Mi Max 2
-
ఎంఐ మ్యాక్స్ 2 ధర తగ్గింది..
భారీ బ్యాటరీ, పెద్ద డిస్ప్లేతో తీసుకొచ్చిన ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్ ధరను షావోమి భారత్‌లో తగ్గించింది. 13,999 రూపాయలకు ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని షావోమి వైస్ ప్రెసిడెంట్, షావోమి ఇండియా ఎండీ మను కుమార్ జైన్ ట్వీట్ ద్వారా తెలిపారు. ''బిగ్ ఇప్పుడు తక్కువైంది! ఎంఐ మ్యాక్స్ 2 రెండు వేరియంట్లపైనా వెయ్యి రూపాయల మేర శాశ్వతంగా ధర తగ్గిస్తున్నాం'' అని జైన్ ట్వీట్ చేశారు. తగ్గిన ధరల అనంతరం ఎంఐ మ్యాక్స్2 32జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగ, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ధర 15,999 రూపాయలు. ఈ రెండు వేరియంట్ల ధరలు లాంచింగ్ సందర్భంగా 14,999 రూపాయలు, 16,999 రూపాయలుగా ఉన్నాయి. అంతేకాక ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ ఫోన్‌పై బంపర్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను ప్రకటించింది. పాత హ్యాండ్‌సెట్‌ను రిటర్న్ చేసి దీన్ని కొనుగోలు చేస్తే, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కింద రూ.15వేల వరకు ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డుదారులకు అదనంగా 5 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంచింది. ఎంఐ మ్యాక్స్ 2 ఫీచర్లు.. 6.44 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ 4 జీబీ ర్యామ్ డ్యుయల్ సిమ్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్ 12 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 5300 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి 4, ఎంఐ మ్యాక్స్ 2లపై పేటీఎం క్యాష్‌బ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ఫ్లాట్ఫామ్స్లపై సంచలన విక్రయాలను నమోదుచేస్తున్న రెడ్మి ఫోన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. షావోమి పాపులర్ స్మార్ట్ఫోన్లు రెడ్మి నోట్4, ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్ఫోన్లపై పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎంఐ స్టోర్ యాప్, ఎం.కామ్ వెబ్‌సైట్‌పై ఈ రెండు స్మార్ట్ఫోన్లను పేటీఎం డిజిటల్ వాలెట్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.300 క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ తెలిపింది. వాలెట్‌లోనే ఈ రూ.300 క్యాష్‌బ్యాక్ లభించనుంది. కేవలం ఒకే ఒక్క లావాదేవీకి, ఒకే యూజర్‌కు ఈ పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. షావోమి రెడ్మి నోట్4 స్మార్ట్‌ఫోన్ 2017 తొలి క్వార్టర్లో అత్యధికంగా రవాణా అయిన స్మార్ట్‌ఫోన్‌గా తాజా రిపోర్టుల్లో నిలిచింది. ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఆధారితంగా ఎంఐయూఐ 8 ద్వారా రెడ్మి నోట్4 పనిచేస్తుంది. 5.5 అంగుళాల పుల్ హెచ్డీ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్ప్లేను, స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీని కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్, 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వేరియంట్లలో ఇది లాంచ్ అయింది. ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆధారితంగా ఎంఐయూఐ 8 ద్వారా పనిచేస్తుంది. 2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీతో 4జీబీ ర్యామ్‌ను ఇది కలిగి ఉంది. 6.44 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే, 12ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దీనిలో ఫీచర్లు. -
షావోమి ‘మి మ్యాక్స్ 2’ వచ్చింది...
ధర రూ. 16,999 న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘మి మ్యాక్స్ 2’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.16,999గా ఉంది. ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5,300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. ‘మి మ్యాక్స్ 2’ స్మార్ట్‌ఫోన్స్ జూలై 27 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నవి. కాగా కంపెనీ తన మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను జూలై 20, 21 తేదీల్లో మి.కామ్, మి హోమ్స్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచుతోంది. -
భారత్ మార్కెట్ లో స్మార్ట్‌ఫోన్ కొత్త మోడల్
న్యూఢిల్లీ: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమీ మరో కొత్త మోడల్‌ను వచ్చేవారం భారత మార్కట్లో విడుదల చేయనుంది. ఎంఐ మాక్స్2 పేరుతో 6.44 అంగుళాల డిస్ప్లేతో ఓ డివైస్‌ను మార్కట్లోకి తీసుకురానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5300 ఎంఏహెచ్. ఈ ఫోన్ చైనాలో గత మే నెలలోనే విడుదల చేశారు. దీనిలో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంది. రామ్ సామర్థ్యం 4 జీబీ. ఇంటర్నల్ స్టోరేజీ 64/128 జీబీ. ఈ డివైజ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. దీనిలో 12 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. షియోమీ గత సంవత్సరం ఇండియాలో ఒక బిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది. అలాగే 2017 సంవత్సరం సెకండ్ క్వార్టర్లో షియోమీ కంపెనీకి చెందిన దాదాపు 2.31 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడు పోయాయి. -
బిగ్ ఈజ్ బ్యాక్: షియోమి కొత్త ఫోన్
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమి, వచ్చే వారంలో న్యూఢిల్లీలో ఓ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ లాంచ్ ఈవెంట్ కోసం ఆహ్వానాలు సైతం పంపిస్తోంది. ఇంతకీ ఈ ఈవెంట్లో లాంచ్ చేయబోయేది ఏంటో తెలుసా. మే నెలలో చైనాలో లాంచ్ చేసిన ఎంఐ మ్యాక్స్2 స్మార్ట్‌ఫోన్. ఈ నెల 18న ఎంఐ మ్యాక్స్2 స్మార్ట్‌ఫోన్‌ను షియోమి భారత్‌లో లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది. దీని ధర కూడా సుమారు రూ.16,100గానే ఉండబోతుందట. ''బిగ్ ఈజ్ బ్యాక్'' అనే ట్యాగ్‌లైన్‌తో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో ఆవిష్కరించింది. దీని ప్రత్యేక ఆకర్షణ పెద్ద స్క్రీన్, బ్యాటరీ. ఎంఐ మ్యాక్స్‌ను పోలిన మాదిరిగానే ఎంఐ మ్యాక్స్ 2 డిజైన్ కూడా ఉంది. ఎంఐ మ్యాక్స్2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.. 6.44 అంగుళాలతో ఫుల్ హెచ్డీ డిస్ప్లే 5300ఎంఏహెచ్ బ్యాటరీ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ 4జీబీ ర్యామ్ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 12ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎంఐయూఐ ఆధారిత ఆండ్రాయిడ్ నోగట్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్బీ టైప్ సి, క్విక్ చార్జ్ 3.0. అయితే రెండు స్టోరేజ్ వేరియంట్లను భారత్‌లో లాంచ్ చేస్తుందో లేదో ఇంకా స్పష్టంకాలేదు. -
భారీ స్క్రీన్ , పెద్ద బ్యాటరీ: ఎంఐ మాక్స్ 2 లాంచ్
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల్లో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తూ ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ మేకర్ షియోమి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. గురువారం ఎంఐ మాక్స్ 2 ఫ్లాబ్లెట్ను చైనా మార్కెట్లో ప్రవేశపెట్టింది. అదీ సరసమైన ధరకే. మి మాక్స్ కు సక్సెసర్‌గా అంచనాలకు తగ్గట్టుగానే భారీ స్క్రీన్ పెద్ద బ్యాటరీ లాంటి అదిరిపోయే ఫీచర్లతో ఎంఐ మ్యాక్స్ 2ను విడుదల చేసింది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో (64 జీబీ, 128 జీబీ) లభ్యంకానుంది. ఈ హ్యాండ్ సైట్ వెనుకవైపు వేలిముద్ర స్కానర్ అమర్చింది. అ లాగే ఐఆర్ బ్లాస్టర్ ( టీవీలకు, ఏసీలకు రిమోట్‌గా వాడుకునేలా) ను పొందుపర్చింది. స్టీరియో స్పీకర్లను అమర్చడం అతిపెద్ద ఇంప్రూవ్‌మెంట్‌గా కంపెనీ చెబుతోంది. 64 జీబీ వేరియంట్ D 1,699 యెన్లు ( సుమారు రూ. 16,000) 128జీబీ వేరియంట్ 1,999 యెన్లు (సుమారు రూ.19,000) ధరలుగా నిర్ణయించింది. జూన్ 1 నుంచి చైనా విక్రయాలు ప్రారంభంకానున్నాయి. ఎంఐ మాక్స్ 2 ఫీచర్స్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ 6.44 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే 1920x1080 పిక్సెల్ రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్ 64జీబీ/128 జీబీ ఇంటర్నెనల్ స్టోరేజ్ మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా వరకు విస్తరించుకునే సదుపాయం కూడా 12ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెల్ఫీ షూటర్ 5300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం Max out with #MiMax2 - #BIGDISPLAYBIGGERBATTERY! -
అదిరిపోయే ఫీచర్లతో ఎంఐ మాక్స్ 2
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల్లో స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తూ ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ మేకర్ షియోమి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ ను తీసుకురాబోతోంది. అదీ సరసమైన ధరకే. షియోమి ఎంఐ మ్యాక్స్ 2గా చెబుతున్న స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్లు బయటికొచ్చాయి. ఇప్పటికే షియోమి అప్ కమింగ్ డివైస్ లు ఎంఐ 6, ఎంఐ 6 ప్లస్ భారీగా ఆసక్తి నెలకొంది. అలాగే వీటి ఫీచర్లకు సంబంధించి రూమర్లు వ్యాపిస్తున్నప్పటికీ మి మాక్స్ 2 ఫీచర్స్ మాత్రం ఆకర్షణీయంగా ఉండడం విశేషం. మి మాక్స్ కు సక్సెసర్‌గా ఇది మార్కెట్లో లాంచ్ కానుంది. శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్‌ను ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో వాడినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎంఐ మ్యాక్స్ 2లో వేగవంతమైన ఛార్జింగ్ సామర్ధ్యంతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని వాడారట. ఇక కెమెరా విషయానికి వస్తే ఎంఐ 5ఎస్‌లో వాడిన కెమెరానే దీనిలో కూడా వాడినట్లు తెలుస్తోంది. వెనుకవైపు 12ఎంపీ సోనీ ఐఎంఎక్స్378 కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుందని అంచనా. ధర 1499 -1699 యెన్ లుగా అంటే సుమారు రూ. 14వేల నుంచి రూ. 16వేల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. షియోమి ఆక్సిజన్ గా పిలుస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇలా ఉండబోతున్నాయి. ఎంఐ మాక్స్ 2 ఫీచర్స్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే 1920x1080 పిక్సెల్ రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా దీన్ని విస్తరించుకునే సదుపాయం కూడా 12ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెల్ఫీ షూటర్ 5000 ఎంఏహెచ్ అయితే లాంచింగ్ సమయం, విక్రయాలు ఎపుడు మొదలుకానున్నాయనే అంశాలపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మరోవైపు షియామి ఎంఐ 6 ఏప్రిల్ 19 న లాంచ్ కానుంది. 203-day wait for you since our #Mi5s launch, 7 years for Mi. #Mi6 is a guaranteed performance beast. Can't wait to show you what's to come! pic.twitter.com/hPA60ec8QX — Mi (@xiaomi) April 11, 2017