భారత్ మార్కెట్ లో స్మార్ట్‌ఫోన్ కొత్త మోడల్
న్యూఢిల్లీ: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమీ మరో కొత్త మోడల్‌ను వచ్చేవారం భారత మార్కట్లో విడుదల చేయనుంది. ఎంఐ మాక్స్2 పేరుతో 6.44 అంగుళాల డిస్‌ప్లేతో ఓ డివైస్‌ను మార్కట్లోకి తీసుకురానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5300 ఎంఏహెచ్. ఈ ఫోన్ చైనాలో గత మే నెలలోనే విడుదల చేశారు. దీనిలో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉంది. రామ్ సామర్థ్యం 4 జీబీ. ఇంటర్నల్ స్టోరేజీ 64/128 జీబీ.
ఈ డివైజ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. దీనిలో 12 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. షియోమీ గత సంవత్సరం ఇండియాలో ఒక బిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది. అలాగే 2017 సంవత్సరం సెకండ్ క్వార్టర్లో షియోమీ కంపెనీకి చెందిన దాదాపు 2.31 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడు పోయాయి.