సిటీ పోలీస్ జట్టుకు మూడో స్థానం | city police team in third place position | Sakshi
Sakshi News home page

సిటీ పోలీస్ జట్టుకు మూడో స్థానం

Published Wed, Mar 19 2014 12:15 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

city police team in third place position

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్‌లో హైదరాబాద్ సిటీ పోలీస్ కబడ్డీ జట్టు మూడో స్థానంలో నిలిచింది. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో కబడ్డీ ఈవెంట్‌లో హైదరాబాద్ జట్టు సెమీఫైనల్లో పరాజయం చవిచూసింది. సిటీ పోలీస్ జట్టు 32-34తో ఆతిథ్య వైజాగ్ చేతిలో పోరాడి ఓడింది.
 
 తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఇరు జట్లు 17-17తో సమవుజ్జీగా నిలిచాయి. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సిటీ పోలీస్ జట్టు 41-22తో వరంగల్ రేంజ్ పోలీస్ జట్టుపై ఘనవిజయం సాధించింది. సిటీ జట్టుకు జూబ్లీహిల్స్ ఎస్‌ఐ మహేందర్ రెడ్డి కెప్టెన్‌గా, శ్రవణ్ కుమార్ కోచ్‌గా వ్యవహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement