
మహిళలు కూడా ఉద్యోగాలు చేయడంతో ఇంట్లో పనిమనిషి లేకపోతే చాలా కష్టం. ఆమె ఒక్క రోజు డ్యూటీకి రాలేదా..? ఇంట్లో ఉండే హడావిడి అంతఇంత కాదు. ఎప్పుడు ఈ పనిమనిషి లీవ్ పెడుతుందోనన్న టెన్షన్‌తో చాలా ఇబ్బంది పడుతుంటారు చాలామంది మహిళలు. ఇక ఆ బాధ లేకుండా మన ఇంటిలో పనులన్నీ చకచక చేసిపట్టే రోబో మన జీవితంలో భాగం కానుంది త్వరలో. మరీ ఆ ఇంటి పనుల రోబో విశేషాలేంటో చూద్దామా..!.
రోబోలు మన ఇంట్లో తిరుగాడే రోజులు సుదూర కల కాకపోవచ్చు. నార్వేకు చెందిన రోబోటిక్స్ కంపెనీ ‘1 ఎక్స్’ వివిధ రకాల పనులు చేయగల కొత్త రోబోను మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది.
‘నియో గామా’ అనే ఈ హ్యూమనాయిడ్ రోబోట్ ఇంటిపనులకు సహాయపడుతుంది. సహజ కదలికలతో ఆకట్టుకుంటుంది. కంపెనీ షేర్ చేసిన ప్రమోషన్ క్లిప్‌లో... నైలాన్ నిట్ సూట్ ధరించిన రోబో కాఫీసర్వ్ చేయడం, పెయింటింగ్ వేలాడదీయడం, బుట్ట మోయడం, అద్దాలు శుభ్రం చేయడం, బయటినుంచి వచ్చిన వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం... మొదలైన దృశ్యాలు ఉన్నాయి.
ఇంటి పనులు సరే... ఈ హ్యూమనాయిడ్ రోబోట్‌లు సాంకేతికపరంగా ఎంత వరకు భద్రం అనే అనుమానాన్ని దృష్టిలో పెట్టుకొని...‘నియో గామా భద్రతకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకున్నాం’ అని ప్రకటించింది కంపెనీ.
(చదవండి: అమెరికా నుంచి భారత్‌కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్)