ఆనంద్ ఖాతాలో రెండో ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్విఫీల్డ్ కప్ అంతర్జాతీయ గ్రాండ్ చెస్ టూర్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. పీటర్ స్విద్లెర్ (రష్యా)తో జరిగిన రెండో గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో...రెండో రౌండ్ తర్వాత ఆనంద్ ఒక పాయింట్‌తో మరో ఆరుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు.