new users
-
పేటీఎంకు ఎన్పీసీఐ ఊరట
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు ఊరటనిస్తూ కొత్త యూపీఐ యూజర్లను చేర్చుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) అనుమతించింది. నిర్దేశిత మార్గదర్శకాలు, నిబంధనలను పాటించడాన్ని బట్టి అనుమతులు ఉంటాయని ఎన్పీసీఐ పేర్కొన్నట్లు ఎక్సే్చంజీలకు ఇచి్చన సమాచారంలో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వెల్లడించింది. నిబంధనలను పదే పదే ఉల్లంఘించినందుకు గాను కార్యకలాపాలు నిలిపివేయాలంటూ ఈ ఏడాది జనవరిలో అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను (పీపీబీఎల్) ఆర్బీఐ ఆదేశించడం తెలిసిందే. ఎన్పీసీఐ అనుమతుల వార్తలతో బుధవారం ఓసీఎల్ షేరు ధర 8 శాతం లాభంతో రూ. 745 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 12 శాతం ఎగబాకింది. -
పేటీఎంకి ‘కొత్త’ ఊపిరి!
కష్టాల్లో కూరుకుపోయిన ఫిక్ టెక్ కంపెనీ పేటీఎంకి భారీ ఊరట లభించింది. కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోవడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుమతినిచ్చింది. ఆగస్ట్‌లో కంపెనీ చేసిన అభ్యర్థన మేరకు ఎన్పీసీఐ అనుమతిని మంజూరు చేసిందని పేటీఎం తెలిపింది.నిబంధనలు పాటించడంలో లోపాల కారణంగా ఎన్పీసీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకోకుండా పేటీఎంపై నిషేధించింది. తాజాగా పేటీఎం అభ్యర్థన మేరకు రెగ్యులేటరీ నిబంధనలు, ప్రోటోకాల్స్లను సమీక్షించి కొత్తగా యూజర్లను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే షరతులతో కూడిన అనుమతి మాత్రమే.ఇదీ చదవండి: అదిరిపోయే ఆఫర్.. విమానం ఎక్కేయండి చవగ్గా!ఆర్బీఐ చర్యల తర్వాత ఇప్పటివరకూ పేటీఎం షేర్లు దాదాపు 10 శాతం నష్టపోయాయి. సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో 34 శాతం క్షీణత, నెలవారీ లావాదేవీల వినియోగదారులలో 25 శాతం తగ్గుదలని నివేదించింది. దీని తర్వాత కంపెనీ షేర్లు ఐదు శాతానికి పైగా పడిపోయాయి. -
కొత్త యూజర్లలో జియో, ఎయిర్టెల్ జోరు
న్యూఢిల్లీ: కొత్త యూజర్ల విషయంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ జోరు కొనసాగుతోంది. మే నెలలో రెండు సంస్థలకు కలిపి 34.4 లక్షల కనెక్షన్లు జతయ్యాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో జియోకి కొత్తగా 21.9 లక్షల మంది యూజర్లు, ఎయిర్‌టెల్‌కి 12.5 లక్షల మంది మొబైల్ కస్టమర్లు జతయ్యారు. జియో మొత్తం సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 47.46 కోట్లకు చేరింది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా మరో 9.24 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. మేలో 1.2 కోట్ల మంది మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఎంఎన్‌పీని అమల్లోకి తెచి్చనప్పటి నుంచి మే నెలాఖరు వరకు వచి్చన మొత్తం ఎంఎన్‌పీ అభ్యర్థ్ధనల సంఖ్య 98.56 కోట్లకు చేరినట్లు వివరించింది. అటు బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య నెలవారీగా 0.72 శాతం వృద్ధితో 93.5 కోట్లకు చేరింది. -
తెలుగు రాష్ట్రాల్లో జియో జోరు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియోకి కస్టమర్లు భారీగా పెరిగారు. ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం చందాదారుల గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియోలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 1.56 లక్షలకు పైగా కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు.ట్రాయ్ గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా 1,56,296 మంది మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య ఏప్రిల్ నెలాఖరి నాటికి 3.29 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో ఎయిర్టెల్ లో 55 వేల మంది కొత్త మొబైల్ చందాదారులు చేరారు. మరోవైపు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ లో భారీగా 2.57 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. వోడాఐడియా కూడా 23,456 మంది కస్టమర్లను కోల్పోయింది.ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జియో లో 26.8 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఈ గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2024 నాటికి దేశంలో మొత్తం జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరుకుంది. 7.52 లక్షల కొత్త కస్టమర్లు, 26.75 కోట్ల మొత్తం కస్టమర్లతో ఎయిర్టెల్ తర్వాత స్థానంలో ఉంది. దేశీయంగా మొత్తం టెలికాం యూజర్ల సంఖ్య ఏప్రిల్ నాటికి 120 కోట్లు దాటడం విశేషం. -
కొత్తగా 3 కోట్ల యూజర్లు లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ ఈ ఏడాది కొత్తగా దాదాపు 3 కోట్ల మంది యూజర్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది 9 కోట్లుగా ఉందని, దీన్ని సుమారు 12 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఐటెల్ మాతృసంస్థ ట్రాన్షన్ ఇండియా సీఈవో అరిజిత్ తాలపత్ర తెలిపారు. తాజాగా అధిక సామర్థ్యాలు గల ఎ60, పీ40 స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టడం, బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌ను నియమించుకోవడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యాపార విస్తరణ క్రమంలో టీవీలు, ట్యాబ్లెట్లు వంటి విభాగాల్లోకి కూడా ప్రవేశించినట్లు వివరించారు. 5జీ సేవల విస్తరణ నేపథ్యంలో తాము కూడా ఈ ఏడాది మూడు లేదా నాలుగో త్రైమాసికం నాటికి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు అరిజిత్ చెప్పారు. దీని ధర రూ. 10 వేల లోపే ఉంటుందని పేర్కొన్నారు. మేడిన్ ఇండియాపై మరింతగా దృష్టి.: ఫీచర్ ఫోన్లు, అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లను అందించడంపైనా.. దేశీయంగా తయారీపైనా ప్రధానంగా దృష్టి పెడుతున్నామని అరిజిత్ చెప్పారు. దేశీయంగానే లభ్యమయ్యే పరికరాలు, విడిభాగాలను కొనుగోలు చేయడాన్ని పెంచుకుంటున్నట్లు వివరించారు. నోయిడాలో తమకు మూడు తయారీ ప్లాంట్లు ఉన్నాయని, వీటిలో దాదాపు 4,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారని అరిజిత్ చెప్పారు. కోవిడ్‌పరమైన సవాళ్ల కారణంగా కొంతకాలం సెమీకండక్టర్ల కొరత నెలకొన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిందన్నారు. ప్రస్తుతం రూ. 10 వేల లోపు ఫోన్ల సెగ్మెంట్లో తమకు 25 శాతం పైగా మార్కెట్ వాటా ఉందన్నారు. మొత్తం స్మార్ట్ఫోన్లకు సంబంధించి రూ. 8 వేల లోపు విభాగంలో తాము 12% వాటా దక్కించుకున్నామని అరిజిత్ చెప్పారు. తమ ఆదాయాల్లో దక్షిణాది మార్కెట్ వాటా 20% ఉంటుందని ఆయన చెప్పారు. ట్రాన్షన్ సంస్థ ఐటెల్, ఇన్ఫినిక్స్, టెక్నో బ్రాండ్ల పేరిట మొబైల్ ఫోన్లను విక్రయిస్తోంది. -
జూలైలో జియో జూమ్!!
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో జోరు కొనసాగుతోంది. జూలైలో ఏకంగా 65.1 లక్షల కొత్త యూజర్లను దక్కించుకుని మార్కెట్ లీడర్‌గా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. దీనితో జులై ఆఖరు నాటికి జియో సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 44.32 కోట్లకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొత్త కస్టమర్లను (34.8 లక్షలు) దక్కించుకున్న ఏకైక సంస్థ జియో ఒక్కటే. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జూలైలో భారతి ఎయిర్టెల్ కొత్త యూజర్ల సంఖ్య 19.42 లక్షలుగా నమోదు కాగా మొత్తం కనెక్షన్ల సంఖ్య 35.40 కోట్లకు ఎగిసింది. అటు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్–ఐడియా యూజర్ల సంఖ్య మాత్రం 14.3 లక్షలు పడిపోయింది. దీంతో మొత్తం సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 27.19 కోట్లకు పరిమితమైంది. వైర్లెస్ కనెక్షన్ల మార్కెట్లో జూలై ఆఖరు నాటికి జియోకు 37.34 శాతం, భారతి ఎయిర్‌టెల్‌కు 29.83 శాతం, వొడా–ఐడియాకు 22.91 శాతం వాటా ఉంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెలికం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై నాలుగేళ్ల మారటోరియం, 100 శాతం విదేశీ పెట్టుబడులు అనుమతించడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. దీంతో వొడాఫోన్ ఐడియాకు కాస్త ఊరట లభించనుంది. 120 కోట్లకు కనెక్షన్లు..: ట్రాయ్ డేటా ప్రకారం దేశీయంగా టెలిఫోన్ కనెక్షన్లు 120.9 కోట్లకు చేరాయి. వైర్లెస్ విభాగంలో మొత్తం యూజర్ల సంఖ్య 118.6 కోట్లకు చేరింది. ఇక బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల మార్కెట్లో టాప్ 5 సరీ్వస్ ప్రొవైడర్ల వాటా 98.7 శాతంగా ఉంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, ఎట్రియా కన్వర్జెన్స్ సంస్థలు టాప్ 5లో ఉన్నాయి. -
బీఎస్ఎన్ఎల్: మూడు నెలలు ఉచిత కాల్స్!
న్యూఢిల్లీ: ప్రభుత్వం టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.149తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్‌కాల్స్(లోకల్/ఎస్టీడీ)ను 30రోజుల పాటు పొందవచ్చు. అయితే ఇతర నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాలు మించి వాయిస్‌కాల్స్ చేసుకునే వెసులుబాటు లేదు. అంతేకాకుండా రూ.439తో రీఛార్జ్ చేయడం ద్వారా మూడు నెలల పాటు ఉచిత వాయిస్ కాల్స్‌ను చేసుకోవచ్చు. తాజా పథకం జనవరి 24వ తేదీ నుంచి కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే వినియోగదారులకు వర్తిస్తుంది.