలుపొందిన హారిక... కశ్లిన్స్కాయా అలీనా (ఐదో గేమ్), పొగోనినా నటలిజా (ఏడో గేమ్), లగ్నో కాటెరినా (ఎనిమిదో గేమ్)లతో మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. -
టైటిల్‌తో సీజన్ ముగించేనా?
మాస్కో: ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ఈ సంవత్సరంలో చివరి టోర్నమెంట్‌కు సిద్ధమయ్యారు. మాస్కోలో నేడు మొదలయ్యే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో హంపి, హారిక టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. ర్యాపిడ్ విభాగంలో మొత్తం 121 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 12 రౌండ్లపాటు టోర్నీ జరుగుతుంది. గురు, శుక్ర, శనివారాల్లో నాలుగు రౌండ్ల చొప్పున గేమ్‌లు జరుగుతాయి. ఈనెల 29, 30వ తేదీల్లో బ్లిట్జ్ విభాగం గేమ్‌లను నిర్వహిస్తారు. బ్లిట్జ్ కేటగిరీలో 17 రౌండ్లు ఉంటాయి. ఇక ఓపెన్ విభాగంలో భారత్ నుంచి గ్రాండ్‌మాస్టర్లు విదిత్ సంతోష్ గుజరాతి, ఆధిబన్, కృష్ణన్ శశికిరణ్, సూర్యశేఖర గంగూలీ, సేతురామన్, శ్రీనాథ్ నారాయణన్, అరవింద్ చిదంబరం, విష్ణుప్రసన్న, హర్ష భరతకోటి, రౌనక్ సాధ్వాని, నిహాల్ సరీన్, డి.గుకేశ్ ఉన్నారు. -
హారికకు ఐదో స్థానం
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది. శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో చివరిదైన తొమ్మిదో రౌండ్లో హారిక నల్ల పావులతో ఆడుతూ 60 ఎత్తుల్లో ఇరీనా క్రుష్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. పది మంది మేటి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో హారిక 4.5 పాయింట్లు సంపాదించింది. ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆమె మరో గేమ్‌లో గెలిచి, ఒక గేమ్‌లో ఓడిపోయింది. ఏడు పాయింట్లు సాధించిన వాలెంటినా గునీనా (రష్యా) విజేతగా అవతరించింది. 6.5 పాయింట్లతో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) రెండో స్థానంలో, 5.5 పాయింట్లతో ఇరీనా క్రుష్ మూడో స్థానంలో నిలిచారు. విజేత గునీనాకు 40 వేల డాలర్లు (రూ. 28 లక్షల 54 వేలు)... రన్నరప్ కొస్టెనిక్కు 30 వేల డాలర్లు (రూ. 21 లక్షల 40 వేలు)... మూడో స్థానం పొందిన ఇరీనా క్రుష్కు 20 వేల డాలర్లు (రూ. 14 లక్షల 27 వేలు), ఐదో స్థానంలో నిలిచిన హారికకు 9,500 డాలర్లు (రూ. 6 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
హారిక... మరో ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక వరుసగా నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) ఎలిజబెత్ పెట్జ్ (జర్మనీ)తో జరిగిన నాలుగో గేమ్‌ను తెల్ల పావులతో ఆడిన హారిక 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. పది మంది మేటి క్రీడాకారిణుల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత హారిక రెండు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. 3.5 పాయింట్లతో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) అగ్రస్థానంలో ఉంది. -
‘పద్మశ్రీ’ హారిక
-
‘పద్మశ్రీ’ హారిక
అంతర్జాతీయ స్థాయిలో 19 ఏళ్లుగా భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తోన్న ఆంధ్రప్రదేశ్ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక కెరీర్లో మరో కలికితురాయి చేరింది. గ్రాండ్‌మాస్టర్ హారికకు కేంద్ర ప్రభుత్వ పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ లభించింది. 70వ గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో శుక్రవారం కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. క్రీడా విభాగంలో మొత్తం తొమ్మిది మందికి ఈ అవార్డులు రాగా... ఉత్తరాఖండ్‌కు చెందిన పర్వతారోహకురాలు బచేంద్రీ పాల్‌కు ‘పద్మభూషణ్’ దక్కింది. మిగతా ఎనిమిది మందిని ‘పద్మశ్రీ’ వరించింది. న్యూఢిల్లీ: క్రీడా ప్రపంచంలో తమ ప్రతిభాపాటవాలతో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలతో గౌరవించింది. వివిధ రంగాల నుంచి మొత్తం 112 మందికి ఈ అవార్డులు రాగా... క్రీడా విభాగం నుంచి తొమ్మిది మంది ఉన్నారు. మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రీ పాల్‌కు ‘పద్మ భూషణ్’ లభించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 64 ఏళ్ల బచేంద్రీ పాల్ 1984లో మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించారు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన రెజ్లర్ బజరంగ్ పూనియా... 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు గౌతమ్ గంభీర్... భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి... ‘ట్రిపుల్ ఒలింపియన్’ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్... భారత కబడ్డీ జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్లకు ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం దక్కడంలో 36 ఏళ్ల శరత్ కమల్ కీలకపాత్ర వహించాడు. 2016 కబడ్డీ ప్రపంచకప్ భారత్‌కు దక్కడంలో అజయ్ ఠాకూర్ ముఖ్యపాత్ర పోషించాడు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జన్మించిన సునీల్ చెత్రి జాతీయ పోటీల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తాడు. అంచెలంచెలుగా... ఆరేళ్ల ప్రాయంలో చెస్‌లో ఓనమాలు దిద్దుకున్న హారిక ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు అంతర్జాతీయ చెస్‌లో మేటి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 1991 జనవరి 12న గుంటూరులో జన్మించిన హారిక 2000లో స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్–10 బాలికల విభాగంలో రజతం గెలిచి వెలుగులోకి వచ్చింది. ఈ దశలో క్రీడా ప్రేమికులైన హారిక తల్లిదండ్రులు రమేశ్, స్వర్ణ తమ అమ్మాయికి మరింత మెరుగైన శిక్షణ ఇప్పించారు. కోచ్ ఎన్వీఎస్ రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటూ హారిక మరింత రాటుదేలింది. అనంతరం ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్–12 విభాగంలో రజత, కాంస్యాలు సాధించింది. 2006లో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్–18 విభాగంలో స్వర్ణం... 2008 ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పసిడి సాధించిన హారిక... 2009లో ఆసియా మహిళా చాంపియన్‌గా... 2010లో కామన్వెల్త్ చాంపియన్‌గా అవతరించింది. 2011లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందిన ఆమె వరుసగా మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2012, 2015, 2017) కాంస్య పతకాలను కూడా దక్కించుకుంది. 28 ఏళ్ల హారిక ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతున్న జిబ్రాల్టర్ అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొంటోంది. హారికకు ‘పద్మశ్రీ’ పురస్కారం రావడంపట్ల ఆమె తల్లిదండ్రులు రమేశ్, స్వర్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. క్రీడా పద్మాలు వీరే.. పద్మ భూషణ్: బచేంద్రీ పాల్ (ఉత్తరాఖండ్–పర్వతారోహణ) పద్మశ్రీ: ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్–చెస్); బజరంగ్ పూనియా (హరియాణా–రెజ్లింగ్); సునీల్ చెత్రి (తెలంగాణ–ఫుట్‌బాల్) గంభీర్ (ఢిల్లీ–క్రికెట్); ఆచంట శరత్ కమల్ (తమిళనాడు–టేబుల్ టెన్నిస్); బొంబేలా దేవి (మణిపూర్–ఆర్చరీ); ప్రశాంతి సింగ్ (ఉత్తరప్రదేశ్–బాస్కెట్‌బాల్); అజయ్ ఠాకూర్ (హిమాచల్‌ప్రదేశ్–కబడ్డీ) -
పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం
న్యూ ఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కేంద్రం ఈ అవార్డులను శుక్రవారం సాయంత్రం ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా నలుగురికి పద్మ విభూషణ్, 14 పద్మ భూషణ్, 94 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. పద్మ విభూషణ్ పొందిన వారిలో ఇస్మాయిల్ ఒమర్ గులే, అనిల్‌కుమార్ మణీబాయ్, బల్వంత్ మెరేశ్వర్ పురందరే, టీజెన్ బాయ్‌లు ఉన్నారు. మాళయళ నటుడు మోహన్ లాల్‌ను, ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌లను పద్మ భూషణ్ వరించింది. పద్మ శ్రీ అవార్డులు పొందిన వారిలో కొందరు... ద్రోణవల్లి హారిక(చెస్ క్రీడాకారిణి) సిరివెన్నెల సీతారామశాస్త్రి(గేయ రచయిత) యెండవల్లి వెంకటేశ్వరరావు(వ్యవసాయ వేత్త) ప్రభుదేవా(కొరియోగ్రాఫర్) మనోజ్ బాజ్ పాయ్(నటుడు) సునీల్ చెత్రీ(పుట్‌బాల్ ప్లేయర్) గౌతమ్ గంభీర్(క్రికెటర్) శివమణి(డ్రమ్మర్) పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పతకాలతో తిరిగి రావాలని...
