
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్ గేమ్‌లో అర్జున్ 45 ఎత్తుల్లో ఎల్తాజ్ సఫారిల్ (అజర్‌బైజాన్)పై గెలిచాడు.
రెండో రౌండ్ గేమ్‌లో అర్జున్ 28 ఎత్తుల్లో నికోలస్ (గ్రీస్) చేతిలో ఓడిపోయాడు. తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ తొలి గేమ్‌లో 28 ఎత్తుల్లో అభినవ్ మిశ్రా (అమెరికా) చేతిలో ఓడిపోయి... లియోన్ మెండోకా (భారత్)తో జరిగిన రెండో గేమ్‌ను 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
ఇవి చదవండి: Virat Kohli: ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
Comments
Please login to add a commentAdd a comment