
కాసాబ్లాంకా చెస్ వేరియంట్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) విజేతగా నిలిచాడు. నలుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య మొరాకోలో ఆరు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కార్ల్‌సన్ 4.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొందాడు.
ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్, భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. హికారు నకముర (అమెరికా) 3.5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. ఆనంద్ ఒక గేమ్‌లో ఓడిపోయి, మరో గేమ్‌లో నెగ్గి, మిగతా నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు.
ఇవి చదవండి: జ్యోతి యర్రాజీకి స్వర్ణం, రజతం..
Comments
Please login to add a commentAdd a comment