
మినీ గోల్ఫ్‌లో ఆంధ్రకు తృతీయ స్థానం
అనంతపురం సప్తగిరిసర్కిల్ : మినీ గోల్ఫ్‌లో ఆంధ్ర బాలుర జట్టు తృతీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ నెల 17 నుంచి 20 వరకు మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన 5వ సీనియర్ గోల్ఫ్ జాతీయస్థాయి క్రీడా పోటీల్లో ఆంధ్ర జట్టు క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచి తృతీయ స్థానంలో నిలిచారు. జాతీయస్థాయిలో మూడోస్థానంలో నిలిచిన జట్టును మినిగోల్ఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్, కార్యదర్శి మహేష్ అభినందించారు. ఆంధ్ర జట్టులో అనంతకు చెందిన ఎస్‌వీ డిగ్రీ కళాశాల విద్యార్థి శ్రీహరి, ఎస్‌కేయూ పీజీ విద్యార్థి మహేష్ అద్భుత ఆటతీరుతో సెలక్టర్లను అలరించారు.