Paytm Cashback
-
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై తగ్గింపు!
దేశీయ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు శుభవార్త చెప్పింది. భారత్ గ్యాస్ (Bharatgas), ఇండేన్ (Indane), హెచ్‌పీ( HP) సంస్థల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లపై అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది పేటీఎం. వినియోగదారులు మొదటి గ్యాస్ బుకింగ్‌పై ఫ్లాట్ రూ. 15 క్యాష్‌బ్యాక్, అదే Paytm వాలెట్ ద్వారా సిలిండర్ బుకింగ్ చేస్తే రూ. 50 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. వీటితో పాటు అదనంగా, యూజర్లు తమ బుకింగ్‌ను ట్రాక్ చేసే అవకాశం కూడా కల్పిస్తోంది. ఈ ఆఫర్ ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకునే కొత్త వినియోగదారులందరికీ వర్తిస్తుందని ప్రకటించింది. కొత్త వినియోగదారులు రూ. 15 క్యాష్‌బ్యాక్ పొందడానికి "FIRSTGAS" కోడ్, పేటీఎం వాలెట్‌ని ఉపయోగించి సిలిండర్ల బుకింగ్ చేసే యూజర్లు "WALLET50GAS" కోడ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా, మొదటి బుకింగ్ తర్వాత, యాప్ బుకింగ్ వివరాలను కూడా సేవ్ చేస్తుంది, తద్వారా తదుపరి బుకింగ్ కోసం యూజర్లు 17-అంకెల ఎల్పీజీ ఐడీ(LPG ID) తదితర వివరాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ బుకింగ్ ప్రక్రియ పూర్తవగానే మీ గ్యాస్ సిలిండర్ మీ రిజిస్టర్డ్ చిరునామాకు 2-3 రోజుల్లో సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ ద్వారా డెలివరీ చేస్తుంది. చదవండి: బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ! -
పేటీఎం బంపరాఫర్!! క్షణాల్లో రూ.5లక్షల లోన్,అప్లయ్ చేయండిలా!
Paytm Loan Process: ప్రముఖ డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం బంపరాఫర్ ప్రకటించింది. చిరు వ్యాపారులకు ఎలాంటి రుసుము లేకుండా రూ.5లక్షల వరకు తక్కువ వడ్డీకే లోన్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు రోజూ ఈఎంఐ చెల్లించే అవకాశాల్ని కల్పించింది. బిజినెస్ కోసం వ్యాపారులు పేటీఎంలో మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ కింద లోన్ పొందవచ్చు. పూర్తి డిజిలైజేషన్ పద్దతిలో జరిగే లోన్ ప్రక్రియలో అదనపు పత్రాలు అవసరం లేకుండా లోన్ తీసుకోవచ్చు. వ్యాపారులు పేటీఎంలో బిజినెస్ లోన్ కోసం ప్రయత్నిస్తుంటే రోజూవారీ లావాదేవీలపై అల్గారిథమ్ని ఉపయోగించి అతని క్రెడిట్ అర్హతను గుర్తించి పేటీఎం యాప్ పెద్దమొత్తంలో లోన్‌ను మంజూరు చేస్తుంది. లోన్ పొందడానికి వ్యాపారులు యాప్‌లో ఐదు పద్దతుల్ని అనుసరించాల్సి ఉంటుంది. ►అందుబాటులో ఉన్న ఆఫర్‌ను చెక్ చేసేందుకు లోన్ కావాలనుకునే వ్యాపారి పేటీఎం యాప్‌ని తెరిచి, ‘బిజినెస్ లోన్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అవసరాన్ని బట్టి, వ్యాపారి రుణ మొత్తాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ► అర్హతను బట్టి మీకు వచ్చే లోన్ ఎంతో మీకు డిస్ప్లే అవుతాయి. అందులో రోజువారీ ఈఎంఐ ఎంత? గడువు దాటితే ఎంత ఫైన్ విధిస్తారు. ఎన్ని సంవత్సరాల్లో లోన్ కట్టాల్సి ఉంటుందనే విషయాలు మీకు కనిపిస్తాయి . ►అనంతరం లోన్ పొందుతున్న వ్యక్తి వివరాలను నిర్ధారించడానికి చెక్ బాక్స్‌పై క్లిక్ చేసి, కొనసాగించడానికి ‘గెట్ స్టార్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ► సీకేవైసీ నుండి కేవైసీలో అనుమతి ఇవ్వడం ద్వారా వ్యాపారి కనీస డాక్యుమెంటేషన్ లోన్ యాప్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ►ఈ సందర్భంగా పాన్ వివరాలు, పుట్టిన తేదీ, ఇమెయిల్, అడ్రస్‌ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది రుణాన్ని మంజూరు చేసే ముందు పాన్, క్రెడిట్స్కోర్,కేవైసీ వివరాలను ధృవీకరిస్తుంది. ►ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అర్హతను బట్టి పేటీఎం యాప్ మీ లోన్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. -
పెరిగిన గ్యాస్ ధరలు, బంపర్ ఆఫర్ ప్రకటించిన పేటీఎం
paytm cash back offer : పెట్రోలియం కంపెనీలు దేశీయ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి భారీగా పెంచాయి. దీంతో సబ్సిడీ లేని సిలిండర్లను కొనుగులు చేయడం సామాన్యులకు కష్టంగా మారింది. అయితే పెరుగుతున్న సిలిండర్ల ధరల్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త స్కీమ్‌లను ప్రకటించింది. కొత్త, పాత కస్టమర్లకు వేర్వేరు ఆఫర్లు అందిస్తోంది. ♦ పేటీఎం తాజాగా '3పే 2700 క్యాష్ బ్యాక్ ఆఫర్' ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పేటీఎంలో కొత్తగా చేరిన కస్టమర్ మొదటి మూడు నెలల కాలంలో పేటీఎం ద్వారా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకుంటే గరిష్టంగా రూ. 900ల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఒకేసారి మూడు కంపెనీలకు చెందిన మూడు సిలిండర్లు బుక్ చేస్తే ఏకంగా రూ. 2700 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ♦ ఇక ఇప్పటికే ఉన్న పేటీఎం కష్టమర్లు ఇండేన్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్‌కు చెందిన ఎల్పీజీ సిలీండర్లను బుక్ చేస్తే ప్రతి బుకింగ్ మీద 5000 వరకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అందిస్తోంది. ఈ పాయింట్లను పేటీఎంలో చేసే ఇతర షాపింగుల్లో ఈ పాయింట్లను ఉపయోగించుకోవచ్చు. ♦ పేటీఎం పోస్ట్ పెయిడ్ కష్టమర్లు ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకొని తర్వాత డబ్బులు చెల్లించవచ్చు -
యూజర్లకు పేటీఎం బంపర్ ఆఫర్..!
ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త స్కీమ్‌లను ప్రకటించింది. కొత్త, పాత కస్టమర్లకు వేర్వేరు ఆఫర్లు అందిస్తోంది. ♦పేటీఎం తాజాగా '3పే 2700 క్యాష్ బ్యాక్ ఆఫర్' ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పేటీఎంలో కొత్తగా చేరిన కస్టమర్ మొదటి మూడు నెలల కాలంలో పేటీఎం ద్వారా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకుంటే గరిష్టంగా రూ. 900ల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఒకేసారి మూడు కంపెనీలకు చెందిన మూడు సిలిండర్లు బుక్ చేస్తే ఏకంగా రూ. 2700 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ♦ ఇక ఇప్పటికే ఉన్న పేటీఎం కష్టమర్లు ఇండేన్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్‌కు చెందిన ఎల్పీజీ సిలీండర్లను బుక్ చేస్తే ప్రతి బుకింగ్ మీద 5000 వరకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అందిస్తోంది. ఈ పాయింట్లను పేటీఎంలో చేసే ఇతర షాపింగుల్లో ఈ పాయింట్లను ఉపయోగించుకోవచ్చు. ♦ పేటీఎం పోస్ట్ పెయిడ్ కష్టమర్లు ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకొని తర్వాత డబ్బులు చెల్లించ వచ్చు మెరుగైన సేవలు గ్యాస్ సిలీండర్ బుకింగ్‌ను సులభతరం చేస్తూ యాప్ లో కొత్త ఫీచర్లను పేటీఎం అప్ డేట్ చేస్తోంది. ఈ ఫీచర్ల సాయంతో సులభంగా బుక్ చేయడంతో పాటు సిలిండర్ డెలివరీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. అంతేకాదు రీఫిల్స్ కోసం ఆటోమేటెడ్ రిమైండర్ సేవల్ని పేటీఎం అందుబాటులో తెచ్చింది. -
పెట్రో మంటలు : పేటీఎం భారీ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరాఘాతంతో సెగలు కక్కుతున్న వినియోగదారులకు డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఓ వినూత్నమైన ఆఫర్ ప్రకటించింది. అటు వినియోగదారులను మరింత ఆకర్షించడంతో పాటు, భారీగా పెరుగుతున్న ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతున్న కస్టమర్లకు ఊరట కల్పించనుంది. పేటీఎం ద్వారా జరిపే పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై డిస్కౌంట్ స్కీంను, క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ కొనుగోలు చెల్లింపులపై రూ. 7500 దాకా డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనున్నట్టు వెల్లడించింది. పేటీఎం.కాం అందించిన సమాచారం ప్రకారం ఇందుకు కనీస లావాదేవీ రూ.50. ఇలా మొత్తం 50 ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఆగష్టు 1, 2019 వరకు చెల్లుతుంది. పెట్రోల్ బంకు దగ్గర మొదటి కనీస లావాదేవీ ముగిసిన అనంతరం, వినియోగదారులకు రూ. 7500 దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్' లో పాల్గొనమంటూ ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఇందులో ఒక ప్రోమో కోడ్‌ను కూడా జత చేస్తుంది. దీని ద్వారా 11, 21, 31, 41లావాదేవీల అనంతరం క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇస్తుంది. అంటే ప్రతీ పదవ లావాదేవీ అనంతరం రూ.1350 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా మొత్తం 50 ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.7500 క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను వినియోగదారులు పొందవచ్చు. లావాదేవీ ముగిసిన 48 పనిగంటల లోపు ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఈ ప్రోమో కోడ్‌తో మాత్రమే వీటిని రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఒక వారంలో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినా ముందు జరిగిన లావాదేవీకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. -
జియోని ఏ1 ధర కోత, పలు ఆఫర్లు
జియోని తన స్మార్ట్‌ఫోన్ ఏ1 ధరను తగ్గించింది. పండుగ సీజన్‌కు ముందస్తుగా ఏ1 స్మార్ట్‌ఫోన్ ధరను 3వేల రూపాయల ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ 16,999 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. అసలు ఈ ఫోన్ ధర 19,999 రూపాయలు. అంతేకాక పలు ఆఫర్లను, డీల్స్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను ఏ1 స్మార్ట్‌ఫోన్‌లో యాక్టివేట్ చేసుకుంటే, రూ.309 రీఛార్జ్ లేదా ఆపై రీఛార్జ్‌లపై అదనంగా 60జీబీ వరకు 4జీ డేటాను ఆఫర్ చేయనుంది. పేటీఎంతో జియోని భాగస్వామ్యం ఏర్పరుచుకున్న నేపథ్యంలో కనీసం రూ.350 కొనుగోళ్లపై రూ.250తో రెండు క్యాష్‌బ్యాక్ ఓచర్లను పేటీఎం ఈ మొబైల్ కొనుగోలుదారులకు అందిస్తోంది. జియోని ఏ1 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... 5.5 అంగుళాల హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే మెటల్ యునిబాడీ డిజైన్ ముందువైపు కర్వ్డ్ గ్లాస్ కోటింగ్ ఫ్రంట్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆండ్రాయిడ్7.0 నోగట్ 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరణ మెమరీ 4010ఎంఏహెచ్ బ్యాటరీ గ్రే, బ్లాక్, గోల్డ్ రంగుల్లో అందుబాటు -
రెడ్మి 4, ఎంఐ మ్యాక్స్ 2లపై పేటీఎం క్యాష్‌బ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ఫ్లాట్ఫామ్స్లపై సంచలన విక్రయాలను నమోదుచేస్తున్న రెడ్మి ఫోన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. షావోమి పాపులర్ స్మార్ట్ఫోన్లు రెడ్మి నోట్4, ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్ఫోన్లపై పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎంఐ స్టోర్ యాప్, ఎం.కామ్ వెబ్‌సైట్‌పై ఈ రెండు స్మార్ట్ఫోన్లను పేటీఎం డిజిటల్ వాలెట్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.300 క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ తెలిపింది. వాలెట్‌లోనే ఈ రూ.300 క్యాష్‌బ్యాక్ లభించనుంది. కేవలం ఒకే ఒక్క లావాదేవీకి, ఒకే యూజర్‌కు ఈ పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. షావోమి రెడ్మి నోట్4 స్మార్ట్‌ఫోన్ 2017 తొలి క్వార్టర్లో అత్యధికంగా రవాణా అయిన స్మార్ట్‌ఫోన్‌గా తాజా రిపోర్టుల్లో నిలిచింది. ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఆధారితంగా ఎంఐయూఐ 8 ద్వారా రెడ్మి నోట్4 పనిచేస్తుంది. 5.5 అంగుళాల పుల్ హెచ్డీ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్ప్లేను, స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీని కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్, 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వేరియంట్లలో ఇది లాంచ్ అయింది. ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆధారితంగా ఎంఐయూఐ 8 ద్వారా పనిచేస్తుంది. 2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీతో 4జీబీ ర్యామ్‌ను ఇది కలిగి ఉంది. 6.44 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే, 12ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దీనిలో ఫీచర్లు.