మేలో 34.4 లక్షల కనెక్షన్లు
న్యూఢిల్లీ: కొత్త యూజర్ల విషయంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ జోరు కొనసాగుతోంది. మే నెలలో రెండు సంస్థలకు కలిపి 34.4 లక్షల కనెక్షన్లు జతయ్యాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో జియోకి కొత్తగా 21.9 లక్షల మంది యూజర్లు, ఎయిర్‌టెల్‌కి 12.5 లక్షల మంది మొబైల్ కస్టమర్లు జతయ్యారు.
జియో మొత్తం సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 47.46 కోట్లకు చేరింది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా మరో 9.24 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. మేలో 1.2 కోట్ల మంది మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఎంఎన్‌పీని అమల్లోకి తెచి్చనప్పటి నుంచి మే నెలాఖరు వరకు వచి్చన మొత్తం ఎంఎన్‌పీ అభ్యర్థ్ధనల సంఖ్య 98.56 కోట్లకు చేరినట్లు వివరించింది. అటు బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య నెలవారీగా 0.72 శాతం వృద్ధితో 93.5 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment