
Norway Chess tournament: నార్వే ఓపెన్ క్లాసికల్ చెస్ టోర్నీలో భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ వరుసగా మూడో విజయం నమోదు చేశాడు. ఆనంద్–వాంగ్ హావో (చైనా) మధ్య మూడో గేమ్ 39 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది.
అయితే ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయిన గేమ్‌లో ఫలితం కోసం ‘అర్మగెడాన్’ గేమ్‌ను నిర్వహిస్తారు. ఈ అర్మగెడాన్ గేమ్‌లో ఆనంద్ 44 ఎత్తుల్లో వాంగ్ హావోను ఓడించాడు. మూడో రౌండ్ తర్వాత ఆనంద్ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
అంజుమ్ రజత గురి
బాకు (అజర్‌బైజాన్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్ ఖాతాలో మూడో రజత పతకం చేరింది. శుక్రవారం మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో అంజుమ్ మౌద్గిల్ రజత పతకం సొంతం చేసుకుంది.
ఫైనల్లో పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల అంజుమ్ 12–16 పాయింట్ల తేడాతో రికీ ఇబ్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. ఎని మిది మంది షూటర్ల మధ్య జరిగిన ర్యాంకింగ్ రౌండ్‌లో రికీ ఇబ్సెన్ 411.4 పాయింట్లు, అంజుమ్ 406.5 పాయింట్లు స్కోరు చేసి తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరారు.
Comments
Please login to add a commentAdd a comment