భారీ స్క్రీన్ , పెద్ద బ్యాటరీ: ఎంఐ మాక్స్‌ 2 లాంచ్‌ | Xiaomi Mi Max 2 With 5300mAh Battery Launched: Price, Release Date, Specifications, and More | Sakshi
Sakshi News home page

భారీ స్క్రీన్ , పెద్ద బ్యాటరీ: ఎంఐ మాక్స్‌ 2లాంచ్‌

Published Thu, May 25 2017 2:30 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM

భారీ స్క్రీన్ , పెద్ద బ్యాటరీ: ఎంఐ మాక్స్‌ 2 లాంచ్‌

భారీ స్క్రీన్ , పెద్ద బ్యాటరీ: ఎంఐ మాక్స్‌ 2 లాంచ్‌

న్యూఢిల్లీ: బడ్జెట్‌ ధరల్లో స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌   చేస్తూ ఫోన్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న  చైనా మొబైల్‌ మేకర్‌ షియోమి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. గురువారం ఎంఐ మాక్స్‌ 2 ఫ్లాబ్లెట్‌ను  చైనా మార్కెట్లో ప్రవేశపెట్టింది.  అదీ సరసమైన ధరకే.   మి  మాక్స్‌ కు సక్సెసర్‌గా   అంచనాలకు తగ్గట్టుగానే  భారీ స్క్రీన్  పెద్ద బ్యాటరీ లాంటి  అదిరిపోయే ఫీచర్లతో  ఎంఐ మ్యాక్స్ 2ను  విడుదల చేసింది.   రెండు  స్టోరేజ్   వేరియంట్లలో (64 జీబీ, 128 జీబీ) లభ్యంకానుంది.  ఈ హ్యాండ్‌ సైట్‌  వెనుకవైపు వేలిముద్ర స్కానర్‌ అమర్చింది. అ లాగే  ఐఆర్‌ బ్లాస్టర్ ( టీవీలకు,  ఏసీలకు రిమోట్‌గా వాడుకునేలా) ను పొందుపర్చింది.   స్టీరియో స్పీకర్లను అమర్చడం అతిపెద్ద ఇంప్రూవ్‌మెంట్‌గా కంపెనీ చెబుతోంది.  64 జీబీ  వేరియంట్‌ D  1,699  యెన్‌లు ( సుమారు రూ. 16,000) 128జీబీ వేరియంట్‌   1,999 యెన్‌లు (సుమారు రూ.19,000) ధరలుగా నిర్ణయించింది. జూన్‌ 1 నుంచి  చైనా  విక్రయాలు ప్రారంభంకానున్నాయి.

ఎంఐ  మాక్స్‌ 2 ఫీచర్స్‌
ఆండ్రాయిడ్‌ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్‌
6.44 అంగుళాల ఫుల్‌ హెచ్‌ డీ డిస్‌ప్లే
1920x1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌
4 జీబీ  ర్యామ్‌
64జీబీ/128 జీబీ  ఇంటర్నెనల్‌ స్టోరేజ్‌
 మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా వరకు విస్తరించుకునే  సదుపాయం కూడా
12ఎంపీ రియర్‌ కెమెరా
5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా సెల్ఫీ షూటర్‌
5300 ఎంఏహెచ్‌  బ్యాటరీ  సామర్థ్యం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement