bulk
-
అలా చేస్తే బ్లాక్లిస్టింగే.. ట్రాయ్ హెచ్చరిక
న్యూఢిల్లీ: బల్క్ కనెక్షన్లను దుర్వినియోగం చేసే సంస్థలు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసింది.వీటిని స్పామ్ కాల్స్ కోసం ఉపయోగిస్తున్నట్లు తేలిన పక్షంలో సదరు సంస్థల టెలికం వనరులను టెల్కోలు డిస్కనెక్ట్ చేయాలని, అలాగే ఆపరేటర్లంతా వాటిని రెండేళ్ల వరకు బ్లాక్ లిస్ట్ చేయాలని నిర్ణయించింది. టెల్కోల చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్లతో గురువారం సమావేశమైన మీదట ట్రాయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.మరోవైపు, ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వైట్లిస్ట్లో లేని యూఆర్ఎల్స్, ఏపీకేలు గల మెసేజీల డెలివరీకి అనుమతి ఉండదని ట్రాయ్ తెలిపింది. అలాగే మెసేజీని పంపే సంస్థ, టెలీమార్కెటర్ను ట్రేస్ చేసే సాంకేతికతను అక్టోబర్ 31 నాటికల్లా అమల్లోకి తేవాలని టెల్కోలకు సూచించింది. ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, జియో తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
బ్లాక్ డీల్స్ హవా..
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికం(క్యూ1)లో ఓపెన్ మార్కెట్ లావాదేవీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బల్క్ లేదా బ్లాక్ డీల్స్ భారీగా నమోదవుతున్నాయి. వెరసి క్యూ1(ఏప్రిల్–జూన్)లో విలువరీత్యా ఇవి 76 శాతం జంప్ చేశాయి. గతేడాది(2023–24) తొలి త్రైమాసికంతో పోలిస్తే లావాదేవీల(డీల్స్) సంఖ్య సైతం 23 శాతం ఎగసింది.ప్రైమ్ డేటాబేస్ ప్రకారం ఈ క్యూ1లో 3,396 బ్లాక్ డీల్స్ ద్వారా అమ్మకాలు రూ. 1.3 లక్షల కోట్లకు చేరాయి. గత క్యూ1లో రూ. 74,811 కోట్ల విక్రయ డీల్స్ నమోదయ్యాయి. తాజా త్రైమాసికంలో ఒక్క జూన్‌లోనే రూ. 73,000 కోట్ల విలువైన డీల్స్ జరగడం గమనార్హం! గత 11 నెలలను పరిగణిస్తే ఒక్క నెలలోనే రూ. 70,000 కోట్ల విలువైన అమ్మకాలు నమోదుకావడం ఇది మూడోసారి!! ఇంతక్రితం 2023 ఆగస్ట్‌లో రూ. 77,469 కోట్లు, డిసెంబర్లో రూ. 78,786 కోట్ల విలువైన విక్రయ డీల్స్ నమోదయ్యాయి. -
వొడాఫోన్ కొత్త ప్లాన్: జియో, ఎయిర్టెల్ తరహాలోనే, ఏది బెటర్?
సాక్షి,ముంబై:వొడాఫోన్ ఇండియా సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. దేశీయ వినియోగదారుల కోసం రూ. 296ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఎక్కువ డేటాను వినియోగించే కస్టమర్లు లక్క్ష్యంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది. ముఖ్యంగా ఎయిర్టెల్, జియోకు చెందిన రూ.296 రీచార్జ్ ప్లాన్లకు దీటుగా తాజా బల్క్ డేటా ప్లాన్‌ను తీసుకొచ్చింది. వొడాఫోన్ రూ.296 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు 25 జీబీ బల్క్ డేటా అపరిమిత వాయిస్ కాలింగ్. రోజుకు 100ఎస్ఎంఎస్లు ఉచితం ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వీఐ మూవీస్, టీవీని ఎంజాయ్ చేయవచ్చు కానీ, వివో అన్లిమిటెడ్ ప్రయోజనాలుండవు. ఎయిర్టెల్ రూ. 296 ప్లాన్ ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులే 25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్. రోజుకి100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు ఏంటంటే.. అపోలో 24|7 సర్కిల్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచిత హెలోట్యూన్స్ , వింక్ మ్యూజిక్ ఫ్రీ. రిలయన్స్ జియో రూ. 296 ప్లాన్ ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులే 25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ , రోజుకు 100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్‌లో రిలయన్స్ జియో వినియోగదారులు జియోటీవీ, జియో సినిమా జియో క్లౌడ్,జియో సెక్యూరిటీల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి -
ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. బల్క్ ఎఫ్డీలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 15 నెలల నుండి 3 సంవత్సరాల వరకు 6.80శాతం వడ్డీని అందించనుంది. కొత్త రేట్లు నవంబర్ 25, 2022 నుండి అమలులోకి వచ్చాయి. రూ. 2 కోట్ల కంటే ఎక్కువ, 5 కోట్ల రూపాయల లోపు ఉండే బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం బ్యాంక్ ప్రస్తుతం 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75 - 6.50 శాతం మధ్య ఉంటుంది. 15 నెలల నుండి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పుడు గరిష్ట వడ్డీ రేటు 6.80శాతంగా ఉంటుంది. (WhatsApp డేటా బ్రీచ్ కలకలం: ఆ మెసేజెస్ కాల్స్‌కి,స్పందించకండి!) 30 రోజుల నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై 4.75శాతం, 46 - 60 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే 61- 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. 185 రోజుల నుండి 270 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై 6 శాతం రేటును ఇస్తోంది. అయితే 2 కోట్ల లోపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులను బ్యాంకు ప్రకటించలేదు. (తగ్గేదెలే అంటున్న మస్క్, టెక్ దిగ్గజాలకే సవాల్!) సీనియర్ సిటిజన్లకు అదనంగా 10 శాతం అలాగే రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కస్టమర్లకు స్పెషల్‌గా 10శాతం వడ్డీని తాత్కాలికంగా అందిస్తుంది. అయితే డిపాజిట్ మొత్తం తప్పనిసరిగా రూ. 2 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. డిపాజిట్ సమయం అయిదేళ్లకుపైన, 10 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ స్పెషల్ స్కీం ఏప్రిల్ 7, 2023 తో ముగుస్తుంది. -
కోయంబత్తూరులో భారతి సిమెంట్ టెర్మినల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ తయారీ సంస్థ భారతీ సిమెంట్.. తమిళనాడులోని కోయంబత్తూరులో 7.5 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో అత్యాధునిక బల్క్ సిమెంట్ టెర్మినల్‌ను ఏర్పాటు చేసింది. కడప ప్లాంటు నుంచి ఈ కేంద్రానికి బల్క్ సిమెంట్ సరఫరా అవుతుంది. ఇక్కడ ప్యాకింగ్ చేసి సిమెంట్ పంపిణీ చేస్తారు. వికా గ్రూప్ చైర్మన్, సీఈవో గీ సీడో, వికా ఇండియా సీఈవో అనూప్ కుమార్ సక్సేనా, మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి ఈ టెర్మినల్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళనాడు, కేరళ మార్కెట్ల కోసం క్విక్సెమ్ పేరుతో తదుపరి తరం పర్యావరణ అనుకూల ప్రీమియం సిమెంట్‌ను విడుదల చేశారు. -
బల్క్ కనెక్షన్లకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: బల్క్ కనెక్షన్లు తీసుకున్న సబ్స్క్రయిబర్స్కు కొత్త కనెక్షన్లు జారీ చేసే అంశానికి సంబంధించి టెలికం శాఖ (డాట్) కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. జూలై 20న జారీ చేసిన ఆదేశాల ప్రకారం కొత్త కనెక్షన్ల జారీ సమయంలో టెలికం ఆపరేటర్లు భౌతికంగా సదరు బల్క్ కనెక్షన్లున్న ఆవరణకు వెళ్లి, దానికి సంబంధించిన లొకేషన్ గ్రిడ్, తనిఖీ చేసిన సమయం తదితర వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించాల్సి ఉంటుంది. అలాగే యూజర్ల ఆవరణలను ప్రతీ ఆరునెలలకోసారి టెల్కోలు సందర్శించి, లొకేషన్ గ్రిడ్ వివరాలను సేకరించాలి. బల్క్ కనెక్షన్లను టెలికం కంపెనీలు తప్పనిసరిగా తనిఖీ చేసేలా చూసేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇక, సిమ్ కార్డులను యాక్టివేట్ చేయడానికి ముందు బల్క్ కనెక్షన్లు తీసుకున్న కంపెనీ వివరాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, ఈ–కేవైసీ, డిజిటల్ కేవైసీ (నో యువర్ కస్టమర్) ఆధారంగా జారీ చేసిన కనెక్షన్లకు సంబంధించిన పలు దరఖా స్తు ఫారంలలో అడ్డదిడ్డంగా రాతలు ఉంటున్నాయని, వాటిని సరిచేయాలని టెల్కోలకు డాట్ సూ చించింది. టెలికం శాఖ అనుమతుల మేరకు గతం లో ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ ప్రక్రియతో టెల్కో లు కనెక్షన్లు జారీ చేసేవి. అయితే, ఆధార్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు సుప్రీం కోర్టు 2018లో కీలక మార్గదర్శకాలు ఇవ్వడంతో అప్ప ట్నుంచీ డిజిటల్ కేవైసీ ప్రక్రియ అమలవుతోంది. -
2004 పుష్కరాల్లో జనసందోహం
దామరచర్ల 2004వ సంవత్సరం ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జరిగిన పుష్కరాల్లో జిల్లా వ్యాప్తంగా 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే ఇందులో వాడపల్లికే 10లక్షల మంది హాజరయ్యారని రికార్డులు చెబుతున్నాయి. అదే విధంగా మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి క్షేత్రానికి 9,03,556 మంది పుష్కర భక్తులు వచ్చారు. ఆదాయం 30లక్షలకు పైమాటే: 2004 పుష్కరాలకు వాడపల్లికి వివిధ మార్గాల ద్వారా రూ.10లక్షల ఆదాయం వచ్చింది. హుండీల ద్వారా శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో రూ.1.81లక్షలు,శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామి దేవాలయంలో రూ.1.08లక్షలు ఆదాయం సమకూరింది.లడ్డూ ప్రసాదాల ద్వారా రూ.3.91లక్షలు,శ్రీఘ్రదర్శనం ద్వారా రూ.1.49లక్షలు ఆదాయం వచ్చింది. మట్టపల్లిలో వివిధ మార్గాల ద్వారా రూ.21,39,643 ఆదాయం వచ్చింది.