ఈ నెల 18న ఎంఐ మ్యాక్స్2 స్మార్ట్‌ఫోన్‌ను షియోమి భారత్‌లో లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది.

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమి, వచ్చే వారంలో న్యూఢిల్లీలో ఓ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ లాంచ్ ఈవెంట్ కోసం ఆహ్వానాలు సైతం పంపిస్తోంది. ఇంతకీ ఈ ఈవెంట్‌లో లాంచ్ చేయబోయేది ఏంటో తెలుసా. మే నెలలో చైనాలో లాంచ్ చేసిన ఎంఐ మ్యాక్స్2 స్మార్ట్‌ఫోన్. ఈ నెల 18న ఎంఐ మ్యాక్స్2 స్మార్ట్‌ఫోన్‌ను షియోమి భారత్‌లో లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది. దీని ధర కూడా సుమారు రూ.16,100గానే ఉండబోతుందట. ''బిగ్ ఈజ్ బ్యాక్'' అనే ట్యాగ్‌లైన్‌తో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో ఆవిష్కరించింది. దీని ప్రత్యేక ఆకర్షణ పెద్ద స్క్రీన్, బ్యాటరీ. ఎంఐ మ్యాక్స్‌ను పోలిన మాదిరిగానే ఎంఐ మ్యాక్స్ 2 డిజైన్ కూడా ఉంది.