third place
-
దుబాయ్ కారు రేసింగ్.. అజిత్ కుమార్ టీమ్ క్రేజీ రికార్డ్
దుబాయ్ కార్ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్ కుమార్‌కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్‌లో 24హెచ్ కార్ రేసింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా తమిళ స్టార్ శివ కార్తికేయన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు.రేసుకు ముందు ప్రమాదం.. అయితే ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. అజిత్ ప్రమాదం నుంచి బయటపడడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.15 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. కాగా.. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రేసింగ్‌కు వచ్చాడు. అతని జట్టు ఈ కారు రేసింగ్‌లో విజయం సాధించింది. రేసింగ్ జట్టు యజమానిగా తాను రేసింగ్‌లో పాల్గొంటానని అజిత్ కుమార్ వీడియోను రిలీజ్ చేశారు. మోటార్‌స్పోర్ట్స్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. అలాగే కుటుంబం, హార్ట్ వర్క్, సక్సెస్, ఫెయిల్యూర్‌ను జీవితంలో సమానంగా చూడాలని అభిమానులకు సూచించారు. కార్ రేసింగ్ గురించి మాట్లాడుతూ.. ' రేసింగ్ అనేది ఇతర క్రీడల మాదిరిగా వ్యక్తిగత క్రీడ కాదు. మీరు స్ప్రింట్ రేసర్లను చూసి ఉండవచ్చు. కానీ ఇందులో నలుగురు, ఐదుగురు డ్రైవర్లు ఒకే కారు నడుపుతారు. కాబట్టి మనమందరం అందరి పనితీరుకు బాధ్యత వహించాలి. మన కారును జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో మనం ల్యాప్ టైమింగ్‌లను సాధించాలి. ఇందులో సిబ్బంది, మెకానిక్స్, లాజిస్టికల్ సపోర్ట్‌తో పాటు డ్రైవర్ల సమష్టి కృషి ఉంటుంది. ఇది సినిమా పరిశ్రమ లాంటిది. ప్రతి ఒక్కరూ తమ పాత్రపై దృష్టి పెడితే ఫలితాలు వస్తాయని' అని అన్నారు.కాగా.. కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్‌తో అజిత్ కుమార్ జతకట్టారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే ద్విభాష చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అనివార్య కారణాలతో వాయిదా వేశారు. ఈ సినిమాను సమ్మర్లో అంటే ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. Big congratulations to you, AK sir, for your perseverance. Proud moment, sir 👏👏 🏆 👍❤️❤️#AjithKumarRacing pic.twitter.com/YQ8HQ7sRW2— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 12, 2025 -
సూర్యకుమార్ వల్లే సాధ్యమైంది
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో మూడో టి20లో అజేయ సెంచరీతో ఆకట్టుకున్న హైదరాబాద్ బ్యాటర్ ఠాకూర్ తిలక్ వర్మ... ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సాధారణంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే తిలక్... ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అడిగి మరీ మూడో స్థానంలో బరిలోకి దిగి సత్తా చాటాడు. తొలి రెండు టి20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి వరుసగా 33, 20 పరుగులు చేసిన తిలక్ వర్మ... తనను తాను నిరూపించుకోవడానికి ఒక స్థానం ముందే బ్యాటింగ్‌కు దిగాలనుకుంటున్నట్లు కెప్టెన్ కు వివరించాడు. దీనికి అంగీకరించిన సూర్యకుమార్ తాను బ్యాటింగ్ చేయాల్సిన మూడో ప్లేస్‌లో తిలక్‌ను దింపాడు. దీంతో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే క్రీజులోకి అడుగుపెట్టిన తిలక్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. సెంచరీ అనంతరం అభివాదం చేస్తున్న సమయంలో తిలక్ తన హావభావాలతో సారథికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ‘సూర్యకుమార్ వల్లే అది సాధ్యమైంది. అతడు మూడో స్థానంలో ఆడే అవకాశం ఇవ్వడంతోనే స్వేచ్ఛగా ఆడాను. గత రెండు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశా. నాకు స్వతహాగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్ ఇష్టం. అదే సూర్యకు చెప్పా. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రే అతడు దానికి అంగీకారం తెలిపాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు మైదానంలో నేనేంటో నిరూపించుకుంటా అని ముందే చెప్పాను. విఫలమైన సమయంలోనూ టీమ్ మేనేజ్మెంట్ అండగా నిలిచింది. సహజ సిద్ధమైన ఆట ఆడేవిధంగా ప్రోత్సహించింది. కెపె్టన్, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వికెట్ పడ్డా వెనకడుగు వేయవద్దని సూచించారు’ అని తిలక్ చెప్పుకొచ్చాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మూడో టి20లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించగా... తిలక్ వర్మ 56 బంతుల్లోనే అజేయంగా 107 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్లో తొలి శతకం తన పేరిట లిఖించుకున్నాడు. అందులో 7 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. గాయాల కారణంగా కొన్నాళ్ల పాటు జట్టుకు దూరమైన తిలక్ వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడమే తన పని అని వివరించాడు. ఆల్‌రౌండర్‌గా జట్టుకు సేవలందించేందుకు ఎప్పుడూ ముందుంటానని వెల్లడించాడు. -
ఆనంద్‌కు మూడో స్థానం!
కాసాబ్లాంకా చెస్ వేరియంట్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) విజేతగా నిలిచాడు. నలుగురు మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య మొరాకోలో ఆరు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కార్ల్సన్ 4.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొందాడు.ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్, భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. హికారు నకముర (అమెరికా) 3.5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. ఆనంద్ ఒక గేమ్‌లో ఓడిపోయి, మరో గేమ్‌లో నెగ్గి, మిగతా నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు.ఇవి చదవండి: జ్యోతి యర్రాజీకి స్వర్ణం, రజతం.. -
Norway Chess 2022: ఆనంద్‌కు మూడో స్థానం
స్టావెంజర్: నార్వే ఓపెన్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్‌ను భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడో స్థానంతో ముగించాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో 52 ఏళ్ల ఆనంద్ 14.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్, కార్ల్సన్ (నార్వే) 16.5 పాయింట్లతో టైటిల్‌ను సొంతం చేసుకోగా... మమెదైరోవ్ (అజర్బైజాన్) 15.5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. చాంపియన్ కార్ల్‌సన్‌కు 7,50,000 నార్వే క్రోన్లు (రూ. 60 లక్షల 36 వేలు), రన్నరప్ మమెదైరోవ్కు 4,00,000 నార్వే క్రోన్లు (రూ. 32 లక్షల 19 వేలు), మూడో స్థానంలో నిలిచిన ఆనంద్‌కు 2,50,000 నార్వే క్రోన్లు (రూ. 20 లక్షల 12 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
భారత్‌కు మూడో స్థానం
అంటాల్యా (టర్కీ): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ మూడు జట్లపై (ఇండోనేసియా, న్యూజిలాండ్, కొరియా) గెలిచి, రెండు జట్ల (చైనా, జపాన్) చేతిలో ఓడిపోయింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన చైనా, జపాన్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత పొం దాయి. కొరియాతో జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో భారత్ తొలి రెండు సింగిల్స్‌లో నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. తొలి సింగిల్స్‌లో రియా భాటియా 6–3, 2–6, 6–3తో నా రి కిమ్‌పై నెగ్గగా... రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 6–2, 6–3తో దాబిన్ కిమ్ ను ఓడించి టీమిండియాకు విజయాన్ని అందించింది. -
‘న్యూస్ ఆన్ ఎయిర్’ హైదరాబాద్ ఘనత
సాక్షి, న్యూఢిల్లీ: న్యూస్ ఆన్ ఎయిర్ సేవల వినియోగంలో హైదరాబాద్ మూడోస్థానం దక్కించుకుంది. ప్రసార భారతి సంస్థ అధికారిక యాప్ ‘న్యూస్ ఆన్ ఎయిర్’లో ఆల్ ఇండియా రేడియోకు సంబంధించిన 240 రేడియో సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం90 దేశాల్లో శ్రోతలు ఉన్నారు. మే 15-31వ తేదీల మధ్య ఈ యాప్‌లోని సేవల ర్యాంకులను ప్రసార భారతి విడుదల చేసింది. న్యూస్ ఆన్ ఎయిర్ రేడియో సర్వీసుల్లో వివిధ భారతి మొదటి స్థానంలో నిలిచింది. నగరాల వారీగా చూస్తే ‘న్యూస్ ఆన్ ఎయిర్’యాప్ సేవలు వినియోగించిన నగరాల్లో పుణె, బెంగళూరు, హైదరాబాద్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా పొందిన సేవల్లో వివిధ భారతి నేషనల్ మొదటి స్థానంలో, ఎఫ్.ఎం.రెయిన్ బో విజయవాడ రెండో స్థానం, ఆలిండియా రేడియో(ఏఐఆర్) తెలుగు 3వ స్థానంలో, ఏఐఆర్ హైదరాబాద్ వీబీఎస్ 4వ స్థానంలో, హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్ బో 5వ స్థానంలో నిలిచాయి. వీబీఎస్ విజయవాడ, ఏఐఆర్ హైదరాబాద్ ఏ, ఏఐఆర్ విశాఖ పీసీ, ఏఐఆర్ కర్నూలు సేవలు తదుపరి స్థానాల్లో నిలిచాయి. -
మిస్ యూనివర్స్ థర్డ్ రన్నరప్.. సవాళ్ల శిఖరం
మహిళలు తమ కలలను నిజం చేసుకోవడానికి వారి జీవితంలో ప్రతిరోజూ అసమానతల సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. అడ్లైన్ కాస్టెలినో సవాళ్లను ఎదుర్కొంటూనే విజయపథం వైపుగా పయనిస్తోంది. కర్ణాటకకు చెందిన ఈ 22 ఏళ్ల మిస్ ఇండియా సోమవారం జరిగిన 69వ మిస్ యూనివర్స్ పోటీలో థర్డ్ రన్నరప్ (నాలుగో స్థానం)గా నిలిచి దేశం గర్వించేలా చేసింది. ఎవరీ అడ్లై్లన్ కాస్టెలినో... కువైట్‌లో పుట్టి పెరిగిన భారతీయ యువతి అడ్లైన్ కాస్టెలినో. కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని ఉదయరాకు చెందిన ఆల్ఫోన్స్, మీరా కాస్టెలినో దంపతులు ఉద్యోగరీత్యా కువైట్‌లో ఉండేవారు. అక్కడే అడ్లై్లన్ పుట్టింది. కువైట్‌లోని ఇండియన్ సెంట్రల్ స్కూల్లో చదువుకుంది. . ‘అమ్మాయిల ఎదుగుదలకు ఎలాంటి దారి లేని దేశం అది. అలాంటి చోట పుట్టి, పెరిగిన నేను మిస్‌యూనివర్స్‌గా గెలుపొందిన వారిని విస్మయంగా చూసేదాన్ని. ప్రతిష్టాత్మక వేదిక మీద మిస్‌యూనివర్స్ కిరీటం అందుకోవాలన్నది నా కల’’ అంటూ తన జీవన ప్రయాణాన్ని వివరిస్తోంది అడ్లైన్ కాస్టెలినో. ఆమె ఆకాంక్షను తెలుసుకున్న తల్లిదండ్రులు 15 ఏళ్ల వయసులో భారతదేశానికి తిరిగి వచ్చారు. అక్కడ నుంచి ముంబై వెళ్లారు. సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో చదువుకున్న అడ్లైన్ ఆ తర్వాత విల్సన్ కాలేజీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. మాతృభాష కొంకణితో పాటు ఇంగ్లిష్, హిందీ, కన్నడ భాషలలో నిష్ణాతురాలు. 2020లో జరిగిన లివా మిస్ దివా యూనివర్స్ పోటీలో విజేతగా నిలిచిన అడ్లైన్కు ఇప్పుడు 22 ఏళ్లు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీలో భారత ప్రతినిధిగా నిలిచింది. సాధనే ధ్యేయంగా ముందడుగు ‘మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకోవాలన్న ఆకాంక్ష సౌకర్యవంతంగా ఉండే జీవనం నుంచి నన్ను బయటకు తోసేసిందనే చెప్పాలి’ అంటారు అడ్లైన్. ఇప్పుడు ఇండియాలో అడ్లైన్ ఒక టాప్ మోడల్. ప్రముఖ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది. ఫ్యాషన్, లైఫ్‌సై ్టల్ బ్రాండ్లు, మ్యాగజైన్ కవర్లు, టెలివిజన్, డిజిటల్ ప్రచారాలలో కనిపిస్తోంది. మరిన్ని సృజనాత్మక రంగాలలో అవకాశాలను పొందడానికి కృషి చేస్తోంది. స్మైల్ ట్రెయిన్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉంది. మహిళల ఆరోగ్య సంరక్షణకు అందించే స్నేహ అనే ఎన్జీవోతో కలిసి పనిచేస్తోంది. రైతుల హక్కుల కోసం, అణగారిన గ్రామీణ వర్గాలకు చేయూతనందించే సంస్థలతో కలిసి పనిచేస్తోంది. జీవనం గడవడానికి కొన్నాళ్లు షూస్ తయారుచేసి, అమ్మకాలు కొనసాగించింది. టాప్మోడల్గా, స్వచ్ఛంద సేవకురాలిగా ఎదగడానికి ముందు తనలో ఉన్న నత్తి సమస్యను అధిగమించడానికి కొన్నేళ్లపాటు సాధన చేసింది అడ్లైన్. ఇండియా నుంచి మిస్‌యూనివర్స్ కిరీటానికి పోటీపడి థర్డ్ రన్నరప్‌గా నిలిచింది.. దేశ మహిళల తరపున.. ‘ఎప్పుడూ సాహసోపేత వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడతాను. ఎంతటి కష్టమైనా వెనుకంజ వేయను. వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయత్నించడానికి సిద్ధంగా ఉంటాను’ అంటున్న ఈ నవీన యువతి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అనిపించకమానదు. ‘నిన్నటి వరకు నన్ను నేను ఒక అమ్మాయిలా భావించాను. కానీ, ఇప్పుడు నేను సమాజానికి మద్దతు ఇచ్చే ఒక మహిళను. ఈ ప్రయాణం నాకు ఎంతో నేర్పించింది. ఈ దేశం ఇచ్చే ప్రేమను నేను ఎప్పటినుంచో పొందుతున్నాను. నాకు మద్దతుగా నిలిచి నేను థర్డ్ రన్నరప్(నాల్గవ స్థానంలో)గా నిలిచేందుకు సాయం చేసిన దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు’ అని తెలిపింది అడ్లైన్ కాస్టెలినో. -
Tamil Nadu: ఓడినా సత్తాచాటిన సీమాన్
సాక్షి, చెన్నై: నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ఎన్నికల్లో ఓడినా సత్తా చాటుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థులు 183 నియోజకవర్గాల్లో 3వ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. ఇక 39 చోట్ల అన్నాడీఎంకే అభ్యర్థుల విజయ అవకాశాలకు గండికొట్టారు. ఒంటరిగా బరిలోకి.. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, పీఎంకే, మక్కల్ నీదిమయ్యం, ఎస్ఎంకే, ఐజేకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తదితర పార్టీలు కూటములతో ఎన్నికలను ఎదుర్కొన్నాయి. అయితే సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. 234 స్థానాల్లో 117 చోట్ల మహిళా అభ్యర్థులను నిలబెట్టారు. పుంజుకుంటున్న సీమాన్ తాజా ఎన్నికల్లో డీఎంకే పార్టీ 37.7 శాతం ఓట్లు సాధించి అధికారం దక్కించుకుంది. ఇక అన్నాడీఎంకే పార్టీ 33.29 శాతం ఓట్లు సాధించి ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఇక నామ్ తమిళర్ కట్చి 5 శాతానికి పైగా ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. 2011 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన సీమాన్ పార్టీ 1.7 శాతం ఓట్లను దక్కించుకుంది. 2016లో 2.15 శాతం సాధించింది. కమల్ కూటమి, దినకరన్–విజయకాంత్ కూటమి నాలుగు స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్కరూ గెలవలేదు కానీ.. తాజా ఎన్నికల్లో సీమాన్‌తో పాటు ఆ పార్టీ అభ్యర్థులెవరూ గెలవలేదు. అయితే ఇతరుల విజయావకాశాలను మాత్రం దెబ్బతీశారు. తిరువొత్తియూరులో పోటీ చేసిన సీమాన్ ఓటమి పాలైనా 48,597 ఓట్లు పొందారు. తూత్తుకుడిలో ఆ పార్టీ అభ్యర్థి వేల్రాజ్ 30,741 ఓట్లు రాబట్టుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో 183 చోట్ల నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు 3వ స్థానంలో నిలవడం గమనార్హం. మొత్తంగా 5 శాతానికి పైగా ఓట్లు సాధించారు. 39 నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే ఓట్లకు చీల్చి వారి విజయావకాశాలను దెబ్బ తీశారు. అలాగే 10 చోట్ల డీఎంకే, 5 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్లకు గండికొట్టారు. మరోవైపు దినకరన్ పార్టీ 20 చోట్ల అన్నాడీఎంకే ఓట్లను చీల్చి వారి విజయావకాశాలను దెబ్బ తీసింది. పదిహేనేళ్ల తర్వాత అసెంబ్లీకి ప్రాతినిధ్యం డీఎంకే కూటమితో ఎన్నికలను ఎదుర్కొన్న వీసీకే, ఎండీఎంకే పార్టీలు చెరో నాలుగు స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలకు 2006 తర్వాత అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయాయి. తాజా గెలుపుతో ఆ పార్టీల అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఇక పీఎంకే, సీపీఎం, సీపీఐ సభ్యులు ఐదేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ఇక మేట్టూరులో పోటీచేసిన ఎన్నికల వీరుడు పద్మరాజన్‌కు ఈసారి 36 ఓట్లు రావడం విశేషం. అలాగే సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ (తొండముత్తూరు), మైల్ స్వామి (విరుగ్గంబాక్కం)లలో పోటీ చేయగా నోటా కన్నా తక్కువ ఓట్లు పడ్డాయి. చదవండి: Kamal Haasan: ఒంటరిగా పోటీ చేసుంటే బాగుండేది! -
ప్రపంచ విలువైన కంపెనీల్లో టీసీఎస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల్లో ఉన్న భారత దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు (టీసీఎస్) మరో గుర్తింపు లభించింది. ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్స్‌లో మూడవ స్థానం చేజిక్కించుకుంది. యాక్సెంచర్, ఐబీఎంలు తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయని బ్రాండ్ ఫైనాన్స్–2021 నివేదిక తెలిపింది. ఐటీ రంగంలో అంతర్జాతీయంగా టాప్–10లో భారత్ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో చోటు దక్కించుకున్నాయి. టీసీఎస్ బ్రాండ్ విలువ 2020తో పోలిస్తే 2021లో 1.4 బిలియన్ డాలర్లు ఎగసి 14.9 బిలియన్ డాలర్లకు చేరింది. వృద్ధి పరంగా 25 ఐటీ కంపెనీల్లో ఇదే అత్యధికం. కస్టమర్లు తమపై ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనమని టీసీఎస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆర్.రాజశ్రీ ఈ సందర్భంగా తెలిపారు. మెరుగైన ప్రతిభ.. ఐటీ కంపెనీలన్నిటి మొత్తం బ్రాండ్ విలువ 3 శాతం తగ్గితే.. టీసీఎస్ సుమారు 11 శాతం వృద్ధి సాధించడం ఇక్కడ గమనార్హం. 2020 నాల్గవ త్రైమాసికంలో ఈ సంస్థ ఏకంగా 6.8 బిలియన్ డాలర్ల డీల్స్‌ను చేజిక్కించుకోవడంతో బలమైన ఆదాయం నమోదు చేసింది. ఐటీ రంగంలో టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సైతం గరిష్ట స్థాయిని తాకింది. బ్రాండ్ విలువ పరంగా ప్రపంచంలో ఈ రంగంలో రెండవ స్థానానికి చేరువలో టీసీఎస్ ఉందని బ్రాండ్ ఫైనాన్స్ సీఈవో డేవిడ్ హైగ్ తెలిపారు. రికవరీ మొదలుకావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐటీ రంగంతోపాటు యూఎస్, యూరప్‌లో ఫైనాన్షియల్ సెక్టార్లో పెట్టుబడులు పెరగడం కారణంగా రాబోయే ఏడాదిలో మరింత మెరుగైన ప్రతిభ కనబరుస్తుందని నివేదిక వెల్లడించింది. సంస్థలో ప్రస్తుతం 4,69,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తొలి స్థానంలో యాక్సెంచర్.. ప్రపంచంలో అత్యంత విలువైన, బలమైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా యాక్సెంచర్ తన స్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ సంస్థ బ్రాండ్ వాల్యూ 26 బిలియన్ డాలర్లుగా ఉంది. రెండవ స్థానాన్ని పదిలపర్చుకున్న ఐబీఎం బ్రాండ్ విలువ 16.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక కాగ్నిజెంట్‌ను దాటి నాల్గవ స్థానానికి ఇన్ఫోసిస్ ఎగబాకింది. ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 19 శాతం అధికమై 8.4 బిలియన్ డాలర్లుగా ఉంది. వేగంగా వృద్ధి చెందుతున్న టాప్–10 బ్రాండ్లలో స్థానం సంపాదించింది. మహమ్మారికి ముందే డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సర్వీసెస్‌పై దృష్టిసారించాలన్న ప్రాముఖ్యతను గుర్తించింది. కన్సల్టింగ్, డేటా మేనేజ్మెంట్, క్లౌడ్ సర్వీసెస్ విభాగాల్లో భారీ ప్రాజెక్టులను దక్కించుకోవడంతో ఇన్ఫోసిస్ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. కాగ్నిజెంట్ బ్రాండ్ విలువ 6 శాతం తగ్గి 8 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. హెచ్‌సీఎల్–7, విప్రో–9, టెక్ మహీంద్రా–15వ స్థానానికి వచ్చి చేరాయి. -
సంస్కరణల్లో తెలంగాణ నం.3
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్రం నిర్దేశించిన సంస్కరణలను పురపాలికల్లో విజయవంతంగా అమలుపరిచిన దేశంలోని మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీని ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి రూ.2,508 కోట్ల అదనపు రుణాలను సమీకరించ డానికి రాష్ట్రం అర్హత సాధించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం గురువారం ఈ మేరకు అనుమతి జారీ చేసింది. ఈ సంస్కరణ లను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ పూర్తి చేయగా, ఈ జాబితాలో చేరిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మూడు రాష్ట్రాలు మొత్తం రూ.7,406 కోట్ల అదనపు రుణాలు సమీకరించుకోవడానికి అర్హత పొం దాయి. ప్రజలకు మెరుగైన వైద్యం, పారిశుద్ధ్య సేవలను అందించేందుకు వీలుగా పురపాలి కలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ సంస్కరణలు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఆ సంస్కరణలివే.. సంస్కరణల కోసం నాలుగు పౌర–కేంద్రీకృత ప్రాంతాలను కేంద్రం గుర్తించింది. అవి.. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వ్యవస్థ అమలు, వ్యాపార సంస్కరణల సులభతరం, పట్టణ స్థానిక సంస్థ/ యుటిలిటీ సంస్కరణలు, విద్యుత్ రంగ సంస్కర ణలు.. కోవిడ్ మహమ్మారితో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలకు ఊరట కలిగించేందుకు కేంద్రం 2020 మే 17న ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం పేర్కొన్న సంస్కరణలను అమలు పరిస్తే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువలో 2% అదనపు రుణాలను ఆయా రాష్ట్రాలు పొంద డానికి అర్హత సాధిస్తాయని అప్పట్లో తెలియజేసింది. ఈ సంస్కరణల అమలులో భాగంగా ఆస్తుల మార్కెట్ విలువను ప్రామాణికంగా తీసుకుని వాటి వైశాల్యం (ఫ్లోర్ ఏరియా) ఎంత ఉంటే ఆ మేరకు ఆస్తి పన్నులు విధించేలా పురపాలికల్లో ఆస్తి పన్నుల రేట్లను ప్రకటించాలని కేంద్రం పేర్కొంది. నీటి సరఫరా, డ్రైనేజీ, మురుగునీటి ప్రవాహ సేవలకు ప్రస్తుతం అవుతున్న వ్యయం ఆధారంగా వీటికి సంబంధిం చిన చార్జీలను సైతం ఫ్లోర్ ఏరియా ఆధారంగా విధించాలని నిర్దేశించింది. అయితే ఇప్పటివరకు 10 రాష్ట్రాలు ‘ఒకే దేశం ఒకే రేషన్ కార్డు’వ్యవస్థను అమలు చేశాయి. 7 రాష్ట్రాలు సులభ వ్యాపార సంస్కరణలు అమలు చేశాయి. 3 రాష్ట్రాలు మాత్రమే నాలుగింటిలో మూడు సంస్కరణలను అమలు చేశాయి. కాగా, కేంద్రం నిర్దేశించిన సంస్కరణల అమలుకు గత మూడు నెలలుగా తీవ్రంగా కష్టపడ్డామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
మా టీకా 94.5% ప్రభావవంతం
న్యూయార్క్: తాము అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ టీకా 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరీక్షల్లో తేలిందని అమెరికాలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ మోడెర్నా సోమవారం ప్రకటించింది. కరోనాను అంతం చేసే విషయంలో తాము ఉమ్మడిగా అభివృద్ధి చేస్తున్న టీకా 90 శాతానికి పైగానే ప్రభావం చూపుతున్నట్లు ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మోడెర్నా సంస్థ ఎంఆర్ఎన్ఏ–1273 పేరిట కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది 94.5 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలోని డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు మూడోదశ పరీక్షల్లో వెల్లడైందని మోడెర్నా తాజాగా పేర్కొంది. వ్యాక్సిన్‌ను తీసుకొచ్చే విషయంలో ఇదొక కీలకమైన ముందడుగు అని వెల్లడించింది. తమ టీకా వినియోగానికి వీలుగా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి ఎమర్జెన్సీ హెల్త్ ఆథరైజేషన్(ఈయూఏ) దరఖాస్తు చేసుకోవాలని మోడెర్నా భావిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ వినియోగం కోసం అనుమతులు తీసుకోవాలని నిర్ణయించింది. మూడో దశ ప్రయోగాల్లో ‘కోవాగ్జిన్’.. హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ‘కోవాగ్జిన్’ మూడో దశ ప్రయోగాల్లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ఆ సంస్థ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా సోమవారం తెలియజేశారు. ఆయన సోమవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన వర్చువల్ సదస్సులో మాట్లాడారు. ముక్కు ద్వారా చుక్కల రూపంలో అందించే మరో కరోనా వ్యాక్సిన్‌ను సైతం తాము అభివృద్ధి చేస్తున్నామని, ఇది వచ్చే ఏడాది కల్లా సిద్ధమవుతుందని తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో కలిసి అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ మూడో దశ ప్రయోగాల్లోకి అడుగుపెట్టిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా బయోసేఫ్టీ లెవల్3 (బీఎస్ఎల్3) ఉత్పత్తి సదుపాయం ఉన్న ఏకైక సంస్థ భారత్ బయోటెక్ అని గుర్తుచేశారు. కోవాగ్జిన్ ఫేజ్–1, ఫేజ్–2 ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు భారత్ బయోటెక్ గత నెలలో వెల్లడించింది. ఫేజ్ 1/2 దశల్లో బీఈ సంస్థ వ్యాక్సిన్ బయోలాజికల్ ఈ.లిమిటెడ్(బీఈ) సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఫేజ్ 1/2 క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశించింది. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో చురుగ్గా పనిచేస్తోంది. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి లభించింది. టీకా పంపిణీ సవాలే న్యూఢిల్లీ: కోవిడ్–19 నిరోధానికి అభివృద్ధి చేస్తున్న టీకాలు అందుబాటులోకి వచ్చినా దేశంలోని 135 కోట్ల మందికి వాటిని పంపిణీ చేయడం పెను సవాలేనని శీతలీకరణ వ్యవస్థల నిపుణుడు, నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చెయిన్ డెవలప్మెంట్ సీఈవో పవనేశ్ కోహ్లీ తెలిపారు. దేశం మొత్తమ్మీద 28 వేల టీకా కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల నెట్వర్క్ అందుబాటులో ఉండగా వీటన్నింటిలోనూ –25 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న టీకాలను నిల్వ చేసుకునే సౌకర్యం లేదన్నారు. ఈ సమస్యను ఎదో ఒకలా పరిష్కరించగలిగినా వాటిని స్థానిక మెడికల్ షాపులు, ఇతర దుకాణాల్లోనూ అందుబాటులో ఉంచడం మరో సవాలని పవనేశ్ తెలిపారు. -
హామిల్టన్‌కు నిరాశ
సోచి (రష్యా): దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ పేరిట 91 టైటిల్స్‌తో ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో రెండు వారాలు వేచి చూడక తప్పదు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్‌కు ఈ అవకాశం వచ్చినా ప్రాక్టీస్ సమయంలో రెండుసార్లు అతను నిబంధనలు ఉల్లంఘించాడు. ప్రాక్టీస్‌కు అనుమతిలేని ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తూ ట్రాక్‌పై రెండుసార్లు రావడంతో అతనిపై 10 సెకన్ల పెనాల్టీని విధించారు. ఫలితంగా ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ చివరకు మూడో స్థానంలో నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ నిర్ణీత 53 ల్యాప్‌లను గంటా 34 నిమిషాల 00.364 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. బొటాస్ కెరీర్లో ఇది తొమ్మిదో టైటిల్‌కాగా ఈ సీజన్లో రెండో విజయం. ప్రస్తుతం 10 రేసులు ముగిశాక హామిల్టన్ 205 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బొటాస్ (161 పాయింట్లు), వెర్స్టాపెన్ (128 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు జర్మనీ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 11న జరుగుతుంది. రష్యా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. బొటాస్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. హామిల్టన్ (మెర్సిడెస్), 4. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్), 5. రికియార్డో (రెనౌ), 6. లెక్లెర్క్ (ఫెరారీ), 7. ఒకాన్ (రెనౌ), 8. క్వియాట్ (అల్ఫాటౌరి) 9. పియరీ గాస్లీ (అల్ఫాటౌరి), 10. అలెగ్జాండర్ ఆల్బోన్ (రెడ్‌బుల్). -
మూడో స్థానంలో రాయుడు ఆడాలి
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి అనూహ్యంగా తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్రధాన ఆటగాడు సురేశ్ రైనా స్థానాన్ని అంబటి రాయుడుతో భర్తీ చేయాలని న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టయిరిస్ అభిప్రాయపడ్డాడు. సీఎస్కే జట్టులో మూడో స్థానంలో బరిలో దిగేందుకు రాయుడే సరైనవాడని అతను పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తానైతే అదే పని చేస్తానని ఈ కివీస్ మాజీ ఆల్‌రౌండర్ వ్యాఖ్యానించాడు. ‘రైనా లాంటి క్లాస్ క్రికెటర్‌ను, నిలకడగా రాణించే ఆటగాడిని, మైదానంలో పరుగుల వరద పారించడంతో పాటు ఫీల్డింగ్‌లో ఆకట్టుకునే ప్లేయర్‌ను వెతకడం చాలా కష్టం. చెన్నై జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవ లేనప్పటికీ మూడో స్థానంలో కుదురుకునే ప్లేయర్‌ను ఎంచుకోవడం ప్రస్తుతానికి సవాలే. రైనాతో పాటు హర్భజన్ కూడా లేకపోవడం జట్టుపై ప్రభావం చూపనుంది. మూడో స్థానంలో రాయుడు సరైన ఎంపిక. రైనా స్థానాన్ని అతను భర్తీ చేయగలడు. దీనితో పాటు టాపార్డర్‌లో ఇద్దరు విదేశీయులతో పాటు యువ రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడిస్తే బావుంటుంది. భారీ హిట్టింగ్ చేసే ఆటగాడిని తీసుకున్నా మంచిదే’ అని స్టయిరిస్ వివరించాడు. -
3వ స్థానంలో తెలంగాణ
ఆకలి తీర్చడంలో.. ఆకలి తీర్చే అంశంలో తెలంగాణ 36 స్కోరుతో 16వ స్థానంలో నిలిచింది. గోవా (76), మిజోరం (75), కేరళ (74) తొలి 3 స్థానా ల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్ల లోపు వయసు గల చిన్నారుల్లో 29.3% మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. గర్భిణు ల్లో 49.8%మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. 6–59 నెలల వయసు గల చిన్నారుల్లో 37.8% మంది రక్తహీనత తో, 4 ఏళ్ల లోపు బాలల్లో 30.8 % బరువులోపంతో బాధపడుతున్నారు. సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో తెలంగాణ మూడో ర్యాంకును సాధించింది. భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ) సూచీ–2019 నివేదికను నీతిఆయోగ్ సోమవారం ఇక్కడ విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి రూపొందించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు–2030 అమలు దిశగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పురోగతి ఆధారంగా ఈ నివేదిక రూ పొందించింది. తొలిసారిగా 2018లో ఈ సూచీని రూపొందించిన నీతిఆయోగ్.. ఈ సూచీ రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని పెంచాలని ఆకాంక్షించింది. 2018లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ 2019లో 67 స్కోరుతో మూడో స్థానానికి ఎగబాకింది. ఇక దేశ సగటు స్కోరు 60గా ఉంది. పేదరిక నిర్మూలనలో.. పేదరిక నిర్మూలనలో 72 స్కోర్‌తో తమిళనాడు నంబర్‌వన్‌గా నిలవగా, 52 స్కోరుతో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రంలో 66.40% మంది ఏదో ఒక వైద్య బీమా పథకంలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో 84.40% మంది కి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద పని లభిస్తోంది. అర్హులైన వారిలో 12.2% మహిళలకు ప్రసూ తి ప్రయోజనాలు లభిస్తున్నాయి. 1.5% రాష్ట్ర జనా భా కచ్చా గృహా ల్లో నివాసముంటోంది. రాష్ట్రంలో వైద్యుల కొరత మంచి ఆరోగ్యం, ప్రజాశ్రేయస్సులో 82 స్కోరుతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ 66 స్కోరుతో 7వ స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రంలో మాతృత్వ మరణాల రేటు (ఎంఎంఆర్) ప్రతి లక్ష మందికి 76గా నమోదైంది. ఆస్పత్రుల్లో ప్రసవాలు 71.8 శాతం జరుగుతున్నాయి. ఐదేళ్లలోపు బాలల మరణాల రేటు ప్రతి 1,000 మందికి 32గా ఉంది. 0–5 ఏళ్ల పిల్లలో టీకాలన్నీ వేయించుకున్న వారు 70.1%ఉన్నారు. ప్రతి లక్ష మందిలో క్షయవ్యాధిగ్రస్తులు 142 మంది ఉన్నారు. ప్రతి 1000 మందిలో కొత్తగా హెచ్ఐవీ సోకినవారు 0.26 మంది ఉన్నారు. ప్రతి 10 వేల జనాభాకు 44.5 మంది వైద్యులు, నర్సులుండాల్సి ఉండగా, తెలంగాణలో 11 మంది మాత్రమే ఉన్నారు. ఉన్నత విద్యలో ప్రవేశాలు అంతంతే.. నాణ్యమైన విద్యలో హిమాచల్‌ప్రదేశ్, కేరళ తొలి 2 స్థానాల్లో ఉండగా.. తెలంగాణ 9వ ర్యాంకు సాధించింది. 1–10వ తరగతి వరకు ప్రవేశాల రేటు తెలంగాణలో 82.54% ఉంది. ప్రాథమికోన్నత విద్య స్థాయి లో 22.49% డ్రాపౌట్స్ నమోదయ్యాయి. ఇక 18 నుంచి 25 ఏళ్ల మధ్య వారిలో కేవలం 36.2 % మంది ఉన్నత విద్య ప్రవేశాలు పొందుతున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను బోధించేవారిలో 46.95% మాత్రమే సుశిక్షితులున్నారు. 16 లక్ష్యాలు.. 2011 నుంచి డేటా 2011 జనగణనను, నాలుగైదేళ్ల క్రితం నుంచి 2019 వరకు గల గణాంకాలను ఆధారంగా దాదాపు 62 అంశాలను పరిగణనలోకి తీసుకుని 16 లక్ష్యాలకు స్కోరు కేటాయించారు. కేంద్ర గణాంకాలు, పథక అమలు శాఖ, గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్, ఐక్యరాజ్యసమితి సహకారంతో నీతిఆయోగ్ ఈ సూచిని రూపొందిం చింది. వివిధ స్కోర్ల ఆధారంగా 4 కేటగిరీ లుగా రాష్ట్రాలను విభజించింది. 0 నుంచి 49 స్కోరు సాధించిన రాష్ట్రాలను ఆశావహులు(ఆస్పిరెంట్), 50 నుంచి 64 స్కోరు సాధించిన రాష్ట్రాలను క్రియాశీలురు (పర్ఫార్మర్), 65 నుంచి 99 స్కోరు సాధించిన రాష్ట్రాలను ముందు వరస (ఫ్రంట్ రన్నర్)గా, 100 స్కోరు సాధించిన రాష్ట్రాలను సాధకులు (అచీవర్)గా విభజించింది. 2018లో కేరళ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే ఫ్రంట్రన్నర్లో నిలిచాయి. ఈసారి 8 రాష్ట్రాలు ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో చోటు సాధించాయి. వీటిలో తెలంగాణతో పాటు కర్ణాటక, సిక్కిం, గోవా కూడా ఉన్నాయి. కేరళ (70) మొదటిస్థానంలో, హిమాచల్ ప్రదేశ్ (60) రెండోస్థానంలో నిలిచింది. -
32 కాదు.. 28 దంతాలే..
సాక్షి, హైదరాబాద్: చిన్నతనంలో పాలదంతాలు వస్తాయి. 7–9 సంవత్సరాల మధ్యలో ఇవి ఊడిపోయి.. పైన, కింద కలిపి కొత్తగా 28 దంతాలు ఏర్పడతాయి. కానీ బాల్యంలో ఆహారాన్ని ఎక్కువగా నమిలే అలవాటు లేకపోవడం, ఐస్‌క్రీమ్స్, చాక్లెట్లు ఎక్కువ తినడం వల్ల నోటికి సరైన వ్యాయామం ఉండటం లేదు. దీంతో దవడలు కుం చించుకుపోతున్నాయి. ఫలితంగా అమ్మాయిల్లో 16 ఏళ్లు, అబ్బాయిల్లో 18 ఏళ్లు దాటాక పుట్టుకొచ్చే నాలుగు జ్ఞానదంతాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. నేటితరం యువతీ యువకుల్లో 90 శాతం మందికి జ్ఞానదంతాలు లేవు. ఒకవేళ ఉన్నా.. అవి ఎగుడుదిగుడుగా, చిగుళ్లలోకి చొచ్చుకుపోయి ఉన్నాయి. పిల్లల దవడ సైజు తగ్గడమే ఇందుకు కారణం. గ్రామీణ ప్రాంత యువతతో పోలిస్తే, పట్టణ ప్రాంతాల్లోని కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న యువతలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. జ్ఞానదంతాలు సరిగా ఏర్పడని వారు ఆహారం తీసుకునేప్పుడు ఆ దంతాలు చిగుళ్లకు గుచ్చుకుని తీవ్రమైన పంటి, తల నొప్పి కలుగుతున్నాయి. ప్రస్తుతం యువతలో వెలుగుచూస్తున్న ఈ సమస్యలకు ఇదే కారణమని సర్వేలో తేల్చారు. మన దంత ఆరోగ్యం అంతంతే! ►విదేశీయులు విధిగా రోజుకు రెండుసార్లు దంతా లు శుభ్రం చేసుకుంటారు. ఇది వారి దినచర్యలో ఒక భాగం. మన దేశంలో నూటికి 90 శాతం మందికి దంత ఆరోగ్యంపై అవగాహన లేదు. ►ఇట్టే కరిగిపోయే చాక్లెట్లు, స్వీట్లు వంటి పదార్థాలను ఎక్కువ తీసుకోవడం, రాత్రి పడుకునే ముందు దంతాలు శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోట్లో వివిధ రకాల బ్యాక్టీరియా ఏర్పడుతోంది. ►15 నుంచి 30 ఏళ్ల యువతలో 30 – 40% మంది నోటి నుంచి దుర్వాసనతో బాధపడుతుంటే, 60 నుంచి 70 శాతం మంది చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. ►ఆహారాన్ని నమలకుండా మింగడం వల్ల నోట్లో ఊరే లాలాజలం ఉత్పత్తి శాతం తగ్గిపోతోంది. దీంతో ‘హెచ్పైలోరే’ అనే బ్యాక్టీరియా కడుపులోకి చేరి అజీర్తి, అల్సర్లకు కారణమవుతోంది. ఏం చేయాలి? ►ఆహారాన్ని పూర్తిగా నమిలి మింగాలి. దీనివల్ల దవడల పరిమాణం పెరుగుతుంది. జ్ఞానదంతాల పుట్టుకకు వీలవుతుంది. ►గట్టిగా ఉన్న కాయలు, పండ్లు, గింజలు మెత్తగా నమలడం వల్ల పంటికి ఎక్సర్సైజ్ అవుతుంది. నోటిలో లాలాజలం సమృద్ధిగా ఉత్పత్తి అవుతుంది. ఆహారం త్వరగా జీర్ణం కావడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ►రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రం చేసుకుంటే దంత ఆరోగ్యం మెరుగవుతుంది. దంత కేన్సర్‌లో సిటీది మూడో స్థానం ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే దంత కేన్సర్ ఎక్కువ. పొగాకు, జర్దా, పాన్, గుట్కాలు ఎక్కువగా నమలడమే ఇందుకు కారణం. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్, బిహార్ ఒకటి, రెండో స్థానాల్లో ఉంటే, హైదరాబాద్ మూడో స్థానంలో నిలుస్తోంది. కోల్‌కతా, చెన్నై, బెంగళూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పొగాకు ఉత్పత్తులు వాడుతున్న వారిలో 38 శాతం మంది నోటి కేన్సర్‌తో, 28 శాతం మంది నోటి చర్మ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. మనతో పోలిస్తే దంత ఆరోగ్యంపై కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వాసుల్లో అవగాహన ఎక్కువ. – డాక్టర్ బి.చంద్రకాంత్‌రావు, దంత వైద్యనిపుణుడు, మహావీర్ హాస్పిటల్, మాసబ్‌ట్యాంక్ -
టాప్–3 ఇంధన సంస్థ.. ‘రిలయన్స్’
న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్... ప్రపంచంలోనే 250 అతి పెద్ద ఇంధన సంస్థల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఏడో స్థానం నుంచి నాలుగు స్థానాలు ఎగబాకింది. ఎస్అండ్పీ గ్లోబల్ ప్లాట్స్ రూపొందించిన ఈ టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీల జాబితాలో ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 7వ స్థానంలో నిలిచింది. ఇది గతేడాది 14వ స్థానంలో ఉంది. మరోవైపు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) 20వ స్థానం నుంచి 11వ స్థానానికి చేరుకుంది. 2017 ర్యాంకింగ్స్‌లో మొత్తం 14 భారతీయ ఇంధన కంపెనీలు చోటు దక్కించుకున్నట్లు గ్లోబల్ ప్లాట్స్ ఒక ప్రకటనలో తెలియజేసింది. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతి పెద్దదైన కోల్ ఇండియా మాత్రం... ఈ జాబితాలో 38వ స్థానం నుంచి 45వ స్థానానికి పడిపోయింది. లిస్టులో భారత్ పెట్రోలియం(39), హిందుస్తాన్ పెట్రోలియం (48), పవర్ గ్రిడ్ (81), గెయిల్ (106) ర్యాంకులు దక్కించుకున్నాయి. అమెరికన్ సంస్థ ఎక్సాన్ మొబిల్ 12 సంవత్సరాల ఆధిపత్యానికి తెరదించుతూ.. రష్యాకి చెందిన గాజ్ప్రోమ్ ఈ లిస్టులో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అటు జర్మనీకి చెందిన ఇ.ఆన్ ఏకంగా 112 స్థానాలు ఎగబాకి 114వ ర్యాంకు నుంచి రెండో స్థానానికి చేరడం గమనార్హం. ఇక ఇ.ఆన్ తరువాతి స్థానాల్లో రిలయన్స్, కొరియా ఎలక్ట్రిక్, చైనా పెట్రోలియం, రష్యన్ సంస్థ పీజేఎస్సీ లుక్ ఆయిల్ వరుసగా నిలిచాయి. ఎక్సాన్ మొబిల్ ఈసారి 9వ స్థానానికి పడిపోయింది. ఆస్తుల విలువ, ఆదాయాలు, లాభాలు, పెట్టుబడులపై రాబడులు అనే నాలుగు అంశాల ప్రాతిపదికగా ఎస్అండ్పీ గ్లోబల్ ప్లాట్స్ ఈ జాబితాను రూపొందించింది. టాప్ 10 కంపెనీల నికర లాభాలు గతేడాది 63.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
సీన్ రివర్స్..!
నల్లగొండ : సరిగ్గా ఏడాది క్రితం మద్యం విక్రయాల్లో రాష్ట్రంలో నల్లగొండ జిల్లా మూడో స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. పల్లె నుంచి పట్నం వరకు నాటుసారా నామరూపాలు లేకుండా చేయడం ద్వారా మద్యం ఏరులై పారింది. దీంతో మద్యం విక్రయాల ద్వారా నెలకు సుమారు రూ.138.93 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. దీనికి పూర్తి భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు పయనిస్తున్నాయి. కారణాలు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం నెలకు రూ.2.75 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. మద్యం విక్రయాల్లో ఎక్సైజ్ శాఖ వైఫల్యాన్ని పసిగట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేరుగా రంగం ప్రవేశం చేయాల్సి వచ్చింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో మద్యం దుకాణాలు 264, బార్లు 25 ఉన్నాయి. వీటి ద్వారా 2016 జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు లిక్కర్ 2,37,794 పెట్టెలు అమ్ముడుకాగా...బీర్లు 2,52,750 పెట్టెలు అమ్మారు. తద్వారా ప్రభుత్వానికి రూ.114.92 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది అదే రోజుల్లో లిక్కర్ 2,29,661 పెట్టెలు, బీర్లు 2,16,328 పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో ప్రభుత్వానికి రూ.112.17 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు 2.39 శాతానికి పడిపోయాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.2.75 కోట్ల లోటు ఏర్పడింది. ఈ లోటును పూడ్చేందుకు ఎక్సైజ్ శాఖ శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. స్టేషన్ల వారీగా పరిశీలిస్తే.... మూడు జిల్లాల్లో కలిపి ఎక్సైజ్ ఎస్హెచ్ఓలు 15 ఉన్నాయి. వీటిల్లో భువనగిరి ఎస్హెచ్ఓ మినహా మిగిలిన 14 స్టేషన్ల పరిధిలో లిక్కర్, బీర్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయి. ప్రధానంగా బీర్ల విక్రయాలు మిర్యాలగూడ స్టేషన్ పరిధిలో 41.75 శాతం, నకిరేకల్ స్టేషన్ పరిధిలో 34.73, చండూరులో 19.70, హాలియాలో 29.91, నాంపల్లిలో 25.01, సూర్యాపేటలో 14.19, తుంగతుర్తిలో 27.73, హుజూర్‌నగర్‌లో 15.46 శాతానికి పడిపోయాయి. లిక్కర్ అమ్మకాలు దేవరకొండ స్టేషన్ పరిధిలో 12.17 శాతం, హాలియా 21.11 శాతం పడిపోయి. మిగిలిన స్టేషన్లల్లో 7.80 శాతం నుంచి 0.15 శాతానికి తగ్గాయి. అధికారుల అన్వేషణ మద్యం విక్రయాలు అమాంతంగా పడిపోవడానికి గల కారణాలను అన్వేషించే పనిలో భాగంగా ఎక్సైజ్ శాఖ కొన్ని ప్రధానమైన అంశాలతో ఒక నివేదిక రూపొందించింది. జిల్లా అధికారుల నివేదికలు, మద్యం వ్యా పారులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను క్రోడీకరించిన స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్...వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు నేరుగా రంగ ప్రవేశం చేసింది. నివేదికలోని ప్రధానాంశాలు లిక్కర్ విక్రయాలు తగ్గిన ప్రాంతాల్లో నాటుసారా ఆనవాళ్లు పూర్తిగా సమసిపోలేదని తెలిసింది. ప్రధానంగా దేవరకొండ, హాలియా, నాంపల్లి, మిర్యాలగూడ, చండూరు, తుంగతుర్తి స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో నాటుసారా విక్రయాలు ఊపందుకున్నాయి. సారాపై ఉక్కుపాదం మోపిన తర్వాత గ్రామాల్లో విపరీతంగా సేల్ అయిన ఆర్డనరీ (చీప్ లిక్కర్) లిక్కర్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో చీప్ లిక్కర్ సేల్స్ నల్లగొండ, దేవరకొండ, నకిరేకల్, చండూరు, హాలియా, నాంపల్లి స్టేషన్ల పరిధిలో 14 శాతానికి పడిపోయాయి. కరెన్సీ ఇబ్బందుల వల్ల గ్రామాల్లో మందుబాబులు సారా బాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల పెంచిన మద్యం ధరల్లో స్ట్రాంగు బీరు రూ.95 నుంచి రూ.110కి పెంచారు. దీంతో బీర్లు సేవించే వారంతా మీడియం బ్రాండ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అలాగే ఎగువ మధ్యతరగతి వారు సేవించే ప్రీమియం బ్రాండ్ల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో వాటి సేల్స్ కూడా 8 శాతానికి పడిపోయాయి. -
మినీ గోల్ఫ్‌లో ఆంధ్రకు తృతీయ స్థానం
అనంతపురం సప్తగిరిసర్కిల్ : మినీ గోల్ఫ్‌లో ఆంధ్ర బాలుర జట్టు తృతీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ నెల 17 నుంచి 20 వరకు మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన 5వ సీనియర్ గోల్ఫ్ జాతీయస్థాయి క్రీడా పోటీల్లో ఆంధ్ర జట్టు క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి తృతీయ స్థానంలో నిలిచారు. జాతీయస్థాయిలో మూడోస్థానంలో నిలిచిన జట్టును మినిగోల్ఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్, కార్యదర్శి మహేష్ అభినందించారు. ఆంధ్ర జట్టులో అనంతకు చెందిన ఎస్వీ డిగ్రీ కళాశాల విద్యార్థి శ్రీహరి, ఎస్కేయూ పీజీ విద్యార్థి మహేష్ అద్భుత ఆటతీరుతో సెలక్టర్లను అలరించారు. -
నల్లధనంలో మనది మూడోస్థానం
-
నల్లధనంలో మనది మూడోస్థానం
పదేళ్లలో రూ.28 లక్షల కోట్లు తరలింపు వాషింగ్టన్: విదేశాలకు నల్లధనం తరలింపులో భారత్ మూడోస్థానంలో నిలిచినట్లు వాషింగ్టన్కు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ అధ్యయనంలో తేలింది. 2012లో భారత్‌నుంచి రూ.ఆరు లక్షల కోట్లు నల్లధనం అక్రమంగా విదేశాలకు చేరినట్లు వెల్లడైంది. 249.57 బిలియన్ డాలర్లతో చైనా అగ్రస్థానంలో ఉండగా, 122.86 బిలియన్ డాలర్లతో రష్యా రెండో స్థానంలో నిలిచింది. వర్ధమాన దేశాలనుంచి 2012లో 991.2 బిలియన్ డాలర్లు అక్రమంగా విదేశాలకు తరలగా అందులో పదిశాతం భారత్నుంచే తరలిందని పేర్కొంది. 2003- 2012 మధ్య భారత్‌నుంచి రూ.28 లక్షల కోట్లు విదేశాలకు చేరినట్లు జీఎఫ్ఐ పేర్కొంది. ‘సమన్వయం అవసరం’ న్యూఢిల్లీ: నల్లధన నియంత్రణకు వివిధ సంస్థల మధ్య చురుకైన సమన్వయం అవసరమని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. రిజర్వ్ బ్యాంకు, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్, ఆదాయపన్ను, సెబీ తదితర సంస్థల మధ్య సమన్వయం నెలకొల్పాలని తన నివేదికలో పేర్కొంది. -
3వ స్థానానికి ఎగబాకిన 'షియోమి'
చైనాకు చెందిన మొబైల్ కంపెనీ షియోమి మూడు సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలో మూడో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్ధగా అవతరించింది. భారత్ లాంటి అత్యంత మొబైల్ వినియోగం ఉన్న దేశాల్లో ఈఫోన్ను నిషేధించినా ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఈ ఫోన్‌కు మంచి డిమాండ్ ఉంది. మొదటి స్ధానంలో కొరియా కంపెనీ స్యామ్సంగ్ ఉండగా, ఆ తరువాత స్ధానంలో యాపిల్ కంపెనీ ఉంది. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌ను షియోమి కంపెనీ నేరుగా ఆన్లైన్లో విక్రయించడం ద్వారా కస్టమర్లకు బాగా చేరువైంది. వచ్చే ఏడాది నాటికి 100 మిలియన్ల ఫోన్ విక్రయాలు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా స్యామ్సంగ్ వాటా 24.7శాతంకు పడిపోయింది. యాపిల్ ఫోన్ మార్కెట్ వాటా కూడా పడిపోవడంతో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే షియోమి కంపెనీ వాటా 5.6 శాతంకు చేరింది. దాంతో ఇది మూడవ స్థానానికి ఎగబాకింది. ** -
భారత్‌కు కాంస్యం
అంటాల్యా (టర్కీ): ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పూర్వాషా షిండే, త్రిషా దేబ్, లిల్లీ చానులతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు టీమ్ విభాగంలో కాంస్యం నెగ్గింది. మూడో స్థానం పోరులో భారత్ 226-224 పాయింట్లతో బ్రెండా మెరినో, లిండా ఒచావో, కాట్యా సోఫియాలతో కూడిన మెక్సికో జట్టును ఓడించింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో రజత్ చౌహాన్ 141-145 పాయింట్లతో యోంగ్ చోయ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయి రజత పతకం సొంతం చేసుకున్నాడు. -
సిటీ పోలీస్ జట్టుకు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్‌లో హైదరాబాద్ సిటీ పోలీస్ కబడ్డీ జట్టు మూడో స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో కబడ్డీ ఈవెంట్లో హైదరాబాద్ జట్టు సెమీఫైనల్లో పరాజయం చవిచూసింది. సిటీ పోలీస్ జట్టు 32-34తో ఆతిథ్య వైజాగ్ చేతిలో పోరాడి ఓడింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఇరు జట్లు 17-17తో సమవుజ్జీగా నిలిచాయి. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సిటీ పోలీస్ జట్టు 41-22తో వరంగల్ రేంజ్ పోలీస్ జట్టుపై ఘనవిజయం సాధించింది. సిటీ జట్టుకు జూబ్లీహిల్స్ ఎస్ఐ మహేందర్ రెడ్డి కెప్టెన్‌గా, శ్రవణ్ కుమార్ కోచ్‌గా వ్యవహరించారు. -
బాంబు పేలుళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోన్న భారత్
-
ఆధార్ సీడింగ్‌లో జిల్లాకు మూడో స్థానం
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : ఆధార్ సీడింగ్‌లో జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉండడంపై జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో బుధవారం మండల డెప్యూటీ తహసిల్దార్ల సమావేశంలో ఆధార్ సీడింగ్, పౌరపంపిణీ విధానం అమలుతీరుపై ఆయన సమీక్షించారు. జిల్లాలో ఆధార్ సీడింగ్ అమలులో 97 శాతం పూర్తి చేసిన ఉంగుటూరు డెప్యూటీ తహసిల్దార్ శారదాదేవి, 95 శాతం పూర్తి చేసిన టి.నర్సాపురం డీటీ రంజిత్, 92 శాతం పూర్తి చేసిన కొవ్వూరు అర్బన్ డీటీ ఆలీలను త్వరలోనే కలెక్టర్ సిద్ధార్థ జైన్ చేతులమీదుగా సత్కరించి ప్రశంసాపత్రాలు అందిస్తామని జేసీ చెప్పారు. కొత్త చౌకడిపోలు ఏర్పాటు జిల్లాలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న చౌకడిపోలను పునర్వవ్యవస్థీకరించి త్వరలోనే కొత్త చౌకడిపోల ఏర్పాటుకు తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జేసీ బాబూరావునాయుడు చెప్పారు. జిల్లాలో రచ్చబండ-2లో జారీ చేసిన కూపన్లలో ఇంకా 24 వేల కార్డులకు సంబంధించి ఫొటో అప్డేషన్ జరగలేదని, ఆ కూపన్లకు సంబంధించి నివేదిక సమర్పించాలని పౌరసరఫరాల అధికారులను ఆయన ఆదేశించారు. సమావేశంలో డీఎస్వో శివశంకర్ రెడ్డి, జిల్లాలోని 46 మంది డీటీలు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీ చేయండి ఏజెన్సీలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని జేసీ, ఐటీడీఏ ఇన్‌ఛార్జి పీవో బాబూరావునాయుడు స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీ వి.వసంతబాలను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఏజెన్సీలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఏజెన్సీలో గిరిజనుల పిల్లల సంరక్షణకు 11 క్రాషీ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 6 నెలల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులను సంరక్షించడానికి ప్రభుత్వం పోలవరం, బుట్టాయిగూడెం ప్రాంతాల్లో 11 క్రాషీ సెంటర్లు ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో 15 అంగన్వాడీ కార్యకర్తలు, 103 సహాయకుల ఉద్యోగాలు, 29 మినీ అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయాలని జేసీ ఆదేశించారు. వసంతబాల మాట్లాడుతూ త్వరలోనే ఆయా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారాన్ని చేపట్టి ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జేసీ టి.బాబూరావునాయుడు సమాచార శాఖాధికారులను ఆదేశించారు. సమాచార శాఖ ఏడీగా బాధ్యతలు చేపట్టిన వి.భాస్కర నరసింహం బుధవారం జేసీ బాబూరావునాయుడు, డీఆర్వోలను కలిశారు.