![Indian Chess Stars Donation 4 Lakhs 50 Thousand - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/13/Chess.jpg.webp?itok=VmPQlg58)
చెన్నై: కరోనాపై పోరాటానికి మద్దతుగా భారత అగ్రశ్రేణి చెస్ క్రీడాకారులు తమవంతుగా చేయూతనిచ్చారు. ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తోపాటు గ్రాండ్‌మాస్టర్లు విదిత్ సంతోష్ గుజరాతి, ఆదిబన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక అభిమానులతో ఆన్‌లైన్‌లో 20 బోర్డులపై చెస్ గేమ్‌లు ఆడారు. చెస్.కామ్–ఇండియా వెబ్‌సైట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత చెస్ స్టార్స్‌తో ఆడిన వారు స్వచ్ఛందంగా కొంత మొత్తం విరాళంగా ఇచ్చారు. ఓవరాల్‌గా ఈ టోర్నీ ద్వారా చెస్ స్టార్స్ మొత్తం ఆరు వేల డాలర్లు (రూ. 4 లక్షల 50 వేలు) సమకూర్చారు. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment