ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త స్కీమ్‌లను ప్రకటించింది. కొత్త, పాత కస్టమర్లకు వేర్వేరు ఆఫర్లు అందిస్తోంది.
♦పేటీఎం తాజాగా '3పే 2700 క్యాష్ బ్యాక్ ఆఫర్' ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం పేటీఎంలో కొత్తగా చేరిన కస్టమర్ మొదటి మూడు నెలల కాలంలో పేటీఎం ద్వారా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకుంటే గరిష్టంగా రూ. 900ల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఒకేసారి మూడు కంపెనీలకు చెందిన మూడు సిలిండర్లు బుక్ చేస్తే ఏకంగా రూ. 2700 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
♦ ఇక ఇప్పటికే ఉన్న పేటీఎం కష్టమర్లు ఇండేన్, హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్‌కు చెందిన ఎల్పీజీ సిలీండర్లను బుక్ చేస్తే ప్రతి బుకింగ్ మీద 5000 వరకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అందిస్తోంది. ఈ పాయింట్లను పేటీఎంలో చేసే ఇతర షాపింగుల్లో ఈ పాయింట్లను ఉపయోగించుకోవచ్చు.
♦ పేటీఎం పోస్ట్ పెయిడ్ కష్టమర్లు ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకొని తర్వాత డబ్బులు చెల‍్లించ వచ్చు
మెరుగైన సేవలు
గ్యాస్ సిలీండర్ బుకింగ్‌ను సులభతరం చేస్తూ యాప్ లో కొత‍్త ఫీచర్లను పేటీఎం అప్ డేట్ చేస్తోంది. ఈ ఫీచర్ల సాయంతో సులభంగా బుక్ చేయడంతో పాటు సిలిండర్ డెలివరీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. అంతేకాదు రీఫిల్స్ కోసం ఆటోమేటెడ్ రిమైండర్ సేవల్ని పేటీఎం అందుబాటులో తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment