Chess Tour Tournament
-
చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీ విజేత అరవింద్
చెన్నై: వరుసగా రెండో ఏడాది చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీ టైటిల్ భారత గ్రాండ్‌మాస్టర్‌కు దక్కింది. గత ఏడాది ఈ టైటిల్‌ను తమిళనాడు ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ దక్కించుకోగా... ఈ ఏడాది తమిళనాడుకే చెందిన గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం సొంతం చేసుకున్నాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. నిరీ్ణత ఏడు రౌండ్ల తర్వాత అరవింద్, అరోనియన్ (అమెరికా), భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 4.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. చివరిదైన ఏడో రౌండ్లో అరవింద్ 64 ఎత్తుల్లో పర్హామ్ (ఇరాన్)పై గెలుపొందగా... లాగ్రెవ్‌తో అర్జున్; అరోనియన్‌తో అమీన్; విదిత్‌తో అలెక్సీ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్‌ను నిర్వహించారు. ఓవరాల్‌గా మెరుగైన టైబ్రేక్ స్కోరు కారణంగా అరవింద్ నేరుగా ఫైనల్లోకి ప్రవేశించగా... అర్జున్, అరోనియన్ మధ్య జరిగిన సెమీఫైనల్లో అరోనియన్ గెలిచి ఫైనల్లో అరవింద్‌తో తలపడ్డాడు. ఫైనల్లో అరవింద్ 2–0తో అరోనియన్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించాడు. అర్జున్‌కు మూడో స్థానం లభించింది. -
హంపి శుభారంభం
స్టావెంజర్ (నార్వే): భారత చెస్ స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి నార్వే చెస్ మహిళల ఓపెన్ టోర్నీలో శుభారంభం చేసింది. పియా క్రామ్లింగ్ (స్వీడన్)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హంపి అర్మగెడాన్ గేమ్‌లో గెలిచింది. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ముందుగా క్లాసికల్ ఫార్మాట్లో గేమ్ జరుగుతుంది. ఒకవేళ గేమ్ ‘డ్రా’ అయితే ఫలితం తేలడానికి అర్మగెడాన్ గేమ్‌ను నిర్వహిస్తారు. అర్మగెడాన్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడే వారికి 10 నిమిషాలు, నల్ల పావులతో ఆడే వారికి 7 నిమిషాలు కేటాయిస్తారు. అర్మగెడాన్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడే ప్లేయర్ నెగ్గని పక్షంలో... నల్ల పావులతో ఆడిన ప్లేయర్ గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంటే దానిని విజయంగా పరిగణిస్తారు. హంపి, పియా క్రామ్లింగ్ క్లాసికల్ గేమ్ 37 ఎత్తుల్లో ‘డ్రా’కాగా... ఫలితం తేలడానికి అర్మగెడాన్ గేమ్ నిర్వహించారు. ఇందులో నల్లపావులతో ఆడిన హంపి 51 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో ఆమెను విజేతగా ప్రకటించారు. భారత్‌కే చెందిన వైశాలి తొలి రౌండ్ క్లాసికల్ గేమ్‌లో 43 ఎత్తుల్లో వెన్జున్ జు (చైనా) చేతిలో ఓడిపోయింది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద అర్మగెడాన్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడుతూ 38 ఎత్తుల్లో ఫిరూజా (ఫ్రాన్స్)పై గెలిచాడు. వీరిద్దరి మధ్య క్లాసికల్ గేమ్ 44 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. -
ఆనంద్‌కు మూడో స్థానం!
కాసాబ్లాంకా చెస్ వేరియంట్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) విజేతగా నిలిచాడు. నలుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య మొరాకోలో ఆరు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కార్ల్సన్ 4.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొందాడు.ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్, భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. హికారు నకముర (అమెరికా) 3.5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. ఆనంద్ ఒక గేమ్‌లో ఓడిపోయి, మరో గేమ్‌లో నెగ్గి, మిగతా నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు.ఇవి చదవండి: జ్యోతి యర్రాజీకి స్వర్ణం, రజతం.. -
అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు..!
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్ గేమ్‌లో అర్జున్ 45 ఎత్తుల్లో ఎల్తాజ్ సఫారిల్ (అజర్బైజాన్)పై గెలిచాడు.రెండో రౌండ్ గేమ్‌లో అర్జున్ 28 ఎత్తుల్లో నికోలస్ (గ్రీస్) చేతిలో ఓడిపోయాడు. తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ తొలి గేమ్‌లో 28 ఎత్తుల్లో అభినవ్ మిశ్రా (అమెరికా) చేతిలో ఓడిపోయి... లియోన్ మెండోకా (భారత్)తో జరిగిన రెండో గేమ్‌ను 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.ఇవి చదవండి: Virat Kohli: ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట! -
ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత ఇలా.. సంతోషంగా ఉంది!
India's 85th chess Grandmaster- దుబాయ్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అనుకున్నది సాధించాడు తమిళనాడు చెస్ ప్లేయర్ శ్యామ్ నిఖిల్. 31 ఏళ్ల శ్యామ్ నిఖిల్భారత చెస్‌లో 85వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. జీఎం హోదా దక్కాలంటే చెస్ ప్లేయర్ 2500 ఎలో రేటింగ్‌ను దాటడంతోపాటు మూడు జీఎం నార్మ్‌లు సాధించాలి. ఈ రెండూ సాధ్యమైతేనే జీఎం హోదా లభిస్తుంది. 2012లోనే శ్యామ్ 2500 ఎలో రేటింగ్‌ను అందుకోవడంతోపాటు రెండు జీఎం నార్మ్‌లు సాధించాడు. అయితే చివరిదైన మూడో జీఎం నార్మ్ కోసం సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది.12 ఏళ్లపాటు వేచి చూశాక ఎట్టకేలకు శ్యామ్ నిఖిల్ దుబాయ్ పోలీస్ మాస్టర్స్ ఓపెన్ చెస్ టోర్నీలో జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను అందుకున్నాడు. ఈ టోర్నీలో శ్యామ్ నిఖిల్ ఐదు పాయింట్లతో 39వ ర్యాంక్‌లో నిలిచాడు. చాలా సంతోషంగా ఉందిఈ క్రమంలో ఏడుగురు గ్రాండ్మాస్టర్లతో తలపడిన శ్యామ్ ఒకరిపై గెలిచి, ఆరుగురితో ‘డ్రా’ చేసుకొని మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు. ‘ఎనిమిదేళ్ల వయస్సులో చెస్ ఆడటం ప్రారంభించాను. అయితే మూడేళ్లపాటు ఏ టోర్నీలోనూ ఆడలేదు. ఆ తర్వాత అండర్–13 రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాను. 2012లోనే రెండు జీఎం నార్మ్‌లు అందుకున్నా మూడో జీఎం నార్మ్ సులభంగా రాలేదు. పలుమార్లు చేరువై దూరమయ్యాను. ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత మూడో జీఎం నార్మ్ అందుకోవడంతో చాలా సంతోషంగా ఉంది’ అని 2022లో కామన్వెల్త్ చాంపియన్‌గా నిలిచిన శ్యామ్ నిఖిల్ వ్యాఖ్యానించాడు. -
విశ్వనాథన్ ఆనంద్‌కు మూడో విజయం
Norway Chess tournament: నార్వే ఓపెన్ క్లాసికల్ చెస్ టోర్నీలో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ వరుసగా మూడో విజయం నమోదు చేశాడు. ఆనంద్–వాంగ్ హావో (చైనా) మధ్య మూడో గేమ్ 39 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అయితే ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయిన గేమ్‌లో ఫలితం కోసం ‘అర్మగెడాన్’ గేమ్‌ను నిర్వహిస్తారు. ఈ అర్మగెడాన్ గేమ్‌లో ఆనంద్ 44 ఎత్తుల్లో వాంగ్ హావోను ఓడించాడు. మూడో రౌండ్ తర్వాత ఆనంద్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అంజుమ్ రజత గురి బాకు (అజర్బైజాన్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ ఖాతాలో మూడో రజత పతకం చేరింది. శుక్రవారం మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో అంజుమ్ మౌద్గిల్ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల అంజుమ్ 12–16 పాయింట్ల తేడాతో రికీ ఇబ్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. ఎని మిది మంది షూటర్ల మధ్య జరిగిన ర్యాంకింగ్ రౌండ్లో రికీ ఇబ్సెన్ 411.4 పాయింట్లు, అంజుమ్ 406.5 పాయింట్లు స్కోరు చేసి తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరారు. చదవండి: Sakshi Malik: ఐదేళ్ల తర్వాత పసిడి పతకంతో మెరిసింది! -
లా రోడా ఓపెన్ చెస్ టోర్నీ విజేత గుకేశ్
Dommaraju Gukesh- భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ స్పెయిన్‌లో జరిగిన లా రోడా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో విజేతగా నిలిచాడు. తమిళనాడుకు చెందిన 15 ఏళ్ల గుకేశ్ నిర్ణీత 9 రౌండ్ల తర్వాత 8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. గుకేశ్ ఏడు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా ముగించాడు. చాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు 3,000 యూరోలు (రూ. 2 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. చదవండి: Vishwa Deenadayalan Death: రోడ్డు ప్రమాదంలో యువ ప్లేయర్ దుర్మరణం -
అజేయంగా నిలిచిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్
Tata Steel Chess 2022: టాటా స్టీల్ చాలెంజర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీని తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ విజయంతో ముగించాడు. నెదర్లాండ్స్‌లో ఆదివారం జరిగిన చివరిదైన 13వ రౌండ్ గేమ్‌లో 18 ఏళ్ల అర్జున్ 62 ఎత్తుల్లో మార్క్ మౌరిజి (ఫ్రాన్స్)పై గెలిచాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఎనిమిది గేముల్లో నెగ్గిన అర్జున్ ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని 10.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. చాలెంజర్స్ టోర్నీ విజేత హోదాలో అర్జున్ వచ్చే ఏడాది జరిగే టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీకి అర్హత పొందాడు. చదవండి: ENG vs WI: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. సంచలనం సృష్టించిన జాసన్ హోల్డర్ -
ఆనంద్ ఖాతాలో రెండో ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్విఫీల్డ్ కప్ అంతర్జాతీయ గ్రాండ్ చెస్ టూర్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. పీటర్ స్విద్లెర్ (రష్యా)తో జరిగిన రెండో గేమ్‌లో నల్లపావులతో ఆడిన ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో...రెండో రౌండ్ తర్వాత ఆనంద్ ఒక పాయింట్‌తో మరో ఆరుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు.