నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) నెట్‌వర్క్ సరికొత్త రికార్డులు సృష్టించింది. గడిచిన మే నెలలో లావాదేవీల పరిమాణం, విలువ రెండూ పెరిగాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఎన్‌పీసీఐ మే నెలలో 1400 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేయడం ద్వారా కొత్త మైలురాయిని సాధించింది. ఏప్రిల్ లో నమోదైన 1330 కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. ఇక ఏప్రిల్‌లో రూ.19.64 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీ విలువ మేలో రూ.20.45 లక్షల కోట్లకు పెరిగిందని ఎన్‌పీసీఐ తెలిపింది.
ఈ ఏడాది మే నెలలో నమోదైన యూపీఐ లావాదేవీలు గతేడాదితో పోలిస్తే 49 శాతం పెరిగాయి. ఈ మే నెలలో జరిగిన యూపీఐ సగటు రోజువారీ లావాదేవీ మొత్తం రూ .65,966 కోట్లు. రోజువారీగా సగటున 45.3 కోట్ల లావాదేవీలు జరిగనట్లుగా ఎన్‌పీసీఐ గణాంకాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment