చెన్నై: కరోనాతో పోరాడుతున్న వారికి తమ వంతు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చిన భారత చెస్ స్టార్ క్రీడాకారులు 50 వేల డాలర్లను (దాదాపు రూ. 37 లక్షలు) సేకరించారు. అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఏర్పాటు చేసిన ‘చెక్‌మేట్ కోవిడ్’ కార్యక్రమంలో భాగమైన విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, రమేశ్ బాబు ఇతర చెస్ ప్లేయర్లతో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించారు.
ఇక దీనిని రెడ్ క్రాస్ ఇండియాకు అందజేస్తామని ఏఐసీఎఫ్ తెలిపింది. రెండు వేలలోపు ఫిడే రేటింగ్స్ ఉన్న చెస్ ప్లేయర్లు ఆనంద్‌తో సహా మిగిలిన నలుగురు క్రీడాకారులతో మ్యాచ్‌లు ఆడేందుకు ఏఐసీఎఫ్ అవకాశ మిచ్చింది. ఆనంద్‌తో ఆడాలంటే 150 డాలర్ల (రూ. 11 వేలు)ను... మిగిలిన నలుగురితో ఆడాలనుకుంటే 25 డాలర్ల (రూ.1,835)ను రిజిస్ట్రేషన్ రుసుముగా పెట్టింది. ఇందులో 105 మంది చెస్ ప్లేయర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment