Narvey
-
ఆనంద్‌కు మూడో స్థానం!
కాసాబ్లాంకా చెస్ వేరియంట్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) విజేతగా నిలిచాడు. నలుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య మొరాకోలో ఆరు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కార్ల్సన్ 4.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొందాడు.ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్, భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. హికారు నకముర (అమెరికా) 3.5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. ఆనంద్ ఒక గేమ్‌లో ఓడిపోయి, మరో గేమ్‌లో నెగ్గి, మిగతా నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు.ఇవి చదవండి: జ్యోతి యర్రాజీకి స్వర్ణం, రజతం.. -
మెరుగ్గా వ్యవహరించిన భారత్
అంతర్జాతీయ పరిణామాలు సవాలు విసురుతున్న సమయంలో గత ఏడాది భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. కోవిడ్–19 మహమ్మారి ప్రభావం నుండి ప్రపంచం క్రమంగా కోలుకున్నప్పటికీ, ప్రపంచ వృద్ధి ఇంకా దుర్బలంగానే ఉంది. ద్రవ్యోల్బణం కూడా మొండిగాఉంది. విపరీతమైన వాతావరణ ఘటనలు పెరుగుతున్న తరుణంలో (రికార్డుల పరంగా జూలై అత్యంత వేడి అయిన నెల అని గ్రహించాలి), వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై ఈ ‘కార్యాచరణ దశాబ్ది’లో తక్షణ చర్యలు అవసరం. అయితే, అంతర్జాతీయ సహకారాత్మక చర్యకు సంబంధించిన ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ – భౌగోళిక రాజకీయ పోటీ, ఘర్షణ ప్రమాదాలు ఆ సహకారానికి అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ కష్టతరమైన ప్రపంచ ముఖచిత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటే, బహుశా భారతదేశ అత్యంత పరిణామాత్మకమైన, అత్యంత బోధనాత్మకమైన నిర్ణయం, జీ20 చర్చా ప్రక్రియకు ఉపక్రమించడం! చెప్పాలంటే,ఇండియా చేయాల్సినదాని కంటే ఎక్కువ చేసింది. అత్యంత సంఘటిత ప్రక్రియను నడిపించడం ద్వారా సహకార విధానంలోకి మొగ్గు చూపింది. భౌగోళిక కమ్యూనిటీలు అన్నింటికీ స్వరాలు ఉండాల్సిన ఈ బహుముఖ, బహుళ వాటాదారుల విధానం... ప్రపంచ సహకారాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. మన భాగస్వామ్య ప్రాధాన్యాలపై పురోగతి సాధించడానికి ప్రపంచం తక్షణమే మార్గాలను కనుగొనాల్సిన తరుణంలో ఇది చాలా కీలకమైనది. ప్రపంచ జనాభాలో 85 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణార్ధ దేశాల సమూహానికి బహుముఖ సంభాషణలలో తరచుగా చోటివ్వరు. అయితే దక్షిణార్ధ ప్రపంచ (గ్లోబల్ సౌత్) వాణికి అవకాశం ఇవ్వడం ద్వారా భారతదేశం భౌగోళికంగా జీ20 చర్చలను విస్తరించింది. జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మొదటి నెలల్లో భారతదేశం 125 దేశాలకు చెందిన నాయకులు, మంత్రుల భాగస్వామ్యంతో కూడిన ‘వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్’ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జీ20 కూటమిలో ప్రాతినిధ్యం వహించని దేశాలతో సంప్రదింపులు జరపడం, వారి ప్రాధాన్యాలను అర్థం చేసుకోవడమే దీని లక్ష్యం. అటువంటి ప్రాధాన్యాల్లో ఒకటి ప్రపంచ సార్వభౌమాధికార దేశాల రుణ సమస్య. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 50 శాతం దేశాలు తీవ్రమైన రుణ బాధలో ఉన్నట్టు అంచనా. ఈ రుణ విచికిత్స కోసం భారతదేశం గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 3 ట్రిలియన్ డాలర్ల సామూహిక జీడీపీ ఉన్న 55 ఆఫ్రికన్ రాజ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో చేర్చాలని కూడా భారతదేశం వాదించింది (ఈ మేరకు సఫలమైంది కూడా). విభిన్న భౌగోళిక ప్రాంతాల నుండి పెట్టుబడులను తీసుకువచ్చే బహుముఖ ప్రక్రియకు నాయకత్వం వహించడంతో పాటు, భారతదేశం కమ్యూనిటీలలో కూడా వాటాదారులతో చర్చలు జరిపింది. ఉదాహరణకు, థింక్20 కమ్యూనిటీ అనేది, జీ20కి ‘ఐడియా బ్యాంక్’గా పనిచేస్తుంది. అదే సమయంలో, ప్రపంచ వాణిజ్య కమ్యూనిటీకి ప్రాతి నిధ్యం వహించే అధికారిక డైలాగ్ ఫోరమ్‌గా బి20 వ్యవహరిస్తుంది. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు మొట్ట మొదటిసారిగా ‘స్టార్టప్20 ఎంగేజ్మెంట్ గ్రూప్’ ప్రాతినిధ్యం వహిస్తుంది. జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్, సాధారణ సవాళ్లను పరిష్కరించడానికి ఒక సాధనంగా అంతర్జాతీయ బహుళ వాటాదారుల సహకారానికి ప్రాముఖ్యమిస్తోంది. ఈ విధానం స్పష్టమైన హామీని కలిగి ఉంది. పెరుగుతున్న సంక్లిష్ట ప్రపంచంలో– భౌగోళికాలు, వ్యాపార రంగాలు, పర్యావరణ వ్యవస్థలు, కమ్యూనిటీలలోని సవాళ్లను పరిష్కరించడానికి బహుళ వాటాదారుల విధానం చాలా అవసరం. సమ్మిళిత జీ20 ప్రక్రియను తీర్చి దిద్దడానికి చేసిన భారత ప్రయత్నాలను సులభంగా తీసేయకూడదు. జనాభాలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారత్. ప్రస్తుతం నిట్టనిలువుగా ఎదుగుతున్న పథంలో ఉంది. అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో వరుసగా మూడేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతేకాకుండా 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 100 కంటే ఎక్కువ స్టార్టప్ యునికార్న్స్ (1 బిలి యన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్‌లు) కలిగివుంది. ఇటీవలి సంవత్సరాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెరుగుదలను చూసింది. ఇవి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 85 బిలియన్ డాలర్ల కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం, ప్రపంచం త్వరలో కొత్త జీ3 యుగానికి స్వాగతం పలుకుతుంది. ఈ అంచనా అమెరికా, చైనాతోపాటు ప్రపంచంలోని ఉత్కృష్ట దేశాలలో భారతదేశాన్ని కూడా చేర్చింది. ఇది మరోలా ఉండి వుంటే, ఈ పరిణామాలు వేరుగా ఉండేవి. ఇదంతా భారతదేశం దాని తలలోకి ఎక్కించు కొని ఉండవచ్చు. అందరినీ కలుపుకొని పోవడం కాకుండా, కొందరితో ప్రత్యేకంగా చర్చలు జరిపి వుండొచ్చు. కానీ భారతదేశం స్వభావరీత్యా పైనుంచి కిందివరకూ చర్చలను నడిపించడానికి ప్రోత్సహించింది. జీ20 అధ్యక్షతలో తొలి నుండీ ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ మకుటంతో, మరింత సంపన్నమైన, సురక్షితమైన భవి ష్యత్తును రూపొందించడానికి ఏకైక మార్గం సహకారమే అని గుర్తు చేసింది. సహకారం పట్ల అంతర్జాతీయ నిబద్ధత క్షీణిస్తున్న తరుణంలో, భారతదేశ జీ20 అధ్యక్షత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రధారులు తమ సహకార విధానాలకు మళ్లీ కట్టుబడి ఉండాలని గుర్తుచేస్తోంది. బోర్గే బ్రెండే వ్యాసకర్త వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు; నార్వే మాజీ విదేశాంగ మంత్రి -
యూరప్ దేశాలు ఇకనైనా మేలుకోవాలి: జైశంకర్
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నందుకు భారత్‌ను విమర్శిస్తున్న వారిపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎదురు దాడికి దిగారు. ఆసియాకు ఎదురవుతున్న సవాళ్లను పశ్చిమ దేశాలు ఇప్పటిదాకా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ‘అఫ్గానిస్తాన్‌తోపాటు పలు ఆసియా దేశాల్లో పరిణామాలు ప్రపంచానికే ప్రమాదకరంగా పరిణమించినా యూరప్ దేశాలు పట్టించుకోలేదు. పైపెచ్చు మరింత వాణిజ్యం చేయాలంటూ మాకు సలహాఇచ్చాయి’ అని మంగళవారం ‘రైజినా డైలాగ్’ కార్యక్రమంలో ఆయన విమర్శించారు. నార్వే, లక్జెమ్‌బర్గ్ విదేశాంగ మంత్రులు, స్వీడన్ మాజీ ప్రధాని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభం యూరప్ దేశాలకు మేలుకొలుపన్నారు. పదేళ్లుగా ఆసియాలో సవ్యమైన పరిస్థితులు లేవన్నారు. ఆసియాలో ప్రతీ దేశ ప్రాదేశిక సార్వభౌమత్వం ప్రమాదంలో పడినప్పటికీ పశ్చిమ దేశాలకు పట్టలేదని, ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభంతోనైనా వాళ్లు ఈ ఖండంలో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. అఫ్గానిస్తాన్ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి, అగ్రరాజ్యాల వైరం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇంధన ధరల్లో పెరుగుదల, ఆహార కొరత ఏర్పడటంతో పాటు అంతర్జాతీయ సిద్ధాంతాలు, విలువలకు విఘాతం కలిగిందన్నారు. ఇది చదవండి: తంజావూరు రథయాత్రలో అపశ్రుతి.. -
Social Star: పైజమా పాప్‌స్టార్ శిర్లే సెటియా.. ఆర్జే నుంచి సింగర్‌గా..
ప్రతిభ ఉంటే ప్రపంచంలో ఏ మూలన ఉన్నా పాపులర్ కావొచ్చని నిరూపిస్తోంది శిర్లే సెటియా. ఇండియాలో పుట్టినప్పటికీ పెరిగింది, చదువుకుంది అంతా ఆక్లాండ్‌లోనే. అయినా భారత సినిమా పాటలను ఆలపిస్తూ లక్షలాది శ్రోతల్ని తన స్వరంతో అలరిస్తోంది. ఇండో–కివీస్ నటిగానేగాక, డ్యాన్సర్‌గా, రేడియో జాకీగా, గాయనిగా, యూ ట్యూబర్ గా రాణిస్తోంది. షోటైమ్ విత్ శిర్లే.. హరియాణాకు చెందిన రాజ్, ఫిరోజా సెటియా దంపతుల ముద్దుల కూతురు శిర్లే సెటియా. శిర్లే ఇండియాలోనే పుట్టినప్పటికీ.. రాజ్ సెటియా వ్యాపార రీత్యా ఆక్లాండ్‌లో స్థిరపడడంతో....శిర్లే ఆక్లాండ్‌లోనే అడుగు వేయడం నేర్చుకుంది. తనకి షానే సెటియా అనే తమ్ముడు ఉన్నాడు. స్కూలులో చురుకైన విద్యార్థిగా పేరున్న శిర్లే చిన్నప్పుడు వ్యోమగామి కావాలని కలలు కనేది. కానీ స్కూలు విద్య పూర్తయ్యాక మార్కెటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో బీకామ్ చేసింది. డిగ్రీ అయ్యాక ఆక్లాండ్‌లో హిందీ కంటెంట్‌ను ప్రసారం చేసే రేడియో టరానాలో పార్ట్‌టైమ్ ఉద్యోగం లో చేరి పాపులర్ షో ‘షోటైమ్ విత్ శిర్లే’కు ఆర్జేగా పనిచేసింది. ఆర్జే నుంచి సింగర్‌గా.. తన గాత్రం మెరుగుపడ్డాక..2012లో శిర్లే సెటియా పేరుతో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. తను అప్లోడ్ చేసే పాటలకు మంచి స్పందన వచ్చేది. చిన్నప్పటి నుంచి న్యూజిలాండ్‌లో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఇద్దరూ హిందీలో మాట్లాడడం వల్ల భారతీయ సినిమా పాటలపై శిర్లేకు అవగాహన ఉంది. చిన్నప్పటి నుంచి బాలీవుడ్ పాటలు వింటూ పెరగడంతో.. భారతీయ సంగీతంపై పట్టు ఏర్పడింది. దాంతో బాలీవుడ్ సినిమా పాటలు పాడి వాటిని తన చానల్లో అప్లోడ్ చేసేది. ఏడాది తరువాత టీ సీరిస్ ఏర్పాటు చేసిన యూ ట్యూబ్ కాంపిటీషన్లో పాల్గొంది. ఆషికీ –2లో అర్జిత్ సింగ్ పాడిన ‘‘హమ్ తేరే బిన్ అబ్ రహనహి సక్తే’’ కవర్ సాంగ్ వీడియోను రికార్డు చేసి తన చానల్లో అప్లోడ్ చేసింది. ఈ పాట బాగా వైరల్ అవడంతో టీ సీరిస్ పోటీలో విజేతగా నిలిచి, అధిక సంఖ్యలో వ్యూస్‌ను సంపాదించుకుంది. పైజమా పాప్‌స్టార్.. పాపులారిటీ తెచ్చిన హమ్ తేరే పాట వీడియో రూపొందించేటప్పుడు శిర్లే.. పైజమా ఉన్న డ్రెస్ ధరించి పాడింది. ఆ పాటతో బాగా పాపులర్ అవడంతో.. న్యూజిలాండ్ హెరాల్డ్ ‘పైజమా పాప్‌స్టార్’గా శిర్లేను వర్ణించింది. అప్పటినుంచి శిర్లే పైజమా స్టార్‌గా పాపులర్ అయ్యింది. దాంతో సబ్‌స్కైబ్రర్స్ సంఖ్య కూడా బాగా పెరిగింది. కోయ్ వి నహీ... రవిసింఘాల్తో కలిసి 2016లో తన తొలి కొయ్ షోర్ పాటను విడుదల చేసింది. మరుసటి ఏడాది బాలీవుడ్ సినిమా ‘ఏ జెంటిల్మెన్’లో ‘‘డిస్కో డిస్కో’’ పాడింది. ఈ పాటకు 54 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇదే ఏడాది తన సొంత పాటలు పాడాలని నిర్ణయించుకుని టీమ్‌తో కలిసి పంజాబీ ట్రాక్ ‘కోయ్ వి నహీ’ సాంగ్‌ను విడుదల చేసింది. ఇది యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొట్టింది. అలా యూఎస్, యూకే, ఇండియా, కెనడాలలోని యూ ట్యూబ్ ఆరి్టస్టులతో కలిసి పాటలు పాడేది. పంజాబీ పాపులర్ సింగర్ గుర్నజర్తో కలిసి ఆమె విడుదల చేసిన ‘కోయ్ వీ నహీ’ పాటకు యూ ట్యూబ్‌లో180 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనితోపాటు జబ్ కోయి బాత్, తు జో మిలా, బోల్ డో నా జరా, కుచ్ నా కహో, బారీష్ కవర్ సాంగ్‌లకు గుర్తింపు వచ్చింది. ‘మస్కా’ ‘నిక్ నేమ్’ వంటి సినిమాల్లో శిర్లే నటించినప్పటికీ గాయనిగానే తనకి మంచి గుర్తింపు వచ్చింది. అంతేగాక బాలీవుడ్ నెక్ట్స్ బిగ్ సింగింగ్ సెన్సేషన్‌గా ఫోర్బ్స్ మ్యాగజీన్ గుర్తించడం, మ్యూజిక్ సెన్సేషన్ ఇన్ సోషల్ మీడియా, న్యూజిలాండ్ సోషల్ మీడియా అవార్డులలో ‘బెస్ట్ ఇన్ మ్యూజిక్ అవార్డు, లాయిడ్ అండ్ అవుట్‌లుక్ ఇండియా సోషల్ మీడియా అవార్డులను అందుకుంది. ప్రస్తుతం శిర్లే యూ ట్యూబ్ చానల్‌కు దాదాపు నలభైలక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండగా, ఇన్స్టాగామ్ ఫాలోవర్స్ డెబ్భై లక్షలకు పైగా ఉన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Vajrasana Benefits: మానసిక ఒత్తిడి, వెన్నునొప్పి, ఎసిడిటీ నివారణకు.. యోగా మంత్రమిదే! -
నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేట్
న్యూయార్క్ : 2021 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నార్వే ఎంపీ టిబ్రింగ్ జడ్డే నామినేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు వివాదాల పరిష్కారానికి ట్రంప్ చొరవ చూపారని జడ్డే ప్రశంసించారు. ఇజ్రాయల్-యూఏఈ మధ్య ట్రంప్ కుదిర్చిన శాంతి ఒప్పందం చారిత్రాత్మకమైనదని కొనియాడారు. మధ్యప్రాచ్యంలో సైనిక దళాల తగ్గింపుతో పాటు శాంతి సాధనకు ట్రంప్ విశేషంగా కృషిచేశారని అన్నారు. యూఏఈ-ఇజ్రాయల్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ట్రంప్ యంత్రాంగం కీలక పాత్ర పోషించిందని జడ్డే అన్నారు. ఇక ఆగస్ట్ 13న స్వయంగా అధ్యక్షుడు ప్రకటించిన ఈ ఒప్పందం ట్రంప్ విదేశాంగ విధానం సాధించిన కీలక విజయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా సెప్టెంబర్ 15న వైట్‌హౌస్‌లో యూఏఈ-ఇజ్రాయల్ ఒప్పందంపై ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఎమిరేట్స విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జయేద్ అల్ నహ్యాన్ల సమక్షంలో సంతకాలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. నలుగురు అమెరికా అధ్యక్షులు ఇప్పటివరకూ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అమెరికా అధ్యక్షులు రూజ్వెల్ట్, వుడ్రూ విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2021 విజేత ఎవరనేది వచ్చే ఏడాది అక్టోబర్ తర్వాత ప్రకటిస్తారు. చదవండి : హారిస్ ప్రెసిడెంట్ అయితే.. అమెరికాకే అవమానం -
ఇక ‘డీఎన్ఏ’ ఆధారిత డైట్
సాక్షి, న్యూఢిల్లీ : ‘మందులు మనకు ఆహారం కారాదు. ఆహారమే మనకు మందు కావాలి’ ఇది మనకు ఆధునిక ఆరోగ్య సూత్రం. అవి, ఇవి అనకుండా అడ్డమైన గడ్డి తిని లేని రోగాలు తెచ్చుకొని మందులు తింటూ బాధ పడేకన్నా.. ఏ మందులు అవసరం లేని, ఏ రోగాలు దరిచేరని మనకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆచితూచి తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పది కాలాలపాటు హాయిగా జీవించొచ్చట. అందుకేనేమో కియో డైట్, వీరమాచినేని డైట్ అంటూ మార్కెట్లో ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు వీటికి భిన్నంగా పూర్తి శాస్త్ర విఙ్ఞానపరంగా మరో డైట్ అమల్లోకి వస్తోంది. అదే ‘పర్సనల్ న్యూట్రిషన్ డైట్ (వ్యక్తిగత పోషకాల ఆహారం)’. మన డీఎన్ఏను విశ్లేషించి జన్యుపరంగా సంక్రమించే జబ్బులేవో అంచనా వేసి, ఆ జబ్బులు రాకుండా నివారించ గలిగిన ఆహారం తీసుకోవడమే ఆ డైట్. ఈ డైట్‌ను ఆలోపతి వైద్యులే నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ పద్ధతి నార్వేలో ఊపందుకుంది. అక్కడకుగానీ, భారత్‌లోని డీఎన్ఏ సెంటర్లకుగానీ మన లాలాజలం తీసి పంపిస్తే చాలు మన డీఎన్ఏ జన్యుక్రమాన్ని విశ్లేషించి నివేదిక పంపిస్తారు. వచ్చే అవకాశం ఉన్న జబ్బులు గురించి కూడా విశ్లేషిస్తారు. ఉదాహరణకు ‘కార్డియో వాస్కులర్ డిసీసెస్’ వచ్చే అవకాశం ఉందంటే, మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ కన్నా చెడు కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్ కన్నా ఎల్డీఎల్) ఎక్కువ ఉన్నట్లయితే మాంసాహారానికి గుడ్‌బై చెప్పి సాత్విక ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. చేపలు పుష్కలంగా తినొచ్చు. ‘ఫుడ్ ఫర్ మీ రీసర్చ్ ప్రాజెక్ట్’ కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఆహార పోషకాలను నిర్ధారించుకోవాలి. అందుకోసం అవసరమైతే డైటీషియన్ దగ్గరకు వెళ్లాలి. మానవ శరీరంలో దాదాపు ఐదు లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుందని, మనం తినే ఆహార పదార్థాల్లో ఎక్కువ భాగం వాటికే పోతుందని ‘పర్సనలైజ్డ్ న్యూట్రిషన్’ పరీక్షల్లో బయటపడడంతో ఈ కొత్త డైట్ విధానం అవసరం అని వైద్యులు తేల్చారు. మనం తినే ఆహారాన్ని బట్టి మన పెద్ద పేగులో బ్యాక్టీరియా రకాలు మారుతాయని కూడా ఆ అధ్యయనంలో తేలింది. మనం సరైన డైటింగ్ చేయడం ద్వారా కొన్ని రకాల బ్యాక్టీరియాలను చంపేయవచ్చట. అంటే వాటిని చంపడానికి వేరే మందులు అవసరం లేదన్న మాట. అందుకనే ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి డీఎన్ఏను తప్పనిసరిగా విశ్లేషించి డేటాను నిక్షిప్తం చేయాల్సిందిగా ‘జాతీయ ఆరోగ్య సేవల ప్రాజెక్ట్ ’ అధికారులకు బ్రిటన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. -
డౌన్లోడ్ స్పీడ్.. మనం వెనకే!
ముంబై: భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.. చౌక టారిఫ్‌ల వల్ల మొబైల్ వినియోగదారుల్లో డేటా వినియోగం భారీగా పెరిగింది.. మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. అదే మరొకవైపు చూస్తే.. మొబైల్ ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్‌లో మన దేశం టాప్–10, టాప్–50, అఖరికి టాప్–100లో కూడా స్థానం దక్కించుకోలేదు. 109వ స్థానంలో నిలిచింది. మొబైల్ ఫోన్లో సగటు డౌన్లోడ్ స్పీడ్ ఫిబ్రవరిలో 9.01 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. ఇది గతేడాది నవంబర్‌లో 8.80 ఎంబీపీఎస్. ఇక్కడ స్పీడ్ కొద్దిగా పెరిగినా కూడా స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 109వ స్థానంలోనే ఉన్నాం. ఓక్లా స్పీడ్ టెస్ట్ ఇండెక్స్ ఈ విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. మొబైల్ డౌన్లోడ్ స్పీడ్‌లో నార్వే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశంలో సగటు డౌన్లోడ్ స్పీడ్ 62.07 ఎంబీపీఎస్. ఇక ఫిక్స్డ్ బ్రాడ్‌బాండ్ విషయంలో మాత్రం భారత్ ర్యాంక్ గతేడాది నవంబర్ నుంచి చూస్తే ఈ ఫిబ్రవరి చివరి నాటికి 76 నుంచి 67కు మెరుగుపడింది. ఇదే సమయంలో ఫిక్స్డ్ బ్రాడ్‌బాండ్ డౌన్లోడ్ స్పీడ్ కూడా 18.82 ఎంబీపీఎస్ నుంచి 20.72 ఎంబీపీఎస్‌కి పెరిగింది. ఫిక్స్డ్ బ్రాడ్‌బాండ్ విభాగంలో సింగపూర్ టాప్‌లో ఉంది. ఇక్కడ డౌన్లోడ్ స్పీడ్ 161.53 ఎంబీపీఎస్‌గా రికార్డ్ అయ్యింది. కాగా మొబైల్ డేటా వినియోగంలో నెలకు 150 కోట్ల గిగాబైట్స్తో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ కాంత్ గత డిసెంబర్లో ప్రకటించారు. అమెరికా, చైనా రెండు దేశాల డేటా వినియోగం కన్నా ఇది ఎక్కవని పేర్కొన్నారు. -
‘వింటర్’లో టాపర్‌గా...
ప్యాంగ్‌చాంగ్: వింటర్ ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 14 పతకాలు గెలిచిన ప్లేయర్‌గా నార్వేకు చెందిన మారిట్ జోర్జెన్ చరిత్ర సృష్టించింది. తాజా ఒలింపిక్స్‌లో ఆమె ఖాతాలో నాలుగో పతకం చేరింది. స్కీయింగ్‌లో మెరిక అయిన జోర్జెన్ క్రాస్ కంట్రీ టీమ్ స్ప్రింట్ ఫ్రీ ఈవెంట్లో మైకెన్ కాస్పెర్సన్ ఫల్లాతో కలిసి కాంస్య పతకం గెలుచుకుంది. దాంతో 13 పతకాలతో నార్వే క్రీడాకారుడు ఒలె ఇనార్ జోర్న్‌డాలెన్ (నార్వే) పేరిట ఉన్న రికార్డును ఆమె తెరమరుగు చేసింది. ఏ ఒలింపిక్స్ (వింటర్, సమ్మర్)లోనైనా అత్యధిక పతకాలు గెలిచిన రెండో మహిళా అథ్లెట్‌గా 37 ఏళ్ల జోర్జెన్ ఘనత వహించింది. అలనాటి సోవియెట్ (ఇప్పటి ఉక్రెయిన్) జిమ్నాస్ట్ దిగ్గజం లారిసా లాతినినా సమ్మర్ ఒలింపిక్స్‌లో అత్యధికంగా 18 పతకాలు సాధించింది. -
జైలంటే జైలూ కాదు స్వర్గంగా ఉందీ చూడు..
ఓస్లో: ప్రపంచంలో జైలు అనగానే ఊచలున్న, గాలి వెలుతరురాని నాలుగు గదుల గోడ, రుచీ పచిలేని తిండి, చుట్టూ తుపాకులతో కాపలాకాచే పోలీసులు, నిద్ర పట్టకుండా దోమలు, దుర్గంధం, పోలీసు పద ఘట్టనలు, కాపలా కుక్కల అరుపులు గుర్తొస్తాయి. జైలంటే ఏ మాత్రం స్వేచ్ఛలేని దుర్భర జీవితం. నార్వేలోని బాస్టాయ్ జైలు ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఆ జైలుపక్షుల దైనందిన జీవితం గురించి వింటే మనమే నేరం చేసి జైలుకు వెళితే బాగుండునేమో అనిపిస్తుంది. అక్కడి ఖైదీలు పోలీసులెవరూ లేపకుండానే క్రమశిక్షణతో పొద్దునే లేస్తారు. అందరూ వ్యాయామం చేస్తారు. కొందరు జైల్లోనే ఉన్న జిమ్‌కు వెళతారు. కసరత్తు చేస్తారు. కండలు పెంచుతారు. టిఫిన్ చేస్తారు. ఆ తర్వాత ఆపక్కనే ఉన్న బీచ్‌కు వెళతారు. సన్‌బాత్ చేస్తారు. కొందరు సముద్రంలో జలకాలాడుతారు. పైన్ చెట్లను నీడన సేదతీరుతారు. ఆ తర్వాత జైలు నిబంధనల మేరకు గుర్రాలు, గొర్రెలు గాస్తారు. వ్యవసాయ పనులు చేస్తారు. జైల్లోపలికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఎక్కువ వరకు ఖైదీలే తమకిష్టమైన ఆహారం వండుకొని తింటారు. ఈ బాస్టాయ్ జైల్లో కటకటాల గదులు ఉండవు. చిన్న డబుల్ బెడ్ రూమ్ గదులు ఉంటాయి. ఖైదీలు తమకిష్టమైన గదుల్లో ఉండవచ్చు. మధ్యాహ్నం కాస్త విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ ఎవరి పనులకు వారు వెళతారు. సాయంత్రం బీచ్ ఒడ్డున బిచానా వేస్తారు. ఆనందంగా గడుపుతారు. మళ్లీ చీకటిపడేలోగా జైలుకు వస్తారు. రాత్రి భోజనం చేసి పడుకుంటరు. ఖైదీలు సముద్రంలో చేపలు పట్టుకోవచ్చు. సమీపంలోని గ్రౌండ్‌కు వెళ్లి ఫుట్‌బాల్ ఆడొచ్చు. జైలు సిబ్బంది, కాపలా తక్కువగా ఉంటుంది. అందుకనే ఖైదీలే ఓ కమ్యూనిటీగా జైల్లో కూడా అన్ని పనులు వంతులవారిగా చేసుకుంటారు. ఖైదీలకంటూ ప్రత్యేక బట్టలు ఉండవు. సొంతంగా ఎవరికిష్టమైన బట్టలు వారు కొనుక్కోవచ్చు, వాటిని వేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతి మంచి జైలుగా ప్రసిద్ధి చెందిన బాస్టాయ్ జైలులో భద్రతా సిబ్బంది అతి తక్కువగా ఉన్నప్పటికీ ఖైదీలెవరూ పారిపోవడానికి ప్రయత్నించరు. అన్ని సౌకర్యాలు ఉండడం ఒక్కటే ఇందుకు కారణం కాదు. జైలు నుంచి విడుదలవడానికి 18 నెలల ముందు నుంచే బయట ఉద్యోగం చేసుకునే అవకాశం ఖైదీలకు ఉంటుంది. విడుదలయ్యాక వారు అదే ఉద్యోగంలో స్థిరపడి పోతారు. వివిధ ఉద్యోగాలను కల్పించేందుకు కూడా నార్వే ప్రభుత్వం సహకరిస్తుంది. ఓ చిన్న దీవిలో ఉన్న ఈ జైలులో ప్రస్తుతం 115 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో తీవ్ర హింసాత్మక నేరాలు చేసిన వారు కూడా ఉన్నారు. ఘోర నేరాలు చేసిన వారిని నేరుగా ఈ జైలుకు తీసుకోరు. దేశంలోని వేరే జైల్లో కొంతకాలం శిక్ష అనుభవించి క్రమశిక్షణతో మెలిగినట్లు ధ్రువీకరణ పత్రం పొందటంతో పాటు ఈ జైలుకు రావాలని కోరుకుంటున్నట్లు దరఖాస్తు చేసుకుంటేనే అలాంటి నేరస్థులను ఇక్కడ అనుమతిస్తారు. ఒక్కసారి నేరం చేసినవారు, మరోసారి నేరం చేయకుండా వాళ్లలో పరివర్తన తీసుకరావడమే ప్రధానంగా ఈ జైలు లక్ష్యం. వారికి జీవితం పట్ల అవగాహన కల్పించేందుకు అధ్యాపకులు వస్తారు. సెమినార్లు నిర్వహిస్తారు. మంచి గ్రంధాలయం కూడా వారికి అందుబాటులో ఉంది. ఒకసారి జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాక మరో రెండేళ్లలోనే అలాంటి నేరం చేసి జైలుకు వచ్చే వారి సంఖ్య నార్వేలో 20 శాతం మాత్రం. అదే అమెరికాలో మళ్లీ జైలుకు వచ్చే వారి సంఖ్య 50 శాతానికిపైగా ఉంది. నార్వేలో యావజ్జీవ శిక్ష ఉండదు. తీవ్ర నేరాలకు గరిష్ట శిక్ష 21 ఏళ్లు. మరీ తీవ్రమైన మానవ హననానికి పాల్పడితే 30 ఏళ్ల జైలు శిక్ష. 60 శాతం ఖైదీలకు మూడు నెలలలోపే శిక్షలు పడతాయి. 90 శాతం ఖైదీలకు ఏడాది లోపే శిక్ష అనుభవిస్తారు. బాస్టాయ్ జైలు నుంచి సాధారణంగా ఎవరూ పారిపోరు. 2015లో ఓ ఖైదీ సర్వ్బోర్డు ద్వారా పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. అలా పట్టుబడిన వ్యక్తిని కొంత కఠినమైన మరో జైలుకు తరలిస్తారు.