అజేయంగా నిలిచిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌  | Tata Steel Chess 2022: Arjun Erigaisi Wins Places Top Rank | Sakshi
Sakshi News home page

Arjun Erigaisi: అజేయంగా నిలిచిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ 

Published Mon, Jan 31 2022 10:37 AM | Last Updated on Mon, Jan 31 2022 11:26 AM

Tata Steel Chess 2022: Arjun Erigaisi Wins Places Top Rank - Sakshi

Tata Steel Chess 2022: టాటా స్టీల్‌ చాలెంజర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీని తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ విజయంతో ముగించాడు. నెదర్లాండ్స్‌లో ఆదివారం జరిగిన చివరిదైన 13వ రౌండ్‌ గేమ్‌లో 18 ఏళ్ల అర్జున్‌ 62 ఎత్తుల్లో మార్క్‌ మౌరిజి (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఎనిమిది గేముల్లో నెగ్గిన అర్జున్‌ ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని 10.5 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు. చాలెంజర్స్‌ టోర్నీ విజేత హోదాలో అర్జున్‌ వచ్చే ఏడాది జరిగే టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నీకి అర్హత పొందాడు.

చదవండి: ENG vs WI: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. సంచ‌ల‌నం సృష్టించిన జాసన్ హోల్డర్  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement