న్యూఢిల్లీ: భారత్, చైనాల్లో చౌక స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరగడం యాపిల్, శామ్‌సంగ్ వంటి పెద్ద కంపెనీల స్మార్ట్‌ఫోన్ అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. దీని ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో ఆసియా పసిఫిక్ ప్రాంతం(జపాన్ మినహా)లో యాపిల్, శామ్‌సంగ్ కంపెనీల అమ్మకాలు 3.5 కోట్లుగా ఉన్నాయి. అదే ఈ ప్రాంతంలోని దేశీయ కంపెనీల స్మార్ట్ఫోన్ల అమ్మకాలు మాత్రం 4.6 కోట్లకు చేరాయి. ఇక హెచ్‌టీసీ, బ్లాక్‌బెర్రి, నోకియా, సోనీ, ఎల్‌జీ, మోటోరోలా కంపెనీల స్మార్ట్ఫోన్ల అమ్మకాలు మొత్తం కలిసి కోటికి చేరాయి. హువాయ్, జడ్‌టీఈ, లెనోవో వంటి చైనా కంపెనీలు 2.7 కోట్ల స్మార్ట్‌ఫోన్లను విక్రయించాయి. భారత్‌లో మైక్రోమ్యాక్స్, కార్బన్, లావా, మాక్స్, ఇంటెక్స్ వంటి కంపెనీల స్మార్ట్ఫోన్ల అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. ఇక చైనాలో కూల్‌ప్యాడ్, కె-టచ్, గ్జియోమి, జియోని, ఒప్పో కంపెనీల హవా పెరుగుతోంది. జనాభా పరంగా మొదటి రెండు స్థానాల్లో ఉన్న చైనా, భారత్‌ల్లో లోకల్ బ్రాండ్ల అమ్మకాలు బాగా పుంజుకుంటున్నాయి. చౌకధరల్లోనే పెద్ద డిస్‌ప్లే, ఎక్కువ మెగా పిక్సెల్ కెమెరా వంటి వినూత్నమైన ఫీచర్లతో దేశీయ కంపెనీలు దూసుకెళ్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దేశీయ కంపెనీల హవా
Published Mon, Aug 26 2013 2:17 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement
Advertisement