Connections
-
ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్
ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్.. ఈ శీర్షిక చూడగానే మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. కానీ ఇలాంటిదొకటి ఉందని నాకు 15 ఏళ్ల కిందటే తెలుసు. సమాజంలో వస్తున్న కొత్త ట్రెండ్ లను ఎప్పటికప్పడు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం సైకాలజిస్టుగా నాకు అవసరం. అలా దాని గురించి తెలుసుకున్నా. ఆ మధ్య కాలంలో అలాంటి కేస్ ఒకటి నా దగ్గరకు వచ్చింది. దాని గురించే ఈరోజు మీతో పంచుకుంటా.అసలేంటీ కాన్సెప్ట్? ఆఫీస్ వైఫ్/ఆఫీస్ హజ్బండ్ అనే పదాలు ఒకరి వర్క్ లైఫ్ లో ముఖ్యమైన సహాయక పాత్ర పోషించే కొలీగ్ గురించి చెప్పేవి. లైఫ్ పార్టనర్ కు సమానమైన ఎమోహనల్ సపోర్ట్, గైడెన్స్, కంపాయిన్షిప్ అందించే వ్యక్తిని ఆఫీస్ స్పౌజ్ అంటారు. వారిద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్, కొలాబరేషన్ ఉంటుంది. ఇతర కొలీగ్స్ తో పంచుకోని, పంచుకోలేని వృత్తిగత, వ్యక్తిగత విషయాలు వారితో పంచుకుంటారు. వారి బంధం అంతవరకే పరిమితం, ఎలాంటి లైంగిక సంబంధం ఉండదు.ఎమోషనల్ డిపెండెన్సీ...హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కార్పొరేషన్లో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ గా పని చేస్తున్న ప్రియా శర్మ తన సహోద్యోగి రాజీవ్ పటేల్ ఐదేళ్లుగా కలిసి పనిచేస్తున్నారు. చాలా ప్రాజెక్టులు పూర్తి చేయడంలో రాజీవ్ ఆమెకు తన సహకారం అందించాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇరువురి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, బాధ్యతలు, బాధలు పంచుకునేవారు.ఒత్తిడి సమయాల్లో ప్రియకు రాజీవ్ ఎమోషనల్ సపోర్ట్ అందించగా, రాజీవ్ కు కష్ట సమయాల్లో ప్రియ భరోసాగా నిలిచింది. అలా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది వృత్తిపరమైన సరిహద్దు రేఖలను చెరిపేయడం ప్రారంభించింది. తరచుగా తమ వ్యక్తిగత వివరాలను పంచుకునేవారు. ఆఫీస్ తో పాటు బయట కూడా తరచూ కలుసుకునేవారు.రాజీవ్ పై ఆమె ఎమోషనల్ గా బాగా ఆధారపడింది. ఎప్పుడు ఒత్తిడి, ఆందోళన అనిపించినా అతనితో మాట్లాడి రిలాక్స్ అయ్యేది. అతను అందుబాటులో లేనప్పుడు అభద్రతకు, ఆందోళనకు లోనయ్యేది. అతను లేకుంటే సరిగా పనిచేయలేకపోయేది.పుకార్లు షికారు... ఇవన్నీ కలిసి ఆఫీసులో వారిద్దరి రిలేషన్ షిప్ పై అనుమానాలకు కారణమయ్యాయి. టీమ్ లో కూడా సమస్యలు మొదలయ్యాయి. తామెంత పనిచేసినా రాజీవ్ ప్రియనే సపోర్ట్ చేస్తాడని, తమకు అన్యాయం చేస్తాడని మిగతావాళ్లు భావిస్తున్నారు. వారిని ‘ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్’ అని అనుకోవడం మొదలుపెట్టారు.ఈ మాటలు ప్రియ వరకు వచ్చేసరికి తల్లడిల్లిపోయింది. ఫ్రెండ్లీగా ఉన్నంతమాత్రాన ఇలా మాట్లాడతారా.. అని బాధపడుతోంది. ఇదంతా ఆమె కుటుంబ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కౌన్సెలింగ్ కోసం వచ్చింది.ఇలాంటి సమస్య మీకూ ఎదురై ఉండవచ్చు. మీరు క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్ తో సంబంధం అంటగట్టేవాళ్లు మీ పక్కనే ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ తుఫాన్ ను కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. అలాంటి సందర్భాల్లో ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అవసరం. అలానే ప్రియ కౌన్సెలింగ్ కోసం వచ్చింది.మూడు నెలల థెరపీ...ప్రియాశర్మ తన సమస్య గురించి వివరించాక సైకోడయాగ్నస్టిక్స్ ద్వారా ఆమె తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జయిటీకి లోనవుతున్నట్లు నిర్ధారణైంది. దీంతో ఆమెకు సైకోథెరపీ ప్రారంభించాను. ఈ థెరపీ లక్ష్యం ప్రియ, రాజీవ్ మద్య ప్రొఫెషనల్ బౌండరీస్ ను తిరిగి ఏర్పాటు చేయడం, అతనిపై ఎమోషనల్ డిపెండెన్సీని తగ్గించి, స్వంత కోపింగ్ మెకానిజమ్ లను మెరుగుపరచడం, వర్క్ ప్లేస్ డైనమిక్స్ ను మెరుగుపరచడం. వారానికో సెషన్ చొప్పున మూడు నెలలపాటు రోల్-ప్లేయింగ్ బౌండరీస్, కాగ్నిటివ్ బిహేవియరల్ టెక్నిక్స్, ఎమోషనల్ రెగ్యులేషన్, వర్క్ ప్లేస్ డైనమిక్స్ ను మెరుగుపరిచేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ తదితర టెక్నిక్స్ ద్వారా ఆమె మామూలు మనిషి కాగలిగింది. రాజీవ్ తో ఫ్రెండ్లీగా ఉంటూనే తన సైకలాజికల్ వెల్ బీయింగ్ ను కాపాడుకోగలిగింది.ముందిలా చేయండి.. అంటే ఏంటి సర్, ఇప్పుడే సమస్య వచ్చినా మీ దగ్గరకు రావాలంటారా? అని మీరు అనుకోవచ్చు. అలా నేనెప్పుడూ చెప్పను. ఎవరైనా సరే మొదట తన సమస్యను తానే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు, చేయాలి కూడా. అలా చేసినా ఫలితం లేనప్పుడే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాలి. మీకోసం కొన్ని సెల్ఫ్ హెల్ప్ టిప్స్...1.సహోద్యోగులతో మీ సరిహద్దులను స్పష్టంగా నిర్దేశించుకోండి. ఆఫీస్ టైంలో పర్సనల్ ఇష్యూస్ చర్చించవద్దు. ఆ తర్వాత కమ్యూనికేషన్ ను పరిమితం చేయండి. 2. రోజూ డైరీ రాయడం మీ ఆలోచనలను, చర్యలను గమనించడానికి, అవి మీ ప్రొఫెషనల్ బౌండరీస్ కు అనుగుణంగా ఉన్నాయో లేవో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. 3. మీ కొలీగ్ పై ఆధారపడేలా చేసే ట్రిగ్గర్ లను గుర్తించి, వాటిని మేనేజ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. 4.మిమ్మల్ని మానసికంగా సంతృప్తి పరిచే హాబీల్లో కొంత సమయం గడపండి. ఇది ఇతరులపై ఎమోషనల్ గా ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. 5. ఏ ఒక్కరికో పరిమితం కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులు లతో సపోర్ట్ నెట్‌వర్క్‌ను రూపొందించండి, 6. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోండి.7. ఒత్తిడిని మేనేజ్ చేసేందుకు మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నెస్, మెడిటేషన్ లను రోజూ ప్రాక్టీస్ చేయండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.comConnections corner -
అలా చేస్తే బ్లాక్లిస్టింగే.. ట్రాయ్ హెచ్చరిక
న్యూఢిల్లీ: బల్క్ కనెక్షన్లను దుర్వినియోగం చేసే సంస్థలు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసింది.వీటిని స్పామ్ కాల్స్ కోసం ఉపయోగిస్తున్నట్లు తేలిన పక్షంలో సదరు సంస్థల టెలికం వనరులను టెల్కోలు డిస్కనెక్ట్ చేయాలని, అలాగే ఆపరేటర్లంతా వాటిని రెండేళ్ల వరకు బ్లాక్ లిస్ట్ చేయాలని నిర్ణయించింది. టెల్కోల చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్లతో గురువారం సమావేశమైన మీదట ట్రాయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.మరోవైపు, ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వైట్లిస్ట్లో లేని యూఆర్ఎల్స్, ఏపీకేలు గల మెసేజీల డెలివరీకి అనుమతి ఉండదని ట్రాయ్ తెలిపింది. అలాగే మెసేజీని పంపే సంస్థ, టెలీమార్కెటర్ను ట్రేస్ చేసే సాంకేతికతను అక్టోబర్ 31 నాటికల్లా అమల్లోకి తేవాలని టెల్కోలకు సూచించింది. ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, జియో తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
కొత్త యూజర్లలో జియో, ఎయిర్టెల్ జోరు
న్యూఢిల్లీ: కొత్త యూజర్ల విషయంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ జోరు కొనసాగుతోంది. మే నెలలో రెండు సంస్థలకు కలిపి 34.4 లక్షల కనెక్షన్లు జతయ్యాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో జియోకి కొత్తగా 21.9 లక్షల మంది యూజర్లు, ఎయిర్‌టెల్‌కి 12.5 లక్షల మంది మొబైల్ కస్టమర్లు జతయ్యారు. జియో మొత్తం సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 47.46 కోట్లకు చేరింది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా మరో 9.24 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. మేలో 1.2 కోట్ల మంది మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఎంఎన్‌పీని అమల్లోకి తెచి్చనప్పటి నుంచి మే నెలాఖరు వరకు వచి్చన మొత్తం ఎంఎన్‌పీ అభ్యర్థ్ధనల సంఖ్య 98.56 కోట్లకు చేరినట్లు వివరించింది. అటు బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య నెలవారీగా 0.72 శాతం వృద్ధితో 93.5 కోట్లకు చేరింది. -
వినోదం కోసం..ఫైబర్‌కు సై!
న్యూఢిల్లీ: దేశీయంగా టీవీ వీక్షకులు వినోదం కోసం క్రమంగా డీటీహెచ్ (డైరెక్ట్ టు హోమ్) సర్వీసుల నుంచి ఫైబర్ కనెక్షన్ల వైపు మళ్లుతున్నారు. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ వేగవంతంగా ఉండటం, అనేకానేక ఓటీటీ యాప్‌లు అందుబాటులోకి రావడం, నెట్వర్క్ స్థిరంగా ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. దీంతో లక్షల మంది కస్టమర్లు డీటీహెచ్‌ను వదిలేసి ఫైబర్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత త్రైమాసికంలో డీటీహెచ్ కస్టమర్ల సంఖ్య ఏకంగా 13.20 లక్షలు తగ్గడం ఇందుకు నిదర్శనం. ఫైబర్ కనెక్షన్లకు ఆదరణ పెరుగుతుండటమనేది వినోదం విషయంలో ప్రజల అలవాట్లు మారుతుండటాన్ని సూచిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాతావరణంలో మార్పులు, సాంకేతిక లోపాల కారణంగా పదే పదే అంతరాయాలు వస్తుంటాయని డీటీహెచ్ సర్విసులపై విమర్శలు ఉన్నాయి. అదే ఫైబర్ కనెక్షన్లయితే పటిష్టమైన, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా ఉంటాయని ధీమా ఉంటోంది. గ్యారంటీగా నిరంతరాయ సర్వీసుతో పాటు పనితీరు కూడా అత్యుత్తమంగా ఉండటంతో ఇవి మరింత ఆకర్షణీయంగా మారుతున్నాయి. యువత దన్ను.. జియో సినిమా, జియోటీవీ వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లు ప్రజల ధోరణులు మారడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫైబర్ కనెక్షన్ల ద్వారా అందుబాటులో ఉండే ఈ ప్లాట్‌ఫామ్‌లు.. భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా లైవ్ స్పోర్ట్స్, లేటెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు లాంటి బోలెడంత కంటెంట్‌ను హై డెఫినిషన్ నాణ్యతతో అందిస్తున్నాయి. ఇంటర్నెట్ ద్వారా నిరంతరాయంగా వినోద సర్విసులు అందుబాటులో ఉండటమనేది ఆకర్షణీయంగా ఉండటంతో యువత ఎక్కువగా ఫైబర్ కనెక్షన్ల వైపు మొగ్గు చూపుతోంది. గణాంకాల ప్రకారం ఇప్పటికే 2.23 కోట్ల మంది యూజర్లు ఫైబర్వైపు మారారు. సాంప్రదాయ డీటీహెచ్ సేవలతో పోలిస్తే ఇంటర్నెట్ ఆధారిత ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని విశ్లేషకులు తెలిపారు. అదే సమయంలో డీటీహెచ్ సర్విసులకు డిమాండ్ తగ్గుతుండటాన్ని కూడా సూచిస్తోందని పేర్కొన్నారు. -
ఈ సమస్యలు మీకూ ఉన్నాయా? షాకింగ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: దేశం వేగవంతమైన 5 జీ నెట్వర్క్ సేవలకు పరుగులు తీస్తున్నక్రమంలో నెట్వర్క్ సమస్యలపై షాకింగ్ సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది. వినియోగదారులకు కాల్‌డ్రాప్, కాల్ కనెక్ట్ కాకపోవడం అనేది ఎంత చికాకు కలిగిస్తుందో అందరికి అనుభవమే. తాజాగా దేశంలో 339 జిల్లాల పరిధిలోని సర్వేలో పాల్గొన్న 56 శాతం మంది యూజర్లు తమ నెట్వర్క్ బాధలను వెల్లడించారు. తీవ్రమైన కాల్ డ్రాప్, కాల్ కనెక్షన్ సమస్యలను ఎదుర్కొంటున్నా మన్నారు. అంతేకాదు 82 శాతం మంది ప్రజలు ఈ నెట్వర్క్ సమస్యలను అధిగమించడానికి డేటా లేదా వైఫై కాల్స్ చేస్తున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ లోకల్ సర్కిల్స్ సోమవారం ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది. సర్వే ప్రకారం గత 3 నెలల్లో వారి మొబైల్ ఫోన్ కాల్లలో ఎంత శాతం చెడ్డ కనెక్షన్ లేదా కాల్ డ్రాప్ సమస్యలను కలిగి ఉన్నాయనే ప్రశ్నకు సమాధానంగా, 37 శాతం మంది 20-50 శాతం సమస్యను ఎదుర్కొన్నారు. కాల్ కనెక్షన్ డ్రాప్‌పై ఇచ్చిన ప్రశ్నకు 8,364 ప్రత్యుత్తరాలు వచ్చాయి. మొత్తంగా 91 శాతం మంది తాము సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పగా, 56 శాతం మంది తమ విషయంలో సమస్య మరింత తీవ్రంగా ఉందని చెప్పారు. కాల్ నాణ్యతపై దృష్టి సారించిన సర్వే 31వేల మందిపై లోకల్ సర్కిల్స్ సర్వే చేసింది. ఇందులో టైర్ 1 నగరాల్లోని 42 శాతం మంది, టైర్ 2 నుండి 31 శాతం , టైర్ 3, 4 గ్రామీణ జిల్లాల నుండి 27 శాతం ఉన్నట్టు నివేదిక పేర్కొంది. 78 శాతం పౌరులు తప్పు కనెక్షన్ ఉన్నప్పటికీ 30 సెకన్లలోపు ఆటోమేటిక్ కాల్ డ్రాప్ సమస్య రాలేదని సర్వే తేల్చింది. డేటా లేదా వైఫై కనెక్షన్ ఉన్న 82 శాతం మంది పౌరులు తరచుగా డేటా లేదా వైఫై కాల్స్ చేస్తున్నారు. ఎందుకంటే వారు సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌ను పొందడం లేదా కనెక్ట్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది -
మందు బాబులూ.. ఆ ప్రకటనను నమ్మకండి
వైరల్: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయాక.. ఏది నిజమో, ఏది అబద్ధమో ధృవీకరించుకోలేని పరిస్థితి నెలకొంది. ఆఖరికి ఫ్యాక్ట్ చెక్‌ల పేరుతో చేస్తున్న ప్రయత్నాలు సైతం వర్కవుట్ కావడం లేదు. దీంతో చాలావరకు విషయాలు నిజనిర్ధారణల మధ్య నలిగిపోతున్నాయి. అయితే.. ఫార్మర్డ్ రాయుళ్ల దెబ్బకు కొత్తా.. పాతా.. ఉత్త పుకార్లు వైరల్ అవుతూనే వస్తున్నాయి. తాజాగా.. మందు బాబుల కోసం మోదీ సర్కార్ తీపి కబురు అంటూ ఓ ప్రకటన విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంటింటికి కరెంట్.. నల్లా కనెక్షన్‌లాగా.. మందు కనెక్షన్ల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నది ఆ వైరల్ వార్త సారాంశం. ఇంటింటికే మద్యం పాలసీలో భాగంగా.. లిక్కర్ పైప్లైన్లను ప్రభుత్వం తీసుకురాబోతోందన్నది ఆ వైరల్ మెసేజ్. ఈ మేరకు హిందీలో ఓ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది. ‘గౌరవనీయులైన ప్రధానిగారు మందు బాబుల కోసం లిక్కర్ పైప్‌లైన్ పథకం తీసుకురాబోతున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోండి. పీఎంవో పేరిట 11 వేల డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లై చేయండి’ అంటూ ఆ ఫేక్ నోటిఫికేషన్ వైరల్ అవుతోంది. అప్లై చేసుకున్న వాళ్ల ఇళ్లను అధికారులు సందర్శించి.. కనెక్షన్‌ను మంజూరు చేస్తారట. పవర్ మీటర్లకు వాటిని కనెక్ట్ చేసి.. వాడకం ఆధారంగా బిల్లులు వేస్తారట. ఇంత ఫేక్ ప్రకటనపై ఫ్యాక్ట్ చెక్ సైట్ పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఊరుకుంటుందా?.. అందుకే వెల్కమ్ చిత్రంలోని నానా పటేకర్ ‘కంట్రోల్’ మీమ్‌తో గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు అతిగా ఆశలు పెంచుకోవద్దంటూ మందు బాబులకు చిల్ గాయ్స్ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఉంచింది. Chill guys, Don’t get your hopes too high‼️#PIBFactCheck pic.twitter.com/34zeYEKByq — PIB Fact Check (@PIBFactCheck) July 18, 2022 ఇదీ చదవండి: ఇకపై వ్యాక్సిన్ తీసుకుంటే క్యాష్ రివార్డు! -
డిస్క్ంకు ఉరితాళ్లు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీధుల్లో లాగుతున్న వివిధ రకాల కేబుల్ వైర్లు (ఇంటర్నెట్, డిష్)విద్యుత్ స్తంభాలకు పెద్ద గుదిబండలా మారాయి. కోర్సిటీతోపాటు శివారు మున్సిపాలిటీల్లోనూ విద్యుత్ స్తంభాలు వివిధ రకాల కేబుల్ వైర్లతో సాలెగూళ్లను తలపిస్తున్నాయి. ఒక విద్యుత్ స్తంభానికి మరో విద్యుత్ స్తంభానికి మధ్య మైనస్ (ఎర్త్), ప్లస్ (పవర్ సప్లయ్)తో పాటు త్రీ ఫేజ్ (ఎల్టీ) వైర్లు మాత్రమే ఉండాల్సిఉండగా 40 నుంచి 50 కేబుల్ వైర్లు వేలాడుతున్నాయి. ఈదురు గాలితో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడుతున్నాయి. సాధారణంగా రెండు మూడు వైర్లు మాత్రమే ఉంటే చెట్ల బరువుకు తీగలు తెగి, నష్టం కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అంతకు మించి కేబుళ్లు వేలాడుతున్నాయి. భారీ చెట్లు, కొమ్మలు విరిగి ఈ లైన్లపై పడ్డప్పుడు ఆ బరువుకు అటు ఇటుగా ఉన్న విద్యుత్ స్తంభాలు ఒరుగుతున్నాయి. ఫలితంగా సంస్థకు భారీగా ఆరి్థక నష్టం వాటిల్లడంతో పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అంతేకాదు పునరుద్ధరణకు 12 నుంచి 24 గంటల సమయం పడుతోంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 8 నుంచి 13 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జోన్ల పరిధిలో 2,153 ఫీడర్లు ట్రిప్పవగా, 361 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరో 31 డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడానికి ఈ కేబుళ్లే ప్రధాన కారణమని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. జంక్షన్ బాక్సులు..గుట్టుగా కనెక్షన్లు విపత్తులను తట్టుకుని నిలబడాల్సిన విద్యుత్ స్తంభాలు కేబుళ్ల కారణంగా అడ్డంగా విరిగిపడుతున్నాయి. స్తంభాలు ఎవరైనా ఎక్కాలన్నా..వీధి చివరిలోని డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను తాత్కాలికంగా బంద్ చేయాలన్నా డిస్కం అనుమతి తప్పని సరి. కానీ ఇంటర్నెట్, కేబుల్ సిబ్బంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఆయా స్తంభాలకు ఏర్పాటు చేసిన జంక్షన్ బాక్సులకు పోల్స్‌పై నుంచి గుట్టుగా సర్వీసు వైర్‌ను లాగి కరెంట్‌ను వాడుతున్నారు. యధేచ్ఛగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాయి. గ్రేటర్లో ఈ తరహా కనెక్షన్లు 60 వేల వరకు ఉన్నట్లు అంచనా. విద్యుత్ చౌర్యం వల్ల సంస్థకు వస్తున్న ఈ నష్టాలను క్షేత్రస్థాయి సిబ్బంది లైన్‌లాస్ జాబితాలో వేసి చేతులు దులుపుకుంటుండటం గమనార్హం. ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు విద్యుత్ స్తంభాల తయారీలో నాణ్యత లోపం స్పష్టంగా కన్పిస్తుంది. సిమెంట్, ఇసుక, ఐరన్ కూడా సరిగా వాడటం లేదు. పాతిన కొద్ది రోజులకే సగానికి విరిగిపోతున్నాయి. భూమిలో మీటరు లోతు వరకు పాతాల్సి ఉండగా, చాలా చోట్ల ఒకటి రెండు ఫీట్లకు మించి తవ్వడం లేదు. పట్టు కోసం చుట్టూ సిమెంట్ వాడక పోవడంతో ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడి నేలకూలుతున్నాయి. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు పోల్‌పైకి ఎక్కే సమయంలో పట్టు దొరక్క కారి్మకులు కింద పడుతున్నారు. ఇటీవల కందుకూరు, మహేశ్వరంలో ఇద్దరు కారి్మకులు చనిపోవడానికి కూడా ఇదే కారణం. స్తంభాల చుట్టూ కేబుళ్లు భారీగా అల్లుకపోయి ఉండటంతో ఏ వైరు దేనికి సంబంధించిందో అర్థం కావడం లేదు. కార్మికులు పోల్పైకెక్కే సమయంలో ఎల్సీ తీసుకున్నప్పటికీ..కొంత మంది ఇళ్లలో జనరేటర్లు, ఇన్వర్టర్లు పని చేస్తుండటం వల్ల ఆయా వైర్ల నుంచి పోల్‌పైకి కరెంట్ రివర్స్ సప్లయ్ జరిగి కార్మికులు విద్యుత్‌షాక్‌కు గురవుతున్నారు. (చదవండి: 19 డిపోలు లాభాలబాట) -
తగ్గిన టెలికం యూజర్ల సంఖ్య
న్యూఢిల్లీ: టెలికం యూజర్ల సంఖ్య ఈ ఏడాది మే నెలలో 116.3 కోట్లకు తగ్గింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే 0.49 శాతం క్షీణించింది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలైన ఏప్రిల్‌లో టెలికం యూజర్ల సంఖ్య 85.3 లక్షల మేర క్షీణించి 116.94 కోట్లకు తగ్గింది. ఏప్రిల్‌తో పోలిస్తే మేలో యూజర్ల సంఖ్య తగ్గుదల 57.6 లక్షలకు పరిమితమైంది. మొబైల్ టెలిఫోనీ విభాగంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు చెరి 47 లక్షల యూజర్లను కోల్పోయాయి. ఎయిర్టెల్ వైర్లెస్ కస్టమర్ల సంఖ్య 31.7 కోట్లు, వొడాఫో¯Œ ఐడియా యూజర్ల సంఖ్య 30.9 కోట్లకు క్షీణించింది. జియో, బీఎస్ఎన్ఎల్ జోరు..: జియో 36 లక్షల కొత్త కనెక్షన్లు జారీ చేసింది. మొత్తం మీద 39.2 కోట్ల యూజర్లతో అగ్రస్థానంలో ఉంది. అటు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య సైతం 2 లక్షలు పెరిగి 11.9 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో క్షీణత..: పట్టణాల్లో మొబైల్ యూజర్ల సంఖ్య 92.3 లక్షల మేర తగ్గగా, గ్రామీణ ప్రాంతాల్లో 36.2 లక్షలు పెరిగింది. మే నెలాఖరు నాటికి మొత్తం మొబైల్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 114.39 కోట్లుగా, ల్యాండ్‌లైన్ యూజర్ల సంఖ్య 1.97 కోట్లుగా ఉంది. బీఎస్ఎన్ఎల్ ఫిక్స్డ్ లైన్ కస్టమర్ల సంఖ్య తగ్గుదల మేలోనూ కొనసాగింది. మొత్తం 1.34 లక్షలు క్షీణించింది. అటు జియో మాత్రం 90,000 కొత్త కస్టమర్లను సంపాదించుకుంది. పెరిగిన బ్రాడ్‌బ్యాండ్... మొత్తం టెలికం యూజర్ల సంఖ్య తగ్గినప్పటికీ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు మాత్రం పెరిగారు. వీరి సంఖ్య ఏప్రిల్‌లో 67.3 కోట్లుగా ఉండగా 1.13 శాతం పెరిగి 68.3 కోట్లకు చేరింది. వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అత్యధికంగా 66.37 కోట్లుగా ఉండగా, వైర్‌లైన్ కనెక్షన్లు 1.93 కోట్లుగా ఉన్నాయి. -
నిర్మాణ రంగానికి ఊతం
1. ముందే విద్యుత్, నీటి కనెక్షన్ల దరఖాస్తు.. గతంలో నిర్మాణం పూర్తయి ఓసీ వచ్చిన తర్వా తే వాటర్ వర్క్స్, ట్రాన్స్‌కో విభాగాల కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కానీ, తాజా నిబంధనతో ఓసీ రాకముందే డెవలపర్లు విద్యుత్, వాటర్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనెక్షన్లు మాత్రం ఓసీ మంజూరయ్యాకే ఇస్తారు. కొన్ని చోట్ల వాటర్ వర్క్స్ విభాగానికి పూర్తి స్థాయిలో నల్లా లైన్స్ లేవు. టెండర్లు పిలవటం, పనులు పూర్తవటం వంటి తతంగమంతా జరగడానికి 3–9 నెలల సమయం పట్టేది. ఈ లోపు నిర్మాణం పూర్తయినా సరే కస్టమర్లు గృహ ప్రవే శం చేయకపోయే వాళ్లు. ఎందుకంటే మౌలిక వసతులు లేవు కాబట్టి! కానీ, ఇప్పుడు దరఖాస్తు చేయగానే వెంటనే అధికారులు ఆయా ప్రాం తాల్లో కనెక్షన్లు ఉన్నాయా? లేవా? చెక్ చేసుకునే వీలుంటుంది. దీంతో నిర్మా ణంతో పాటూ వసతుల ఏర్పాట్లు ఒకేసారి జరుగుతాయి. 2. వెంటిలేషన్స్లో గ్రీన్.. హరిత భవనాల నిబంధనల్లో ప్రధానమైనవి.. భవ న నిర్మాణాల్లో సాధ్యమైనంత వరకూ సహజ వనరుల వినియోగం. ఉదయం సమయంలో ఇంట్లో లైట్ల వినియోగం అవసరం లేకుండా సహజ గాలి, వెలుతురు వచ్చేలా గదుల వెంటిలేషన్స్ ఉం డాలి. అందుకే తాజాగా గదుల వెంటిలేషన్స్ గ్రీన్ బిల్డింగ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలనే నిబంధనలను తీసుకొచ్చారు. దీంతో ఇంట్లో లైట్లు, ఏసీల వినియోగం తగ్గుతుంది. ఫలితంగా కరెంట్ ఆదా అవుతుంది. నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది. 3. సెట్‌బ్యాక్స్ తగ్గింపు.. 120 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే భవనా ల చుట్టూ 20 మీటర్ల వెడల్పు ఖాళీ స్థలం వదిలితే సరిపోతుంది. గతంలో వీటికి సెట్‌బ్యాక్స్ 22.5 మీటర్లుగా ఉండేది. 55 మీటర్ల వరకూ ఎత్తు భవనాలకు గరిష్టంగా చుట్టూ వదలాల్సిన స్థలం 16 మీటర్లుగా ఉండగా.. ఆపై ప్రతి 5 మీటర్లకు 0.5 మీటర్ల ఖాళీ స్థలం పెరిగేది. కానీ, తాజా నిబంధనలతో 120 మీటర్ల ఎత్తు దాటితే గరిష్టంగా 20 మీటర్ల సెట్‌బ్యాక్ వదిలితే సరిపోతుంది. 4. రోడ్ల విస్తరణకు స్థలం ఇస్తే.. నగరంలో రోడ్ల విస్తరణలో స్థలాల సమీకరణ పెద్ద చాలెంజ్. దీనికి పరిష్కారం చెప్పేందుకు, స్థలాలను ఇచ్చేవాళ్లను ప్రోత్సహించేందుకు నిబంధనల్లో మార్పు చేశారు. రోడ్ల విస్తరణకు ముందు ఉన్న విధంగానే భవనం నమూనా, ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు ఉన్న ఎత్తు సేమ్ అదేగా ఉండాల్సిన అవసరం లేదు. భవన నిర్మాణానికి అనుమతించిన విస్తీర్ణం మాత్రం గతం కంటే మించకుండా ఉంటే చాలు. 5. టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ ఇప్పటివరకు టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్స్ అనేవి స్టార్ హోటళ్లు, ప్రీమియం అపార్ట్మెంట్లలో మాత్ర మే కనిపించేవి. కానీ, తాజా సవరణల్లో టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ ఏర్పాటును చేర్చారు. అపార్ట్మెంట్ పైకప్పును పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. పైగా టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్, దాని కింది ఫ్లోర్‌లోనే క్లబ్ హౌస్ వంటి వసతులుంటా యి కాబట్టి కస్టమర్లు పూర్తి స్థాయిలో వసతులను వినియోగించుకుంటారు. అపార్ట్మెం ట్ చల్లగా ఉంటుంది. ఏసీ వినియోగం తగ్గు తుంది. నిర్వహణ పటిష్టంగా ఉన్నంతకాలం బాగుంటుంది. – సాక్షి, హైదరాబాద్ ఇంపాక్ట్ ఫీజు సంగతేంటి? ఓసీ రాకముందే బీటీ, సీసీ రోడ్లు నిర్మా ణం పూర్తి చేయాలనే నిబంధనను తీసుకొ చ్చారు. ఇది ఆహ్వానించదగ్గదే. కానీ, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ కోసం వసూలు చేస్తున్న ఇంపాక్ట్ ఫీజును ఇందులో నుంచి మినహాయించాలనేది డెవలపర్ల డిమాండ్. 6 ఫ్లోర్ల తర్వాత నుంచి ఇంపాక్ట్ ఫీజుగా చ.అ.కు రూ.50 వసూలు చేస్తున్నారు. నిజానికి నిర్మాణ కార్యకలాపాలతో అభి వృద్ధి జరిగి ఆయా ప్రాంతాల్లో జనాభా పెరుగుతుంది కాబట్టి ఇంపాక్ట్ ఫీజులతో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, తాజా నిబంధనల్లో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ కూడా నిర్మాణదారులే చేయాలి. ఆ తర్వాతే ఓసీ మంజూరు చేస్తామనడం సరైనది కాదు. ఇంపాక్ట్ ఫీజు ఎస్క్రో ఖాతాలో ఉంటుంది ఈ సొమ్ముతో డెవలపర్లు వసతులను ఏర్పా టు చేయాలి లేదా ఆయా ఖర్చును ఇంపాక్ట్ ఫీజు నుంచి మినహాయించాలి. -
పేదింటికి వెలుగు
ఆదిలాబాద్‌టౌన్: కిరోసిన్ దీపాలు పెట్టుకొని కాలం గడిపే రోజులు పోనున్నాయి.. విద్యుత్ వైర్లకు కొండ్లు తగలించి కరెంట్ వాడుకోవడం వంటి బాధలు ఇక తప్పనున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టి పేదింట్లో విద్యుత్ కాంతులు వెదజల్లే పథకం జిల్లాలో అమలవుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల్లో రూ.125కే విద్యుత్ వెలుగులు నింపేందుకు ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే జిల్లాకు ప్రభుత్వం 9వేల కనెక్షన్లు లక్ష్యం ఇవ్వగా, అంతకు మించి 11,114 దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం కావడంతో మరిన్ని దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేని ఇల్లు ఉండొద్దనే ఉద్దేశంతో కేంద్రం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ కనెక్షన్ లేకుండా ఇబ్బందులు పడుతున్న పేదల జీవితాల్లో ఈ పథకం వెలుగులు నింపనుంది. అయితే ఈ పథకం చివరి గడువు ఈనెల 31తో ముగియనుంది. గతేడాది కాలంగా వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతోపాటు మీటర్లు బిగించి కరెంటు సరఫరా చేస్తున్నారు. రూ.125కే గృహ విద్యుత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి పథకం ద్వారా రూ.125కే విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. విద్యుత్ మీటర్‌తోపాటు ఒక ఎల్ఈడీ బల్బు, పది మీటర్ల సర్వీస్ వైర్, స్విచ్‌బోర్డు, అర్తింగ్, ఎంసీబీ బటన్ కూడా ఇస్తున్నారు. ఈ పథకానికి 2018 అక్టోబర్‌తో గడువు ముగిసినా పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గడువును పొడిగించింది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెల్లరేషన్‌కార్డు ఉన్నవారు సంబంధిత విద్యుత్ శాఖ ఏఈ, లైన్మెన్లకు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు. లబ్ధిదారులు ఇంటి పన్ను రశీదు, ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్, రేషన్‌కార్డు జిరాక్స్‌లను దరఖాస్తుతోపాటు రూ.125 అందజేస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. లక్ష్యానికి మించి దరఖాస్తులు.. జిల్లాకు ఈ పథకం కింద 9వేల లక్ష్యం కేటాయించారు. కాగా ఇప్పటి వరకు 11,114 మంది లబ్ధిదారులు విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మార్చి 31 వరకు గడువు ఉండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు 80 శాతం వరకు కనెక్షన్లు కూడా అమర్చామని చెబుతున్నారు. జిల్లాలో కనెక్షన్లు ఇలా.. మండలం కనెక్షన్లు ఆదిలాబాద్ ఉమ్మడి మండలం 649 బజార్హత్నూర్ 955 బేల 832 బోథ్ 1082 ఇచ్చోడ 546 జైనథ్ 414 నేరడిగొండ 951 తలమడుగు 1055 తాంసి 1309 గుడిహత్నూర్ 155 ఇంద్రవెల్లి 849 నార్నూర్ 228 ఉట్నూర్ 904 -
ఒక్కరే చూడొద్దు
మనం ఏవిటేవిటో అనుకుంటాం.. మనం ఏకాకులం అని అనుకుంటాం! చాలాసార్లు ఏకాంతం కోరుకుంటాం.. ఎవరితోనూ ఏ కనెక్షన్ లేకుండా మన ప్లేస్‌లో మనం ఉంటే బాగుండూ అనుకుంటాం. అలా అనుకోకండి... ముందు టీవీ ఉండొచ్చు.. వెనకాల ఇంకెవరైనా ఉండొచ్చు!! అర్ధరాత్రి దాటింది.. తలుపు కొడ్తున్నారు! లోపల.. ఒళ్లో పిల్లాడిని పెట్టుకుని కునికిపాట్లు పడుతున్న తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్లు తెరిచింది. ఇంకా తలుపు కొడ్తూనే ఉన్నారు. ఆ తల్లి వణికిపోతోంది. ‘‘మామయ్యా.. మామయ్యా...’’ పిలిచింది, వచ్చింది తన మామేమో అనుకొని. ప్రతిస్పందనగా తలుపు కొట్టిన చప్పుడే వినపడుతోంది. ఆమెలో భయం ఎక్కువైంది. ‘‘ఈ పూట పనిచేస్తే సర్పంచ్ డబ్బులిస్తానన్నాడు. రెండు రోజులకు సరిపడా సరుకులు తెస్తా..’’ అని చెప్పి వెళ్లాడు. ఇప్పటిదాకా తిరిగి రాలేదు. తలుపు కొడ్తున్న చప్పుడు ఆగలేదు. సొంత ఊళ్లో.. ఉన్న ఎకరం భూమిని ఆక్రమించి భర్తను చంపేశాడు భూస్వామి. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని చంటిబిడ్డను చంకనేసుకొని ఈ ఊరొచ్చిపడ్డారు తనూ, మామ. ఇక్కడేమో అంతా వింతగా ఉంది. ఈసారి తలుపు చప్పుడు మరింత గట్టిగా వినపడటంతో వర్తమానంలోకి వచ్చింది ఆమె. మామయ్యా అని పిలిచినా బదులు పలకట్లేదంటే.. తలుపు కొడ్తోంది వాళ్లేనా? నెమ్మదిగా వెళ్లి చూద్దామని అనుకునేలోపే.. ఆ గుడిసెలో ఉన్న గుడ్డి దీపం కాస్తా ఆరిపోయింది. ఇంతలోకే మోకాళ్ల మీద పాకుతూ ఆ ‘ముగ్గురు పిల్లలు’ తనను చుట్టుముట్టారు. అనుకున్నంతా అయింది. రాత్రి గడపవతల అన్నం పెట్టలేదు. తలుపు తట్టి మరీ లోపలికి వచ్చేశారు. తన చేతుల్లో ఉన్న పిల్లాడిని దగ్గరగా పొదివి పట్టుకునుంది. అయినా వాళ్లు వదలట్లేదు. బలంగా లాగుతున్నారు. తను ప్రతిఘటిస్తోంది. చేతుల మీద రక్కుతున్నారు. గట్టిగా అరుస్తూ పిల్లాడిని ఎత్తుకొని వాళ్ల నుంచి తప్పించుకోవడానికి గుడిసె దాటింది. పరిగెడుతూ పరిగెడుతూ ఓ చిన్న గుడి దగ్గర ఆగింది. ఆమె దేవుడి ప్రాంగణంలోకి వెళ్లేసరికి ఆ ముగ్గురూ నిరాశతో వెనుదిరిగారు. ఊరవతల.. పాడుబడిన ఇంట్లో ఆ పూటకి ఎలాగో గండం తప్పించుకుంది ఆ తల్లి. కానీ ఆ ఊళ్లో కొనసాగాలంటే ప్రతిరోజూ ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిందే. ఉదయమనగా వెళ్లిన మామ జాడలేడు. తెల్లవారే వరకు గడిపిన ఆమె వెలుతురు వెలువడ్డ మరుక్షణమే మామను వెదకడానికి బయలుదేరింది. ఊరవతల తాగి పడి ఉన్నాడు. లేపి.. గుడిసె దగ్గరకు తీసుకొచ్చి రాత్రి జరిగిన సంఘటనను మొరపెట్టుకుంది. అవి పిల్ల పిశాచాలు. వాటికి తిండి పెట్టకపోతే నా కొడుకుని పీక్కుతింటాయి అంటూ ఏడ్చింది. పిల్లా లేదు.. పిశాచమూ లేదు. అంతా భ్రమ. ఈ ఊళ్లోవాళ్లు మూర్ఖులు అని కొట్టిపారేశాడు ఇంకా మత్తు వదలని మామ. వచ్చిన డబ్బులతో తాగడమే కాక పిచ్చి వాగుడు వాగుతున్నావని తిట్టింది. కొడుకును అతనికి అప్పజెప్పి తను బయలుదేరింది. ఆ ఊళ్లోకి అడుగుపెట్టినప్పుడు నది దగ్గర ఆ ఊరు ఆవిడ చేసిన హెచ్చరిక గుర్తొచ్చింది. ‘‘ఈ ఊళ్లోకి కొత్తగా వచ్చినట్టున్నారు. మీకు తినడానికి ఉన్నా లేకపోయినా.. రాత్రి పడుకునే ముందు గడపవతల ప్లేట్లో అన్నం పెట్టడం మాత్రం మరిచిపోవద్దు. లేకపోతే మీ పిల్లాడి ప్రాణాలు పోతాయ్’’ అని. ‘‘ఎందుకలా?’’ అడిగింది. ‘‘తెలియదు. 70 ఏళ్లుగా సాగుతున్న ఆచారం. ఈ ఊరు చివరన ఉన్న పాడుబడ్డ ఇంట్లో మూడు పిల్ల పిశాచాలుంటాయి. రాత్రి అయిందంటే చాలు.. ఊరు మీదకొస్తాయి. ప్రతి గుమ్మం ముందున్న అన్నం తిని వెళ్లిపోతాయి లేకపోతే ఆ ఇంట్లో పిల్లల్ని మింగేస్తాయని చెప్తుంటారు’’ అని తనకు తెలిసింది చెప్పింది ఆవిడ. ఆ ప్రకారమే ఈ తల్లి ఊరవతల ఉన్న పాడుపడిన ఇంటికి వెళ్లింది. ఆ ఇంట్లో ఓ తల్లి చిన్న కుండలో చారెడు బియ్యంతోపాటు నూరిపెట్టిన గన్నేరు పప్పు ముద్దనూ వేసి గంజి కాసి.. ఆ పిల్లలకు పెడ్తూ కనిపించింది. చివరకు తను కూడా తిని ఈమె కళ్లముందే ఆ ముగ్గురు పిల్లలతోపాటు ఆ తల్లీ నురగలు కక్కి చనిపోతుంది. విషయం అర్థమవుతుంది వచ్చిన తల్లికి. ఆకలితో చనిపోయిన ఆ పిల్లలే పిశాచాలై ఊరు మీద పడ్డారని. భయంతో వెనుతిరుగుతుంది. రెండో కథ చెరువు గట్టున.. జనం మధ్యలో .. ఎనభై ఏళ్ల ఓ ముసలావిడను గొలుసులతో గుంజకు కట్టేసి ఉంది. ‘‘ఈ దయ్యాన్ని వదిలిపెట్టేది లేదు బాబా’’ అంటున్నాడు ఆ ఊరి పెద్ద. ‘‘చెప్పు.. ఎందుకొస్తున్నావ్?’’ అంటూ బాబా మంత్రదండంతో ఆ ముసలావిడను బెదిరిస్తున్నాడు. ‘‘నేను దయ్యాన్ని కాను.. నన్ను వదిలేయండి’’ ముసలావిడ ప్రాధేయపడుతోంది. అయినా వినట్లేదు. అప్పుడు రంగప్రవేశం చేశాడు పోలీస్ ఇన్స్పెక్టర్. దెయ్యం పేరుతో వృద్ధురాలిని గొలుసులతో బంధించడాన్ని చూడలేకపోయాడు. అసలు దయ్యాలు, భూతాలు ఏంటి? అంతా మూఢనమ్మకాలు. మానసిక రోగాలు. భ్రమలు, భ్రాంతులు అంటూ ఆమెను విడిపించబోయాడు. ఊరి పెద్ద, బాబాతోపాటు చుట్టూ ఉన్న జనం, కానిస్టేబుల్స్ కూడా ‘‘అయ్యా.. అపచారం.. అది దయ్యమే. బంధించే ఉంచండి’’ అంటూ ఇన్స్పెక్టర్ మాట సాగనివ్వలేదు. చేసేదిలేక వెనక్కితగ్గాడు ఇన్స్పెక్టర్. కానీ రాత్రి కాపలాదారులు నిద్రలోకి జారుకున్నాక వచ్చి.. ఆ వృద్ధురాలిని విడిపించి తన జీప్‌లో ఆమె ఇంటి దగ్గర దింపాడు ఇన్స్పెక్టర్. ‘‘నన్ను విడిపించినందుకు చాలా కృతజ్ఞతలు ఇన్స్పెక్టర్గారూ. నాకున్న కాసింత పొలాన్నీ కబ్జాచెయ్యడానికి ఊరివాళ్లముందు నన్ను దయ్యంలా నిరూపించాలని చూస్తున్నారు ఊరి పెద్ద. వాడికి బాబా వత్తాసు. సమయానికి వచ్చి రక్షించారు. మీ రుణం ఎలా తీర్చుకోనూ?’’ వినయంగా అడిగింది ఆ వృద్ధురాలు. ‘‘అయ్యో.. ఇది నా బాధ్యత. అవునూ.. ఊరవతల.. ఈ చిట్టడవిలో ఒంటరిగా ఉంటున్నావా?’’ గాబరాగా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆమె ఇల్లును చూసి. ‘‘లేదు బాబూ.. మా అక్కతో కలిసి ఉంటున్నాను. ఈ ఊరువాళ్ల బారి నుంచి తప్పించుకోడానికే’’ అంది. జాగ్రత్తలు చెప్పి జీప్ ఎక్కాడు ఇన్స్పెక్టర్. తెల్లవారి.. తన తల్లికి ఒంట్లో బాలేదని, రెండు రోజులు ఆమెకు సాయంగా ఉండొస్తానని పుట్టింటికి బయలుదేరింది ఎస్ఐ భార్య. యథావిధిగా అతనూ డ్యూటీకి వెళ్లాడు. అయితే రాత్రి ఇంటికి చేరేసరికి భార్య దర్శనమిచ్చింది. అదేంటి రెండు రోజుల దాకా రానన్నావ్.. అప్పుడే వచ్చావేంటి?అని ఆశ్చర్యపోతాడు ఇన్స్పెక్టర్. ‘‘మరీ చేతకాకుండా ఏమీ లేదు అమ్మకి. బాగానే ఉంది. మీకు కష్టమవుతుందని వచ్చేశా’’అంటుంది. ఆ రాత్రి ఎందుకనో మళ్లీ ఆ ముసలమ్మ గుర్తొస్తుంది ఎస్ఐకి. కానిస్టేబుల్‌ను తీసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. అక్కడికి చేరుకోగానే భార్య నుంచి ఫోన్ వస్తుంది. ‘‘ఏంటీ.. ఇంకా ఇంటికి చేరారా లేదా? నేను లేను కదా అని డ్యూటీ పేరుతో స్టేషన్లోనే కాపురం ఉంటున్నారా?’’ అంటూ. షాక్ అవుతాడు ఎస్ఐ. మరి ఇంట్లో ఉన్నది ఎవరు? అనుమానంతోనే ఇంటికి వస్తాడు. ఇంట్లో భార్య కనపడుతుంది. అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎస్ఐకి. ఆ అయోమయంలోనే రెండు రోజులు గడుస్తాయి. పనిమీద ఎస్ఐ బయటకు వెళ్లినప్పుడల్లా పుట్టింటి నుంచి భార్య ఫోన్ చేస్తూంటుంది క్షేమసమాచారాల కోసం. మళ్లీ ఇంటికి వెళ్లేసరికి ప్రత్యక్షమవుతుంది. అదే విషయం అడిగితే.. నన్నే అనుమానిస్తున్నావా అంటూ ఏడుస్తుంది. ఏమీ అర్థంకాదు ఎస్ఐకి. చేసేదిలేక బాబా దగ్గరకు వెళ్తాడు. భార్య రూపంలో ఉన్నది దయ్యమేనని స్పష్టం చేస్తాడు బాబా. మంత్రించిన ఆవాలు ఇస్తాడు చుట్టూ చల్లుకోమని. వాటిని తీసుకొని ఇంటికి వెళ్లిన ఎస్ఐ నిస్సత్తువగా కుర్చీలో కూలబడ్తాడు. అతనిని చూసిన భార్య‘‘ఏంటి అంత నీరసంగా ఉన్నావ్? ఆకలిగా ఉందా? ఉండు వేడి వేడి సూప్ చేసుకొస్తాను’’ అంటూ వంటింట్లోకి వెళుతుంది. ఆమె అటు వెళ్లగానే బాబా ఇచ్చిన ఆవాలను కుర్చీ చుట్టూ చల్లుకుంటాడు. ఇంతలోకి బయట గుమ్మం నుంచి సూట్‌కేస్ పట్టుకొని భార్య వస్తుంది. దిమ్మతిరుగుతుంది ఎస్ఐకి. ‘‘ఇందాకే కదా వంటింట్లోకి వెళ్లావ్?’’ అంటాడు. ‘‘నేనా? ఇప్పుడే పుట్టింటి నుంచి వస్తుంటే..’’ అంటుంది అమాయకంగా. ‘‘రైలు దిగి ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా నన్ను పికప్ చేసుకోవడానికి వస్తావేమోనని. నీ ఫోన్ కలిస్తేనా?’’ అంటూ దగ్గరకు వస్తుంది. కింద ఆవాలను చూసి.. ‘‘అయ్యో ఆవాలు పడేసుకున్నారా? వంట రానప్పుడు ఎందుకీ తంటా? హాయిగా బయటనుంచి తెప్పించుకోక?’’ అంటూ చీపురు తెచ్చి కిందంతా శుభ్రం చేస్తుంది. ఈలోపు వంటింట్లోంచి సూప్‌తో వస్తుంది భార్యలాగే ఉన్నా ఇంకో ఆవిడ. ఈ ఇద్దరినీ చూసి ఎస్ఐ మతి పోతుంది నిజంగానే. ఆ ఇద్దరు ఆడవాళ్లూ విస్తుపోతారు ఒకరినొకరు చూసుకుని. వాళ్లలో నిజమైన భార్య ఎవరో? ఆ మిగిలిన వ్యక్తి ఎవరో? తెలుసుకోవడానికి రహస్యంగా బాబాకు ఫోన్ చేస్తాడు ఎస్ఐ. మాటల్లో పెట్టు వస్తానని చెప్తాడు బాబా. వాళ్లను మాటల్లో పెడ్తుండగానే బాబా వచ్చేస్తాడు. బాబాను చూసి సూప్ కాచిన భార్య పారిపోవడానికి ప్రయత్నిస్తుంటుంది. పట్టుకొని.. ‘‘ఈమే దయ్యం. ఆ ముసల్ది. నేను చెప్తే మీరు నమ్మలేదు. రక్షించినందుకు మీ భార్య రూపంలోనే వచ్చి మీతో కాపురం చేస్తోంది’’ అంటూ కాళ్లు, చేతులు కట్టేస్తాడు బాబా. అంతా చూసి అసలు భార్య కళ్లుతిరిగి పడిపోతుంది. భార్యే దయ్యమా? దయ్యమే భార్యా? ‘‘చెప్పు మళ్లీ ఎందుకొచ్చావో చెప్పు’’ అంటూ దెయ్యాన్ని కొడ్తుంటాడు బాబా. ‘‘ఈమె పెళ్లికాకుండా చనిపోయింది. అందుకే ఇప్పుడు నీతో కాపురం చేస్తోంది’’ అని ఎస్ఐతో చెప్తూ ఆ దయ్యాన్ని సీసాలో బంధించే ప్రయత్నం చేస్తుంటాడు బాబా. ఆ దయ్యం అలా సీసాలోకి దూరుతుందో లేదో ఇటు కళ్లుతిరిగిపడిపోయిన ఎస్ఐ అసలు భార్య లేస్తుంది. ‘‘ఎస్ఐ గారూ.. మీకేం భయంలేదిప్పుడు. ఆ ముసలి దయ్యాన్ని ఈ సీసాలో బంధించేశా’’ అని భరోసానిస్తూ వెళ్లిపోతాడు బాబా. ఆ సీసాను ఊరవతల చెరువు గట్టున పాతి పెడ్తాడు. మరుసటిరోజు అత్తగారిని చూడ్డానికి ఎస్ఐ తన భార్యతో ఊరికి ప్రయాణమవుతాడు. ముందు సీట్లో డ్రైవర్‌తోపాటు ఎస్ఐ, వెనక సీట్లో ఆయన భార్య కూర్చుని ఉంటారు. దయ్యం గురించి ఇంకా కలవర పడ్తున్నాడేమో అనుకొని వెనకనుంచి భర్త భుజమ్మీద చేయి వేస్తుంది ఆమె. ఏమీలేదులే అన్నట్టుగా వెనక్కితిరిగి చూడకుండానే ఆమె చేయిని నొక్కి రేర్ వ్యూ మిర్రర్లో చూస్తాడు భార్యను. వృద్ధ దయ్యం కనపడుతుంది నవ్వుతూ! ఒళ్లు గగుర్పొడిచే ఇలాంటి పదిహేను కథలతో ‘‘అంజాన్.. రూరల్ మిత్స్’’ పేరుతో పదిహేను ఎపిసోడ్ల న్యూ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అప్లోడై ఉంది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలకు చెందిన మూఢనమ్మకాల ఆధారంగా తీసిన సిరీస్ ఇది. అన్నిటికీ దయ్యమే నేపథ్యం. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యకు పాల్పడే కుటుంబసభ్యుల పనిపట్టే, మహిళల మీద జరుగుతున్న హింసను ఆపే మంచి దయ్యాల కథలూ ఉన్నాయి వీటిలో. రూరల్ మిత్స్ అనే ట్యాగ్‌లైన్‌తో తీసిన ఈ సిరీస్‌లో ఏ ఎపిసోడ్‌లోనూ అది మిత్ అన్న భావనను కలగజేసే లాజిక్ ఎండ్ ఇవ్వలేదు. హారర్ షోగా ప్రజెంట్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం అయ్యుంటే రూరల్ మిత్స్ అనే క్యాప్షన్ పెట్టి ఉండాల్సింది కాదు. పెట్టినందుకు కనీసం లాజిక్ ఎండ్‌ను ఇస్తే బాగుండేది. రాత్రి లైట్ ఆర్పేసుకొని ఈ సిరీస్ చూస్తే హారర్ షో థ్రిల్ కలుగుతుంది. అలాంటి జానర్‌ని ఇష్టపడే ప్రేక్షకులు ‘అంజాన్.. రూరల్ మిత్స్’ను ఎంజాయ్ చేస్తారు. – సరస్వతి రమ -
కలెక్షన్లు, కనెక్షన్లపై దృష్టి సారించండి
అనంతపురం అగ్రికల్చర్ : వంద శాతం విద్యుత్ బిల్లుల వసూళ్లు (కలెక్షన్లు), పెండింగ్‌లో ఉన్న వాటికి కనెక్షన్లు ఇవ్వడంపై అధికారులు దృష్టి సారించాలని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) హెచ్‌వై దొర ఆదేశించారు. మంగళవారం స్థానిక విద్యుత్‌శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ పుల్లారెడ్డి, జోనల్ చీఫ్ ఇంజనీరు పీరయ్య, జిల్లా ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎస్‌ఏవో) విజయభాస్కర్‌తో కలిసి విద్యుత్‌శాఖకు సంబంధించి అన్ని అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ... మిగతా జిల్లాల కన్నా రెవెన్యూ వసూళ్లలో వెనుకబడి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని నెలవారీ వసూళ్లు వంద శాతం సాధించడంపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే ఇతర జిల్లాలలో పోల్చితే ఇక్కడ అక్రమ విద్యుత్ వాడకం కూడా ఎక్కువగా ఉందన్నారు. విద్యుత్ చౌర్యాన్ని (లైన్‌లాస్) గణనీయంగా తగ్గించాలన్నారు. ఇంటింటా మీటర్ ఉండేలా మీటర్స్ సేల్స్ పెంచాలని ఆదేశించారు. రూ.125 కే విద్యుత్ కనెక్షను పథకాన్ని గ్రామీణప్రాంత ప్రజలు అందులోనూ పేద వర్గాలు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ వాడకందారుపలై కొరడా ఝులిపించి అపరాధ రుసుం, అవసరమైతే కేసులు నమోదు చేయాలని సూచించారు. -
నీటి మీటర్లు లేకుంటే కనెక్షన్ కట్
- అక్రమ నీటి కనెక్షన్లకు రెండింతల చార్జీలు హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలోని నీటి కనెక్షన్లు ఉన్న వారందరూ ఆగస్టు నుంచి తప్పని సరిగా నీటి మీటర్లు వాడాలని హైదరాబాద్ జలమండలి ఎండీ పేర్కొన్నారు. మీటర్లు లేని కనెక్షన్ దారులందరికీ ఆగష్టు లో నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. నోటీసులో మీటర్లు దొరికే ఏజెన్సీ వివరాలు ఉంటాయన్నారు. నోటీసు అందిన నెలరోజుల్లో మీటర్లు పెట్టుకోకుంటే కనెక్షన్ కట్ చేయనున్నట్టు తెలిపారు. అలాగే కమర్షియల్ కనెక్షన్ దారులు రెండు నెలలలోపు మీటర్లు పెట్టుకోవాలన్నారు. అక్రమంగా నీటి కనెక్షన్లు ఉంటే రెండింతలు చార్జీలు వసూలు చేస్తామన్నారు. -
అక్రమాలకు అడ్డా...
అరండల్‌పేట : నగరపపాలక సంస్థను అవినీతి జాఢ్యం వదలడంలేదు. కుళారుు కనెక్షన్ల విషయంలోనూ దిగువస్థారుు అధికారులు తమ నైజాన్ని చాటుకున్నారు. నగరంలో 1.54 అసెస్మెంట్లు ఉంటే కేవలం 80వేల కుళాయి కనెక్షన్లు మాత్రమే అధికారికంగా ఉన్నాయి. మిగిలినవి అనధికారమే. నగరంలో కుళాయి కనెక్షన్లపై ఉన్నతాధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో కళ్లు తిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. నగరపాలకసంస్థకు నీటి మీటర్ల ద్వారా ఏడాదికి రూ. 5 కోట్ల వరకు పన్నుల రూపంలో వస్తున్నాయి. అయితే ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నగరంలోని అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలకు నీటి మీటర్లను బిగించాల్సి ఉంటుంది. చాలా వరకు అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలకు నీటిమీటర్లు బిగించకుండానే నీటిని వినియోగించుకుంటున్నారు. అదే సమయంలో మీటర్ల ద్వారా చార్జీల వసూళ్లను సైతం ఫిట్టర్లు పట్టించుకోవడం లేదు. కనీసం వారికి డిమాండ్ నోటీసులు కూడా ఇవ్వడం లేదు. దీనివల్ల నీటి బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటి వరకు నీటిమీటర్ల మీద సుమారు రూ. 10 కోట్ల వరకు బకాయిలున్నాయంటే నిర్లక్ష్యం ఎంతలా ఉందో స్పష్టమవుతోంది. నగరంలో స్కాడాను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం ద్వారా నీటి పన్నును పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రతి డివిజన్లో ఉన్న అక్రమ కనెక్షన్లను అధికారులు సర్వే బృందాలతో గుర్తించారు. త్వరలో వారికి నోటీసులు ఇవ్వనున్నారు. దీంతో పాటు ఆస్తిపన్ను, వాణిజ్య సముదాయాలకు, షాపులకు నీటి చార్జీలను పెంచాలని యోచిస్తున్నారు. నగరాానికి సంబంధించి మొత్తం 81,841 తాగు నీటి కనెక్షన్లు ఉండగా ఇందులో కేవలం ఓవైటీ కింద 120, యూఏటీ కింద 732 అంటే మొత్తం 852 కనెక్షన్లలకు మాత్రమే మీటర్లను బిగించారు. మిగిలిన 80989 సర్వీసులకు మీటర్లు బిగించకుండా కార్పొరేషన్ అధికారులు నీటి పన్ను వసూలు చేస్తున్నారు. క్రేజీపై ఎందుకో వాత్సల్యం? నగరపాలకసంస్థ పరిధిలోని మానససరోవరం పార్కులోని క్రేజీవరల్డ్ను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. ఇందులోని స్మిమ్మింగ్‌ఫూల్, ఇతర అవసరాలకు తక్కెళ్లపాడు మంచినీటి శుద్ధి కేంద్రం నుంచి పైపులైన్ ఏర్పాటు చేశారు. ఈ పైపులైన్ ద్వారా రోజూ ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటల పాటు నీటిని క్రేజీ వరల్డ్‌కు సరఫరా చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ పైపులైన్‌కు నీటి మీటరును బిగించకపోవడంతో పైసా కూడా కార్పొరేషన్‌కు చెల్లించకుండానే నీటిని యధేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. ఈ విషయంలో ఇంజినీరింగ్ అధికారులు ఎందుకు అంత దానిపై అవ్యాజమైన ప్రేమ చూపిస్తున్నారో అర్థం కావడంలేదు. రోజుకు గంటకు మించి జనానికి నీరు విడుదల చేయని అధికారులు దానికి మాత్రం నాలుగు గంటలపాటు విడిచిపెట్టడం గమనార్హం. -
కమీషన్ ఇస్తేనే కనెక్షన్!
ఒంగోలు క్రైం : వ్యవసాయ విద్యుత్‌కు సంబంధించి కొత్త కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసేందుకు ఆ శాఖాధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల అధికారులు నిబంధనల ప్రకారం రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయకుండా కమీషన్లు ఇచ్చిన వారికే మంజూరు చేస్తున్నారు. లంచాలు ఇవ్వని రైతులకు ఏడాదికి కూడా మంజూరు చేయకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లను దరఖాస్తులు వచ్చిన ఆర్డర్ ప్రకారం మంజూరు చేయాలి. కానీ, పలు మండలాల ఏఈలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కమీషన్లు ఇచ్చిన వారికి వెంటనే మంజూరు చేస్తున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కమీషన్లు ఇవ్వకుంటే నెలల తరబడి మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మూడు మండలాల్లో పరిస్థితి అధ్వానం... జిల్లాలోని సింగరాయకొండ, టంగుటూరు, చీమకుర్తి మండలాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో పది మందికిపైగా రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేసిన అధికారులు.. వారికి మాత్రం మంజూరు చేయకపోవడంతో ఆయా రైతులు పంటలు సాగుచేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా టంగుటూరు మండంలో వ్యవసాయ విద్యుత్ దరఖాస్తులు 30కిపైగా పెండింగ్‌లో ఉన్నాయి. చీమకుర్తి సెక్షన్ పరిధిలో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. అవినీతి ఆరోపణలపై నెలన్నర క్రితం చీమకుర్తి సెక్షన్ ఏఈని బదిలీ చేసినప్పటికీ అతను మాత్రం అక్కడే కొనసాగుతున్నారు. ఈ మండలంలోని ఒక్క చండ్రపాడు గ్రామంలోనే మూడు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల కోసం 11 మంది రైతులు డీడీలు చెల్లించి ఎదురుచూస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర నుంచి కేబుల్ వరకూ విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలోనే సమకూర్చి ఆ ప్రాంతానికి తరలించి బిగించాలి. కానీ, కిలోమీటర్ పొడవున కేబుల్ కొరత ఏర్పడిందని, దాన్ని తెచ్చుకుంటేనే ట్రాన్స్ఫార్మను బిగిస్తామని స్థానిక విద్యుత్ శాఖాధికారి చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులే కేబుల్‌ను మాయంచేస్తూ రైతులతో తెప్పిస్తున్నారని, కమీషన్ ఇచ్చిన వారికే కేబుల్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో మరో 8 ట్రాన్స్ఫార్మర్ల దరఖాస్తులు కూడా కార్యాలయంలో మగ్గిపోతున్నాయి. పల్లామల్లి, మంచికలపాడు గ్రామాలకు చెందిన పలువురు రైతులు చీమకుర్తి ఏఈపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి మోమోలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ మండలంలో పరిస్థితి మారలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాభావానికితోడు విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా సాగుకు నోచుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.