రెడ్‌మి 4, ఎంఐ మ్యాక్స్‌ 2లపై పేటీఎం క్యాష్‌బ్యాక్‌ | Xiaomi Redmi Note 4, Mi Max 2 Now Available With Rs. 300 Paytm Cashback on Mi.com, Mi Store App | Sakshi
Sakshi News home page

రెడ్‌మి 4, ఎంఐ మ్యాక్స్‌ 2లపై పేటీఎం క్యాష్‌బ్యాక్‌

Published Wed, Aug 30 2017 3:42 PM | Last Updated on Sun, Sep 17 2017 6:09 PM

రెడ్‌మి 4, ఎంఐ మ్యాక్స్‌ 2లపై పేటీఎం క్యాష్‌బ్యాక్‌

రెడ్‌మి 4, ఎంఐ మ్యాక్స్‌ 2లపై పేటీఎం క్యాష్‌బ్యాక్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లపై సంచలన విక్రయాలను నమోదుచేస్తున్న రెడ్‌మి ఫోన్లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ అందుబాటులోకి వచ్చింది. షావోమి పాపులర్‌ స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మి నోట్‌4, ఎంఐ మ్యాక్స్‌ 2 స్మార్ట్‌ఫోన్లపై పేటీఎం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఎంఐ స్టోర్‌ యాప్‌, ఎం.కామ్‌ వెబ్‌సైట్‌పై ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను పేటీఎం డిజిటల్‌ వాలెట్‌ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.300 క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు ఈ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ తెలిపింది. వాలెట్‌లోనే ఈ రూ.300 క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. కేవలం ఒకే ఒక్క లావాదేవీకి, ఒకే యూజర్‌కు ఈ పేటీఎం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది.  షావోమి రెడ్‌మి నోట్‌4 స్మార్ట్‌ఫోన్‌ 2017 తొలి క్వార్టర్‌లో అత్యధికంగా రవాణా అయిన స్మార్ట్‌ఫోన్‌గా తాజా రిపోర్టుల్లో నిలిచింది. 
 
ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌ ఆధారితంగా ఎంఐయూఐ 8 ద్వారా రెడ్‌మి నోట్‌4 పనిచేస్తుంది. 5.5 అంగుళాల పుల్‌ హెచ్‌డీ 2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లేను, స్నాప్‌డ్రాగన్‌ 625 ఎస్‌ఓసీని కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ 2జీబీ ర్యామ్‌, 3జీబీ ర్యామ్‌, 4జీబీ ర్యామ్‌ వేరియంట్లలో ఇది లాంచ్‌ అయింది. 
 
ఎంఐ మ్యాక్స్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ కూడా ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌ ఆధారితంగా ఎంఐయూఐ 8 ద్వారా పనిచేస్తుంది. 2గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ఎస్‌ఓసీతో 4జీబీ ర్యామ్‌ను ఇది కలిగి ఉంది. 6.44 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ డిస్‌ప్లే, 12ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా దీనిలో ఫీచర్లు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement