బీజింగ్: ప్రముఖ చైనా మొబైల్ మేకర్ షావోమి మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. రెడ్ మి 4 ఏ, రెడ్‌మి నోట్ 4తో అమ్మకాల సునామీ సృష్టించిన షావోమి ఈ విజయ పరంపరలో మరో డివైస్‌ను చైనాలో విడుదల చేసింది. గత నెలలో రెడ్‌మి నోట్ 5 ఏ పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త వెర్షన్ ప్రారంభించింది. కొత్త 4జీబీ ర్యామ్ వేరియంట్ లో దీని ధరను రూ.12వేలకు కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. పాత వెర్షన్ లోని స్నాప్ డ్రాగెన్ 425 ప్రాసెసర్ మెరుగుపర్చి( క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆధారిత 435 ప్రాసెసర్) కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. ప్లాటినం సిల్వర్, షాంపైన్ గోల్డ్ రోజ్ గోల్డ్ కలర్స్‌లో చైనాలో ప్రస్తుతానికి లభిస్తోంది. 2జీబీ, 16జీబీ స్టోరేజ్,ధర రూ. 6700, 3జీబీ, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కూ. 8645 ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టులో చైనాలో లాంచ్ చేసింది. అయితే ఈ ఏడాది చివరిలోపు ఇండియాలో కూడా లాంచ్ చేయనుందని తెలుస్తోంది. అధికారిక సమాచారం వచ్చేంతవరకు ఎపుడు లాంచ్ చేయనుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
రెడ్ మీ నోట్ 5 ఏ
5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
720x1280 పిక్సల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1
4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
స్టోరేజ్ 128 దాకా విస్తరించుకునే సదుపాయం
13 ఎంపీ రియర్ కెమెరా
16ఎంపి ఫ్రంట్‌కెమెరా
3080 ఎంఏహెచ్ బ్యాటరీ
రెడ్ మి నోట్ 5 ఏ లాంచ్..ఫీచర్లు?
Published Mon, Sep 18 2017 4:17 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement
Advertisement