Paytm Loan Process: ప్రముఖ డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎం బంపరాఫర్ ప్రకటించింది. చిరు వ్యాపారులకు ఎలాంటి రుసుము లేకుండా రూ.5లక్షల వరకు తక్కువ వడ్డీకే లోన్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు రోజూ ఈఎంఐ చెల్లించే అవకాశాల్ని కల్పించింది.
బిజినెస్ కోసం వ్యాపారులు పేటీఎంలో మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ కింద లోన్ పొందవచ్చు. పూర్తి డిజిలైజేషన్ పద్దతిలో జరిగే లోన్ ప్రక్రియలో అదనపు పత్రాలు అవసరం లేకుండా లోన్ తీసుకోవచ్చు. వ్యాపారులు పేటీఎంలో బిజినెస్ లోన్ కోసం ప్రయత్నిస్తుంటే రోజూవారీ లావాదేవీలపై అల్గారిథమ్‌ని ఉపయోగించి అతని క్రెడిట్ అర్హతను గుర్తించి పేటీఎం యాప్ పెద్దమొత్తంలో లోన్‌ను మంజూరు చేస్తుంది. లోన్ పొందడానికి వ్యాపారులు యాప్లో ఐదు పద్దతుల్ని అనుసరించాల్సి ఉంటుంది.
►అందుబాటులో ఉన్న ఆఫర్‌ను చెక్ చేసేందుకు లోన్ కావాలనుకునే వ్యాపారి పేటీఎం యాప్‌ని తెరిచి, ‘బిజినెస్ లోన్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అవసరాన్ని బట్టి, వ్యాపారి రుణ మొత్తాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
► అర్హతను బట్టి మీకు వచ్చే లోన్ ఎంతో మీకు డిస్‌ప్లే అవుతాయి. అందులో రోజువారీ ఈఎంఐ ఎంత? గడువు దాటితే ఎంత ఫైన్ విధిస్తారు. ఎన్ని సంవత్సరాల్లో లోన్ కట్టాల్సి ఉంటుందనే విషయాలు మీకు కనిపిస్తాయి .
►అనంతరం లోన్ పొందుతున్న వ్యక్తి వివరాలను నిర్ధారించడానికి చెక్ బాక్స్‌పై క్లిక్ చేసి, కొనసాగించడానికి ‘గెట్ స్టార్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
► సీకేవైసీ నుండి కేవైసీలో అనుమతి ఇవ్వడం ద్వారా వ్యాపారి కనీస డాక్యుమెంటేషన్ లోన్ యాప్ ప్రాసెసింగ్ జరుగుతుంది.
►ఈ సందర్భంగా పాన్ వివరాలు, పుట్టిన తేదీ, ఇమెయిల్, అడ్రస్‌ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది రుణాన్ని మంజూరు చేసే ముందు పాన్, క్రెడిట్స్కోర్,కేవైసీ వివరాలను ధృవీకరిస్తుంది.
►ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అర్హతను బట్టి పేటీఎం యాప్ మీ లోన్ మొత్తాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment