ఎంఐ మ్యాక్స్‌ 2 ధర తగ్గింది.. | Xiaomi Mi Max 2 Price Cut in India | Sakshi
Sakshi News home page

ఎంఐ మ్యాక్స్‌ 2 ధర తగ్గింది..

Published Mon, Oct 30 2017 2:24 PM | Last Updated on Mon, Oct 30 2017 2:25 PM

Xiaomi Mi Max 2 Price Cut in India

భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేతో తీసుకొచ్చిన ఎంఐ మ్యాక్స్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ ధరను షావోమి భారత్‌లో తగ్గించింది. 13,999 రూపాయలకు ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని షావోమి వైస్‌ ప్రెసిడెంట్‌, షావోమి ఇండియా ఎండీ మను కుమార్‌ జైన్‌ ట్వీట్‌ ద్వారా తెలిపారు. ''బిగ్‌ ఇప్పుడు తక్కువైంది! ఎంఐ మ్యాక్స్‌ 2 రెండు వేరియంట్లపైనా వెయ్యి రూపాయల మేర శాశ్వతంగా ధర తగ్గిస్తున్నాం'' అని జైన్‌ ట్వీట్‌ చేశారు.

తగ్గిన ధరల అనంతరం ఎంఐ మ్యాక్స్‌2 32జీబీ వేరియంట్‌ ధర రూ.13,999 కాగ, 64జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 15,999 రూపాయలు. ఈ రెండు వేరియంట్ల ధరలు లాంచింగ్‌ సందర్భంగా 14,999 రూపాయలు, 16,999 రూపాయలుగా ఉన్నాయి. అంతేకాక ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఈ ఫోన్‌పై బంపర్‌ ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ను ప్రకటించింది. పాత హ్యాండ్‌సెట్‌ను రిటర్న్‌ చేసి దీన్ని కొనుగోలు చేస్తే, ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ కింద రూ.15వేల వరకు ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. యాక్సిస్‌ బ్యాంకు బుజ్‌ క్రెడిట్‌ కార్డుదారులకు అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ కూడా అందుబాటులో ఉంచింది.

ఎంఐ మ్యాక్స్‌ 2 ఫీచర్లు..
6.44 అంగుళాల ఐపీఎస్‌ డిస్‌ప్లే
1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్‌ఓసీ
4 జీబీ ర్యామ్
డ్యుయల్ సిమ్
ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
12 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్
5300 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement