కష్టాల్లో కూరుకుపోయిన ఫిక్ టెక్ కంపెనీ పేటీఎంకి భారీ ఊరట లభించింది. కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోవడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుమతినిచ్చింది. ఆగస్ట్‌లో కంపెనీ చేసిన అభ్యర్థన మేరకు ఎన్‌పీసీఐ అనుమతిని మంజూరు చేసిందని పేటీఎం తెలిపింది.
నిబంధనలు పాటించడంలో లోపాల కారణంగా ఎన్‌పీసీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోకుండా పేటీఎంపై నిషేధించింది. తాజాగా పేటీఎం అభ్యర్థన మేరకు రెగ్యులేటరీ నిబంధనలు, ప్రోటోకాల్స్‌లను సమీక్షించి కొత్తగా యూజర్లను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే షరతులతో కూడిన అనుమతి మాత్రమే.
ఇదీ చదవండి: అదిరిపోయే ఆఫర్.. విమానం ఎక్కేయండి చవగ్గా!
ఆర్బీఐ చర్యల తర్వాత ఇప్పటివరకూ పేటీఎం షేర్లు దాదాపు 10 శాతం నష్టపోయాయి. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో 34 శాతం క్షీణత, నెలవారీ లావాదేవీల వినియోగదారులలో 25 శాతం తగ్గుదలని నివేదించింది. దీని తర్వాత కంపెనీ షేర్లు ఐదు శాతానికి పైగా పడిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment