3వ స్థానానికి ఎగబాకిన 'షియోమి'
చైనాకు చెందిన మొబైల్ కంపెనీ షియోమి మూడు సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలో మూడో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్ధగా అవతరించింది. భారత్ లాంటి అత్యంత మొబైల్ వినియోగం ఉన్న దేశాల్లో ఈఫోన్‌ను నిషేధించినా ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఈ ఫోన్‌కు మంచి డిమాండ్ ఉంది. మొదటి స్ధానంలో కొరియా కంపెనీ స్యామ్‌సంగ్ ఉండగా, ఆ తరువాత స్ధానంలో యాపిల్ కంపెనీ ఉంది. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌ను షియోమి కంపెనీ నేరుగా ఆన్‌లైన్‌లో విక్రయించడం ద్వారా కస్టమర్లకు బాగా చేరువైంది.
వచ్చే ఏడాది నాటికి 100 మిలియన్ల ఫోన్ విక్రయాలు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా స్యామ్‌సంగ్ వాటా 24.7శాతంకు పడిపోయింది. యాపిల్ ఫోన్ మార్కెట్ వాటా కూడా పడిపోవడంతో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే షియోమి కంపెనీ వాటా 5.6 శాతంకు చేరింది. దాంతో ఇది మూడవ స్థానానికి ఎగబాకింది.
**