షావోమి ‘మి మ్యాక్స్‌ 2’ వచ్చింది... | Xiaomi Mi Max 2 bets big on massive display | Sakshi
Sakshi News home page

షావోమి ‘మి మ్యాక్స్‌ 2’ వచ్చింది...

Published Wed, Jul 19 2017 12:31 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

షావోమి ‘మి మ్యాక్స్‌ 2’ వచ్చింది... - Sakshi

షావోమి ‘మి మ్యాక్స్‌ 2’ వచ్చింది...

ధర రూ. 16,999
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘మి మ్యాక్స్‌ 2’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.16,999గా ఉంది. ఇందులో 6.44 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 12 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది.

‘మి మ్యాక్స్‌ 2’ స్మార్ట్‌ఫోన్స్‌ జూలై 27 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నవి. కాగా కంపెనీ తన మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను జూలై 20, 21 తేదీల్లో మి.కామ్, మి హోమ్స్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement