న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల్లో స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తూ ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ మేకర్ షియోమి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ ను తీసుకురాబోతోంది. అదీ సరసమైన ధరకే. షియోమి ఎంఐ మ్యాక్స్ 2గా చెబుతున్న స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్లు బయటికొచ్చాయి. ఇప్పటికే షియోమి అప్ కమింగ్ డివైస్ లు ఎంఐ 6, ఎంఐ 6 ప్లస్ భారీగా ఆసక్తి నెలకొంది. అలాగే వీటి ఫీచర్లకు సంబంధించి రూమర్లు వ్యాపిస్తున్నప్పటికీ మి మాక్స్ 2 ఫీచర్స్ మాత్రం ఆకర్షణీయంగా ఉండడం విశేషం.
మి మాక్స్ కు సక్సెసర్‌గా ఇది మార్కెట్లో లాంచ్ కానుంది. శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్‌ను ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో వాడినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎంఐ మ్యాక్స్ 2లో వేగవంతమైన ఛార్జింగ్ సామర్ధ్యంతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని వాడారట. ఇక కెమెరా విషయానికి వస్తే ఎంఐ 5ఎస్‌లో వాడిన కెమెరానే దీనిలో కూడా వాడినట్లు తెలుస్తోంది. వెనుకవైపు 12ఎంపీ సోనీ ఐఎంఎక్స్378 కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుందని అంచనా. ధర 1499 -1699 యెన్ లుగా అంటే సుమారు రూ. 14వేల నుంచి రూ. 16వేల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. షియోమి ఆక్సిజన్ గా పిలుస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇలా ఉండబోతున్నాయి.
ఎంఐ మాక్స్ 2 ఫీచర్స్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్
6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే
1920x1080 పిక్సెల్ రిజల్యూషన్
4 జీబీ ర్యామ్
128 జీబీ స్టోరేజ్
మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా దీన్ని విస్తరించుకునే సదుపాయం కూడా
12ఎంపీ రియర్ కెమెరా
5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెల్ఫీ షూటర్
5000 ఎంఏహెచ్
అయితే లాంచింగ్ సమయం, విక్రయాలు ఎపుడు మొదలుకానున్నాయనే అంశాలపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మరోవైపు షియామి ఎంఐ 6 ఏప్రిల్ 19 న లాంచ్ కానుంది.