బటూమి (జార్జియా): గతంలో ఎన్నడూలేని విధంగా సన్నద్ధత... పదేళ్ల తర్వాత దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం... రెండేళ్ల తర్వాత స్టార్ క్రీడాకారిణి కోనేరు హంపి పునరాగమనం... వెరసి సోమవారం మొదలయ్యే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతి, ఆధిబన్, శశికిరణ్ కృష్ణన్లతో కూడిన భారత పురుషుల జట్టుకు ఐదో సీడ్... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తానియా సచ్దేవ్, ఇషా కరవాడే, పద్మిని రౌత్‌లతో కూడిన భారత మహిళల జట్టుకూ ఐదో సీడ్ లభించింది. పురుషుల విభాగంలో 185 దేశాలు... మహిళల విభాగంలో 155 దేశాలు పోటీపడుతున్న ఈ మెగా ఈవెంట్లో 11 రౌండ్లు జరుగుతాయి. అత్యధిక పాయింట్లు సాధించిన తొలి మూడు జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేస్తారు. పురుషుల విభాగంలో తొలి ఒలింపియాడ్ 1927లో... మహిళల విభాగంలో తొలి ఒలింపియాడ్ 1957లో జరిగింది. ఆనంద్, హరికృష్ణ లేకుండానే... పరిమార్జన్ నేగి, సేతురామన్, శశికిరణ్ కృష్ణన్, ఆధిబన్, లలిత్ బాబు సభ్యులుగా ఉన్న భారత పురుషుల జట్టు 2014లో కాంస్యం సాధించింది. ఈ పోటీల చరిత్రలో భారత అత్యుత్తమ ప్రదర్శన ఇదే. 2012లో హారిక, ఇషా కరవాడే, తానియా, మేరీఆన్ గోమ్స్, సౌమ్య స్వామినాథన్ సభ్యులుగా ఉన్న భారత మహిళల జట్టు అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి ఆనంద్, హరికృష్ణలతోపాటు హంపి కూడా భారత జట్టుకు అందుబాటులో ఉండటం... టోర్నీకి శిక్షణ శిబిరాలు నిర్వహించడం... టోర్నీ సందర్భంగా సన్నాహాల కోసం భారత జట్లకు తొలిసారి సెకండ్స్ (సహాయకులు)ను ఏర్పాటు చేయడంతో రెండు జట్లూ పతకాలతో తిరిగి వస్తాయని భారీ అంచనాలు ఉన్నాయి. పురుషుల విభాగంలో అమెరికా, రష్యా, చైనా, అజర్బైజాన్... మహిళల విభాగంలో చైనా, రష్యా, ఉక్రెయిన్, జార్జియా జట్లతో భారత్‌కు గట్టిపోటీ లభించే అవకాశముంది. -
గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: ఏఐసీఎఫ్ అంతర్జాతీయ మహిళల గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ‘నిథమ్’ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీని తెలంగాణ క్రీడా కార్యదర్శి బుర్రా వెంకటేశం, భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రారంభించారు. ఈనెల 16 వరకు జరుగనున్న ఈ మెగా టోర్నీలో భారత్ నుంచి ఆరుగురు జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరితో పాటు మంగోలియా, వియత్నాం, కజకిస్థాన్, ఉక్రెయిన్లకు చెందిన ఆరుగురు అంతర్జాతీయ క్రీడాకారులు టైటిల్కోసం పోటీ పడుతున్నారు. ఈ టోర్నీ తొలి అంచె పోటీలు ముంబైలో జరుగగా, రెండో అంచె పోటీలకు భాగ్యనగరం ఆతిథ్యమిస్తోంది. టోర్నీ మెత్తం ప్రైజ్‌మనీ రూ. 7,50,000 కాగా విజేతకు రూ. 1,60,000 అందజేస్తారు. రన్నరప్‌కు రూ. 1,30,000, మూడోస్థానంలో నిలిచిన వారికి లక్ష రూపాయలు ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నారు. టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా అర్జున అవార్డు గ్రహీత, తెలుగు తేజం ద్రోణవల్లి హారికను క్రీడా కార్యదర్శి బుర్రా వెంకటేశం, ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి సత్కరించారు. అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. -
హారిక బృందం పసిడి మెరుపులు
హమెదాన్ (ఇరాన్): భారత మహిళల చెస్ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆసియా నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్లో పసిడి మెరుపులు మెరిపించింది. ఒకే రోజు రెండు స్వర్ణాలతోపాటు రజతం, కాంస్య పతకాలు దక్కించుకుంది. శుక్రవారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో హారిక మహిళల బ్లిట్జ్ ఈవెంట్లో టీమ్, వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచింది. దాంతోపాటు స్టాండర్డ్ ఈవెంట్ టీమ్ విభాగంలో కాంస్యం, వ్యక్తిగత విభాగంలో రజతం సొంతం చేసుకుంది. హారికతోపాటు ఇషా కరవాడే, వైశాలి, పద్మిని రౌత్, ఆకాంక్ష భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. తొలుత ఏడు రౌండ్ల స్టాండర్డ్ విభాగంలో భారత్ ఎనిమిది పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత బృందం మూడు విజయాలు సాధించి... మరో రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో రెండింటిలో ఓడిపోయింది. 13 పాయింట్లతో చైనా స్వర్ణం, 11 పాయింట్లతో వియత్నాం రజతం గెల్చుకున్నాయి. స్టాండర్డ్ విభాగంలో బోర్డు–1పై బరిలోకి దిగిన హారిక తాను ఆడిన ఆరు గేముల్లోనూ విజయం సాధించి ఆరు పాయింట్లతో సారాసదత్ (ఇరాన్)తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా సారాసదత్కు స్వర్ణం, హారికకు రజతం ఖాయమయ్యాయి. బోర్డు– 3పై ఇషా కరవాడే, బోర్డు–4పై పద్మిని రౌత్, బోర్డు– 5పై ఆకాంక్ష కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఇక బ్లిట్జ్ విభాగంలో భారత మహిళల జట్టు ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, మరో మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించి అజేయంగా నిలిచింది. నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత 13 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించింది. ఈ విభాగంలోనూ బోర్డు–1పై బరిలోకి దిగిన హారిక ఐదు పాయింట్లతో టాప్ ర్యాంక్ పొంది పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఓపెన్ విభాగంలో రజతం... మరోవైపు ఓపెన్ విభాగంలో ఆధిబన్, సేతురామన్, కృష్ణన్ శశికిరణ్, సూర్యశేఖర గంగూలీ, అభిజిత్ గుప్తాలతో కూడిన భారత పురుషుల జట్టు స్టాండర్డ్ విభాగంలో 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నిర్ణీత ఏడు రౌండ్లకుగాను భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకొని, మరో మ్యాచ్‌లో ఓడి రజత పతకాన్ని దక్కించుకుంది. 13 పాయింట్లతో ఇరాన్ గ్రీన్ స్వర్ణం కైవసం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో సేతురామన్ (బోర్డు–2), కృష్ణన్ శశికిరణ్ (బోర్డు–3) పసిడి పతకాలు సంపాదించగా... ఆధిబన్ (బోర్డు–1) రజతం గెల్చుకున్నాడు. -
స్త్రీలోక సంచారం
::: అక్రమ చొరబాటుదారులను నిరోధించడం కోసం ‘జీరో టాలరెన్స్’ (ఏమాత్రం సహించేది లేదు) వలస విధానాన్ని అమలు చేస్తున్న అమెరికా, సరిహద్దుల్లోని మెక్సికన్ వలస తల్లిదండ్రుల నుంచి వారి పిల్లల్ని వేరు చేసి వేర్వేరు వసతికేంద్రాల్లో ఉంచడాన్ని అమెరికా దేశపు ప్రస్తుత, పూర్వ ప్రథమ మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వైఖరిని తాను ద్వేషిస్తున్నానని డొనాన్డ్ ట్రంప్ భార్య మెలనియా ప్రకటించగా, ఇంత అమానుషమైన చర్యల్ని ప్రపంచయుద్ధకాలంలో కూడా మనం చూడలేదని లారా బుష్ వ్యాఖ్యానించారు ::: బ్రిటన్ రాణివంశపు కొత్త పెళ్లికూతురు మేఘన్ మార్కల్ తండ్రి థామస్ మార్కల్.. ‘ట్రంప్‌కి ఒక అవకాశం ఇవ్వండి’ అని తన అల్లుడు ప్రిన్స్హారీతో చెబుతూ, యు.ఎస్. అధ్యక్షుడి విషయంలో విశాల హృదయంతో ఆలోచించాలని సూచించడం మేఘన్‌ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చుట్టరికాలతో చొరవ చూపి పాలనా వ్యవహారాలపై సలహాలను ఇవ్వడాన్ని బ్రిటన్ రాజప్రాసాదం ఒక చికాకు వ్యవహారంగా పరిగణిస్తున్నట్లు బ్రిటన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ::: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సోమవారం మధ్యాహ్నం.. రైల్లో ప్రయాణిస్తున్న ఒక గర్భిణికి ఆకస్మికంగా పురిటి నొప్పులు రావడంతో రైల్వే అధికారులు 45 నిమిషాల పాటు రైలును ఆపి, రైల్వే వైద్య సిబ్బంది చేత సురక్షితంగా కాన్పు జరిపించారు. రైల్లో జన్మించిన ఆ శిశువుకు 25 ఏళ్ల వయసు వచ్చేవరకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించిన పారిస్ రైల్వేశాఖ.. ఆ తల్లికి శుభాభినందనలు కూడా పంపింది ::: కస్టమర్ కోరికపై ఎయిర్టెల్ డిష్‌టీవీ నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చేందుకు షోయబ్ అనే ఆపరేటింగ్ ఎగ్జిక్యూటివ్‌ను ఇంటికి పంపిస్తున్నట్లు సమాచారం అందుకున్న లక్నో మహిళ పూజాసింగ్.. ట్విట్టర్లో ‘డియర్ షోయబ్, నువ్వు ముస్లిం మతస్తుడివి. నీ పని తీరుపై నాకు నమ్మకం ఉండదు కనుక, వేరెవరైనా హిందూ మతస్తుడిని నీ బదులుకు మా ఇంటికి పంపించే ఏర్పాటు చేయగలవు’ అంటూ పోస్ట్ పెట్టారు. దీనిపై ఎయిర్టెల్ ఆమె కోరిన విధంగానే హిందూ మతస్తుడైన ఆపరేటర్‌ను పంపుతూ, ‘ఎయిర్టెల్ మత విశ్వాసాలకు అతీతమైన సంస్థ. మీరు కూడా మాలాగే ఉండాలని ఆశిస్తున్నాం’ అని ప్రతిస్పందించింది ::: వరల్డ్ నెంబర్12 చెస్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారికకు బిజినెస్‌మేన్ కార్తీక్ చంద్రతో సోమవారం హైదరాబాద్‌లో నిశ్చితార్థం అయింది. గుంటూరు జిల్లా గోరంట్లలో జన్మించి, 2011లో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ గెలుపొంది, 2012, 2015, 2017 ‘ఉమెన్స్ వరల్డ్ చెస్ చాంపియన్’లలో కాంస్య పతకాలు పొంది, 2007లో అర్జున అవార్డు సాధించిన 27 ఏళ్ల హారికకు చెస్‌లో వ్లాదిమర్ క్రామ్నిక్, జూడిత్ పోల్గార్, విశ్వనాథన్ ఆనంద్.. అభిమాన చెస్ ప్లేయర్లు ::: హాలీవుడ్లో సీనియర్ నటీమణులు బయటికి వచ్చి తమపై జరిగిన లైంగిక వేధింపులను, లైంగిక దాడులను, లైంగిక అకృత్యాలను బయటì పెట్టిన విధంగానే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కూడా ధైర్యంగా బయటికొచ్చి, ‘క్యాస్టింగ్ కౌచ్’కు తాము ఏ విధంగా బలయిందీ చెబితే తప్ప మన దగ్గర ఏనాటికీ ‘మీటూ’ ఉద్యమం మొదలు కాదని బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషీ సంచలనాత్మకమైన వ్యాఖ్య చేశారు. ఇలాంటి విషయాలలో ఒక మహిళ చేసిన ధైర్యం ఎందరో మహిళలను ముందుకు నడిపిస్తుందని ఆమె అన్నారు ::: తెలంగాణలోని మొత్తం 21 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లను (డి.సి.పి.యు) నెలకొల్పేందుకు రాష్ట్ర స్త్రీ,శిశు అభివృద్ధి శాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. బాలల హక్కులను పరిరక్షించడంతో పాటు, బాలలపై హింసను నిరోధించడానికి ఈ యూనిట్లు పనిచేస్తాయి ::: పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన ‘శారదా’ చిట్‌ఫండ్ కుంభకోణంలో కీలక నిందితుని తరఫున వాదిస్తున్న నళినీ చిదంబరం ఈ నెల 20న (నేడు) కోల్‌కతాలోని ప్రత్యేక విచారణ కార్యాలయానికి హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపింది. నళిని ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం సతీమణి ::: -
హారిక జట్టుకు ‘యూరోపియన్’ టైటిల్
అంటాల్యా (టర్కీ): భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సభ్యురాలిగా ఉన్న బతూమి చెస్ క్లబ్ నోనా జట్టు ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 12 క్లబ్ జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో హారిక బృందం 17.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది. హారిక జట్టులో నానా జాగ్‌నిద్జె, నినో బతియాష్విలి, బేలా ఖొటెనాష్విలి, మెలియా సలోమి (జార్జియా) మిగతా సభ్యులుగా ఉన్నారు. ఈ టోర్నీలో హారిక తాను ఆడిన ఆరు గేమ్‌లను ‘డ్రా’గా ముగించడం విశేషం. -
162 ఎత్తుల్లో గెలిచిన హారిక... ఫైనల్ ఆశలు సజీవం
టెహరాన్ (ఇరాన్ ): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు సజీవంగా ఉన్నాయి. తాన్ జోంగి (చైనా)తో శుక్రవారం జరిగిన సెమీఫైనల్ రెండో గేమ్‌లో హారిక 162 ఎత్తుల్లో గెలిచింది. దాంతో నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమమయ్యారు. తొలి గేమ్‌లో హారిక ఓడిపోవడంతో రెండో గేమ్‌లో ఆమె కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజేతను నిర్ణయించడానికి శనివారం వీరిద్దరి మధ్య టైబ్రేక్ గేమ్‌లు జరుగుతాయి. -
హారిక పరాజయం
ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ టెహరాన్ (ఇరాన్): ప్రపంచ చెస్ చాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారికకు షాక్! టోర్నీ సెమీ ఫైనల్లో భాగంగా తాన్ జోంగి (చైనా)తో గురువారం జరిగిన తొలి గేమ్‌లో హారికకు పరాజయం ఎదురైంది. 44 ఎతు్తల్లో ఈ గేమ్ ముగిసింది. తెల్లపావులతో ఆడిన తాన్ ప్రా రంభం నుంచి ఆధిక్యం ప్రదర్శించి హారికకు ఎలాం టి అవకాశం ఇవ్వలేదు. పోటీలో నిలవాలంటే శుక్రవారం జరిగే రెండో గేమ్‌లో హారిక తప్పనిసరిగా వి జయం సాధించాల్సి ఉంటుంది. గేమ్ ‘డ్రా’గా ము గిసినా ఆమె నిష్క్రమిస్తుంది. అయితే సెమీస్ చేరడంతో కాంస్యం మాత్రం దకు్కతుంది. ఉమెన్ గ్రాం డ్ మాస్టర్ అయిన తాన్ జోంగితో గతంలో 4–4తో సమవైున రికార్డు ఉన్న హారిక, ప్రపంచ చాంపియన్ షిప్ కీలక పోరులో మాత్రం తడబడింది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో హారిక, పద్మిని
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్ టెహరాన్ : ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్ మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. గురువారం జరిగిన రెండో రౌండ్ టైబ్రేక్ పోరులో వీరిద్దరు తమ ప్రత్యరు్థలను 1.5–0.5 పాయింట్ల (ఓవరాల్‌గా 2.5–1.5) తేడాతో ఓడించారు. దినారా సదుకసోవా (కజకిస్తాన్ )తో జరిగిన తొలి టైబ్రేక్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడి హారిక 57 ఎతు్తల్లో విజయం సాధించింది. వీరిద్దరి మధ్య జరిగిన రెండో గేమ్ 49 ఎతు్తల్లో డ్రాగా ముగియడంతో హారికను విజయం వరించింది. జావో జుయ్ (చైనా)తో జరిగిన టైబ్రేక్‌లో కూడా పద్మిని తొలి గేమ్‌ను 65 ఎతు్తల్లో గెలుచుకుంది. నల్ల పావులతో ఆడినా పద్మిని దూకుడు ప్రదర్శించింది. రెండో గేమ్ 76 ఎతు్తల్లో డ్రాగా ముగిసింది. ఫలితంగా ఆమె కూడా ముందంజ వేసింది. -
హారిక తొలి గేమ్ ‘డ్రా’
ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి రౌండ్లో తొలి గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. ఇరాన్‌లోని టెహరాన్‌లో శనివారం ఈ మెగా ఈవెంట్ ప్రారంభమైంది. బంగ్లాదేశ్ క్రీడాకారిణి షమీమా అక్తర్ లీజాతో జరిగిన తొలి రౌండ్ తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 85 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు ఎలీనా (అర్మేనియా)తో జరిగిన తొలి గేమ్‌ను భారత్‌కే చెందిన పద్మిని రౌత్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. -
హారికకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హారికతోపాటు మరో ముగ్గురు నినో బత్సియాష్విలి (జార్జియా), అనా ఉషెనినా (ఉక్రెయిన్), తానియా సచ్దేవ్ (భారత్) 5.5 పాయి0ట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... హారికకు టాప్ ర్యాంక్ లభించింది. నినో బత్సియాష్విలి రెండో స్థానంలో, అనా ఉషెనినా మూడో స్థానంలో, తానియా నాలుగో స్థానంలో నిలిచారు. ఇంగ్లండ్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను హారిక కేవలం 15 ఎత్తుల్లో అర్మేనియా గ్రాండ్‌మాస్టర్ సెర్గీ మూవ్సెసియాన్తో ‘డ్రా’గా ముగించింది. ఈ టోర్నీలో హారిక నాలుగు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, రెండింటిలో ఓడిపోయి0ది. ఏడో రౌండ్లో హారిక మహిళల ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ హు ఇఫాన్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించింది. మొత్తం 133 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ నుంచి 26 మంది బరిలోకి దిగారు. తెలుగు క్రీడాకారులు ఎం.ఆర్. లలిత్ బాబు 5.5 పాయి0ట్లతో 28వ స్థానంలో, హర్ష భరతకోటి 4 పాయి0ట్లతో 79వ స్థానంలో, కోటిపల్లి సాయి నిరుపమ 3.5 పాయి0ట్లతో 110వ స్థానంలో నిలిచారు. -
హారిక సంచలనం
సాక్షి, హైదరాబాద్: ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సంచలనం సృష్టించింది. మహిళల ప్రపంచ నంబర్‌వన్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హు ఇఫాన్ (చైనా)పై హారిక తన కెరీర్లో తొలిసారి విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 45 ఎత్తుల్లో హు ఇఫాన్‌ను ఓడించింది. ఈ గేమ్‌కు ముందు హు ఇఫాన్‌తో హారిక 19 సార్లు తలపడగా... నాలుగు గేముల్లో ఓడిపోయి, 15 గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. ఈ టోర్నీలో ఏడో రౌండ్ తర్వాత హారిక ఖాతాలో ఐదు పాయి0ట్లు ఉన్నాయి. -
హారిక గెలుపు
జియాజింగ్ (చైనా): చైనీస్ ఎ డివిజన్ చెస్ లీగ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో షాన్డంగ్ జట్టుకు చెందిన హారిక... తైన్ జింగ్ జట్టుకు చెందిన ని షికన్పై గెలుపొందింది. తొలి రౌండ్లో క్వి జువో (జింగ్సు జట్టు)తో జరిగిన గేమ్‌ను హారిక డ్రా చేసుకుంది. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ (షాంఘై జట్టు)... జెన్ చాంగ్ షెంగ్(గ్వాంగ్ డంగ్ జట్టు)పై విజయం సాధించాడు. మొత్తం 12 జట్లు తలపడే ఈ లీగ్‌లో చైనా అగ్రశ్రేణి క్రీడాకారులతో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు పాల్గొంటారు. -
ప్రపంచాన్ని గెలవాలి...
♦ వరుసగా రెండు టైటిల్స్ గెలవడం సంతోషం ♦ ఒలింపియాడ్‌లో భారత్ పతకం సాధిస్తుంది ♦ మరింత మంది మహిళా జీఎంలు రావాలి ♦ ‘సాక్షి’తో చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక ♦ జీవిత లక్ష్యం వరల్డ్ చాంపియన్‌షిప్ ♦ తాజా టైటిల్స్ ప్రత్యేకం ♦ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళల చెస్‌లో నిలకడగా రాణిస్తున్న క్రీడాకారిణుల్లో ద్రోణవల్లి హారిక ఒకరు. దశాబ్ద కాలంగా పలు అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ... నిరంతరం తన ఆటకు పదునుపెడుతూ ఈ తెలుగమ్మాయి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఇటీవల రెండు వారాల వ్యవధిలో రెండు అంతర్జాతీయ ఓపెన్ టోర్నమెంట్లలో మహిళల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. సీనియర్ స్థాయిలో దాదాపు అన్ని మెగా ఈవెంట్స్‌లో పతకాలు నెగ్గిన 25 ఏళ్ల హారికకు ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతకం మాత్రం ఇంకా ఊరిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ఈ మెగా ఈవెంట్లో కాంస్య పతకాలు సాధించిన హారిక విశ్వవిజేత కావడమే తన ఏకైక లక్ష్యం అని చెబుతోంది. కజకిస్తాన్‌లో జరిగిన యురాసియన్ బ్లిట్జ్ కప్‌లో విజేతగా నిలిచిన అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన హారిక పలు అంశాలపై ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... ఊహించలేదు: రెండు వారాల వ్యవధిలో రెండు అంతర్జాతీయ ఓపెన్ టోర్నమెంట్లలో మహిళల విభాగంలో విజేతగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. మేటి గ్రాండ్‌మాస్టర్లు పాల్గొన్న ఈ టోర్నీల్లో అనుభవజ్ఞులైన వారితో తలపడ్డాను. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఆడుతూ ముందుకెళ్లాను. చివరికి ఈ రెండు టోర్నీల్లో మహిళల కేటగిరిలో అగ్రస్థానాన్ని సంపాదించడం చాలా సంతోషాన్నిచ్చింది. యురాసియన్ బ్లిట్జ్ కప్‌లో ఇజ్రాయెల్ గ్రాండ్‌మాస్టర్ బోరిస్ గెల్ఫాండ్‌తో ఆడిన గేమ్‌లు ప్రత్యేకం. ఆయన గురించి ఎంతో విన్నాను. ఇప్పుడు ముఖాముఖిగా తలపడ్డాను. చైనా, రష్యా క్రీడాకారిణులు రెగ్యులర్‌గా బ్లిట్జ్ టోర్నీల్లో పాల్గొంటారు. వారితో పోలిస్తే ఈ తరహా టోర్నీల్లో అంతగా అనుభవం లేకున్నా ఆడి టాప్ ర్యాంక్ సాధించినందుకు ఈ రెండు విజయాలు నాకెంతో సంతృప్తినిచ్చాయి. చెస్ ఒలింపియాడ్‌లో రాణిస్తాం: వచ్చే నెల ఆరంభంలో చైనాలో జరిగే మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ టోర్నీలో బరిలోకి దిగుతున్నాను. ఆ తర్వాత సెప్టెంబరులో అజర్బైజాన్లో జరిగే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ టీమ్ ఈవెంట్లో పాల్గొంటాను. నాలుగేళ్ల క్రితం ఒలింపియాడ్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి కోనేరు హంపి ఒలింపియాడ్‌లో ఆడటంలేదని సమాచారం ఉంది. ఒక వేళ ఆమె ఆడితే జట్టు అవకాశాలు మెరుగు పడతాయి. మేటి జట్లు పాల్గొనే ఈ పెద్ద ఈవెంట్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. చెస్‌పై నమ్మకం పెరగాలి: మేథో క్రీడ అయిన చెస్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చు. అయితే చెస్ కూడా ఖరీదైన క్రీడగా మారింది. ఒకస్థాయికి చేరుకున్నాకే ఈ ఆటతో భరోసా వస్తుంది. చాలా మంది చిన్న వయసులో మంచి ఫలితాలు సాధిస్తున్నా మధ్యలోనే వదిలేస్తున్నారు. పెద్ద స్థాయిలో విజయాలు దక్కాలంటే నిరంతరం కష్టపడాల్సి ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళా క్రీడాకారిణులు ఏమాత్రం తీసిపోరు. మహిళల విభాగంలో ఇప్పటికైతే నేను, హంపి మాత్రమే గ్రాండ్మాస్టర్స్గా ఉన్నాం. పట్టుదలతో ప్రయత్నిస్తే మరింత మహిళా క్రీడాకారిణులు గ్రాండ్‌మాస్టర్ హోదా సంపాదిస్తారనే నమ్మకం ఉంది. ఒలింపిక్స్‌లో చెస్‌ను చూడాలి: విశ్వవ్యాప్తంగా ఆదరణ ఉన్న చెస్ క్రీడాంశం ఒలింపిక్స్‌లో ఎందుకు లేదో ఇప్పటికీ అర్థం కాదు. ఈ ఆట ఎక్కువ సమయం తీసుకుంటుందనేది ఒక కారణం కావొచ్చు. అయితే ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాలను ఒలింపిక్స్‌లో చేర్చే వీలుంది. ఆసియా క్రీడల్లో రెండుసార్లు చెస్‌ను ఆడించారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్‌లో చెస్‌ను ఒలింపిక్స్‌లో చూడాలని అనుకుంటున్నాను. జీవిత లక్ష్యం ప్రపంచ చాంపియన్: గత రెండు పర్యాయాల్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించాను. వచ్చే ఏడాది జరిగే చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి విశ్వవిజేత కావాలనే లక్ష్యం ఉంది. జూనియర్ స్థాయిలో ప్రపంచ చాంపియన్ అయ్యాను. ఆసియా, కామన్వెల్త్ పోటీల్లోనూ స్వర్ణాలు సాధించాను. భారత్ నుంచి మహిళల విభాగంలో తొలి ప్రపంచ చాంపియన్ నేనే కావాలన్నది నా జీవిత లక్ష్యం. నా లక్ష్యం నెరవేరే వరకు నిరంతరం శ్రమిస్తాను. వ్యక్తిగతం... ఇటీవలే ఇండియన్ ఆయిల్లో ఆఫీసర్ ‘ఎ’ గ్రేడ్ ఉద్యోగం వచ్చింది. ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వివాహం అయ్యాక కూడా చెస్‌లో కొనసాగుతాను. నన్ను ఆటలో ప్రోత్సహించే వ్యక్తి కావాలనేదే షరతు. ప్రతీ టోర్నీ మధ్యలో దొరికిన విరామాన్ని మేమంతా బాగా ఎంజాయ్ చేస్తాం. అయితే విదేశాల్లో జరిగే టోర్నీల సందర్భంగా భారతీయ వంటకాలు లభించడం కష్టమవుతోంది. కొన్నేళ్లుగా టోర్నీలకు వెళ్లినపుడు సొంతంగా నేనే వంట చేసుకుంటున్నాను. -
హారికకు 3 పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఆసియా నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడు పతకాలను సాధించింది. అబుదాబిలో ఇటీవల ముగిసిన ఈ టోర్నమెంట్లో మహిళల స్టాండర్డ్ వ్యక్తిగత విభాగంలో బోర్డు-1పై ఆడిన హారిక రజత పతకాన్ని దక్కించుకుంది. ర్యాపిడ్ విభాగంలో బోర్డు-2పై ఆడిన హారిక స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ర్యాపిడ్ టీమ్ విభాగంలో హారిక సభ్యురాలిగా ఉన్న భారత జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. -
ఆరో స్థానంలో హరికృష్ణ
హుఅయాన్ (చైనా): ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐఎంఎస్‌ఏ) ఎలైట్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ బాస్క్యూ (ఏకకాలంలో రెండు గేమ్‌లు ఆడటం) ఈవెంట్లో ఆరు గేమ్‌లు ముగిశాక 3.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. హరికృష్ణ రెండు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. మహిళల బాస్క్యూ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. గురువారం మరో నాలుగు గేమ్‌లు జరుగుతాయి. -
హంపి, హారిక గేమ్‌లు ‘డ్రా’
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ పదో రౌండ్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. నినో బత్సియాష్విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 68 ఎత్తుల్లో... పియా క్రామ్లింగ్ (స్వీడన్)తో జరిగిన గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హారిక 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. -
హారికకు తొలి గెలుపు
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన ఐదో రౌండ్లో హారిక 28 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అంటొనెటా స్టెఫనోవా (బల్గేరియా)ను ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకుంది. పియా క్రామ్లింగ్ (స్వీడన్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను హంపి 54 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఐదో రౌండ్ తర్వాత హంపి మూడు పాయింట్లతో మూడో స్థానంలో, హారిక 2.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. -
మరింత ఎత్తుకు......
అంతర్జాతీయ క్రీడాయవనికపై ఈ ఏడాది భారత క్రీడాకారులు తమ ఉనికిని ఘనంగా చాటుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని మెరుపులు మెరిపిస్తామని... విదేశీ క్రీడాకారుల విజయాలకు దీటుగా మరింత గొప్పగా రాణిస్తామని ఈ ఏడాది భరోసా కల్పించారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులు ఆకాశమే హద్దుగా తమ అద్వితీయ ప్రదర్శనతో అదుర్స్ అనిపించారు. టెన్నిస్‌లో సానియా మీర్జా, ఆర్చరీలో దీపిక కుమారి, హాకీలో మహిళల జట్టు, చెస్‌లో ద్రోణవల్లి హారిక... ఇలా ఒకరిని మించి మరొకరు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి భారత క్రీడారంగాన్ని మరింత ముందుకు, మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. - సాక్షి క్రీడావిభాగం ఇద్దరూ... ఇద్దరే ఈ ఏడాది టెన్నిస్‌లో భారత ‘రాకెట్’ దూసుకుపోయింది. మహిళల విభాగంలో సానియా మీర్జా శిఖరాగ్రానికి చేరుకోగా... పురుషుల విభాగంలో లియాండర్ పేస్ వయసు పెరిగినా వన్నె తగ్గని విజయాలతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 29 ఏళ్ల సానియా మీర్జాకు ఈ ఏడాది చిరస్మరణీయంగా గడిచింది. మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోవడంతోపాటు నమ్మశక్యంకానిరీతిలో 10 టైటిల్స్‌ను సొంతం చేసుకొని ఔరా అనిపించింది. బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో జతకలిసి సిడ్నీ ఓపెన్‌లో టైటిల్ నెగ్గిన సానియా... మార్చిలో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో జోడీ కట్టడం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. హింగిస్‌తో జతగా సానియా చెలరేగిపోయింది. ఇండియన్ వెల్స్, మియామి, చార్ల్స్టన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్జూ, వుహాన్, బీజింగ్ టోర్నీల్లో సానియా-హింగిస్ జంట టైటిల్స్ గెల్చుకోవడంతోపాటు సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లోనూ చాంపియన్‌గా నిలిచింది. ఈ సంవత్సరంలో సానియా మొత్తం 65 మ్యాచ్‌ల్లో గెలిచి, 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మొత్తం 15 లక్షల 66 వేల 203 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 కోట్ల 35 లక్షల 34 వేలు) సంపాదించింది. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో సానియా ప్రాతినిధ్యం వహించిన ఇండియన్ ఏసెస్ జట్టు రన్నరప్‌గా నిలువగా... చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో హింగిస్ సభ్యురాలిగా ఉన్న హైదరాబాద్ ఏసెస్ కూడా రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో 42 ఏళ్ల లియాండర్ పేస్ తన జోరును కొనసాగించాడు. మార్టినా హింగిస్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) సాధించాడు. ఈ క్రమంలో ఓపెన్ శకంలో అత్యధికంగా తొమ్మిది మిక్స్డ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. సీజన్ ఆరంభంలో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో కలిసి ఆక్లాండ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గడంద్వారా పేస్ 1997 నుంచి ఇప్పటిదాకా ప్రతి ఏడాదీ కనీసం ఒక్క టైటిల్ అయినా గెలిచిన అరుదైన రికార్డు నమోదు చేశాడు. మరో స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాదిని భారత డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్‌గా ముగించాడు. 36 ఏళ్ల బోపన్న ఈ సంవత్సరం నాలుగు డబుల్స్ టైటిల్స్ నెగ్గాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ తన కెరీర్లో తొలిసారి టాప్-100లో చోటు సంపాదించాడు. డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 1-3తో చెక్ రిపబ్లిక్ చేతిలో ఓడిపోయింది. హాకీ... చలాకీ... ఒకవైపు వివాదాలు కొనసాగినా... మరోవైపు భారత పురుషుల, మహిళల హాకీ జట్లు విజయాలు సాధిస్తూ ఈ ఏడాదిని చిరస్మరణీయంగా మార్చాయి. బెల్జియంలోని యాంట్‌వర్ప్‌లో జరిగిన వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో ఐదో స్థానం సాధించడంద్వారా భారత మహిళల జట్టు 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పురుషుల జట్టు అజ్లాన్ షా టోర్నీలో కాంస్య పతకం సాధించి సీజన్లో శుభారంభం చేసింది. చివర్లో న్యూఢిల్లీలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్లో కాంస్యం సాధించి అంతర్జాతీయ హాకీ సమాఖ్య టోర్నీలో 33 ఏళ్లుగా ఉన్న పతకం లోటును తీర్చుకుంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో కొత్తగా వచ్చిన రాంచీ రేస్ జట్టు విజేతగా నిలిచింది. 64 గళ్లలో పతకాల గలగల తమ మేథస్సుకు మరింత పదును పెడుతూ ఈ ఏడాదీ భారత చెస్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. గతేడాది మూడు టోర్నీల్లో టైటిల్ నెగ్గిన భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈసారి జ్యూరిచ్ చాలెంజ్ టోర్నీలో మాత్రమే విజేతగా నిలిచాడు. షామ్‌కిర్ టోర్నీలో, నార్వే టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. లండన్ క్లాసిక్ టోర్నీలో మాత్రం తొమ్మిదో స్థానంతో నిరాశ పరిచాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికకు ఈ ఏడాది మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఏప్రిల్‌లో రష్యాలో జరిగిన ప్రపంచ మహిళల వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లో నిష్ర్కమించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఏప్రిల్‌లోనే చైనాలో జరిగిన ప్రపంచ మహిళల టీమ్ చాంపియన్‌షిప్‌లో రెండో బోర్డుపై ఆడుతూ హారిక రజతం దక్కించుకుంది. ఇక నవంబరులో రోమ్‌లో జరిగిన తొలి ప్రపంచ ఆన్లైన్ బ్లిట్జ్ టోర్నమెంట్లో హారిక అగ్రస్థానాన్ని సాధించి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ రెండో ర్యాంకర్ కోనేరు హంపి చైనాలో జరిగిన ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో మొదటి బోర్డుపై మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత మొనాకోలో జరిగిన గ్రాండ్‌ప్రిలోనూ కాంస్యం సొంతం చేసుకుంది. భారత రెండో ర్యాంకర్ పెంటేల హరికృష్ణ పోకెర్స్టార్ ఐల్ ఆఫ్ మ్యాన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఇక గ్రీస్‌లో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఐదు స్వర్ణాలు, మూడేసి రజత, కాంస్య పతకాలు లభించాయి. ‘పట్టు’ పట్టారు ఏడేళ్ల క్రితం బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ కాంస్య పతకం నెగ్గినప్పటి నుంచి భారత రెజ్లర్ల విజయాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ ఏడాదీ భారత రెజ్లర్లు తమ ‘పట్టు’తో పలు పతకాలు కొల్లగొట్టారు. గాయం కారణంగా స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ వైదొలగడంతో... అతని స్థానంలో బరిలోకి దిగిన మహారాష్ట్ర రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో 74 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రపంచ క్యాడెట్ చాంపియన్‌షిప్‌లలో భారత రెజ్లర్లు అనిల్ కుమార్ (50 కేజీలు), అంకుష్ (38 కేజీలు) స్వర్ణ, రజత పతకాలు... ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రవి కుమార్ (55 కేజీలు) రజతం సాధించారు. కజకిస్తాన్‌లో జరిగిన ప్రెసిడెంట్ కప్ టోర్నీలో మహిళా రెజ్లర్లు అనిత, నవ్‌జ్యోత్ కౌర్, లలిత, సాక్షి మలిక్, నిక్కీ, నిర్మలా దేవి, వినేశ్ ఫోగట్ రజత పతకాలు నెగ్గారు. మిగతా లీగ్‌లతో స్ఫూర్తి పొంది రెజ్లింగ్‌లోనూ ఈ ఏడాది తొలిసారిగా ప్రొ రెజ్లింగ్ లీగ్ ప్రారంభమైంది. ‘పంచ్’ పవర్ ఈసారి మన పంచ్ ‘పవర్’ పెరిగింది. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో శివ థాపా (56 కేజీలు) కాంస్యం నెగ్గి ఈ మెగా ఈవెంట్ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో విజేందర్, వికాస్ కృషన్ మాత్రమే ఈ ఘనత సాధించారు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రొఫెషనల్‌గా మారాడు. ఈ హరియాణా బాక్సర్ వరుసగా మూడు బౌట్లలో తన ప్రత్యర్థులను నాకౌట్ చేసి ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. గతేడాది ఆసియా క్రీడల్లో పతకం స్వీకరించేందుకు నిరాకరించి ఏడాదిపాటు సస్పెన్షన్‌కు గురైన మహిళా బాక్సర్ సరితా దేవి ఈ ఏడాది మళ్లీ రింగ్‌లోకి దిగింది. రియో ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్ టోర్నీలో స్టార్ మహిళా బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు)... ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ (48 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. అయితే ‘బాక్సింగ్ ఇండియా’లో అంతర్గత వివాదాల కారణంగా అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం ‘బాక్సింగ్ ఇండియా’పై మళ్లీ సస్పెన్షన్ విధించింది. దాంతో భారత బాక్సర్లు అంతర్జాతీయ టోర్నీలో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం పతాకంపై పోటీపడ్డారు. బాణం... అదుర్స్ ఈ ఏడాది మన ఆర్చర్ల గురి అదిరింది. ముఖ్యంగా మహిళా ఆర్చర్లు నిలకడగా రాణించారు. దీపిక కుమారి, రిమిల్ బురులీ, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల జట్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గి వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వ్యక్తిగతంగా దీపిక సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్‌కప్ ఫైనల్స్ (మెక్సికో)లో రజతం, టర్కీలో జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో కాంస్యం సాధించింది. పురుషుల విభాగంలో మంగళ్ సింగ్ చాంపియా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. పోలండ్‌లో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో మంగళ్ సింగ్ రజతం సాధించాడు. పురుషుల కాంపౌండ్ సింగిల్స్ విభాగంలో రజత్ చౌహాన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆర్చర్‌గా గుర్తింపు పొందాడు. ఒకే ఒక్కడు... కల నిజమైనట్లుగా... విఖ్యాత ఎన్బీఏ బాస్కెట్‌బాల్ లీగ్‌లో భారత ప్లేయర్ విన్యాసాలు కనిపించాయి. ఈ ఏడాది జరిగిన ఎన్బీఏ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో పంజాబ్‌కు చెందిన సత్నామ్ సింగ్‌ను డల్లాస్ మావెరిక్స్ జట్టు కొనుగోలు చేసింది. భారత ప్లేయర్‌ను ఎన్బీఏ జట్టు కొనుగోలు చేయడం ఇదే ప్రథమం. -
పోరాడి ఓడిన హారిక
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ సోచి (రష్యా): ఒత్తిడిలో తడబడిన భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లో ఓటమి పాలైంది. అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా ఉన్న మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి హారిక 2.5-3.5 పాయింట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. క్లాసికల్ పద్ధతిలో జరిగిన నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1-1తో సమఉజ్జీగా నిలువడంతో విజేతను నిర్ణయించడానికి మంగళవారం ర్యాపిడ్ పద్ధతిలో టైబ్రేక్ గేమ్‌లను నిర్వహించారు. తొలుత 25 నిమిషాల నిడివి కలిగిన రెండు గేమ్‌లు జరిగాయి. ఇందులో తొలి గేమ్‌లో హారిక 38 ఎత్తుల్లో ఓడిపోయింది. అయితే వెంటనే తేరుకొని రెండో గేమ్‌లో హారిక 80 ఎత్తుల్లో గెలుపొందడంతో స్కోరు 1-1తో సమమైంది. దాంతో ఈసారి 10 నిమిషాల నిడివి కలిగిన రెండు గేమ్‌లను నిర్వహించారు. ఇందులో తెల్లపావులతో తొలి గేమ్‌ను ఆడిన హారిక 96 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఒకానొక దశలో హారికకు ఈ గేమ్‌లో స్పష్టమైన విజయావకాశాలు కనిపించాయి. కానీ మరియా ముజిచుక్ చక్కటి వ్యూహాలతో ‘డ్రా’ చేసుకోగలిగింది. ఇక రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన మరియా 56 ఎత్తుల్లో హారికపై నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. 2012 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ హారిక సెమీఫైనల్ దశలోనే నిష్ర్కమించింది. గురువారం మొదలయ్యే నాలుగు గేమ్‌ల ఫైనల్లో నటాలియా పోగోనినా (రష్యా)తో మరియా ముజిచుక్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో పోగోనినా టైబ్రేక్‌లో 1.5-0.5తో పియా క్రామ్లింగ్ (స్వీడన్)పై గెలిచింది. మరియా, పోగోనినా మధ్య ఫైనల్లో గెలిచిన వారు ఈ ఏడాది చివర్లో హూ ఇఫాన్ (చైనా)తో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో తలపడతారు. -
హారిక సెమీస్ గేమ్ ‘డ్రా’
నేడు టైబ్రేక్ సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ పోరుకు చేరేదెవరో మంగళవారం తేలనుంది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత టైబ్రేక్‌కు దారితీసింది. ఆదివారం వీరిద్దరి మధ్య జరిగిన తొలి గేమ్ ‘డ్రా’గా ముగియగా... సోమవారం జరిగిన రెండో గేమ్ కూడా ‘డ్రా’ అయింది. దాంతో ఇద్దరూ 1-1తో సమఉజ్జీగా నిలిచారు. రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 78 ఎత్తుల తర్వాత ‘డ్రా’కు అంగీకరించింది. పియా క్రామ్లింగ్ (స్వీడన్), నటాలియా పోగోనినా (రష్యా)ల మధ్య రెండో సెమీఫైనల్లో నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1-1తో సమంగా ఉన్నారు. తొలి గేమ్‌లో క్రామ్లింగ్ 79 ఎత్తుల్లో గెలుపొందగా... రెండో గేమ్‌లో పోగోనినా 38 ఎత్తుల్లో విజయం సాధించింది. దాంతో రెండు సెమీఫైనల్స్ విజేతలను నిర్ణయించడానికి మంగళవారం టైబ్రేక్ గేమ్‌లను నిర్వహిస్తారు. -
హారిక గేమ్ డ్రా
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్ రౌండ్ తొలి గేమ్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘డ్రా’ చేసుకుంది. అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా ఉన్న మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో ఆదివారం జరిగిన తొలి గేమ్‌ను నల్లపావులతో ఆడిన హారిక 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. సోమవారం వీరిద్దరి మధ్యే రెండో గేమ్ జరుగుతుంది. ఈ గేమ్‌లో హారిక తెల్లపావులతో ఆడనుండటం ఆమెకు అనుకూలాంశం. ఈ గేమ్‌లో నెగ్గినవారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ ఈ గేమ్ కూడా ‘డ్రా’ అయితే విజేతను నిర్ణయించడానికి మంగళవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. -
సెమీస్‌లో హారిక హంపి ఆశలు సజీవం
సోచి (రష్యా): అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మేరీ అరాబిద్జె (జార్జియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హారిక 1.5-0.5 తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న హారిక... శుక్రవారం జరిగిన రెండో గేమ్‌లో 95 ఎత్తుల్లో గెలిచింది. 2012 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ హారిక సెమీఫైనల్‌కు చేరుకున్నా ఆ అడ్డంకిని దాటలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి సెమీఫైనల్ ఆశలు సజీవంగా నిలబెట్టుకుంది. మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో తప్పనిసరిగా నెగ్గాల్సిన రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన టాప్ సీడ్ హంపి 62 ఎత్తుల్లో గెలిచింది. దాంతో ఈ ఇద్దరు 1-1తో సమంగా ఉన్నారు. వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు శనివారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. ఈ పోటీలో నెగ్గిన వారు సెమీఫైనల్లో హారికతో తలపడతారు. -
క్వార్టర్స్‌లో హారిక
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హారిక ‘టైబ్రేక్’లో 1.5.-0.5తో విజయం సాధించింది. నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత వీరిద్దరూ 1-1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించడానికి బుధవారం టైబ్రేక్‌ను నిర్వహించారు. టైబ్రేక్ తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 55 ఎత్తుల్లో కొస్టెనిక్‌ను ఓడించగా... నల్లపావులతో ఆడిన రెండో గేమ్‌ను 91 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో కోనేరు హంపి; మేరీ అరాబిద్జె (జార్జియా)తో హారిక తలపడతారు. -
హంపి, హారిక గెలుపు
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ జోరు కొనసాగిస్తున్నారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో వీరిద్దరూ గెలిచారు. అలీసా గలియమోవా (రష్యా)తో జరిగిన గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హంపి 38 ఎత్తుల్లో గెలుపొందగా... ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 55 ఎత్తుల్లో అద్భుత విజయం సాధించింది. మంగళవారం జరిగే రెండో గేమ్‌లో హంపి, హారిక ‘డ్రా’ చేసుకుంటే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. -
ప్రిక్వార్టర్స్‌కు హారిక
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ సోచి (రష్యా): నిర్ణాయక టైబ్రేక్‌లలో తన సత్తా చాటుకున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఇరీనా క్రుష్‌తో జరిగిన రెండో రౌండ్లో హారిక టైబ్రేక్‌లో 1.5-0.5తో విజయం సాధించి ముందంజ వేసింది. శనివారం నిర్ణీత రెండు గేమ్‌లు ముగిసిన తర్వాత వీరిద్దరు 1-1తో సమఉజ్జీగా నిలిచారు. దాంతో ఫలితం తేలడానికి ఆదివారం రెండు టైబ్రేక్ గేమ్‌లను నిర్వహించారు. తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 70 ఎత్తుల్లో గెలుపొంది... తెల్ల పావులతో ఆడిన రెండో గేమ్‌ను 58 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో హారిక ఆడుతుంది. మరోవైపు ఈ టోర్నీలో ఆడిన నాలుగు గేముల్లోనూ నెగ్గిన కోనేరు హంపి ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో అలీసా గలియమోవా (రష్యా)తో తలపడుతుంది. -
హారికకు తొలి విజయం
దోహా: ఖతార్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి విజయాన్ని సాధించింది. గూ జియోబింగ్ (చైనా)తో శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో తెల్లపావులతో ఆడిన హారిక 40 ఎత్తుల్లో గెలిచింది. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 81 ఎత్తుల్లో మిఖైలో ఒలెక్సియెంకో (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయాడు. -
హరికృష్ణ శుభారంభం
తొలి గేమ్‌లో హారికపై గెలుపు దోహా: ఖతార్ మాస్టర్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ శుభారంభం చేశాడు. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో జరిగిన తొలి రౌండ్లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 80 ఎత్తుల్లో గెలిచాడు. హారికపై హరికృష్ణకిది రెండో విజయం కావడం విశేషం. వీరిద్దరూ తొలిసారి 2012 టాటా స్టీల్ టోర్నీలో తలపడగా హరికృష్ణ 33 ఎత్తుల్లో నెగ్గాడు. మొత్తం 40 దేశాల నుంచి 154 మంది పాల్గొంటున్న ఖతార్ మాస్టర్స్ టోర్నీలో 92 మంది గ్రాండ్‌మాస్టర్లు ఉండటం విశేషం. తొమ్మిది రౌండ్లపాటు జరిగే ఈ టోర్నీలో విజేతకు 25 వేల డాలర్లు ప్రైజ్‌మనీ ఇస్తారు. -
హారికకు మూడో స్థానం
షార్జా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో స్థానాన్ని సంపాదించింది. శనివారం ముగిసిన ఈ 11 రౌండ్ల టోర్నమెంట్లో హారిక మొత్తం ఆరున్నర పాయింట్లు సాధించింది. చివరి రౌండ్లో హారిక 83 ఎత్తుల్లో బచిమెగ్ తువ్షిన్తగ్స్ (మంగోలియా)పై గెలిచింది. హారికతోపాటు బచిమెగ్, అనా ఉషెనినా (ఉక్రెయిన్), జుయ్ జావో (చైనా) ఆరున్నర పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... హారికకు మూడో స్థానం, జుయ్ జావోకు నాలుగో స్థానం, ఉషెనినాకు ఐదో స్థానం, బచిమెగ్కు ఆరో స్థానం దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఐదున్నర పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. చివరి రౌండ్లో హంపి 38 ఎత్తుల్లో ఎలీనా డానిలియన్ (ఆర్మేనియా)పై గెలిచింది. 8.5 పాయింట్లతో జూ వెన్జున్, హూ ఇఫాన్ (చైనా) సమవుజ్జీలుగా నిలువగా మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా జూ వెన్‌జున్‌కు టైటిల్ లభించింది. హూ ఇఫాన్ రన్నరప్‌గా నిలిచింది. -
హారిక విజయం... హంపి గేమ్ డ్రా
షార్జా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో విజయం నమోదు చేయగా... కోనేరు హంపి ఖాతాలో ఐదో ‘డ్రా’ చేరింది. శనివారం జరిగిన పదో రౌండ్లో నల్లపావులతో ఆడిన హారిక 89 ఎత్తుల్లో ఎలీనా డానిలియన్ (ఆర్మేనియా)పై గెలిచింది. వెన్జున్ జూ (చైనా)తో జరిగిన గేమ్‌ను హంపి 45 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం హారిక ఖాతాలో 5.5 పాయింట్లు; హంపి ఖాతాలో 4.5 పాయింట్లు ఉన్నాయి. శనివారం జరిగే చివరిదైన 11వ రౌండ్లో బాచిమెగ్ (మంగోలియా)తో హారిక; ఎలీనా డానిలియన్తో హంపి తలపడతారు. -
హారికకు పదో స్థానం
ఖాంటీమన్సిస్క్ (రష్యా): ప్రపంచ బ్లిట్జ్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పదో స్థానంలో నిలిచింది. 34 మంది క్రీడాకారిణులు బరిలోకి దిగిన ఈ పోటీల్లో నిర్ణీత 30 రౌండ్లు ముగిశాక హారిక 16.5 పాయింట్లు సాధించింది. చివరిరోజు సోమవారం హారిక ఒక్క గేమ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. 23 పాయింట్లు సాధించిన అనా ముజిచుక్ (స్లొవేనియా) విజేతగా నిలిచింది. నానా జాగ్నిజ్దె (జార్జియా-20.5 పాయింట్లు) రజతం... తాతియానా కొసిన్‌త్సెవా (రష్యా-20 పాయింట్లు) కాంస్యం గెలిచారు.