చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ టోర్నీ విజేత అరవింద్‌ | Chennai Grandmasters Chess Tournament wins Grandmaster Arvind Chidambaram | Sakshi
Sakshi News home page

చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ టోర్నీ విజేత అరవింద్‌

Published Tue, Nov 12 2024 6:00 AM | Last Updated on Tue, Nov 12 2024 6:00 AM

Chennai Grandmasters Chess Tournament wins Grandmaster Arvind Chidambaram

చెన్నై: వరుసగా రెండో ఏడాది చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ టైటిల్‌ భారత గ్రాండ్‌మాస్టర్‌కు దక్కింది. గత ఏడాది ఈ టైటిల్‌ను తమిళనాడు ప్లేయర్‌ దొమ్మరాజు గుకేశ్‌ దక్కించుకోగా... ఈ ఏడాది తమిళనాడుకే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ అరవింద్‌ చిదంబరం సొంతం చేసుకున్నాడు. ఎనిమిది  మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీ  జరిగింది. నిరీ్ణత ఏడు రౌండ్ల తర్వాత అరవింద్, అరోనియన్‌ (అమెరికా), భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ 4.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. 

చివరిదైన ఏడో రౌండ్‌లో అరవింద్‌ 64 ఎత్తుల్లో పర్హామ్‌ (ఇరాన్‌)పై గెలుపొందగా...  లాగ్రెవ్‌తో అర్జున్‌; అరోనియన్‌తో అమీన్‌; విదిత్‌తో అలెక్సీ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్‌ను నిర్వహించారు. ఓవరాల్‌గా మెరుగైన టైబ్రేక్‌ స్కోరు కారణంగా అరవింద్‌ నేరుగా ఫైనల్లోకి ప్రవేశించగా... అర్జున్, అరోనియన్‌ మధ్య జరిగిన సెమీఫైనల్లో అరోనియన్‌ గెలిచి ఫైనల్లో అరవింద్‌తో తలపడ్డాడు. ఫైనల్లో అరవింద్‌ 2–0తో అరోనియన్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించాడు. అర్జున్‌కు మూడో స్థానం లభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement