న్యూఢిల్లీ: బల్క్ కనెక్షన్లను దుర్వినియోగం చేసే సంస్థలు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసింది.
వీటిని స్పామ్ కాల్స్ కోసం ఉపయోగిస్తున్నట్లు తేలిన పక్షంలో సదరు సంస్థల టెలికం వనరులను టెల్కోలు డిస్కనెక్ట్ చేయాలని, అలాగే ఆపరేటర్లంతా వాటిని రెండేళ్ల వరకు బ్లాక్ లిస్ట్ చేయాలని నిర్ణయించింది. టెల్కోల చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్లతో గురువారం సమావేశమైన మీదట ట్రాయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వైట్‌లిస్ట్‌లో లేని యూఆర్‌ఎల్స్, ఏపీకేలు గల మెసేజీల డెలివరీకి అనుమతి ఉండదని ట్రాయ్ తెలిపింది. అలాగే మెసేజీని పంపే సంస్థ, టెలీమార్కెటర్‌ను ట్రేస్ చేసే సాంకేతికతను అక్టోబర్ 31 నాటికల్లా అమల్లోకి తేవాలని టెల్కోలకు సూచించింది. ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, జియో తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment