ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి, ఇండియా గత మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగం సిద్ధం చేసింది.ఈ మేరకు విచారణకు హాజరు కావాల్సిందిగా మను కుమార్ జైన్‌కు ఇప్పటికే నోటీసులు అందినట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి.
భారతీయ చట్టాలకు అనుగుణంగా షావోమి వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయా ? లేదా అనే అంశాలపై 2022 ఫిబ్రవరి నుంచి ఈడీ విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో మను కుమార్ జైన్ నుంచి కొన్ని వివరాలు సేకరించే పనిలో ఈడీ ఉంది. ప్రస్తుతం మను కుమార్ జైన్ షావోమి గ్లోబల్ హెడ్‌గా దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్నారు. విధి నిర్వాహాణలో భాగంగా ప్రస్తుతం ఆయన ఇండియాలోనే ఉన్నారు. ఈడీ ఆయన్ని ఎప్పుడు విచారించబోతుందనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను ఉద్దేశించి షావోమి ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ తాము భారత చట్టాలకు లోబడే ఇక్కడ అన్ని రకాల కార్యకలపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విచారణ సందర్భంగా ఈడీ అడిగిన అన్ని వివరాలను తాము ఎప్పటికప్పుడు అందిస్తున్నట్టు వివరించారు. కాగా ఈ అంశంపై ఇటు ఈడీ కానీ అటు మను కుమార్ జైన్ కానీ నేరుగా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment